"విజయ్ అద్వయితానికి ఫోన్ కలుపు"
ఇన్స్ స్పెక్టర్ కు ఫోనా? ఇప్పుడా? ఎందుకూ?"
"చెప్తాగా? ముందు ఫోన్ చెయ్యి"
"విజయ్ ఫోన్ నంబర్లు తిప్పాడు. ఎంతసేపటికీ ఎవరూ ఎత్తలేదు.
"ఎవరూ లేనట్టున్నారు"
"మంచి నిద్రలో ఉండి ఉంటారు. ఏదీ ఇలా ఇవ్వు." అని నరేంద్ర రిసీవర్ తీసుకున్నాడు.
"హల్లో!" ఫోన్ లో ఇన్స్ స్పెక్టర్ కంఠం మత్తుగా పలికింది.
"ఇన్స్ స్పెక్టర్ నేను నరేంద్రను"
"ఆ! నువ్వా? ఏమిటి ఈ వేళప్పుడు! మళ్ళీ ఏదైనా మర్డర్ జరిగినట్టు నీకు ఫోన్ వచ్చిందా?"
"నాకు ఫోన్ రాలేడు. మర్డర్ జరిగితే ముందు నీకే వస్తుందిలే"
"మరి!"
"మర్డర్ జరగవచ్చు నువ్వు వెంటనే ఓసారి శంకర్రావు ఇంటికి వెళ్లాలి"
"ఎందుకూ? అతడ్ని ఎవరైనా మర్డర్ చేస్తారనే సమాచారం అందిందా?
"అతడ్ని కాదు ఒక స్త్రీ హత్య జరగొచ్చు"
"స్త్రీ హత్యా?"
"అవును."
"ఇప్పుడె వస్తున్నాను నువ్వూరా!"
"నేనెందుకూ? ఇద్దరు కానిస్టేబుల్స్ తీసుకొని వెళ్ళు!"
"నువ్వు కూడా రావాలి నేను ఒక గంటలో వస్తాను."
"గంటలోనా? త్వరగా వచ్చెయ్. నేను రెడిగా ఉంటాను."
"ఓ.కే." ఇన్స్ స్పెక్టర్ రిసీవర్ పెట్టేశాడు.
"అదేమిటి బాస్? ఆమెను శంకర్రావు హత్యచేస్తాడని ఎందుకనుకుంటున్నావ్?"
"వాడి రహస్యం ఏదో ఆ పిల్లకు తెలిసి ఉండాలి. లేకపోతే ఇంతకాలం తర్వాత ఆమెను ఇంత అర్జెంటుగా ఎందుకూ తీసుకొస్తాడు? ఆ పిల్లకు ఏ అనుమానం లేకపోతే తాన్ బిడ్డను హొమ్ లో ఎందుకు వదిలేసి వస్తుంది? నువెళ్ళి పడుకో" అంటూ నరేంద్ర తనగదిలో బత్తలుఇ మార్చుకొని వచ్చాడు.
అప్పటికే విజయ్ బట్టలు మార్చుకొని రెడీగా కూర్చుని ఉన్నాడు.
"నువ్వెందుకు? బాగా అలిసిపోయి ఉన్నావ్ వెళ్ళి పడుకో అన్నాడు నరేంద్ర.
"నాకేం అలసటగా లేదు వస్తాను. కారు తియ్యనా?"
"వద్దు నేను జీపులో వెళ్తాను నువెళ్ళిపడుకొ" అన్నాడు నరేంద్ర.
విజయ్ "మీరు వెళ్ళాక పడుకుంటాలే. తలుపు వెయ్యాలిగా" అన్నాడు.
నరేంద్ర సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ అద్వయితం కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. చేతి గడియారం చూసుకున్నాడు. రెండు దాటుతోంది.
జీప్ వచ్చి ఇంటి ముందు ఆగింది.
నరేంద్ర బయటకి వెళ్ళి జీప్ ముందు సీట్లో కూర్చున్నాడు.
ఇన్స్ స్పెక్టర్ స్టీరింగ్ దగ్గర ఉన్నాడు.
"పోనియ్! ఇప్పటికే ఆలస్యం అయిందేమో!" అన్నాడు నరేంద్ర.
జీప్ డెబ్బయ్ మైళ్ళ వేగంతో పోతుంది.
"శంకర్రావు ఇల్లు తెలుసా?" అడిగాడు నరేంద్ర.
"తెలుసు. సరూర్ నగర్ లో ఉంది. పెద్ద బంగళా బంగళా చుట్టూ రకరకాల చెట్లు ఉన్నాయ్." అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
"సరూర్ నగారా? మనం వెళ్ళే సరికి మూడు అవుతుందేమో?" అన్నాడు నరేంద్ర.
"ఎందుకూ? నలభైఐదు నిముషాల్లో వెళ్ళొచ్చు" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
"ఇప్పుడే రెండు దాటిపోయింది."
జీపు వేగం పెంచాడు ఇన్స్ స్పెక్టర్.
జీపులో వెనక కూర్చున్న కానిస్టేబుల్స్ నిద్రతో ఊగుతున్నాడు
15
పోలీసు జీపు సరూర్ నగర్ లో విజయవాడ రోడ్డులో కుడివైపున రోడ్డుకు. దూరంగా ఉన్న పాతకాలపు రెండు అంతస్తుల భవనం ముందు ఆగింది.
"ఇది పాతకాలపు బంగళాలా ఉంది ?" అన్నాడు నరేంద్ర.
"లేక ఇప్పుడు శంకర్రావు కట్టించగలడా దాని తాలుకు యజమాని పోలీస్ యాక్షన్ సమయంలో పాకిస్తాన్ పారిపోయాడు. దిక్కు మొక్కూ లేని ఇలాంటి బంగళాలను ఆ రోజుల్లో కొందరుఆక్రమించుకొని, ఆ తర్వాత అమ్మేశారు శంకర్రావు తండ్రి ఇంత పెద్ద ఆవరణలో ఉన్న ఈ బంగళాను ఇరవైవేలకు ఆంద్రప్రదేశ్ పార్మేషన్ కాగాల కొన్నాడట. శంకర్రావుకు హిమాయత్ నగర్ లో మరో ఇల్లు ఉంది. అతడు ఆ మధ్యవరకు అంటే భార్య చనిపోయే రోజువరకు అక్కడే ఉండేవాడు"
"ఇప్పుడు?"
"ఇప్పుడు ఆ ఇల్లు అద్దెకు ఇచ్చాడు. అతడు లాయర్ గా పెద్దగా రాణించలేదా ఈ ఇంట్లో ఎప్పుడూ ఎవరూ ఉండరు. శంకర్రావు తండ్రి ఉన్నంత కాలం అతడు ఈ ఇళ్ళు వదిలేవాడు కాదు. ఇప్పుడు శంకర్రావు ఎక్కువగా కమలాంబ ఇంట్లోనే ఉంటుంటాడు. రెండు మూడు రోజులు ఇక్కడ ఉంటాడు. పెరటి తోటలు అజమాయిషీకి వస్తుంటాడు. ఇంటి వెనక భాగంలో దాదాపు ఐదెకరాల ఖాళీ స్థలం ఉంది అందులో మామిడి చెట్లూ, అరటి చెట్లూ వగైరా ఉంటాయి. అతడికి పోచయ్య అనే నమ్మిన బంటు ఒకడున్నాడు అతడు కుటుంబంతో అవుట్ హౌస్ లో ఉంటాడు. పేరుకు అవుట్ హౌసె కాని అన్ని హంగులూ ఉన్న రెండు బెడ్ రూముల ఇల్లు. శంకర్రావు ఇక్కడ ఉన్నప్పుడు వంటావార్పూ అంతా పోచయ్య భార్యే చూస్తుంది. అప్పుడప్పుడు కమలాంబతో వచ్చి రెండు రోజులు ఉంటూ ఉంటాడట.
"చాలా ఇన్ ఫర్ మేషన్ సంపాదించావే?"
"అవును, రాధారాణి హత్య ఇతడే చేసి ఉంటాడని నా నమ్మకం ఒట్టి డబ్బు మనిషత."
"మనం జీపులో కూర్చుండి పోయాం" అన్నాడు నరేంద్ర జీపు దిగుతూ.
అప్పటికి మూడు దాటింది. వెన్నెల పండారబోసినట్టుగా ప్రకాశిస్తోంది.
నరేంద్ర, అద్వయితం గేటు తెరుచుకొని లోపలకు వెళ్ళారు. కానిస్టేబుల్స్ వారిని అనుసరించాడు.
"దౌలత్ సుమా ప్యాలెస్ అంటారు దీన్ని" అన్నాడు అద్వయితం ముందుకు నడుస్తూ,
ఇంటి ముందు పూల కుండీల బారుల తీర్చి అమర్చి ఉన్నాయి. ఆ బారులకు అటూ ఇటూ రకరకాల పూల మొక్కలూ, కోటన్ మొక్కలూ ఉన్నాయి కుడి వైపున మొక్కల మధ్య లాన్ ఉంది. ఆ లాన్ లో ఉయ్యాల ఉంది.
"ఫర్వాలేదు. శంకర్రావుకు మంచి టేస్టే ఉంది" అన్నాడు నరేంద్ర ఉయ్యాల చూస్తూ.
"వాడి బొంద. వాడి తండ్రి విలాస పురుషుడు. అతడి ప్లానే ఇదంతా" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
ప్రహరీ గేటుకూ, సింహద్వారానికి దాదాపు ముపై అయిదు గజాల దూరం ఉంటుంది.
నలుగురూ గేటు దాటి ముందున్న కుండీల మధ్యగా నడుస్తూ సింహద్వారం వరకూ వచ్చారు.
ఇన్స్ స్పెక్టర్ గబగబా మెట్లెక్కి సింహద్వారం తలుపులు నెట్టాడు. తలుపులు తెరుచుకున్నాయి. అందరూ హాల్లోకి వచ్చారు.
తోటలో గానీ, హల్లోగానీ ఎక్కడా జనసంచారం లేదు. నాలుగు వైపులకూ చూశాడు. కుడి పక్కగా ఉన్న గది తలుపు తీసి ఉంది.
నరేంద్ర గదిలోకి వెళ్ళాడు. ఆ వెనకే ఇన్స్ స్పెక్టర్ దాదాపు అన్ని గదులూ తిరిగి చూశారు.
తిరిగి హాల్లోకి వచ్చారు.
"పైకి వెళ్దామా?" అన్నాడు అద్వయితం.
"ముందు అవుట్ హౌస్ లో ఉన్న వాడ్ని పిలిపించు" అన్నాడు నరేంద్ర.
"ఏది కొండలూ, యాదగిరి మీరు వెళ్ళి ఎడం వైపుగా ఇంటి వెనక భాగంలో అవుట్ హౌస్ ఉన్న ఆ పోచ్చయ్య గాడ్ని లాక్కురండీ" అన్నాడు అద్వయితం.
నరేంద్రకు నవ్వు వచ్చింది.
"మీ పోలీసు వాళ్ళ భాషే వేరు"
"ఏం? ఎందుకలా అంటున్నారు?"
"నేనైతే పోచ్చయ్యను పిల్చుకు రండి అంటాను. లాక్కురావడం ఎందుకూ? వాడు రానంటేగా లాక్కురావాలి."
"అద్వయితం పొట్ట ఎగిరెగిరి పడేలా నవ్వాడు.
"ఇవ్వాళంతా జాగారమే" అన్నాడు అద్వయితం.
"నువ్వు బాగానే నిద్రపోయావుగా?" అన్నాడు నరంద్ర.
"నిద్రా పాడా? అప్పుడే, అంటే ఓ గంటకు ముందే పడుకున్నాను. అంతలోనే నీ ఫోన్ వచ్చింది."
"నువ్వు కనీసం గంటయినా నిద్రపోయావు" అంటూ నరేంద్ర లేచాడు. లోపలకు నడిచాడు.అద్వయితం అతడ్ని అనుసరించాడు.
ఇద్దరూ పడమటి గది దాటి ఇంటి వెనక భాగాన ఉన్న సన్నజాజి పందిరి కిందకు వచ్చారు.
పందిరి కింద ఉన్న మెట్లమీద భారతి రక్తం మడుగులో వెల్లికిలా పడి ఉంది.
ఆమె శరీరం మీద పడి ఉన్న సన్నజాజిపూలు రక్తాన్ని పులుముకొని, పందిరి ఆకుల్లో నుంచి పడ్తోన్న వెన్నెల్లో వింత రంగుల్ను వెదజల్లుతున్నాయి.
రాతిమీద పడటం తల వెనక భాగం పగిలిపోయింది.
చేతుల మీదా, ముఖం మీదా ఎవరో రక్కినట్టుగా గీతలు ఉన్నాయి. ఎవరో ఆమెకు తోసేశారనీ, ఆత్మరక్షణకు ఆమె పెనుగులాడి ఉంటుందని అర్థం అయిపోయింది నరేంద్రకు. అద్వయితం శవం మీదకు వంగి పరిశీలనగా చూస్తున్నాడు.
ఆమె వంటి మీద ఉన్నా గోధుమరంగు షిపాన్ చీర, రక్తపు మరకలతో చెల్లాచెదరుగా ఉంది. బిగుతుగా ఉన్నావైలెట్ కలర్ జాకెట్ కుడి చేతి మీద చిరిగి ఉంది.
మెడతో ఒంటిపేట బంగారు గొలుసు ఉంది.