ఢిల్లీకి కన్నా...సీమాంధ్ర పీసీసీ చీఫ్‌గా?

 

 

 

రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు హైకమాండ్ నుంచి పిలుపురావడంతో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇవాళ హైకమాండ్ పెద్దలతో మంత్రి కన్నా కీలక మంతనాలు జరుపనున్నారు. కన్నాకు హైకమాండ్ పిలుపుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మంత్రి శ్రీధర్‌బాబును నియమించాలని అధిష్ఠానం ఆలోచిస్తోందంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, సీమాంధ్ర పీసీసీ చీఫ్‌గా కన్నా నియామకానికి అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

 

 

కాగా, కన్నా లక్ష్మినారాయణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం గతంలోనే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌తో మంతనాలు జరిపారు. తాజాగా కన్నాకు దిగ్విజయ్‌, అహ్మద్‌పటేల్‌ పిలుపునివ్వడం.. ఇద్దరూ ఆల్రెడీ కన్నాతో ప్రత్యేకంగా మాట్లాడటంటో ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిని చేస్తారా? లేదంటూ ఎవరూ ఊహించని విధంగా కిరణ్‌ని తప్పించి, కన్నాను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతారా.? అన్నదానిపైనా రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి.