చత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్

 

 

 

చత్తీస్‌గఢ్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం ఏడుగంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రాష్ట్రంలో 85 వేల మంది పారామిలటరీ బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం రమణ్‌సింగ్ సహా 143 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా ఓటు వేస్తే చేతులు తీసేస్తామంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే ప్రాంతాలన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలే.

 


మరోవైపు చత్తీస్‌గఢ్‌లో కా౦కేర్ జిల్లా పంఖజోర్ లో మావోయిస్టులు ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. భారీగా పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ ఎన్నికలను అడ్డుకోవడానికి మావోయిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.