Previous Page Next Page 
మనస్విని పేజి 9


    
    
    "ప్రపంచంలో కష్టాలన్నీ తనవే అనుకుని బాధపడేవారి కన్నా తన బాధ అంతా ప్రపంచందే అనుకునేవారు చాలా అదృష్టవంతులు వంతెన క్రింద నీరు పారాలి. అంతే కానీ నీటిక్రింద వంతెనవుండరాదు.
    
    
    కష్టాలునష్టాలు మనిషికి దూరంగా వుండవు. దగ్గరిగా వస్తాయ్. బెదిరిపోతే గుండెలు జారతాయ్ మౌనం వహిస్తే నిరాధారంగా ఉంటాయి అంతేసారధీ'
    
    ఒక్కక్షణం అతని ముఖంలోకి సూటిగా చూసి, అతను చెప్పింది ఏమీ అర్ధంకాక అన్నాడు నవ్వుతూ.
    
    'ఇప్పుడెవరు బాధపడుతున్నారని మధూ ఈ ఉపన్యాసం?'    

    '....'
    
    'అలా చూస్తావేం?'
    
    '......'
    
    'చెప్పవేం బదులు?'
    
    'అహ అది కాదు ఇంతవరకూ మౌన ముద్రాంకితుడవై సాక్షాత్తూ యోగిపుంగవుడిలా వుండి-ఆలోచనా సాగరంలో అల్లల్లాడుతూ ఉండి నాకే-నాతోనే-నా ఎదురుగానే ఇలా మస్కా వేస్తావేం?'
    
    'పోనీవయ్యాబాబూ! చెపితేనమ్మవు.....ఇంతకినీ హఠాత్ ఆగమనానికి కారణమేమిటా అని?'
    
    '......'
    
    'పలకవేమయ్యా'
    
    'ఏముంది అత్యవసరమైన పరిస్థితుల్లో అతి అత్యవసరమైన సహాయంకోరి వచ్చాను'
    
    'ఏమిటది?'  

 

    'సలహా'
    
    'సలహానా?' 'అవును ఓ అర్జెంటు విషయంలో'
    
    'అడుగు'
    
    'దానికి ముందు నువా కథను వినాలి'
    
    'వింటాను'
    
    'అందుకే ఈ రాత్రికి టౌన్ కి వచ్చెయ్'
    
    'అలాగే'
    
    'నేవస్తా'
    
    'అంత అర్జంటా?'
    
    'అవును'
    
    'సరే!'    

 

    'పశ్చిమదిశా సతి తన మగని ఆగమనానికి ముందుగా ఇల్లంతా అలంకరించుకుని రంగు రంగుల ముగ్గులుగీస్తున్నది-' పక్కన్నేవచ్చి కూర్చున్న గీతతో అన్నాడు సారధి.
    
    'ఈ రోజు మకారాలకి కూడలిఅయిందే ఈ తూముబండ'
    
    'అంటే'
    
    'ఏముందీ......మరదలూమధురమూ, మానినీ, ముగ్గురు ఇక్కడే కలిశారు'
    
    'అంటే'
    
    'వింటే'
    
    'ఊ....'
    
    'ముందు నేను వస్తున్నాను వెను వెంట తరుముతున్నట్టు సరోజ వచ్చింది.....దారివెంట వెళ్ళేవాడిని లాక్కొచ్చిఅక్కడ కూలేసింది......కూనిరాగాలు తీసింది.....కబుర్లుచెప్పింది.....పాడింది....పాడమంది......కథచెప్పుమంది .....చీవాట్లు తినింది- అలిగి వెళ్ళింది'
    
    'ఎందుకు?'
    
    'ఆమె పాటని, మాటని వినలేదని'
    
    'సరేతర్వాత?'    
    
    'మధురం వచ్చాడు'
    
    'ఎందుకో?'    

 

    'తెలియదు'
    
    'ఏమన్నాడు?'
    
    'రమ్మన్నాడు'
    
    'ఎందుకు? ఎక్కడకి'
    
    'టౌన్ కి, వినేందుకు'
    
    'ఏమిటో?'    

 

    'కథ'
    
    'విని-'
    
    'సలహా చెప్పాలిట'
    
    'ఊహూ......తర్వాత నేను.....అంతేనా.....లేకపోతే'
    
    'అవును'
    
    '......'
    
    "మళ్ళీప్రశ్న వేయలేదు"
    
    "ఆపావేం?"  

 

    "అయిపోయిందిగా"    

 

    "అప్పుడేనా"
    
    "అబ్బబ్బ! విసుగొస్తూ వుందండి"
    
    దగ్గరగా జరిగి నవ్వుతూ ఆమె చేతిని అందుకుని మృదువుగా వేళ్ళని నిమురుతూ పిలిచాడు.
    
    "గీతా"
    
    "ఊ"
    
    "ఇలారోప్జూ వచ్చేస్తుంటే మీ నాన్న వాళ్ళకి తెలియటం లేదా?"
    
    "ఎందుకు తెలీదు?"
    
    "మరి"
    
    "మానాన్నగారే సాయంకాలం అలా బయటికి వెళ్లి వస్తూ  వుండటం మంచిదని చెప్పాడు"
    
    "ఎందుకని?"
    
    "ఆరోగ్యం అని"
    
    "ఎవరైనా చెపితే"
    
    "ఏమిటి?"
    
    "మనం ఇలా కలిసి మాట్లాడుకోవటం"    

 

    "ఏముంది క్లాస్ మేట్.....ఫ్రెండ్ అంటాను"
    
    "అబద్దమా?"    

 

    "ఎక్కడా?"
    
    "ఇక్కడే....."
    
    "అబద్దం ఏముంది నిజమే చెపుతాను గదా?"    

 

    "కొంత దాస్తున్నావ్"
    
    "నిజమే-అడగని విషయం ఎందుకు చెప్పాలి"
    
    "అడిగితే"
    
    "చెపుతాను"
    
    "ఊహూ ఏమనో?"
    
    "ప్రేమించాను...... పెళ్ళి....."    

 

    "పూర్తి చెయ్"    

 

    "అది మీ వంతు"    

 

    "చేసుకుంటాను"

 Previous Page Next Page