హీరోయిన్ టాపిక్ డైవర్షన్‌కే గుడ్లవల్లేరు ఇష్యూ!

ఈ దిక్కుమాలిన, దరిద్రపు జగన్ మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు వుంది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది ఒకటయితే, సాక్షి మీడియా దాన్ని రకరకాలుగా టర్న్ చేసి, అదేదో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులాగా చిత్రీకరించడానికి శుక్రవారం ఉదయం నుంచి కాలకూట విషాన్ని సమాజంలో చిమ్ముతోంది. కేవలం ఐదుగురు విద్యార్థినీ విద్యార్థుల మధ్య జరిగిన వ్యక్తిగత అంశాన్ని కాలేజీ మొత్తానికి ఆపాదించి, దాన్ని హిడెన్ కెమెరాలు అనే మసిపూసి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం నిస్సిగ్గుగా జరిగింది. వాస్తవానికి ఐదుగురు విద్యార్థుల మధ్య జరిగిన వ్యవహారం హిడెన్ కెమెరాల ప్రచారానికి దారి తీసినట్లు తెలుస్తోంది. ప్రేమలో విఫలమైన ఒక కుర్రాడు చేసిన హిడెన్ కెమెరాల తప్పుడు ప్రచారాన్ని జగన్ మీడియా సొంతం చేసుకుని చాలా ఘోరం జరిగినట్టు మీడియాలో ఊదరగొట్టేసింది. రకరకాల విషపూరిత కథనాలు వండి వడ్డించేసింది. ఇప్పటి వరకూ శవాల కోసమే వెతుకుతున్న రాబందు జగన్ కూడా ఈ విషయం మీద విషం కక్కాడు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆడపిల్లల జీవితాలను కూడా నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ విషం కారణంగా గుడ్లవల్లేరు కాలేజీ ఆడపిల్లలు మరింత ఆందోళనకు గురయ్యారు. వందలు, వేలల్లో వీడియోలు వున్నాయని ఈ దుర్మార్గపు మీడియా చేసిన ప్రచారం చూసి ఆడపిల్లలు తల్లడిల్లిపోయారు. ఈ విషయం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన పోలీసులు లేడీస్ హాస్టల్లో ఎలాంటి హిడెన్ కెమెరాలు లేవని తేల్చారు. ఈ ఘటన వెనుక వున్న అసలు విషయం కూడా వెల్లడయింది. దాంతో అప్పటి వరకూ ఆందోళన చేసిన విద్యార్థినులు ఆందోళన విరమించారు. అంతా సర్దుమణిగినప్పటికీ దరిద్రపు జగన్ మీడియా మాత్రం వెనక్కి తగ్గలేదు.. తన విష ప్రచారం ఆపలేదు. 

మొత్తమ్మీద ఆలోచిస్తే అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఇప్పుడు ముంబై హీరోయిన్ కాదంబరి ఇష్యూ చాలా సీరియస్‌గా వుంది. ఈ ఇష్యూలో ఐపీఎస్‌లతోపాటు జగన్ కొంప కూడా మునిగేలా వుంది. శుక్రవారం నాడు కాదంబరి విజయవాడ వచ్చింది. ఆమెకు జరిగిన అన్యాయానికి సంబంధించి దర్యాప్తు చాలా వేగంగా జరుగుతోంది. హీరోయిన్ కాదంబరి విషయంలో ఇదంతా జరగడానికి జగన్ ఇచ్చిన ఆదేశాలే కారణమన్న అంశం కూడా బయటకి వస్తోంది. ఈ అంశమే కనుక పూర్తి స్థాయిలో బయటపడిందంటే జగన్‌ సీన్ సితార్ అయిపోయే ప్రమాదం వుంది. అందుకే హీరోయిన్ కాదంబరి ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమే జగన్ మీడియా గుడ్లవల్లేరు హాస్టల్ ఇష్యూని ఇంత పెద్దది చేసి రచ్చరచ్చ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.