"సిల్లీ బోయ్" అనుకుంది రమాదేవి సన్నగా నవ్వుకుంటూ . అసలు అతన్నెంత దూరంగా వుంచాలనుకుంటే అంత దగ్గరకొచ్చేస్తాడు. నిజం చెప్పాలంటే అతని పద్దతులు ఏమిటో అతనికే తెలీదనిపిస్తుంది.
ఇదేం మనిషి బాబూ!అంతేకాదు. ఒక్కోసారి ఎంత ప్రమాదంగా ప్రవర్తిస్తాడో అమెకి గుర్తుకొచ్చింది.
అవును, ఆరోజు... తనుగనక సిగ్గుతో తలపించుకొని ఊరుకుంది. కానీ, మరో మేడంగానీ, సార్ గానీ అయితే అతడిని కాలేజీనుంచి డిస్మిస్ చేసేవాళ్ళే. అడ్రస్ లేకుండా పోయేవాడు.
పరీక్ష జరుగుతోంది. తను వాచర్ గా క్లాస్ లో తిరుగుతోంది.
ఎవరి ధోరణిలో వాళ్ళు పరీక్ష రాస్తున్నారు. కాని ఒక అబినయ్ దొంగచూపులు చూడటం పసిగట్టింది. రామాదేవి. అతను కాపీ కొట్టటానికి ప్రయత్నిస్తున్నాడని అమెకి అర్థం అయిపోయింది.
ప్రత్యక్షంగా పట్టుకోవాలని నిశ్చియంచుకుంది. అమె. అప్పటికే అతని అల్లరితో విసుగెత్తిపోయి వుంది.
అతను జేబులో చెయ్యి పెట్టాడు. దేనికోసమో వెదుకుతున్నట్లుగా జేబులో తడుముకుంటున్నాడు.
రమాదేవి అతన్ని సూటిగా చూడగానే గభాల్న చేయి తీసేసి అన్సర్ పేపర్ కేసి చూసుకోవటం మొదలుపెట్టాడు అభినయ్.
అమె వచ్చి అతని పక్కగా నించుంది. అమె రాకతో అభినయ్ చాలా ఇబ్బందిగా నవ్వాడు అమెను చూసి.
"కమాన్ మిస్టర్... జేబులోంచి కాపీస్లిప్స్ బయటికి తియ్యి" అంది కఠినంగా.
అభినయ్ కంగారుగా చూశాడు అమెకేసి.,
" నాదగ్గర... నా దగ్గర.....ప్లీజ్ ఏమీ లేవు మేడం" నన్ను ఈసారికి విడిచిపెట్టండి. మేడం. అన్న ధోరణిలో అభ్యర్ధిస్తున్నట్టుగా అన్నాడు.
"నటించకుండా ముందు కాగితాలు తీసి నాకివ్వు లేదా కాపీకొట్టావన్న కారణంతో నిన్ను బయటికి పంపించేయాల్సి వుంటుంది" కోపంగా అంది రమాదేవి.
" నా దగ్గర కాగితాలు లేవు మేడం" తిరిగి అదే సమాధానం.
"ఇటు తిరుగు" అంది అజ్ఞాపిస్తున్నట్లుగా.
"దేనికి"? కంగారుగా అడిగాడు అభినయ్.
"నీ జేబు చెక్ చేస్తాను" అంది.
"వీల్లేదు! నా జేబుని చెక్ చేయడానికి నేను అంగీకరించను" అన్నాడు పట్టుదలగా. క్రీగంట పూర్ణాకేసి చూస్తున్నాడు చిన్నగా నవ్వుతూ.
"అయితే నువ్వు పరీక్ష రాయడానికి వీల్లేదు. ప్లీజ్ గెటౌట్" అరిచింది.
"అబ్బ... ఏమిట్రా అభినయ్ డిస్ట్రబెన్స్! మేం పరీక్ష రాయాలా వద్దా?" అన్నాడు పూర్ణా విసుగుని ప్రకటిస్తూ.
"అమె అనవసరంగా నన్ను అనుమానిస్తుందిరా" అన్నాడు అభినయ్..
అంతమందిలో తన పరువు మర్యాదలు పోతున్నాయన్నంత బాధగా సమాధానం యిచ్చాడు అతను తన ఫ్రెండ్ కి.
"పోని నీ జేబులో ఏమీ లేవని అంటున్నావు కదా! అమెని చెక్ చేసుకోని" అన్నాడు దాసు.
"సరే"! నేను వద్దన్నా వినటం లేదు. నేనేం చేయను చూసుకోండి. మేడం" అన్నాడు అభినయ్ పక్కకి తిరిగి. అమె అతని జేబులో చేయి పెట్టింది.
అమె ముఖం కందగడ్డలా మారిపోయింది. చేతిని వెనక్కి విసురుగా లాగేసి "స్టుపిడ్...." అని పళ్ళబిగివుచాటుగా తిట్టింది. అతన్ని మింగేయాలన్నంత కసి, అవేశం, అమెకి కలిగాయి. కలలో కూడా ఊహించని అవమానం.
ఎంత దారుణానికి ఒడిగట్టాడు. దుర్మార్గుడు. ఎవరూ లేకపోతే అతని చెంపలు పగలకొట్టి వుండేది రమాదేవి.
అతను కొంటెగా చూశాడు అమెవంక.
"ఏమీ దొరకలేదా మేడం?" అన్నాడు ఎగతాళిగా.
"షటప్" అని విసురుగా వెళ్ళిపోయి కుర్చీలో కూలబడిపోయింది. కింద పళ్ళకి పెదిమని నొక్కిపట్టి అవేశాన్ని చల్లార్చుకోడానికి ప్రయత్నిస్తోంది.
ఎంత అవమానం చేశాడు. జీవితంలో మరచిపోగలదా?
రోగ్... ఇడియట్... స్కౌండ్రల్... అమె ముక్కుపుటాలు ఎగిరెగిరి పడుతున్నాయి.
వాడ్ని... కాలేజినుంచి డిస్మిస్ చేయించాలనిపిస్తోంది. విద్యార్ధి దశ అనేది లేకుండా నాశనం చేయ్యాలి. ఎన్నో ఆలోచనలు అమెని ముసురుతున్నాయి.
కానీ ఏమని రిపోర్ట్ చేస్తోంది?
అతను అలా ప్లాన్ ప్రకారం చేశాడని నిరూపించలేదు. ఓ పక్క తన పాకెట్ ని చెక్ చెయ్యడానికి వీలులేదని ప్రతిఘటించాడు. తనే ఫోర్స్ చేసింది మరి.
పైగా చండాలం నలుగురికి తెలిస్తే తనకే అవమానం ఇప్పుడు.... నవ్వులపాలైపోతుంది. మళ్ళీ కాలేజి మొహం కూడా చూడలేని పరిస్ధితి కలుగుతుంది.
ప్రస్తుతం జరిగింది అభినయ్ కీ, తనకి మాత్రమే తెలుసు. ఇంకెవరకి తెలీదు. కనక రిపోర్ట్ ఇచ్చి జరిగినదాన్ని అల్లరి చేసుకోవడం తనకే చిన్నతనం అవుతుంది కూడా.
అందుకే మౌనంగా వుండిపోయింది.
పరీక్ష పూర్తయ్యేవరకూ మళ్ళీ కుర్చీలోంచి కూడా లేవలేదు. రమాదేవి ఏడుపొచ్చినా బిగపెట్టుకుని కూర్చుంది.
ఇలాంటి అనుభవం అతని వల్ల ఇంకెవరికి జరిగినా అతను కాలేజి నించి వెళ్ళగొట్టబడేవాడే. అది అక్షరసత్యం.
అలాంటి చిలిపివాడి గురించి తనెందుకిలా తలకిందులై పోతుందీ రోజు.
అతనికోసం తను ఎదురుతెన్నులు చూడవలసినంత గొప్పవాడు కాదే!
కానీ ఏదో ఆకర్షణ....
మాటల గారడీ... అతన్ని చూడాలని మనసెందుకు ఆరాటపడుతుంది?
అదే...... అదే.... అతనితో వచ్చిన చిక్కు.
తను అక్కడే అతనికి దొరికిపోయింది. మళ్ళీ అంతలోనే అనుకొంది.
వస్తే వచ్చాడు లేకపోతే లేదు.
ఏ.... అతనేమన్నా వి.ఐ.పి. ననుకొంటున్నాడా? ఫ్రిజ్ లోంచి బాటిల్ తీసి చల్లని నీళ్ళు తాగింది. హాయిగా అనిపించింది. నీళ్ళు తాగాక.
మధ్యాహ్నం ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి అసలు తోచటం లేదు.
చంద్రశేఖర్ అమె భర్త
కాంప్ వెళ్ళాడు. ఒక్కగాను ఒక్క కూతురు బేబి శ్వేత అమ్మమ్మ దగ్గరకెళ్ళిపోయింది.
ఇంట్లో ఒంటరిగా... బోర్... అసలు టైం గడవడంలేదు. అందుకే అలా వుందేమో.
అతని కోసం ఎదురుచూడ్డాం!
కానే కాదు... ఇంకెందుకో!