అబ్బాయిలలో ఈ విషయాలు అమ్మాయిలకు తెగ నచ్చుతాయట..!
posted on Jun 10, 2024 @ 10:15AM
అమ్మాయిలు, అబ్బాయిలు.. ఈ జెండర్ మధ్య బేధమే పెద్ద అట్రాక్షన్. అబ్బాయిల పట్ల అమ్మాయిలు.. అమ్మాయిల పట్ల అబ్బాయిలు ఆకర్షితులవడం చాలా కామన్. వ్యక్తిత్వం వల్ల కావచ్చు, అందం వల్ల కావచ్చు, స్టైల్ వల్ల కావచ్చు.. ఏదో ఒక విషయానికి ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవడం అనేది మాత్రం జరిగేదే. అయితే అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిలను చూసి ఆకర్షితులైతే మనసులో దాచుకోలేరు. ఆ ఆకర్షణ ఎక్కువ రోజులు కొనసాగి అదలా ప్రేమగా మారే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ అమ్మాయిలు మాత్రం ఎవరైనా అబ్బాయి తనకు నచ్చినా, అబ్బాయిలో కొన్ని విషయాలు నచ్చినా అస్సలు బయట పడరు. బయటకు చెప్పరు కూడా. అమ్మాయిలకు అబ్బాయిలలో నచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి వైపు ఓ లుక్కేస్తే..
ఫొటోలంటే చాలా ఇష్టం..
అమ్మాయిలకు ఫొటోలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తనకు నచ్చిన అబ్బాయితో ఫొటో దిగడమంటే ఎక్కడలేని సంతోషం వారిలో ఉంటుంది. అబ్బాయిలు తమకు తాము ఇద్దరికీ కలిసి ఫొటోలు తీయాలని, వీడియోలు తీయాలని అమ్మాయిలు కోరుకుంటారు. ఇలా ఫొటోలు తీసే అబ్బాయిల పట్ల వారు మరింత ప్రేమతో ఉంటారు.
ఓపెన్ గా మాట్లాడటం..
ఓపెన్ గా మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. జీవితం గురించి ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు, ఇద్దరికి సంబంధించిన కలల గురించి ఓపెన్ గా మాట్లాడటం, ఏదైనా విషయం గురించి లోతుగా మాట్లాడటం లేదా చర్చించడం మొదలైనవి చేయడం వల్ల ఇద్దరి మధ్య బంధం చాలా డీప్ గా ఉన్నట్టు వారు ఫీలవుతారు. అంతేనా అమ్మాయి చెప్పే విషయాన్ని శ్రద్దగా వినేవారు అయితే ఇక అమ్మాయిలకు చాలా పిచ్చి ప్రేమ ఏర్పడుతుంది. అందుకే అమ్మాయిని ప్రేమిస్తే వారు చెప్పేది శ్రద్దగా వినడం ముఖ్యం.
కౌగిలి..
ఒక కౌగిలి బోలెడు ధైర్యాన్ని, నీకు నేనున్నా అనే నమ్మకాన్ని, జీవితం మీద భరోసాను ఇస్తుంది. తన భాగస్వామి తనను కౌగిలించుకోవడం వల్ల అమ్మాయికి తన భాగస్వామి మీద ప్రేమ పెరుగుతుంది. అమ్మాయిలు బాధలో ఉన్నప్పుడు, ఆమె దిగులుగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు దగ్గరకు తీసుకోవడం, కౌగిలించుకోవడం, ఆమె వీపును ప్రేమగా నిమరడం లాంటివి చేస్తే తన అలసట, బాధ అన్నీ మర్చిపోతుంది.
*రూపశ్రీ.