బందరు పిచ్చోడికి అలా అర్ధమైందట!

ఓటమి తరువాత వైసీపీ నేతలకు మైండ్ పోయినట్లుంది.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా వేగంగా వెస్తున్న అడుగులతో వాళ్లకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు. దీంతో  వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రామా అన్నా వారికి బూతుగానే వినిపిస్తోంది. ఆ కోవలో వైసీపీ అధినేత జగన్ తరువాత ముందుగా చెప్పుకోవలసింది వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గురించి. 

పార్టీ ఓటమి తరువాత వైసీపీ తరఫున మాట్లాడేవాళ్లే కరవయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం, బూతులతో, అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే  రోజా, సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వంటి వారంతా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఇక జగన్ తరఫున మాట్లాడడానికి, మీడియా ముందుకు రావడానికి వైసీపీకి పేర్ని నాని ఒక్కరే మిగిలినట్లు కనిపిస్తున్నది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు, జనసేన అధినేతపై నోటికొచ్చిందల్లా మాట్లాడేవారు. 

ఇంత మాట్లాడిన ఆయనకు ఎన్నికలలో పోటీ చేసే ధైర్యం మాత్రం లేకపోయింది. అందుకే మచిలీపట్నం నుంచి తాను తప్పుకుని తన వారసుడిని నిలబెట్టారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు పేర్ని నాని కుమారుడు కిష్టు కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో, అహంకారపూరిత వైఖరితో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని పరాజయం పాలయ్యారు. అది వేరే  సంగతి. ఇప్పుడు పేర్ని నాని అవసరం ఉన్నా లేకపోయినా మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారు.  

తాజాగా తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం (ఆగస్టు5) కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన తొలి కలెక్టర్ల సమావేశం ఇది. ఆ సమావేశంలో చంద్రబాబునాయుడు పాలనా పరమైన అంశాలలో కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. శాఖల వారీగా సమీక్షలు నిర్వహించారు. సమస్యల పరిష్కారంలో వేగంగా పని చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధామ్యాలును వివరించారు. ఆ సందర్భంగా చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. అందులో తప్పేమీ లేదు. కలెక్టర్లు ఉన్నది కూడా ప్రజలకు సేవ చేయడానికే కదా? అలాగే స్థానిక సమస్యల సత్వర పరిష్కారం విషయంలో ప్రజా ప్రతినిథులతో సమన్వయం చేసుకోవాలని, స్థానిక ప్రజా ప్రతినిథులతో  ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని సమస్యల పరిష్కారం విషయంలో వేగంగా పని చేయాలని సూచించారు. అందులోనూ తప్పేమీ లేదు.

కానీ పేర్ని నానికి మాత్రం ప్రజా పాలన సజావుగా సాగడమే తప్పుగా కనిపించింది. చంద్రబాబు తమ పార్టీ నేతలు ఏం చెబితే అది చేయాలని కలెక్టర్లను ఆదేశించారంటూ గగ్గోలు పెడుతున్నారు. అలా కలెక్టర్ల సమావేశం పూర్తయ్యిందో లేదో ఇలా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పేర్ని నాని.. తన ఫేక్ ప్రాపగాండాను ఆరంభించేశారు. చంద్రబాబు కలెక్టర్లను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారంటూ గుండెలు బాదేసుకున్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన అధికారులు, రాజకీయ నాయకులు ఆ ప్రజల సమస్యలపై సమన్వయంతో పని చేయాలనడం తప్పెలా అవుతుందో పేర్ని నానికే తెలియాలి. అయితే వైసీపీ స్టైలే ఇది.. ఫేక్ ప్రచారంతో జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తారు. 2014 నుంచి 2019 వరకూ అదే చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే మొదలెట్టేశారు. అయతే ఒక సారి నమ్మి మోసపోయిన జనం మరోసారి ఇటువంటి ప్రాపగాండాను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మరన్న విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు.