ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉందా లేదా? ఇలా తెలుసుకోండి..!

 

ప్రేమ ఇప్పట్లో స్కూల్ పిల్లల మధ్యన కూడా వినిపిస్తున్న మాట. కాలేజీ వయసు వచ్చేసరికి ప్రేమ పేరుతో శృతి మించిపోయేవారు కూడా అధికంగా ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ అనేది చాలా వరకు కనిపించట్లేదు. ఆకర్షణ లేదా స్వార్థం కోసం చాలామంది చనువు పెంచుకుని దాన్నే ప్రేమ అని పిలుస్తున్నారు కూడా.  ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉందా లేదా? తెలుసుకోవడం ఎలా అని చాలామంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. అయితే నిజమైన ప్రేమ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కొన్ని విషయాలు చాలా దోహదపడతాయి. అవేంటో తెలుసుకుంటే..


చాలామంది లవ్ పార్టర్ నుండి ఖరీదైన బహుమతులు ఆశిస్తుంటారు. నాకు అది కావాలి, ఇది కావాలి  అని అడుగుతూ ఉంటారు కూడా. ఒకవేళ డిమాండ్ కు తగ్గట్టు ఏమైనా ఇవ్వకపోతే నీకు అసలు నా మీద ప్రేమ లేదు అనేస్తుంటారు. ఇలా ఖరీదైన బహుమతులు ఇస్తేనే ఇద్దరి  మధ్య ప్రేమ ఉందని అంటూంటే ఆ రిలేషన్ లో ప్రేమ లేదని అర్థం.

ప్రేమ ఉన్నంత మాత్రానా అన్నీ ఓపెన్ గా చెప్పేయాలని కాదు అర్థం. ప్రేమలో ఉన్న భాగస్వామి వ్యక్తిగతానికి సంబంధించిన పాస్వర్డ్ లు, ఇతర విషయాలు చెప్పమని బలవంతం చేస్తుంటారు కొందరు. ఇలా చేసేవారి  మధ్య ప్రేమ లేనట్టేనని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు.  అలాంటి బంధాలు ఎక్కువ కాలం నిలవడం కూడా కష్టమేనట. ఎప్పుడైతే ఒకరి స్పేస్ ను గౌరవిస్తామో.. అప్పుడే ప్రేమ కూడా ఉంటుంది.


ఇద్దరు వ్యక్తుల మధ్య స్పేస్ అనేది చాలా ముఖ్యం. ఒకరి గురించి మరొకరికి ప్రతీదీ తెలియాలి అనుకునే మెంటాలిటీ చాలామందిలో ఉంటుంది. అలాంటి వారికి పోసెసివ్ నెస్ ఎక్కువ కూడా. అయితే ఇలాంటి వారి మధ్య కూడా   ప్రేమ కంటే అభద్రతా భావమే ఎక్కువ ఉంటుంది. అభద్రతా భావం ఉన్న రిలేషన్ లో వ్యక్తి పట్ల నమ్మకం, ప్రేమ అనేవి ఉండవు. రానురాను అభద్రతాభావం కాస్తా అనుమానంగా మారే అవకాశం కూడా ఉంటుంది.


లవ్ లో ఇద్దరి మధ్య స్పేస్ తగినంత ఉండకపోవడమే కాదు.. అస్సలు  భాగస్వామిని పట్టించుకోకుండా  తన మానాన తనును  ఉండనివ్వడం కూడా ప్రేమ లేకపోవడాన్ని సూచిస్తుంది.  ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు సాధారణమైన విషయాలను అంతగా పట్టించుకోకుండా ఎలా లైట్ తీసుకుంటారో.. తన పార్ట్నర్ కు ఏం కావాలి? ఏం అవసరం అనేది పట్టించుకోవడం బాగోగులు, అవసరాల గురించి తెలుసుకోవడం కూడా అంతే అవసరం.


ఏదైనా ఒక పని చేయాలని అనుకొనేటప్పుడు ఖచ్చితంగా చెప్పే చేయాలి అనే మెంటాలిటీ ఉంటే మాత్రం ఆ ఇద్దరి మధ్య ప్రేమ కొరవడినట్టే. అందులో ఆధిపత్యం, అహంకారం, తన భాగస్వామికి స్వేచ్ఛ ఇవ్వకపోవడం వంటివి ప్రేమను డామినేట్ చేస్తాయి.

ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్ కు చాలాప్రాముఖ్యత ఉంది. భాగస్వామి కంటే ఫోన్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నా, ఫోన్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నా.. పార్ట్నర్ మీద ప్రేమ విషయంలో ఆలోచించుకోవాల్సిందే. అంతేకాదు.. భాగస్వామి ఫోన్ చెక్ చేయడం,  ఫోన్ లో జరిగే ప్రతి కార్యకలాపం తనకు తెలిసే జరగాలని అనుకోవడం.. అలాంటివన్నీ ప్రేమకంటే ఎక్కువ అభద్రతాభావం, అనుమానం లాంటి వాటిని బలపరుస్తాయి. కాబట్టి అలాంటివి ఉన్న బంధం ప్రేమ అనుకోవడం పొరపాటు.

                                                       *రూపశ్రీ.