కంపెనీ బిల్డింగ్ కు దూరంగా నిల్చుని రామకృష్ణ కోసం వెలి ఉన్నాను.
"ఒక అరగంట తర్వాత రామకృష్ణ బయటికి వచ్చాడు....."
"ఒక్కడే వచ్చాడా?" విజయ్ ప్రశ్నించాడు.
"అవును."
"మరి ఆరోజు సోమసుందరంతో మాట్లాడుతూ బయటికి వస్తుండగా చూశానన్నావ్?" విజయ్ కసిఒ కసిగా అడిగాడు.
"ఇవ్వాళ నేను అక్షరాలా జరిగింది జరిగినట్టు చెప్తున్నాను సార్" నరేంద్ర కేసి తిరిగి అన్నాడు సూర్యనారాయణ.
"నిజం చెప్పకపోతే నీకే ప్రమాదం చెప్పు. ఆ తర్వాత అన్నాడు నరేంద్ర.
ఈసారి తనను నరేంద్ర మందలించకపోవడం వల్ల విజయ్ శాంతించాడు.
"భర్త బ్రతికి ఉండగా అతడి భార్యను వివాహం చేసుకోవడం నేఅరం అని తెలుసు. పైగా నమ్మిన స్నేహితుడే ఆ పనిచేశాడని తెలీసినప్పుడు ఆ వ్యక్తి ప్రతికారజ్వాలతో దహించిపోతాడనీ తెలుసు. అంతకు ముందు ఉత్తరాలు వచ్చినా అతడు తిరిగి వస్తాడని భావించలేదు. పైగా ఆ ఉత్తరాలు ఎవరో గిట్టనివాళ్ళు రాసి ఉంటార్లే అని భావించాను. చచ్చిపోయిన మనిషి తిరిగివచ్చాడు. నాతల తిరిగిపోయింది.
అతడు మామీద ప్రతీకారం తీర్చుకుంటాడనీ తెలుసు ఆ భయంతోనే అతడ్ని వెంబడించాను."
"కరెక్ట్. అతడ్ని వెంబడించావు. అతడు బతికి ఉంటే నీప్రాణానికి బ్రతుక్కు ప్రమాదం అని గ్రహించావు. అందుకే అతడ్ని హత్య చేశావు. ఎలిజీ కోసం తిన్నగా డిటెక్టివ్ ఇంటికే వచ్చావు. గుండెలు తీసిన బంటువు. ఆమోఘమైన తెలివితేటలు కలవాడివి."
"విజయ్!" నరేంద్ర విజయ్ వాక్ ప్రవాహాన్ని ఆపాడు.
విజయ్! ముందు పూర్తిగా విను" అని సూర్యనారాయణ కేసి తిరిగి" ఆ చెప్పు" అన్నాడు నరేంద్ర.
"రామకృష్ణ ఆటో ఎక్కాడు. నేను కార్లో అతడ్ని అనుసరించాను అతడు తిన్నగా హిమాయత్ నగర్ లో ఉన్న లాయర్ రమణారావు ఇంటికి తిన్నగా వెళ్ళాడు. నేను దూరంగా కారు ఆపుకొని అతడి రాక కోసం ఎదురు చూశాను. దాదాపు రెండు గంటల తర్వాత రామకృష్ణ రమణరావు ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు"
"అప్పుడు టైం ఎంతయింది?"
"ఏడు దాటింది, ఏడుంబావు లోపలే బయటికి వచ్చాడు సరిగా నిముషాలు అడిగితే చెప్పలేను."
"దట్సాల్ రైట్ ! మళ్ళి అతడ్ని హొటల్ వరకూ వెంబడించావు. అవునా?" విజయ్ ప్రశ్నించాడు.
"లేదండీ అతడు కొంత దూరం నడిచి ఖాళీ ఆటో ఆపి ఎక్కి వెళ్ళిపోయాడు" ఆగి నిట్టూర్చి విడిచాడు సూర్యనారాయణ.
"అంటే నువ్వు అతడ్ని అనుసరించలేదంటావ్?"
"అవునుసార్!"
"మరి అతడు ఎక్కడ దిగింది నీకేలా తెలిసింది?"
"అతడి ఆటో కనుచూపు దాటి వెళ్ళిపోగానే నేను కారు స్టార్ట్ చేసి రమణరావు ఇంటి ముందు ఆపి రమణరావు ఆఫీసు గదిలోకి వెళ్ళాను. రామకృష్ణ ఏం మాట్లాడాడో చెప్పమని అడిగాను. అతను నిరాకరించాడు. అతడి వీక్నెస్ నాకు తెలుసు."
"ఏమిటిది?"
"డబ్బు, తెల్లవారి బిజినెస్ సంబంధించిన మెటీరియల్ కొనడానికి ఆ మధ్యాహ్నమే ఐదువేలు బ్యాంకు నుంచి డ్రాచేశాను. జేబులో నుంచి ఆ డబ్బు తీసి రమణరావు ఇచ్చాను. మొదట సంశయించాడు. చెప్పడానికి, నా కథ అంతా విన్నాక చెప్పాడు."
"ఏం చెప్పాడు."
"అతను ప్యాలెస్ జూబ్లీలో ఉన్నాడనీ, రూం నంబరు కూడా అతడే చెప్పాడు."
"ఇంకా ఏం చెప్పాడు?"
"మా గురించి అతడేమీ మాట్లాడలేదని చెప్పాడు."
"వీలుఇనామా గురించి చెప్పాడా?" అతడి ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు నరేంద్ర.
"వీలునామా? ఏ వీలునామా?" తెల్లబోయి నోరు తెరిచాడు సూర్యనారాయణ.
విజయ్ ఏదో ప్రశ్నించబోయాడు. అంతలో వరండాలో బూటు కాళ్ళ చప్పుడు విన్పించింది. కాలింగ్ బెల్ మోగింది.
"ఇన్స్ స్పెక్టర్ వచ్చినట్టున్నాడు" అన్నాడు విజయ్.
సూర్యనారాయణ గాభరాగా లేచి నిల్చున్నాడు.
"భయపడకు . కూర్చో" అన్నాడు నరేంద్ర.
విజయ్ లేచి వెళ్ళి తలుపు తెరిచాడు.
ఇన్స్ స్పెక్టర్ అద్వయితం లాఠీతిప్పుతూ లోపలకు వచ్చాడు.
"మైగాడ్! అనుకున్నంతా అయింది. ఇక్కడే ఉన్నాడు" అంటూ సూర్యనారాయణ మీదకు దూకి, పెడ రెక్కలు విరిచిపట్టు కొన్నాడు ఇన్స్ స్పెక్టర్ అద్వయితం.
వెంటనే ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి సూర్యనారాయణ చేతులకు బేడీలు వేశారు.
"మిస్టర్ అద్వయితం!" నరేంద్ర దాదాపు అరిచినట్టే
అద్వయితం నరేంద్ర కేసి నిర్లక్ష్యంగా చూశాడు.
"మిస్టర్, ఏమిటి ఈ హడావిడి? నా ఇంట్లో ఉన్న వ్యక్తిమీద నువ్వు ఇలా అమర్యాదకరంగా ప్రవర్తించడం ఏమీ బాగాలేదు" ఇన్స్ స్పెక్టర్ కేసి తీవ్రంగా చూస్తూ అన్నాడు నరేంద్ర.
"హత్యా నేరంలో నాకు అనుమానితుడుగా నమ్మకం కలిగితే, అతడు నీ ఇంట్లోనే కాదు. ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నా అరెస్టు చేసి తీరతాను" అన్నాడు అద్వయితం ఎడమచేతి వెళ్లాతో మీసం దువ్వుకుంటూ.
"నేను హంతకుడ్ని కాదు. రామకృష్ణను నేను హత్య చెయ్యలేదు పిచ్చివాడిలా అరిచాడు సూర్యనారాయణ.
"చుప్ రహొ" కానిస్టేబుల్ కసిరాడు.
"నీ నమ్మకానికి ఆధారం?" కటువుగా పలికింది నరేంద్ర కంఠం.
"ఇదిగో!" అంటూ ఫ్యాంటు జేబులో ఉన్న సిగరెట్ కేసు చూపించాడు.
"దీనిమీదున్న వేలుముద్రలు ఫోటో తియ్యడం అయిపోయింది. ఇక హంతకుడి వేలుముద్రలతో పోల్చి చూడాలి."
సిగరెట్ కేసు చూసి తెల్ల ముఖం వేశాడు సూర్యనారాయణ.
"ఇదంతా మోసం, దగా!" అరిచాడు సూర్యనారాయణ.
"నోరు మూసుకుంటావా లేక ఒకటి తగిలించాలా?" అన్నాడు
"ఇన్స్ స్పెక్టర్ ఇటీజ్ టూమచ్ . నా ఇంట్లో ఉన్నవాడిని అరెస్టు చెయ్యడమే కాక నా కళ్లముందు నా ఇంట్లో కొడ్తావా?" నరేంద్ర కోపంగా అన్నాడు.
"అవసరం అయితే అదీ చేస్తాను. ఇది జూబ్లీ ఫ్యాలేస్ హొటల్ లో హత్య జరిగిన గదిలో దొరికింది."
"అది ఇతడిదేనని ఎలా చెప్తావ్?"
"మధ్యాహ్నం అతని భార్యకు చూపించాను విజయ్ కూడా ఉన్నాడు ఇది తన భర్త సిగరెట్ కేసేనని ఆమె అంగీకరించింది. ఇంతకంటే రుజువు ఏం కావాలి ఇతడ్ని అనుమానించడానికి? మరో గంటలో దీనిమీది వేలు ముద్రలు ఎవరివో కూడా తెలుస్తాయిలే" గర్వం ఉట్టిపడే గొంతుతో అన్నాడు అద్వయితం.
"దగా! మోసం! మీ పోలీసు వాళ్ళేనా సిగరెట్ కేసు కొట్టే ఉంటారు. నేను అసలు హొటల్ కే వెళ్ళలేదు" ఏడుపు గొంతుతో అన్నాడు సూర్యనారాయణ.
ఇన్స్ స్పెక్టర్ లాఠీ ఎత్తాడు.
"మిస్టర్ ఇన్స్ స్పెక్టర్ . ఆ లాఠీ దించు. నా ఇంట్లో అతడి వంటి మీద దెబ్బపడ కూడదు." నరేంద్ర కంఠం. కంచు గంటలా మోగింది.
"అంతా అబద్దం సార్! నన్ను రక్షించండి." నరేంద్రను చూస్తూ ప్రాధేయపడ్డాడు సూర్యనారాయణ.
"ఏది అబద్దం? నీ భార్య చెప్పిందా?"
సూర్యనారాయణ గొంతుకు ఉందిడి అద్దం పడిన గొడ్డులా చూశాడు ఇన్స్ స్పెక్టర్ ను.
"మాట్లాడవేం? ఈ సిగరెట్ కేసు నీది కాదా?" గద్దించాడు ఇన్స్ స్పెక్టర్.
"నా.....నాదే."
"చూశావా?" అన్నట్టు గర్వంగా చూశాడు నరేంద్ర ముఖంలో ఇన్స్ స్పెక్టర్.
"కేసునాదే. కాని అది మీకు హత్య జరిగిన గదిలో దొరికిందని చెప్పడం శుద్ధ అబద్దం." అన్నాడు సూర్యనారాయణ దాదాపు అరిచినట్టే.
"అవును నువ్వు హత్య చెయ్యడం కూడా అబద్దమేలే పద! నీ వేలిముద్రలు పరీక్ష చేస్తే అంతా బయటపడ్తుంది."
"కేసు అతడిదేనని అంగీకరిస్తున్నాడు. అందువల్ల దానిమీద అతడి వేలిముద్రలు ఉండటంలో ప్రత్యేకత ఏమీలేదు. కాని అది హహ్త్య జరిగిన గదిలో దొరికిందని ఎలా నిరూపిస్తావ్?" అంటూ నరేంద్ర.
"నిరూపిస్తాను. తప్పక నిరూపిస్తాను. ఇతడు ఆ హొటల్ కు వెళ్ళగా చూసిన సాక్షులు కూడా ఉన్నాడు. పదపద!" అంటూ ఇన్స్ స్పెక్టర్ సూర్యంరెక్కపట్టుకొని గుంజాడు.
"సాక్షులా?" ఆశ్చర్యంగా అడిగాడు నరేంద్ర.
"అవును! సాక్షులే!"
"ఎవరు వాళ్ళు."
"ఉన్నర్లే." అంటూ ఇన్స్ స్పెక్టర్ విసురుగా సూర్యాన్ని ముందుకు నెడ్తూకదిలాడు.
"ఆగు! ఇన్స్ స్పెక్టర్ !"
"ఏం?"
"నువ్వు పోరాపడ్తున్నావ్" అన్నాడు నరేంద్ర.
"ఇది వరకు పడినమాట నిజమే ! కాని ఇంకాపడన్లే, ఈహత్యలో ఇతడు కాక. మరికొంత మంది ఉన్నట్టు ఇప్పుడు తెలుసుకున్నానులే."