అతడితో పరిచయం అయిన కొత్తలో ఎన్నిమాటలు చెప్పాడు?
"నిన్ను ప్రేమిస్తున్నాను"
"నువ్వే నా ప్రాణం?"
"నీ అపురూప సౌందర్యంముందు ప్రపంచమే మోకరిల్లుతుంది."
అన అతడే, తను తనను మంత్రించి చేశాయి.
అన్నీ మాటలు తనను మంత్రించి చేశాయి.
అన్నీ నమ్మింది. అంత మంచివాడు ప్రపంచంలోనే ఉండడని భావించి మురిసిపోయింది.
అంతేకాదు. మేనమామ ఇల్లు తనకు ఒకనరకంల తయారైంది. తుఫాన్ రాత్రి సముద్రంలో పయనిస్తున్న వంటరి ఓడలాంటి తన జీవితానికి ఓ ఒడ్డు దొరికిందని భావించింది.
గాలిలో అల్లాడుతున్న తన జీవితానికి ఓ రెండు బలమైన చేతుల ఆధారం దొరికినట్టుగా అన్పించింది. కాని ఆ చేతులు నూనె రాసుకున్న చేతులనీ, అవి ఇట్టే జారిపోతాయని తను ఊహించలేకపోయింది.
ఆత్మీయత దూరమై మరుభూమిలా మరిగిపోతున్న తన మనసు మీద, ఓ నిండుమనసు అమృతపు జల్లుల్ని చిలకరిస్తున్నట్టుగా అణు భూతి చెందింది. కాని ఆ అనుభూతి ఎంతోకాలం నిలవలేదు. ఆ మనసు చిలకరించేది అమృతబిందులు కావనీ, విషపు చినుకులనీ తెలుసు కోవడానికి ఎంతోకాలం పట్టలేదు. తన రంగులకల చెదిరిపోయింది.
తను ఆ వార్తా విన్పించినప్పుడు ఎంతచండాలంగా మాట్లాడాడు?
మాతృత్వాన్నే అవమానించాడు.
"మీ ఆయన స్టేషన్ కు వస్తాడా?"
"సుజాత ఆలోచన దారం పుటుక్కున తెంచింది ఎదురు బల్ల మీద కూర్చున్న స్త్రీ.
ఫ్లాస్కులో ఉన్న కాఫీ ఒక గ్లాసులో పోస్తూ అడిగింది ఆమె.
"ఇదిగో! కాఫీ తీసుకొమ్మా!"
"వద్దండీ!" మొహమాటపడిపోతూ అన్నది భారతి.
"పర్వలేదమ్మా తీసుకో. తల్లిలాటిదాన్ని ఇస్తున్నాను నాకూ నీ వయసు కూతురు ఉంది. దాని జీవితం బుగ్గిపాలైంది" అని గ్లాసు అందించింది.
భారతి గ్లాసు అందుకొని "మీ అమ్మాయికి ఏమైందండీ?" అన్నాది.
"బోలెడంత కట్నం ఇచ్చి పెళ్ళి చేశాం. వాడు పరమ దుర్మార్గుడు. నానా హింసలు పెట్టాడు దాన్ని. చివరకు ఇంట్లోనుంచి వెళ్ళగొట్టాడు."
"ఇప్పుడు ఎక్కాడ ఉంది!"
"మా దగ్గిరే ఉందమ్మా. మేం ఎంత చెప్పినా తిరిగి అత్తవారింటికి వెళ్ళనంటున్నది. ఆ మధ్య నిద్రమాత్రలుకూడా మింగింది. ఎలాగో బతికి బయటపడింది" ఆమె గాడంగా నిట్టూర్పు విడిచింది.
"కాఫీ తాగి, లేచి వెళ్ళి గ్లాసు కడిగి తీసుకొచ్చింది భారతి. గ్లాసు అందిస్తూ "థ్యాంక్స్ ండీ" అన్నది.
ఆమె కూతుర్ని గురించి ఎన్నో అడగాలని ఉంది భారతికి. కాని అడగలేకపోయింది.
"హైదరాబాద్ లో ఎక్కడుంటారు? మీ ఆయన ఏం బిజినెస్ చేస్తున్నారు? మాకు కూడా పత్తర్ గట్టిలో బట్టలషాపు ఉంది".
భారతికి పచ్చి వెలక్కాయ గుజ్జు గొంతుకు అడ్డుపడినట్టుగా అయింది.
"అసలు నాకు పెళ్ళే కాలేదండీ".
ఎదురు బల్లమీది స్త్రీ భారతిని విస్మయంగా చూసింది.
"విజయవాడ ఒక స్నేహితురాలి పెళ్ళికి వెళ్ళివస్తున్నాను. నేను హైదరాబాద్ లో ఇండస్ట్రీస్ డిపార్ట్ మెంటులో టైపిస్టుగా పనిచేస్తున్నాను" గబగబ పాఠం వల్లించినట్టు అనేసింది.
"మరి! అదేమిటమ్మ అలా చెప్పావ్?"
"సరదాకు చెప్పాను పిన్నిగారూ అనవసరంగా ప్రశ్నలువేసే వాళ్లంటే నాకు చిరాకు. అలాంటివైకి ఎప్పుడూ నిజం చెప్పాలనిపించదు" అనేసి భారతి కిటికీ అద్దంలో నుంచి బయటికి చూడసాగింది.
"ఈకాలపు పిల్లలే అంత. అడిగినదానికి సరైన సమాధానం చెప్పరు. పెద్దవాళ్లను ఆటలు పట్టిస్తున్నామని కూడా అనుకోరు."
భారతి ఆమె మాటలు విన్పించలేదు.
ఆమె బుర్రంతా ఆలోచనలతో చెదలపుట్టలా ఉంది.
14
రాత్రి 11-45 గంటలైంది.
"ఏమిటమ్మ? ఆ అర్థం అయింది. కృష్ణా ఎక్స్ ప్రెస్ తుఫాన్ తాకిడివల్ల మూడు గంటలు లేటన్నారు.చివరి నిముషంలో మరోరెండు గంటలు లేటు అని చెప్పే అవకాశం లేకపోలేదు. చాలా పొద్దుపోయింది నువ్వెళ్ళి పడుకో" అన్నాడు సునందతో నరేంద్ర.
బయటగేటు తెరిచిన శబ్దం అయింది.
"ఎవరో గేటు తెరుస్తున్నారు. బావేనేమో?" అంటూ ఇంటి తలుపు తెరిచి పోర్టికోలోకి వచ్చి నిలబడింది సునంద.
విజయ్ గేటు మూసి లోపలకు వచ్చాడు.
పోర్టికోలో తనకోసం ఎదురుచూస్తున్న సునందను చూడగానే విజయ్ ముఖం వికసించింది.
"ఏం బావా ఇంత లేటయింది."
"ఒకటే ముసురు. ఇక్కడ వర్షం లేనట్టుందే?"
"లేదు"
నరేంద్ర బయటికి వచ్చాడు.
"సునందా! అలసిపోయి వచ్చి ఉంటాడు. లోపలకు రానివ్వు" అన్నాడు నరేంద్ర.
"బాస్ 10% పర్సెంట్ పెయిల్యూర్ అన్నమాట" అన్నాడు నరేంద్ర.
"బావా! ముందు నువ్వెళ్ళి స్నానం చేసిరా.ఈలోగా నేను భోజనం వడ్డిస్తాను. ఆ తర్వాత "సక్సెస్" ఎంతో 'ఫెయిల్యూర్' ఎంతో మాట్లాడుకోండి" అంటూ సునంద లోపలకు వెళ్ళింది.
"ఆ ఆ ! వెళ్ళి స్నానం భోజనం చేసిరా!" అన్నాడు నరేంద్ర.
"అలాగే!" విజయ్ లోపలకు వెళ్ళాడు.
నరేంద్ర సిగరెట్ తాగుతూ జయ్ కొరకు ఎదురుచూస్తున్నాడు.
విజయ్ స్నానంచేసి, భోజనంచేసి వచ్చాడు. నరేంద్రకు ఎదురుగా కూర్చున్నాడు.
"బాగా అలసిపోయినట్టున్నావ్. వెళ్ళిపడుకో రేపు మాట్లాడు కోవచ్చు" విజయ్ ను చూస్తూ అన్నాడు నరేంద్ర.
"పర్వాలేదు. ఏదీ ఒక సిగరెట్ ఇవ్వు" అన్నాడు విజయ్.
"ఈమధ్య సిగరెట్లు బాగానే తాగుతున్నట్టున్నావ్?"
"అబ్బే! ఎప్పుడైనా బాగా అలసిపోయినప్పుడూ....?"
"చాలాఉత్సాహంగా ఉన్నప్పుడు....." అంటూ నరేంద్ర నవ్వాడు.
విజయ్ సిగరెట్ వెలిగించుకున్నాడు.
"ఆ చెప్పు శంకరరావు విజయవాడా ఎందుకు వెళ్ళినట్టు?"
"మేనకోడల్ని చూట్టానికీ- ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చాడు"
"అంతేనా?"
"అవును. అంతే."
"నువ్వు అంతదూరం వెళ్ళడం దండగేనన్నమాట. మరి 70 పర్సెంట్ సక్సెస్ అన్నావ్? ఏవిషయంలో?"
"ఆమె సమాచారం తెలుసుకోవడంలో?"
"అందువల్ల మనకు ప్రయోజనం?"
"ఉందో లేదో నువ్వే చెప్పాలి" అన్నాడు విజయ్.
"అయితే నువ్వు సేకరించిన వివరాలు చెప్పు."
"విజయవాడలో దిగినప్పట్నుంచీ శంకర్రావును ఫాలో అవుతూనే ఉన్నాను. అతడు స్టేషన్ నుంచి తిన్నగా సత్యనారాయణపురం వెళ్ళాడు. ఒక ఇంటి తలుపుతట్టాడు. ఓ ఇరవై మూడేళ్ళ యువతి తలుపుతీసింది. అతడ్ని ఆశ్చర్యంగా చూసింది. ఏమన్నదో విన్పించలేదు. తర్వాత అతడు ఆమె వెనకే లోపలకు వెళ్ళాడు. రెండు గంటలు బయట వైట్ చేశాను. కాని అతడు రాలేదు.
రెండోరోజు ఉదయం వెళ్ళి నేను తలుపుతట్టాను.
"ఎందుకూ" ఆశ్చర్యంగా అడిగాడు నరేంద్ర.
"ఆ యువతికీ శంకర్రావుకు ఉన్నసంబంధం ఏదో తెలుసుకోవడానికి."
"గుడ్! తర్వాత?"
"ఆ యువతే తలుపు తీసింది."
"శంకర్రావు గారు ఉన్నారా ఊరికి వెళ్ళిపోయారా అని అడిగాను."
"ఉన్నారు"
"లోపల ఉన్నారా?"
"బయటికి వెళ్ళారు. పన్నెండు గంటలకు వస్తానన్నారు మీరెవరు?" అడిగింది.
"నా పేరు శేఖర్ మా నాన్నగారూ శంకర్రావు గారూ స్నేహితులు. ఆయన ఈ ఊరు వచ్చారనీ వెళ్ళి కలుసుకోమనీ రాత్రి మా నాన్నగారు ఫోన్ చేశారు అన్నాను."
"ఓ అలాగా? మామయ్య వచ్చాక చెప్తాను."
"ఆయన మీకు మామయ్య? అంటే ....?"
"మేనమామ! అన్నది."
అంతలో ఓ ణాలుగెల్ల పిల్లవాడు "మమ్మీ" అంటూ వచ్చి తల్లి కాళ్ళకు చుట్టుకొన్నాడు.
"మీ వారు ఏం చేస్తారు?"
ఆమె సమాధానం ఇవ్వలేదు.
ముఖంలో చిరాకు కన్పించింది.
"మామయ్య వచ్చాక మీరు వచ్చి వెళ్ళారని చెప్తాను. నాకు కొంచెం అర్జెంటు పని ఉంది. బయటకు వెళుతున్నాను" అని కొడుకు బూట్లు తొడగసాగింది.
"వస్తానండీ అని బయటికి వచ్చేశాను.
ఎందుకైనా మంచిదని ఆమెను పాలోఅయ్యాను. ఆమె తిన్నగా పడమటలో ఉన్న స్ట్రీ సదనానికి రిక్షాలో వెళ్ళింది. ఒక గంట తరువాత బయటికి వచ్చింది, అయితే పిల్లవాడు లేడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏదో మిస్టరి ఉందనిపించింది. స్ట్రీ సదనంలో పనిచేసే అటెండరును ఏభై రూపాయలిచ్చి మచ్చిక చేసుకొన్నాను. అతడు కొంత ఇన్ ఫర్ మేషన్ ఇచ్చాడు."
"ఏమిటా ఇన్ పర్ మేషన్."
"ఆమె నాలుగేళ్ల క్రితం ఆ హొమ్ లో చేరిందట. అప్పటికి ఆవిడ గర్భవతి ఆట. అక్కడే పిల్లవాడిని కన్నదట, సాధారణంగా మగవాడి చేత మోసగించబడిబ స్త్రీలు ఆ హొమ్ కు వస్తూ ఉంటారట. మూడేళ్ళపాటు ఆమె అక్కడే ఉన్నదట. ఒక సంవత్సరం నుంచి ఎక్కడో కంపెనీలో టైపిస్టుగా చేరిందట. ఆమెకు ఎవరూ లేరని చెప్పాడు. ఆమె అక్కడ ఉన్న ఆ మూడేళ్ళలో ఆమెను చూడటానికి ఒక్క వ్యక్తికూడా రాలేదట. ఇక్కడే నాకు ఏదో తిరకాసు ఉన్నట్టుగా అన్పించింది."
"ఏమిటా తిరకాసు?" నవ్వుతూ అడిగాడు నరేంద్ర.
శంకర్రావు నిజంగా ఆమె మేనమామే అయితే ఆమె అలా హొమ్ చేరాల్సిన అవసరం ఏ మొచ్చింది?"
నరేంద్ర పకపక నవ్వాడు.
"ఎందుకు నవ్వుతున్నావ్?"
"మేనమామకు తెలియకుండా ఎవరి వల్లోనో పడి ఉంటుంది గర్భంవచ్చింది. వాడు ఛీ పొమ్మన్నాడు. ఆ విషయం మేనమామకు ఎలా చెబుతుంది? ఇంటి నుంచి పారిపోయే హొమ్ లో చేరి ఉంటుంది"
విజయ్ నీరుకారిపోయాడు. ఏదో సాధించానని భావించాను అంతవరకు.
"ఆ|| తర్వాత? మరి ఎలా తెలిసింది శంకర్రావుకు?"
"జీవితంలో స్థిరపడిపోయింది కనక తన గురించి మేనమామకు తెలియజేసి ఉండొచ్చుగా?" అన్నాడు నరేంద్ర.
విజయ్ తెల్లముఖం వేశాడు. తనుపడిన శ్రమంతా వ్యర్థం అయిపోయింది. తీరాచూస్తే తను సేకరించిన సమాచారం అంతా వడ్ల గింజలో ఉన్నది బియ్యపు గింజ అన్నట్టుగా తేలిపోయింది. విజయ్ బుర్రలో ఏదో ఆలోచన మెరుపులా మెరిసింది.
"ఇవ్వాళ ఆమెను తీసుకొని శంకర్రావు హైదరాబాద్ వచ్చాడు"
"రావచ్చు. ఇందులో మనకు పనికొచ్చే సమాచారం ఏముంది? మేనమామ మేనకోడల్ని తన ఇంటికి తీసుకొచ్చాడు."
"అంత తేలిగ్గా తీసేయ్యకు. అలా అయితే పిల్లావాడిని వెంటతీసుకురాకుండా స్ట్రీ సదనంలో ఎందుకు వదిలేసి వచ్చింది? రైలు ఎక్కికిటికీ దగ్గర కూర్చుంది. శంకర్రావు ప్లాట్ పారం మీద నిల్చున్నారు. ఆమె ఎంతో దిగులుగా కన్పించింది. "నాకేదో భయంగా ఉంది" అని ఆమె అనడం నేను విన్నాను. మరీ దగ్గరగా నిలబడితే శంకర్రావు చూస్తాడని దూరంగా నిల్చున్నాను వాళ్ళను గమనిస్తూ."
"శంకర్రావు కూడా కృష్ణాలో వచ్చాడా?"
"వచ్చే ఉంటాడు. రాకుండా ఎందుకుంటాడు?"
"ఒక డిటెక్టివ్ చెప్పాల్సిన సమాధానం కాదది. వచ్చాడో లేదో చెప్పాలి."
"బండి కూతవేసి కదిలింది. నేను పరిగెత్తినా కంపార్ట్ మెంటులోకి ఎక్కాను."
"హైదరాబాద్ లో దిగాక కన్పించారా?"
"కన్పించలేదు అందుకే 70 పర్సెంటే సక్సెస్ అన్నాను"
"వెరీ బాడ్!"
"నేను ఎక్కినా కంపార్ట్ మెంట్ లో ఒక మిస్టర్ ఎక్కాడు బండి ఆగగానే అతని కోసం వచ్చిన వాళ్ళు దిగే వాల్లను దిగనివ్వకుండా డోర్స్ దగ్గర అడ్డం నిలబడ్డాడు. ఎలాగో వాళ్ళను తోసుకొని దిగాను. వాళ్ళ కోసం వెదికాను. ప్లాటుపారం మీదగానీ, స్టేషన్ బయట కానీ కన్పించలేదు."
"సరే ఇక వెళ్ళి పడుకో" ఆవలిస్తూ అన్నాడు నరేంద్ర.
"నా ప్రయసంతా వ్యర్థమేనంటావా?"
నరేంద్ర ఆలోచనలో పడ్డాడు చేతి వాచీలో టైం చూసుకొన్నాడు.
1-10 అయింది.