నాటీ ఆరోపణల నట్టి కుమార్!
posted on Aug 25, 2016 @ 5:11PM
టీ కప్పులో తుఫాన్ అంటారు తెలుసుగా.... అదుగో అదే జ్ఞాపకం వస్తుంది ఎవరికైనా! ఇంతకీ దేని గురించి అంటారా? మన నట్టి కుమార్ నాటీ మాటల గురించి!
తెలుగు మీడియాలో నెంబర్ వన్ గా చెప్పుకునే ఓ ఛానల్ స్టూడియోకి వచ్చి, రీసెంట్ గా, నట్టి చాలా హంగామా చేశాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఎప్పుడూ నట్టి కుమార్ హంగామాని లైట్ తీసుకునే ఇతర మీడియా వాళ్లు కూడా ఈసారి కాస్త ఇంట్రస్ట్ చూపారు. అందుక్కారణం నట్టి కుమార్ అటు పాలిటిక్స్ ను, ఇటు సినిమాను, మధ్యలో నొటోరియస్ నయీమ్ ను ఒక్క చోట చేర్చాడు. అదీ విశేషం...
నయీమ్ ఈ మధ్య ఎన్ కౌంటర్ అయ్యాడు కాబట్టి అతడి గురించి ఏం చెప్పినా, ఎవరు చెప్పినా జనాలకి ఇంట్రస్ట్ గ్యారెంటీ. అలాగే, అధికార తెలుగు దేశం నేత అచ్చెన్నాయుడిని కూడా రొంపిలోకి లాగితే ఇక తిరుగే లేదు. అక్కడితో ఆగకుండా నట్టి కుమార్ నాటీగా ఇండస్ట్రీలో ఎవరెవరి పేర్లో చెప్పేశాడు! అంతా నయీమ్ తో లింక్ లున్న వారే అన్నాడు!
నట్టి కుమార్ నిజం చెప్పాడా? లేదా? ఈ ప్రశ్న జటిలమైంది. కాకపోతే, రెవెన్యు, పోలీస్ శాఖాల వంటి వాట్ని కూడా వదలని నయీమ్ సినిమా ఇండస్ట్రీని వదిలపెడాతడని ఎవరం అనుకుంటాం. సహజంగానే అక్కడా మనోడు కర్చీఫ్ వేసి వుంటాడు. తన ప్రతాపం చూపి వుంటాడు. కాని, నట్టి కుమార్ మాటలు పట్టుకుని ఆయన చెప్పిన కొద్ది మందికి మాత్రమే నయీమ్ తో సంబంధాలున్నాయని డిసైడ్ అవ్వటం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే, అప్పుడప్పుడూ ఇలా వచ్చి రొటీన్ గా ఆరోపణలు చేసి సైలెంట్ అవ్వటం నట్టికి మామూలే అంటున్నారు ఆయనతో పడని వాళ్లు. కాబట్టి ఈ సారి ఆయన సిరియస్ గా మాట్లాడుతున్నాడని అనుకోవటం తెలివితక్కువతనమే అవుతుందని వారి వాదన. మరో వైపు, ఇలా నట్టి కుమార్ పై చాలా ఆరోపణలు చేస్తున్న వారే మరో అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.
నట్టి వద్ద బోలెడు సాక్ష్యాధారాలు వుంటే నేరుగా దర్యాప్తు చేస్తున్నసిట్ వద్దకి వెళ్లకుండా టీవీ స్టూడియోకి ఎందుకు వచ్చినట్టూ అని! ఈ డౌట్ కూడా సహజమే! నట్టి కుమార్ ఇప్పుడు తన ఆరోపణలు నాటీ ఆరోపణలు కావని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది...