జగన్ ను రెండో పెళ్లి చేసుకోమన్నా..చంద్రబాబుకి కులపిచ్చి..
posted on Mar 1, 2016 @ 5:33PM
వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి జంప్ అయిన ఆదినారాయణ రెడ్డి అప్పుడే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఎలాగో అనేక అడ్డంకులు ఎదురైనా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరారు. అయితే అలా చేరారో లేదో అప్పుడే మైక్ దొరికింది కదా అని చెప్పేసి జగన్ పై విమర్శనాస్త్రాలు విసిరారు. అంతేకాదు పార్టీ అధినేత చంద్రబాబుపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ లక్ష కోట్లు సంపాదించాడని.. వాటికి రూపాయి లెక్క వడ్డీ వేసుకున్నా ఆరు లక్షలవుతుందని.. అన్నారు. అంతేకాదు తను ఎంట్రీకి అడ్డుపడిన రాంసుబ్బారెడ్డిని ఉద్దేశించి కూడా వ్యాఖ్యానించారు. అతనితో పనిచేసేందుకు సిద్దంగా ఉన్నానని.. ఒకవేళ తాను కనుక ఇబ్బంది పెడితే.. నేను రెండింతలు ఇబ్బందులు పెడతానని హెచ్చరించారు.
అక్కడితో ఆగకుండా ఇంకా అనేక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఇద్దరూ ఆడపిల్లలే ఉన్నారని.. ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పానని.. అన్నారు. ఇక చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. అలాగే... చంద్రబాబుకు కులపిచ్చి ఉందని... అది మార్చుకోవాలని ఆయనకు చెప్పానని అన్నారు. వైఎస్ హయంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగంగా జరిగాయని.. అంతకంటే వేగంగా చేయాలని చంద్రబాబుకు సూచించానన్నారు. మరి పార్టీలోకి వచ్చిన కొత్తలోనే ఇంతలా మాట్లాడుతున్నాడు.. అందునా చంద్రబాబు గురించి కూడా మాట్లాడుతున్నాడు.. ఇలానే మాట్లాడితే పార్టీలో ఏమాత్రం ఇమడగలడో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆదినారాయణ రెడ్డిగారు నోరు కాస్త ఆదుపులో పెట్టుకుంటే మంచిదని.. అనుకుంటున్నారు.