Previous Page Next Page 
మనస్విని పేజి 8

 

    వెనువెంటనే వస్తూ పిలిచింది సరోజ
    
    'ఊ'
    
    'అలా కూర్చుందామా'
    
    కెనాల్ నుండి పొలానికి నీళ్ళుపారించే తూము వైపుగా చూపుతూ అంది.    

 

    'ఊ...'
    
    'అలా కూర్చుందామా'
    
    కెనాల్ నుండి పొలానికి నీళ్ళుపారించే తూము వైపుగా చూపుతూ అంది.    
    
    'ఊ..'
    
    మౌనంగా వెళ్ళి కూర్చున్నారు.
    
    ఎదురుగా కూర్చుని కాలవలోనికి రెండుకాళ్ళు వదిలిగలగలాపారే నీళ్ళలో పాదాలు ముంచి చప్పుడు చేస్తూ కూర్చుంది.  

 

    పారాణిదిద్దుకున్న పాదాలునీళ్ళలో ఎర్ర తామరల్లా మెదులుతున్నాయ్ కదుల్తూ.    

 

    పాదాలకాంతికినీరు ఎర్రగా మారినట్లై అస్తమిస్తోన్న సూర్యకాంతికి అనుగుణంగా వుంది. మెల్ల మెల్లగా కూని రాగాలు మొదలుపెట్టింది.
    
    "ఓబావా! నా బావా!!"
    
    మౌనంవీడలేదు సారధి.
    
    'కోతీబావకు పెళ్ళంట.....'
    
    విసుగ్గా అన్నాడు.
    
    'అబ్బబ్బ! కొంచెంసేపునీ కూనిరాగం ఆపుదూ'
    
    నవ్వుకుంది బావ చమత్కారానికీ. అందుకే బావా తిట్టినా ఆమెకు సంతోషంగా వుంటుంది. కూనిరాగంతో కూడిన దండనలో ఆప్యాయత వుంటుంది. కానీ అధికారం ఉండదు. అధికారం లేకున్నా ఆ ఆజ్ఞముందు అధికారంవున్న ఆజ్ఞ ఎందుకూ చెల్లదు.
    
    లేచివచ్చి దగ్గరగా కూర్చుంటూ అంది.
    
    'పోనీనువు పాడరాదా బావా?'  

 

    ఆమెముఖంలోకి ఓ విధంగా చూశాడు.
    
    మళ్ళీ రెట్టించింది అలాగేచూస్తూ అన్నాడు.
    
    'నేనుపాడితే వినేవాళ్ళులేరు'
    
    'నేవింటాన్లే'  

 

    'వినలేవు'
    
    'అబ్బబ్బ! వింటాన్లేద్దు!!'  

 

    "ఊరుకో సరోజా! అర్ధంలేనిగారాబం చెయ్యకుపాటరానివాళ్ళని పాడమని అడిగి అవమానం చేస్తే వాళ్ళెంత బాధపడుతారో తెలుసా?'    
    
    'అరరేతెలియదే? పోనీలే వద్దులేబావా......'

    

    ఒక్కక్షణం ఆగి మళ్ళి అంది.    
    
    'పోనీ ఓ కథ చెప్పుదూ'
    
    'చందమామో, బాలమిత్ర చదువుకోరాదూ'
    
    'అప్పుడే అయిపోయాయి'
    
    'యువతెచ్చాను కదా?'    

 

    'ఇంకా యువతరం రాలేదు'
    
    'తూ! తూ! అంతా తప్పుడు మాటలు.....ఊరుకో ఇక విసిగించకు'
    
    'అలా కసరితే నే వెళ్ళిపోతాను'
    
    'పో'
    
    'నిజం'
    
    'నిజం'
    
    'పోతాను'
    
    'పో'
    
    'మళ్ళీ రాను'
    
    'వద్దు'
    
    'కాలవలో దూకుతా!'
    
    'వద్దు చలి!'
    
    విరగబడి నవ్వింది.
    
    'చచ్చేవాళ్ళకి చలేంటి బావా?'    

 

    'అర్ధంలేనివాగుడు వాగక. ఇంటికిపో'
    
    'ఎందుకో?'
    
    'ఒకందుకు'
    
    'అదేమిటో?'
    
    'అడగరానిది'
    
    'అయితే అత్తయ్యతో చెపుతా?'
    
    'ఏమని?'
    
    '......'
    
    'ముహూర్తం పెట్టించమని?'    

 

    సిగ్గుపడుతూ లేచి అంది.
    
    'నేవెళతా బావా?'
    
    'వెళ్ళు'
    
    'అయినా అదెందుకని'
    
    'ఏది'
    
    'ముహూర్తం'
    
    'అప్పుడు.....ఎందుకు? ఏమిటి? ఎక్కడ? అని అడిగే అధికారం వస్తుంది'
    
    'ఓహో'
    
    'సరే వెళ్ళు'
    
    మౌనంగా పది అడుగులు వేసిమళ్ళీ వచ్చింది.
    
    'నేపోతున్నా బావా'
    
    'తప్పు నే వెళ్ళి వస్తాననాలి'
    
    'మళ్ళీ ఇక్కడికా?'
    
    'ఎక్కడికైనా సరే'
    
    'సరేనే వెళ్ళివస్తా'
    
    'ఇది ఎన్నోసారి చెప్పటం'
    
    'మళ్ళీరాను'
    
    'ఈ పూట మాత్రమే'
    
    'నిజం ఇంకెప్పుడూ రాను'
    
    '......'
    
    'పోతున్నా.......పోతున్నా'
    
    బెదరిస్తూదూరంగా పోతూవున్న కోమలిని కలుసుకోవటానికి పరుగెడుతూ వెళ్ళింది.
    
    సైకిల్ బెల్ మోగించుకుంటూ వచ్చి తూముబండపై కాలు మోపుతూ నిలబడ్డాడు మధురం ఆలోచనలలో మునిగివున్న సారధి తలెత్తి చూచాడు.    

    'హలో'
    
    'ఏమిటి సుదీర్ఘమైన ఆ ఆలోచన?'
    
    'ఏముంది-ఏమీలేదు'
    
    సైకిలుదిగి స్టాండు వేశాడు. దగ్గరగా వచ్చి ప్రక్కన కూర్చుని మీద చేయివేస్తూ అన్నాడు మధురం.

 Previous Page Next Page