Previous Page Next Page 
చిలకలు పేజి 37


    విజయ్ ను గుండీకోసం శంకర్రావో, రమణరావో వెంబడిస్తూనే ఉండి ఉంటారు.
    రమణరావు మీద హత్యా ప్రయత్నం చేసినవాడికి ఆరువెళ్లు ఉన్నాయి. ఆ మాట రమణరావే చెప్పాడు. కాని తను నమ్మలేదు. పైడయ్యా చెప్పినా నమ్మలేదు.
    మరి సునంద కూడా చూశానంటుందే?
    శంకర్రావే ఈ పని  చేసివుంటే ఆరేళ్ళు ఉన్న చేతిని సునందకు కావాలనే ఎందుకు చూసిస్తాడు?
    అంటే విజయ్ ను కొట్టింది శంకర్రావుకాడు.
    గుండీకోసం రమణరావే కొట్టిఉంటాడా? మరి అతడి చేతికి ఆరు వేళ్ళు లేవే!
    ఆరు వేళ్ళున్న వాడిని ఎవడ్నయినా కిరాయి గుండాను రమణరావు ఎంగేజ్ చేశాడా?
    భారతిని చంపింది ఎవరు?
    రమణరావు ఎంగేజ్ చేసిన కిరాయి మనిషా? ఒక ఆడమనిషి కూడా ఆ హత్య జరిగినప్పుడు ఉండి ఉండాలి. గాజుల ముక్కలు పడి ఉన్నాయ్.
    పోచయ్య ఏదో దాస్తున్నాడు. రమణరావు వాడ్నే కూడగట్టుకొని ఈ హత్య చేయించి ఉండొచ్చుగా?
    ఆ ఆడమనిషి
    ఆ ఆడమనిషి సన్యాసమ్మే అయిఉండాలి. అంటే భారతిని హత్య చేసింది రమణరావే. మిగతా రెండు హత్యలూ రమణరావే చేస్తే మరి అప్పుడు చేతులకు గ్లౌజులు తొడుక్కున్నాడు. మరి ఇక్కడ వేలు ముద్రలు ఎందుకు  వదిలినట్టు?
    సన్యాసమ్మ మీద అనుమానం వస్తుందని ఊహించి ఉండడు! అంతే!
    ఆలోచిస్తూ తెలతెలవారుతూ ఉండగా నరేంద్ర నిద్రలోకి జారిపోయాడు.
                                    19
    "అన్నయ్యా! అన్నయ్యా!"
    సునంద కంఠం విని తృళ్ళిపడి లేచాడు.
    "ఎనిమిది అయింది. ఇన్స్ స్పెక్టర్  వచ్చాడు."
    "వీడొకడు పొద్దునే తయారయ్యాడు. విజయ్ ఎలా ఉన్నాడు?"
    ఫర్వాలేదు. లేచి కూర్చున్నాడు. ఇన్స్ స్పెక్టర్ తో మాట్లాడుతున్నాడు."
    "కాపీ తెస్తాను" అంటూ సునంద  లోపలికి వెళ్ళింది.
    నరేంద్ర బద్దకంగా లేచి బాత్ రూంలోకి వెళ్ళాడు.
    పళ్ళు తోముకొని వచ్చేసరికి సునంద కాఫీ కప్పు అన్నకు అందించింది. కాఫీ తాగి నైట్ డ్రెస్ లోనే విజయ్ గదిలోకి వచ్చాడు.
    "గుడ్ మార్నింగ్ " అన్నాడు ఇన్స్ స్పెక్టర్
    "గుడ్ మార్నింగ్. ఏమిటింత పొద్దుటే వచ్చావ్ మరో మర్డరా?"
    "మరొక మర్డరు కూడా జరగలా? ఈ మూడూ చాలవు మన ప్రాణాలకు?" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "విజయ్! ఎలా ఉంది?" నరేంద్ర అడిగాడు.
    "బాగానే ఉంది. కొంచెం తలనొప్పిగా ఉంది"
    "ఇదేం దారుణం విజయ్ తలబద్దలు కొట్టింది ఆ రంగారావుగాడే. ఇవన్ని వాదిపనే అనవసరంగా మనం రమణరావును అనుమానిస్తున్నాం. అతడి ఆఫీసులో వాళ్ళూ, అతడికి తెలిసినవాళ్ళంతా రమణరావు చాలా మంచివాడని చెప్తున్నారు. కాకపోతే కాస్త ఆడవాళ్ల బలహీనత ఉందట"
    "అలాగా?" సాలోచనగా అన్నాడు.
    "అసలు విషయం చెప్పనే లేదు" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "ఏమిటదీ?"
    "నీ అంచనా తప్పు అయింది"
    "ఏమిటది?"
    "సన్యాసమ్మ వేలిముద్రలు, భారతి శరీరం మీది వేలిముద్రలు కావట."
    "అలాగా?" చాలా తాపీగా అని సిగరెట్  వెలిగించుకున్నాడు.
    "ఇప్పటికైనా అంగీకరిస్తావా రమణరావు హంతకుడు కాడని?" 
    "ఇదొక్కటి చాలా అతడ్ని అనుమానితుల లిస్టులోనుంచి తొలగించటానికి?" తీవ్రంగా చూస్తున్నాడు నరేంద్ర.
    "రాత్రి విజయ్ ను  కొట్టింది శంకర్రావేనటగా?"
    "ఎవరు చెప్పారు?"
    "విజయ్!"
    " చూడలేదట. కాని అమ్మాయి సునంద వాడిచేతికి ఆరేళ్ళు ఉండటం చూసిందటగా?"
    "అయితే?"
    అయితే ఏడుటి? ఆరు వేళ్లు ఉంది ఎవరికీ? శంకర్రావుకేగా? నేను మొదటినుంచి వాడ్నే అనుమానిస్తున్నాను. నువ్వే ఏదేదోఊహించు కొని కేసును పెడమార్గం పట్టిస్తున్నావ్?"
    "ఏమిటి నీ ఉద్దేశ్యం నేను కావాలనే పెడమార్గం పట్టిస్తున్నానంటావా?"
    "ఛ! నేను అనడం లేదు. నన్ను అపార్థం చేసుకోకు"
    "కేసును పెడమార్గం పట్టించడం అంటే అర్థం ఏమిటి?"
    "నువ్వు కావాలని చేస్తున్నావనడం లేదు."
    నా తెలివితేటలు అంతగొప్పగా ఉన్నాయంటావ్. అంతేగా?" నరేంద్ర ముఖం గాంభీరం అయింది.
    అందరూ కొద్ది నిముషాలు మౌనంగా ఉండిపోయారు.
    "నరేంద్రా! నన్ను అపార్థం చేసుకోవద్దు."
    "అదేం లేదులే. రేపు రాత్రికి నీకు హంతకుడ్ని పట్టిస్తాను సరేనా?"
    "రేపు రాత్రి దాకా ఎందుకు? మరో రెండు గంటల్లోనే పట్టుకోబోతున్నారు. ఒకడు నా కస్టడీలోనే ఉన్నాడు. రామకృష్ణ హంతకుడు సూర్యనారాయణే! రాధారాణిని హత్య చేసింది శంకర్రావు. భారతిని హత్య చేయించింది కూడా వాడే. రమణరావు హత్య చెయ్యడానికి ప్రయత్నించింది ఆ శంకర్రావే. విజయ్ ను కొట్టింది కూడా అరాస్కెల్."
    "ఇవన్నీ కోర్టులో ప్రూవ్ చెయ్యగలవా?"
    "ఆ! చేస్తాను."
    "విష్ యూ గుడ్ లక్" అన్నాడు  నరేంద్ర.
    "ఈ దెబ్బతో నువ్వు డి.ఎస్.పి.వి. అయిపోతావు" అన్నాడు విజయ్.
    "అవును, నువ్వు తప్పక డిఎస్పిగా ప్రమోట్ అవుతావు" అన్నాడు  నరేంద్ర నవ్వుతూ.
    "ఏం కానని ఎగతాళి చేస్తున్నావా?"
    "నేను  నిజమే చెప్తున్నాను" అన్నాడు నరేంద్ర.
    "నువ్వు చెప్పకపోయినా జరిగేది అదే."
    "ఏమిటి ఇన్స్ స్పెక్టర్ ఇవ్వాళ చాలా ఎగ్రసివ్ గా మాట్లాడుతున్నావ్?" అన్నాడు విజయ్ .
    "శంకర్రావును అనుమానిస్తూణే ఇన్నిరోజులు వదిలేసినందుకు విచారిస్తున్నాను. ముందే అరెస్టు  చేసి ఉంటే ఒక హత్యతో పోయేది."
    "ఇప్పుడు నీకు నష్టం ఏముంది? మూడు హత్యలు వరసగా హంతకుల్ని పట్టుకోవడం నీకు ఇది  ఒక గొప్ప అవకాశమేగా? అన్నాడు విజయ్.
    నరేంద్ర ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
    "నేను వస్తాను" లేచి నిల్చున్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "మంచిది. గుడ్ లక్ " అన్నాడు నరేంద్ర మరోసారి అదోలా నవ్వుతూ.
    "థాంక్యూ!" అని బూట్ల టకటకలాడించుకొంటూ వెళ్ళి పోయాడు ఇన్స్ స్పెక్టర్.
    "నీ దృష్టిలో శంకర్రావు నిరపరాధా?" అన్నాడు విజయ్.
    "విజయ్, ఇవ్వాలా నువ్వు  ఈ విషయాల గురించి ఆలోచించకు."
    "నేను బాగానే ఉన్నాను."
    ఇవ్వాళ రెస్టు తీసుకో. రేపు మనం చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది."
    "ఏమిటది?"
    ఇప్పుడు చెప్పను. రేపు చెప్తాను. నువ్వు విశ్రాంతి తీసుకో." అని నరేంద్ర లేచి  వెళ్ళిపోయాడు.
                                        20
    అర్థ గంటలో నరేంద్ర స్నానం చేసి డ్రెస్ చేసుకొని డైనింగ్  టేబుల్ దగ్గరకు వచ్చాడు తల్లి పెట్టిన టిఫెన్ తిని, గ్యారెజ్ లో నుంచి ఎ ఐ ఏ. 2000 మారుతిని బయటికి తీశాడు.
    విజయ్ పోర్టి కోలోకి వచ్చాడు.
    "ఎక్కడికి వెళ్తున్నావ్?"
    నిన్ను రెస్టు తీసుకోమమన్నానా? రాత్రికి వచ్చి చెబుతాగా?"
    "చిన్న పిల్లవాడిలా మాట్లాడకు. నువ్వెళ్ళి పడుకో.
    "ఇన్స్ స్పెక్టర్  మూర్ఖుడు అతడికి నువ్వు ఆరాత్రి వెంకట రమణా ప్యాలెస్ కు వెళ్ళినట్టు గట్టి నమ్మకంగా ఉంది. ఇప్పుడు వాగిన దాన్ని బట్టి చూస్తే ఏం చేస్తాడో అని భయంగా ఉంది."
    "ఏం చేస్తాడు?"
    "ఆ హొటల్  వాళ్ళకు నిన్ను చూపిస్తాడు."
    "అయితే?"
    "వాళ్ళు నిన్ను గుర్తిస్తారు. ఇన్స్ స్పెక్టర్ ఏ చేతులకు బేడీలు వెయడానికి కూడా వెనకాడదు. అందుకే పోలీసు వాళ్ళు స్నేహితులైనా, బంధులైనా నమ్మవద్దంటారు.
    "నీ చేతులకు బేడీలు వేస్తాడా? వెయ్యనియె" అంటూ కార్  స్టార్ట్  చేశాడు నరేంద్ర.
    విజయ్ కారు  వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుండిపోయాడు.
    "ఏమిటి బావా చల్లగాలిలో నిల్చున్నావ్?" అంటూ వచ్చింది సునంద.
    "ఆ రాత్రి  నరేంద్ర బాగా  పొద్దుపోయి ఇంటికి వచ్చాడు.
    విజయ్ కు డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చాడు. సునంద మందు మాత్రలతోపాటు వాలియం కూడా ఇచ్చింది. మంచి నిద్రలో ఉన్నాడు.
    ఏమట్రా అబ్బాయ్  ఇంత పొద్దు పోయింది? వెధవ ఉద్యోగం ఇదేం ఉద్యోగంరా? తిండీ తిప్పలూ లేకుండా పైగా ఎప్పుడు ఎవడు ఏం చేస్తాడోననే భయం ఇకటి! నువ్వు దిగిందికాకా వాడ్ని కూడా ఇందులోనే  దించావు మీ ఇద్దరికీ ఏ ప్రమాదమైనా జరిగితే మేము ఏంకావాలి?

 Previous Page Next Page