గెలిచి ఓడనున్న హిల్లరీ... ఓడి గెలవనున్న ట్రంప్?
posted on Nov 7, 2016 @ 12:48PM
అమెరికన్ ఎలక్షన్స్ డెడ్ లైన్ దగ్గరపడిపోతోంది. నవంబర్ 8త్ జడ్జిమెంట్ డే వచ్చేస్తోంది. అందుకు తగ్గట్టే యూఎస్ లో డ్రామా కూడా హైలెవల్లో నడుస్తోంది! క్లైమాక్స్ ఫైట్ భలే రక్తి కడుతోంది!
ఈ సారి ఎన్నికల్లో మొదట్నుంచీ సెన్సేషన్ గా నిలుస్తోన్న ట్రంప్ చివర్లో కూడా తన తడాఖా చూపిస్తున్నాడు. అసలు ఒక దశలో పార్టీలోనే గెలిచి బయటకు రాలేడని భావించిన మన బిజినెస్ మ్యాన్ ఇప్పుడు వాషింగ్ టన్ రేస్ లో వైట్ హౌజ్ దగ్గరి దాకా వచ్చేశాడు. కేవలం తనకు మనీ పవర్ అండ్ మౌత్ పవర్ దాకా బండి ఇక్కడి దాకా లాక్కొచ్చాడు. ఫైనల్ స్టేజ్ లో కూడా ట్రంప్ అదే చేసేస్తున్నాడు. పొలిటికల్ తనకంటే ఎంతో ఎక్స్ పీరియన్స్ వున్న హిల్లరీని ఆయన తెలివిగా కన్నా దూకుడుగా ఎదుర్కొంటున్నాడు. పదే పదే కామన్ అమెరికన్స్ కనెక్ట్ అయ్యే విషయాలు చర్చిస్తున్నాడు. అందుకోసం భారత్, చైనా, సింగపూర్, మెక్సికో లాంటి ఇతర దేశాల పేర్లు కూడా యథేచ్చగా వాడుకుంటున్నాడు!
ట్రంప్ క్యాంపైన్ హైలైట్ అవ్వటానికి ప్రధాన కారణం ఆయన తీసుకున్న కాంట్రవర్సియల్ స్టాండే! ముస్లిమ్ ల మీదా, మెక్సికన్ల మీద అతని ప్రకటనలు రచ్చ రచ్చ అయిపోయాయి. అయితే ఆ తరువాత అంత ఎక్కువగా ట్రంప్ టార్గెట్ చేసింది ఇండియన్స్ , చైనీస్ జనాల్నే. వాళ్లొచ్చి మన ఉద్యోగాలు దొంగలించేస్తున్నారని అమెరికన్స్ ను నమ్మించాడు. అందులో నిజం కూడా లేకపోలేదు. కాని, ట్రంప్ విజయవంతంగా భూతద్దంలో పెట్టి చూపాడు. ఎలక్షన్ క్యాంపైన్ చివరి దశలో కూడా డోనాల్డ్ అదే పని చేశాడు...
అమెరికన్స్ కు రావాల్సిన ఉద్యోగాలు ఇండియన్, చైనీస్ కంపెనీలు తన్నుకుపోతున్నాయని ట్రంప్ తన చివరి సభలో కూడా నొక్కి చెప్పాడు. ఆ మధ్య మోదీ ఫ్యాన్ అని, హిందువుల స్నేహితుడినని తెగ మునగ చెట్టు ఎక్కించిన ఆయన లాస్ట్ స్పీచ్ లో మాత్రం అమెరికన్స్ ఉద్యోగాలు ఇండియన్స్ వల్ల పోతున్నాయని గట్టిగా చెప్పాడు. చైనీస్, సింగపూర్, మెక్సికన్ కంపెనీల్ని కూడా ట్రంప్ టార్గెట్ చేశాడు. కాకపోతే, ట్రంప్ చేస్తోన్న ఈ ఉద్యోగాల దొంగతనం ఆరోపణ ఎంత వరకూ ఓట్ల రూపంలో కలిసొస్తుందో రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది...
ఇప్పటికీ గెలిచే ఛాన్స్ కాస్త ఎక్కువగా వున్న హిల్లరీ చివరి నిమిషంలో హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది. ఆమెపై వున్న అక్రమ ఈమెయిల్ సర్వర్ వివాదం సుఖాంతమైంది.ఎఫ్ బీఐ హిల్లరీపై ఓపెన్ చేసిన దర్యాప్తు ఆమెను నిర్ధోషిగా తేల్చింది. హిల్లరీ పంపిన 6లక్షలకు పైగా ఈమెల్స్ ఏవీ తప్పుడు మెయిల్స్ కావని తేల్చేశారు అధికారులు! ఇంత త్వరగా అన్ని మెయిల్స్ ఎలా వెరిఫై చేశారని ట్రంప్ గోల చేస్తున్నా మిసెస్ క్లింటన్ క్లీన్ అండ్ గుడ్ అని ఎఫ్ బీఐ చెప్పేసింది!
ఓట్లు పడటానికి కొన్ని గంటల ముందు ట్రంప్ కు వ్యతిరేక పరిస్థితులే వున్నట్టు ప్రస్తుతానికైతే కనిపిస్తోంది. సర్వేలు కూడా అదే అంటున్నాయి. కాని, రిజల్ట్ వెలువడే సమయంలో ఏదైనా జరగొచ్చు. ఆఫ్ట్రాల్ ట్రంప్ ఇక్కడి దాకా వచ్చి ఓడినా అతడు బాదపడాల్సింది ఏం లేదు! ఎందుకుంటే, ఆతనొక మామూలు రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. ప్రపంచ వ్యాప్తంగా అతని పేరు మార్మోగిపోవటం ఎలా చూసినా లాభమే! కాని, హిల్లరీకి మాత్రం ఇది పెద్ద పరీక్షే! సంవత్సరాల తరబడి రాజకీయాల్లో వున్న ఈ మాజీ ప్రెసిడెంట్ గారి పెళ్లాం అనూహ్యంగా ఓడిపోతే అది పెద్ద చరిత్ర అయిపోతుంది! తక్కువ మార్జిన్ తో గెలిచినా... అది డెమొక్రాట్లకు ఎంతో కొంత పరాభవమే! హిల్లరీ క్లింటన్ భారీ మెజారీటితో గెలిస్తే తప్ప ట్రంప్ క్రెడిట్ ను ఇప్పుడు ఎవ్వరూ కొట్టేయలేని పరిస్థితి నెలకొంది!