తృప్తి దేశాయ్ కొత్త వివాదం.. దేవాలయంలోకి చీరలా..?
posted on Apr 14, 2016 @ 10:44AM
నిన్న మొన్నటి వరకూ దేవాలయాల్లో ప్రవేశించడానికి లింగ వివక్షతపై ఆందోళనలు జరిగాయి. ఒక దేవాలయంలో స్త్రీలకు ప్రవేశం లేకపోతే.. మరో దేవాలయం గర్భగుడిలోకి పురుషుల ప్రవేశానికి అనుమతి లేదు. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న ఈ ఆచారాలను సైతం తొలగించి మహిళలు పోరాటం చేసి ఆఖరికి ఆలయంలో ప్రవేశించడానికి అనుమతి తెచ్చుకున్నారు. ఇక ఈగొడవలకు ముగిసిపోయాయి కదా అని ఆలోచించే లోపే మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన వివాదం.. దేవాలయంలో స్త్రీలు వేసుకునే దుస్తుల గురించి.
సాధారణంగా పలు ఆలయాల్లో స్ర్తీలు సంప్రదాయ దుస్తులు వేసుకునే రావాలన్న నిబంధనలు ఉంటాయి. ఇక పురుషుల విషయానికి వస్తే కొన్ని దేవాలయాలను బట్టి వారు పంచెతో వచ్చే ఆనవాయితీ ఉంటుంది. అయితే ఇప్పుడు భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ దీనిపై ఆరోపిస్తున్నారు. ఆమె ప్యాంటు, కోటు వేసుకొని కొల్హాపూర్ మహాలక్ష్మీ దేవాలయంలోకి వెళుతుండగా అక్కడ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దేవాలయ నిబంధనల ప్రకారం చీరతోనే రావాలని సూచించారు. దీంతో ఆమె వేసుకునే దుస్తులపై నిబంధనలేంటని.. ఇది వివక్షతే నంటూ ఆమె మండి ఆలోయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. మరి దీనిపై ఎంత రచ్చ జరుగుతుందో చూడాలి.