Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 8


    
    "ఇంట్లో ఎవరూ లేరు. మనం పైన కూర్చుంటే ఎవరైనా జొరబడినా తెలీదు. అందుకని" అని లోపల హాల్లోకి నడిచి,  అక్కడ వున్న బాల్కనీ మెట్లవేపు దారితీసింది రమాదేవి.
    "చాలా బాగుంది" అన్నాడు అభినయ్ అమెని వెనకనుంచి చూస్తూ.
    "ఏమిటి?" అమె వెనక్కి తిరిగి చూడకూండానే అడిగింది.
    "ఇల్లు!" చెప్పాడు.
    ఖరీదైన ఫర్నిచర్. అలంకరించిన పరికరాలనీ, గోడలకి ఉన్న పెయింటింగ్స్ నీ ముచ్చటగా చూస్తూ.
    "ఈ ఇంటిని నా టేస్ట్ ప్రకారం కట్టించారు మా ఆయన" చెప్పింది రమాదేవి.
    "మీ టేస్ట్ అంటే మీ వారికి అంత యిష్టమా?" అడిగాడు అభినయ్.
    అతనెందుకలా అడిగాడో అమెకి అర్ధం కాలేదు. కానీ సమాధానం-
    "చాలా!" అని మాత్రం చెప్పింది.
    "కిందా పైన కూడా ఒకటే ప్లాన్ ప్రకారం కట్టించారు అభినయ్ డ్రాయింగ్ రూం, హాల్, రెండు బెడ్ రూమ్స్, కిచెన్ ఎక్స్ ట్రా" గర్వంగా చెప్పింది రమాదేవి.
    ఆ ఇంటిని చూస్తే అమె అభిరుచులు అర్ధమవుతున్నాయి అతనికి.
    "నిజానికి నాకు ఉద్యోగం చేయాల్సిన  అవసరం లేదు. ఆయన ఎక్కువగా కేంపులు వెళతారు. అందుకని బోర్ కొట్టకుండా హాబీగా, నేను జాబ్ చేస్తున్నాను"
    అమె చెప్పుకుపోతుంది.
    అమెను అనుసరిస్తూ బెడ్ రూంలో అడుగు పెట్టాడు అభినయ్.
    కప్ బోర్డ్స్ లోనూ, షెల్పులోనూ, పుస్తకాలు నీట్ గా సర్దబడి వున్నాయి. ఒక  అరలో టి.వి. వుంది.
    బీరువా, డబల్ కాట్ బెడ్.
    కిటికి దగ్గరగా టేబుల్ కుర్చీ.
     ఆ కుర్చీలో కూర్చుంటే రోడ్డు కాంపౌండ్ వాల్, ఆ ఇంటి గార్టెన్ అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.
    డబుల్ కాట్ మీద డన్ లప్ ఫోం బెడ్ మీద పరచివున్న బోంబె డయింగ్ దుప్పట్లు వున్నాయి. ఎత్తయిన తలగడలు రెండు వున్నాయి. అతను మంచంకేసి చూస్తుంటే అంది రమాదేవి.
    "ఇది నా పడగ్గది. అభినయ్. నా లైబ్రరీ కూడా ఆ గదిలోనే పెట్టుకొన్నాను. ఒక విధంగా చెప్పాలంటే నేను  ఎక్కువగా ఈ గదిలోనే వుంటాను" అంది రమాదేవి.
    "కూర్చో" అంది.
    అభినయ్ నవ్వుతూ చూశాడామెకేసి.
    "ఎందుకానవ్వు?" అంది చిరుకోపంతో.
    "కుర్చీ టేబుల్ మీ పర్శనల్ అని తెలుస్తున్నాయి. మంచం మీదీ, మీ ఆయనదీ, అని తెలుసు. మరెక్కడ కూర్చోను" అడిగాడు అమె దగ్గరగా వచ్చి.
    "చాల్లె బడాయి మాటలు. పర్వాలేదు ఆ కుర్చీలో కూర్చో" అంది చిన్నగా నవ్వుతూ.
    అభినయ్ కుర్చీలో కూర్చుని గభాల్న లేచి నించున్నాడు.
    "ఏం లేచావు?" అడిగింది అయోమయంగా.
    "ఈ కుర్చీలో కూర్చోగానే ఒడిలో కూర్చున్నట్టు అనిపించింది" అన్నాడు.
    "షటప్! నువ్వు చిలిపివాడివనే అనుకున్నాను. కానీ చాలా డేంజరస్ మాన్ వి కూడా?" అంది మంచంమీద కూర్చుంటూ రమాదేవి.
    అతని ప్రతి కదలికనీ అమె స్పష్టంగా పరీక్షగా గమనిస్తోంది.
    " నువ్వు పదినిమిషాలు కూర్చో. చిరాగ్గా వుంది. స్నానం చేసి వస్తాను" అంది.
    "నిమిషాలు లెక్కపెడుతుంటాను" అన్నాడు అభినయ్.,
    అమె లేచి నిలబడింది.
    అటాచెడ్ బాత్ రూంలోకి నడిచి తలుపులు మూసుకొని రమాదేవి భారంగా ఒళ్ళు విరుచుకుంది.
    చిన్న కూనిరాగం అమె పెదలమీద తేలుతోంది.
    అభినయ్ సిగరెట్ వెలిగించి కిటికిలోంచి బయటకి చూశాడు.
    చీకటి పడింది. రోడ్డుమీద మునిసిపాలిటి దీపాలు వెలగలేదు. ఆరోజు పౌర్ణమి కావడంచేత వీధుల్లో దీపాలు వెలగవు. పట్టణాల్లో అది మామూలే.
    బాత్ రూంలోంచి సన్నగా కూనిరాగం వినిపిస్తోంది.
    అతను ఊపిరి బిగపెట్టి చప్పుడు కాకుండా తలుపు తోశాడు. తలుపు తెరుచుకోలేదు. లోపల గెడ పెట్టబడింది.
    అతనలా అనుకోలేదు. తనని కావాలని అక్కడ కూర్చోబెట్టి స్నానాలగదిలోకి వెళ్ళివుంటుందని, తలుపు గెడ పెట్టకుండా దగ్గరికి వేసే వుంటుందని ఊహించుకున్నాడు అబినయ్.
    అభినయ్ కి ఎక్కడలేని  నిరుత్సాహం కలిగింది.
    అమెని స్నానం చేస్తుంటే ఎలా వుంటుందో చూడాలని వుందతనికి.
    అందాన్ని, ఆనందాన్ని అనుభవించాలన్న సిద్దాంతం అతనిది.
    నిజానికి అడవాళ్ళంటే అభినయ్ చాలా అభిమానిస్తాడు. అడదాని సౌందర్యానికి ప్రాముఖ్యతనిస్తాడు. అయితే ఆ క్షణం వరకూ ఏ స్త్రీవల్లా అతను అనుభవాన్ని పొందలేదు. కానీ ఆ అనుభవపు లోతుల్లోకి వెంటనే వెళ్ళి అంచు అంచునీ తాకాలని ఆరాటపడుతున్నాడు.
    రమాదేవిలో ఏదో మాగ్నెట్ పవర్ వుంది. లేకపోతే అమె చుట్టూ ఇలా తిరిగేవాడా?
    అమె తనని కావాలని వెనక తిప్పుకుంటున్నదా?
    ఏదన్నా నాటకం అడుతుందా? తనకి బుద్ది చెప్పడానికి?
    అతనికి ఆ అనుమానం రావడానికి కారణం అమెని ఎన్నో రకాలుగా ఏడిపించి వున్నాడతను. దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడిలా తనని అడిస్తున్నదా?
    రమాదేవి కూడా  అంతేనా అయితే మాత్రం! అమెని......
    తలుపుకి వున్న  "కీ హోల్" లోంచి చూశాడు.
    సరిగ్గా కనిపించడంలేదు. కాస్త పెద్ద హోల్ పెట్టచ్చు కదా! ఇప్పుడు ఎలాంటి ఛాన్స్ మిస్ అవుతుందో మరి.
    ఎక్కడలేని చిరాకు, కోపం వస్తున్నాయి అభినయ్ కి.
    అసలు.... తనని గదిలో కూర్చోబెట్టి ఆ గదికి అటాచ్ చేసిన బాత్ రూంలోకి స్నానానికి అమె వెళ్ళడంలో ఏమయినా మర్మం వుందా? తను ఇలాంటి కొంటెపని చేస్తాడని అమెకి తెలీని విషయం కాదు.
    ఖచ్చితంగా ఆలోచించగలదు.... అంత తెలివైనది రమాదేవి.
    అంటే ఖచ్చితంగా అమెను తను చూడాలనే ఇలా చేస్తుండాలి. తనని రెచ్చగొట్టడానికే అమె  ఇలా చేస్తోంది. బాత్ రూం కిటికి వుందేమో నని చుట్టూ చూశాడు.
    లేదు.

 Previous Page Next Page