"ఒరే దాసూ! జీవితం అంటే అర్థం తెలుసురా నీకు? పుట్టుకతో మనం ఏమీ తీసుకురాలేదు. పోయేటప్పుడు తీసుకెళ్ళేది లేదు"
కానీ... ఈ మధ్య కాలంలోనే మనిషి స్వార్థంతో బతుకుని ప్రారంభిస్తాడు.
కానీ అది బతుకు కాదురా!
"నా.... నీ..." అనే బేధభావం లేకుండా ఎదుటి వాడికి ఉపయోగపడుతూ బతికే బతుకులో వుండే మధురానందం ఎదుటివాడి నెత్తిన చేతులు పెట్టి సంపాదించే లక్షలు ఇవ్వలేవు.
"వేదంతమా!"
"కాదు, అక్షర సత్యమిది. నేను చెయ్యాలనుకొన్న మంచిని చెయ్యడం, నేను చేయలనుకొన్న దాన్ని సాధించడం కోసం వెనుకంజ వేసే ప్రసక్తి లేదు. జీవితం అనే బతుకు పోరాటంలో ఎదుటివాడికి నష్టాన్ని కలిగించకుండా అందాన్నీ, ఆనందాన్ని, సుఖాన్నీ పొందటం నా పాలసీ" అన్నాడు అభినయ్ స్ధిరంగా.
"ఒ.కే. అయితే ఓ పని చేయ్యి. ఆ అమ్మాయి పేరు చెప్పకు. కానీ జరిగింది చెప్పు" అన్నాడు పూర్ణా.
అభినయ్ చెప్పాడు.
పూర్ణా సంతోషంగా అభినయ్ వీపున చరుస్తూ...." అయితే నావల్ల ఓ అమ్మాయిని రక్షించే అవకాశం నీకు దొరికిందన్నమాట!" అన్నాడు.
"నిజం చెప్పాలంటే అంతే మరి!" అంటూ లేచాడు అభినయ్. అతని వెనుక మిత్ర బృందంకూడా లేచారు.
గాలరీ క్లాసు దగ్గరికి రాగానే అభినయ్ నడక వేగం తగ్గింది.
ఆ క్లాసులో కూర్చుని పాఠం వింటున్న కైరవి కనబడింది అభినయ్ కి.
అది లెక్చరర్ గంగాధరం క్లాసు గంగాధరం అంటే అందరికి హడల్. అయనకి "ఘోస్ట్" అన్న నిక్ నేమ్ వుంది కాలేజిలో.
కాసు పక్కగా అభినయ్ మిత్రబృందంతో కలిసి వెళ్ళడం చూసింది కైరవి.
అబినయ్ ని చూసి చిలిపిగా నవ్వింది కైరవి. ఆ చూపుకోసమే తపించిపోతున్న అభినయ్ కళ్ళు మెరిసినాయి. గుండె లయ తప్పినట్టు పరవశంగా అతనికేసి చూస్తోంది కైరవి.
అభినయ్ క్లాసురూం కిటికి పక్కగా నించున్నారు. క్లాసులోకి వచ్చేస్తునన్నట్లుగా సైగ చేశాడు.
"అమ్మో!" అన్నట్టుగా గుండెలమీద చేతులు వేసుకొంది కైరవి. తన వాలకాన్ని ఏమాత్రం పసిగట్టినా ఘెస్ట్ గారు చంపేస్తారు. ఆ విషయం తెలుసు కైరవి.
ఎవరూ చూడకుండా వెళ్ళిపోమన్నట్టుగా నమస్కారం చేసింది కైరవి. అతను విననట్టుగా తల అడ్డంగా తిప్పాడు. అమెకేమీ పాలుపోని పరిస్ధితి.
ఇటు లెక్చరర్. అటు ప్రియుడు.
ఎలా? ఏం చేయాలి? దొంగచూపులు చూస్తోంది.
బయట నిలబడి నోటుపుస్తకంలో ఏదో రాస్తున్నాడు అభినయ్. అమె అతన్నే చూస్తోంది. ఆ పుస్తకాన్ని కిటికిలోంచి అమెకి అందించాడు. నెమ్మదిగా చేయిసాచి ఆ పుస్తకాన్ని అందుకొంది కైరవి.
అమె గుండెలు అదురుతున్నాయి. ఒడిలో పెట్టుకుని పుస్తకాన్ని తెరిచి కళ్ళుదించి చూసింది.
ఓ అమ్మాయిని ఓ అబ్బాయి ముద్దు పెట్టుకొంటున్న బొమ్మ.
అమ్మాయి బొమ్మదగ్గర కైరవి అనీ, అబ్బాయి బొమ్మ దగ్గర అభినయ్ అని రాసి వుంది. దాని చుట్టూ పెదవుల ముద్రలు వున్నాయి.
కింద ఇలా రాసివుంది.
అది చదవగానే అమె చెంపలు కెంపులయ్యాయి.
డియర్ డార్లింగ్!
నీకు వెయ్యినూట పదహారు ముద్దులు ఇస్తున్నాను అందుకో.
---- అభినయ్.
నుదురు, మెడ, శరీరం, భుజాలు, కనురెప్పలు, ముక్కు, పెదవులు, చంపలు, గెడ్డం, గుండెలు, నడుం, పొట్ట, ఇంకా ఇంకా... కిందుగా ఇంకా చాలా కిందుగా.... సిగ్గు, గువ్వపిట్టలా ముడుచుకుపోతోంది కైరవి. అమె కళ్ళు అరమోడ్పులవుతున్నాయి.
మ్చ్...మ్చ్......
అబ్బ... అ..దే....ఓహ్...మ్చ్...మ్చ్......
ముద్దుల వర్షంలో మునిగిపోయిన అనుభూతిలో అమె క్లాసురూం అన్న సంగతి మరచిపోయి మెలికలు తిరిగిపోతోంది.
అమెకి ఏమయిందో తెలీని క్లాసులో స్టూడెంట్స్ తికమకపడిపోసాగారు. ఘెస్ట్ గారు పాఠం అపి అమెకేసి నిర్ఘాంతపోతూ చూసి అంతలోనే తేరుకొన్నాడు.
"మిస్ కైరవీ1 లీవ్ ది క్లాస్ రూం?" అని అరిచాడు. జరగింది తెలుసుకొని కైరవి సిగ్గుతో క్లాసులోంచి బయటికి నడిచింది. 4
రమాదేవి బాల్కనీలోకి పదిహేడోసారి వచ్చి రోడ్డుమీదికి తొంగి చూసింది.
అమె ఎదురుచూస్తోన్న వ్యక్తి జాడలేదు.
అమెకదోవిధమైన చిరాకూ, కోపమూ వస్తున్నాయి.
వస్తానని ఎందుకన్నాడు?
మరి రాండే? కుదరలేని మనిషి ఇంకెక్కడికయినా వెళ్ళాడా!
అమె అలోచనల కేంద్ర బిందువు అబినయ్.
అతన్నిబాగా మందలించాలి. లేకపోతే హద్దుమీరిపోతున్నాడు అనుకొంది రమాదేవి.
ఊరుకొంటున్న కొద్ది విపరీతంగా తయారవుతున్నాడు. ఎలా చెప్పాలి? ఏం చేయ్యాలి? తోచలేదామెకి.
చలిగాలి తిరిగింది. ఆకాశం అపరంగి కాంతలను సంతరించుకొంటోంది.
అతని గురించి తనెందుకంతగా ఆలోచిస్తుంది? అమెనే అంతుచిక్కడంలేదు.
"పాఠం కోసం!" అన్నాడు.
"ఏం పాఠం?"
తనకి నేర్పడానికి కాదుకదా! ఒక మగాడు ఆడదానికి నేర్పేపాఠం ఏమిటి?
ఛీ! ఇదేం ఆలోచన, సిగ్గుతో మొగ్గయిపోయింది.
ఎందుకు? ఎందుకిలా అవుతోంది తనకి? అసలు అభినయ్ గురించి తనెందుకు ఆలోచిస్తుంది? అతనంటే తన కిష్టమా? లేదే! మరి కోపమా? ఊహు అదీ లేదు. మరి?