కాంగ్రెస్ హయంలోనే తెలంగాణ: షిండే

 

 

 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. సోమవారం ఉదయం జీవోఎం సమావేశం అనంతరం షిండే మీడియాతో మాట్లాడుతూ యూపీఏ -2 పదవీ కాలం పూర్తయ్యేలోపు తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తుందని షిండే ప్రకటించారు. ఉమ్మడి రాజధాని విషయంలో హైదరాబాద్ పరిధిపై జీవోఎంకు అనేక ప్రతిపాదనలు వస్తున్నాయన్నారు. అవన్నింటినీ కేంద్రం పరిశీలిస్తుందని తెలిపారు. 371డి సంగతి జీవోఎం చూసుకుంటుందని షిండే చెప్పారు. షిండే ఉద్దేశ్యం ప్రకారం, 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో యూపీఏ సర్కార్‌ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయనే స్పష్టం చేశారనుకోవాలి. బిల్లు తీసుకొస్తారు సరే, దానికి పార్లమెంటు ఆమోదం పొందుతుందా.? అంటే దానికింకా సమాధానం దొరకడంలేదు.

 

VIDEO courtesy TV9