ఎర్రబెల్లి ఆ విషయంలో హర్ట్ అయ్యారా..? అందుకే పార్టీ వీడారా..?
posted on Mar 1, 2016 @ 3:38PM
తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి.. అనేక సంవత్సరాలు పార్టీకి నమ్మిన బంటులా ఉన్న ఎర్రబెల్లి ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే దశాబ్దాల తరబడి పార్టీని వెన్నంటి ఉన్న ఎర్రబెల్లి అంత సడెన్ గా పార్టీ మారడానికి కారణాలేంటి.. అంటే ఇప్పుడో కొత్త వాదన వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో.
ఒకేపార్టీ అయినప్పటీకీ రేవంత్ రెడ్డికి, ఎర్రబెల్లికి అనేక విషయాల్లో విబేధాలు ఉండేవి. వీరిద్దరి మధ్య తరుచూ ఏవో గొడవలు వస్తూనే ఉండేవి. అలా వారు గొడవ ప్రతిసారీ పార్టీ అధినేత చంద్రబాబు వారిని బుజ్జగించడం కామన్.. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఒక పని వలన ఎర్రబెల్లి బాగా హర్ట్ అయ్యారంట. అదేంటంటే.. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల బరిలో దిగిన అభ్యర్ధుల ఖర్చు నిమిత్తం ఎన్నికల వ్యవహారానికి సుమారు రూ.60 కోట్లు నిధులు వచ్చాయంట. అయితే ఈ డబ్బుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకోమని చంద్రబాబు రేవంత్ రెడ్డిని పురమాయించారట. అంతే దీంతో ఎర్రబెల్లి దీన్ని అవమానంగా భావించి.. సైకిల్ దిగి కారెక్కారంట. మరి ఇది వాదన మాత్రమే.. నిజంగా అదే జరిగిందా.. ఎంత వరకూ నిజమో ఎర్రబెల్లికే తెలియాలి.