దగ్గుబాటి సురేశ్ కి టీడీపీ టిక్కెట్
posted on Apr 6, 2016 @ 3:35PM
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు గానూ వచ్చే జూన్ లో ఎన్నికలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా జరిగే ఈ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలన నుంచి మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2 ఖాళీలున్నాయి. తెలంగాణలో ఉన్న ఖాళీలను టీఆర్ఎస్ దక్కించుకోనుండగా..ఇక ఏపీలో ఉన్న స్థానాలను మూడు టీడీపీ, ఒకటి వైసీపీకి దక్కనున్నాయి. రాజ్యసభ టిక్కెట్లు కేటాయింపు తెలుగు దేశానికి కత్తిమీద సాముగా తయారైంది. చాలా మంది రాజ్యసభ టిక్కెట్లు ఆశిస్తున్నారు. అయితే వీటన్నింటిలోంచి ఒక వార్త ప్రముఖంగా వినిపిస్తోంది.
టాలీవుడ్ అగ్ర నిర్మాత, సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ ని టీడీపీ తరపున పెద్దల సభకు పంపిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దగ్గుబాటి కుటుంబం తొలి నుంచి టీడీపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. రామానాయుడు బాపట్ల నుంచి తెలుగు దేశం తరపున లోక్ సభకు ఎంపికయ్యారు. సురేశ్ కి కూడా చంద్రబాబుతో సత్సంబంధాలున్నాయి. దానితో పాటు సినిమా
ఇండస్ట్రీని కూడా తన వైపు తిప్పుకోవడానికి సురేశ్ ను రాజ్యసభకు పంపితేనే బెటరనే ఆలోచనలో ఉన్నారని టాక్. మరి టీడీపీ అధినేత మైండ్ గేమ్ ఎలా ఉంటుందో.