Previous Page Next Page 
చిలకలు పేజి 22


    "ఫర్వాలేదు. తీసుకోండి సార్!"
    "అక్కర్లేదు."
    "మరి నన్ను ఉన్న పాటున పిలిపించడానికి కారణం?"
    "కారణం నిన్ను ఇక్కడకు రప్పించడమే."
    "ఎందుకు సార్. నన్ను ఇన్ స్పెక్టర్ కు అప్పగించడానికేనా సార్! నేను హంతుకుడ్ని కాదు."
    నిన్ను ఇన్ స్పెక్టర్ అద్వయితం అరెస్టు చేస్తాడు. అది కొన్ని గంటల్లోనే జరగవచ్చు. అతడి చేతుల్లో పడక ముందే నేను నీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నువ్వు హత్య చేశావా లేదా అని నేను ఇప్పుడు నిర్ణయించబోవడంలేదు."
    "థాంక్యూసార్!"
    "ఎందుకూ?"
    "మీరు నన్ను హంతకుడని భావించనందుకు"
    "అలా అని నేను అనలేదే. హంతుకుడు ఎవరైనా దానికి పత్రి ఫలం అనుభవించాల్సిందే. ఈ విషయం గుర్తుంచుకొని నేను వేసే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలి. అబద్దాలు చెప్పకూడదు అన్నాడు నరేంద్ర.
    "నిజమే చెప్తాను సార్. అబద్దాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను హత్య చెయ్యలేడు."
    "నువ్వు  హత్యచేశావా కాదా అని నిన్ను అడగడలేదు."
    సూర్యనారాయణ మౌనంగా ఉండిపోయాడు.
    "త్వరగా నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. ఏ  సమయంలోనైనా ఇన్ స్పెక్టర్ రావచ్చు. ఆ తర్వాత నీకు  ఆ అవకాశం దొరక్కపోవచ్చు."
    సూర్యనారాయణ నిలువెల్లా వణికిపోయాడు.
    "ఇన్ స్పెక్టర్ కు చెప్పాడా నేను ఇక్కడకు వస్తున్నట్టు?"
    "నేను చెప్పలేదు. కాని పోలీసు వాళ్ళు ఇట్టే వాసన పట్టేస్తారు" నవ్వుతూ అన్నాడు నరేంద్ర.
    "నిన్ను ఇంత దుర్మార్గుడనుకోలేదు. గోముఖ వాఘ్రనివి. నన్ను పిలిపించింది ఆ ఇన్ స్పెక్టర్ కు అప్పగించడానికా?" మనసులో అనుకొన్నడు.
    "ఏమిటి ఆలోచిస్తున్నారు?" నరేంద్ర అడిగాడు.
    సూర్యనారాయణ ఆలోచనలో నుంచి తృల్లిపడ్డాడు. అంతలో కాలింగ్ బెల్ మోగింది.
    సూర్యనారాయణ చివ్వున లేచి నిల్చున్నాడు. అతడి కాళ్ళ వణుకు నరేంద్ర గమనించాడు.
    "పర్వాలేదు కూర్చో. భుజం పట్టుకొని కూర్చోబెట్టాడు నరేంద్ర.
    తలుపు తెరిచాడు.
    విజయ్  లోపలకు వచ్చాడు.
    "నువ్వు!" తేలిగ్గా అన్నాడు నరేంద్ర.
    విజయ్  ఆశ్చర్యంగా సూర్యనారాయణను చూస్తూ నిలబడి పోయాడు.
    వీడు ఇక్కడున్నాడా? నరేంద్ర వీడ్ని ఇక్కడెందుకు కూర్చో బెట్టినట్టు? ఇన్ స్పెక్టర్ నుంచి రక్షంచడానికేనా? అంటే.....?
    నరేంద్ర విజయ్ ముఖంలోకి నవ్వుతూ చూశాడు.
    "ఏమిటలా చూస్తున్నావ్?" అన్నాడు నరేంద్ర.
    "ఇతని కోసం ఇన్ స్పెక్టర్ వాళ్ళ ఇంటి ముందు సిబ్బందితో కాపలా కాస్తున్నాడు" అదోలా నరేంద్రను చూస్తూ అన్నాడు విజయ్.
    "ఆ సంగతి నాకు తెలుసులే" అన్నాడు నరేంద్ర.
    "తెలుసా? తెలిసే అతడ్ని మనింట్లోదాచారా?"
    "విజయ్!" నరేంద్ర తీవ్రంగా అన్నాడు.
    లోపలకు సూర్యనారాయణకు ఎదురుగా ఉన్న కుర్చీలో  కూర్చున్నాడు. అతడికి నరేంద్ర వ్యవహారం అర్థం కాకుండా ఉంది.
    "శనివారం రాత్రి నువ్వూ, అనసూయ ఇక్కడికి వచ్చే ముందే రామకృష్ణ హత్య చెయ్యబడ్డాడని నీకు తెలుసా?" నరేంద్ర సూర్యనారాయణను అడిగాడు.
    "తెలియదు"
    "అబద్దం తెలుసు" విజయ్  అన్నాడు.
    విజయ్  ముఖం చిన్న బుచ్చుకొని కూర్చున్నాడు.
    "నిజం చెప్పు!" సూర్యనారాయణకేసి తిరిగి అడిగాడు డిటెక్టివ్ నరేంద్ర.
    "నిజంగా నాకు తెలియదు."
    "రామకృష్ణ  హత్య చెయ్యబడక ముందుగానీ ఆ తర్వాతగానీ జూబ్లీ పాలెస్ హొటల్ కు వెళ్ళలేదా."
    "లేదు,"
    "బాగా ఆలోచించుకొని జవాబులివ్వు."
    "నిజమే. నేను అసలు ఆ హొటల్ కు వెళ్ళలేదు."
    "అబద్దం!" అరిచినట్టే అన్నాడు విజయ్.
    నరేంద్ర విజయ్ కేసి ప్రశంసా పూర్వకంగా చూశాడు.
    "నిజం నేను అసలు ఆ హొటల్ కు వెళ్ళలేదు" అన్నాడు సూర్యనారాయణ.
    "ఆ రోజు రామకృష్ణను హత్యచేసి.....సారీ ....రామకృష్ణ హత్య జరిగిన ఎఒజున ఏం చెప్పావో గుర్తు చేసుకో" తీవ్రంగా చూస్తూ అన్నాడు విజయ్.
    సూర్యనారయణ  ఆలోచించసాగాడు. అతడు ఆరోజు ఏం చెప్పానో గుర్తురావడంలేదు. అరచేత్తో నొసలు నొక్కు కొంటూ ఆలోచించసాగాడు.
    "గుర్తు రాలేదా?"
    "రాలేడు" అన్నట్టు తల ఆడించాడు సూర్యనారాయణ.
    "ఊ కానియ్!" అన్నట్టు నరేంద్ర విజయ్ కేసి చూశాడు.
    "ఆ రోజు అతడు ఉన్న హొటల్ పేరుతోపాటు అతడు దిగిన గది నంబరు కూడా చెప్పావ్. అవునా?"
    "అవునండీ"
    "నీకెలా తెలుసు అని నరేంద్ర అడిగాడు. అతన్ని మధ్యాహ్నం నుంచి ఫాలో అవుతున్నట్టుగా చెప్పావ్"
    "ఆ గుర్తొచ్చింది. ఆరోజు నువ్వు అబద్ధం చెప్తున్నవని" గద్దించునట్టుగా అన్నాడు విజయ్.
    నరేంద్ర సిగరెట్  తాగుతూ వింటూ కూర్చున్నాడు. "లేదుసార్. ఇవ్వాళే నిజం చెప్తున్నాను. ఆ రోజు చెప్పిందే అబద్దం."
    ఏదో ప్రశ్నించబోతున్న విజయ్ ని ఆగమని కళ్లతోనే చెప్పాడు నరేంద్ర.
    సూర్యనారాయణ కేసి తిరిగి "ఆ రోజు అబద్దం గురించి అలా ఉంచి ఇవ్వాళ చెప్పదల్చుకున్న నిజం ఏదోచెప్పు. అసలు రామకృష్ణ ఈ ఊరు వచ్చినట్టు ఎలా తెలుసు? హొటల్ పేరూ, గది నెంబరూ ఎలా తెలుసుకున్నావ్" అడిగాడు నరేంద్ర.
    "ఒక్క హొటల్ కు అతన్ని అనుసరించాననీ, అతను ఉన్న గది నెంబరు కౌంటర్ లో అడిగి  తెలుసుకొన్నాననీ ఆ రోజు చెప్పాను. ఇది  మాత్రం అబద్దం. మిగతా విషయాలన్నీ నిజమే చెప్పాను."
    "మొదటి  నుంచి వరసగా జరిగిన విషయాలు చెప్పు. రామకృష్ణ హైదరాబాద్ వచ్చినట్టు నీకు  ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది? అతడు ఫలానా  హొటల్ లోని ఫలానా గదిలో ఉన్నట్టు ఎలా తెలుసుకున్నావ్? నువ్వూ, నీ భార్యా ఆ రాత్రి ఇక్కడకు ఎందుకు వచ్చారు? నరేంద్ర సూర్యనారాయణను తీవ్రంగాచూస్తూ అడిగాడు.
    "శనివారం మూడున్నర గంటలకు రావూస్ కంపెనీకి వెళ్ళాను"
    "ఎందుకు వెళ్ళావ్?" మధ్యలో అందుకున్నాడు విజయ్.
    "విజయ్  అతడ్ని పూర్తిగా చెప్పనివ్వు. ఆతర్వాత నువ్వు ప్రశ్నలు వెయ్యి" అన్నాడు నరేంద్ర.
    "ఊ చెప్పండి."
    "సోమసుందరాన్ని చూడటానికి వెళ్ళాను. అతడితో మాట్లాడి తిరిగి వస్తూండగా రామకృష్ణ బయటకు వస్తూ కన్పించాడు."
    "ఆ రోజు నువ్వు లోపలకు వెళ్ళబోతుండగా అతడు సోమసుందరంతో కలిసి బయటికి వస్తూ కన్పించాడన్నావ్?" విజయ్  అడిగాడు.
    సూర్యనారాయణ వెర్రిముఖం వేశాడు.
    "సమాధానం చెప్పు"
    "ఆ రోజు గాభారాలో ఏదేదో చెప్పేశాను. క్షమించండి" అన్నాడు.
    "సరే! చెప్పు", అన్నాడు నరేంద్ర.
    "విజయ్ కు నరేంద్ర మీద కోపం వచ్చింది. ముఖం గంభీరంగా మారింది.
    "సోమసుందరంతో నీకెం పని?" విజయ్ అడిగాడు.
    "విజయ్!" విజయ్ కేసి నరేంద్ర చురచుర చూశాడు.
    విజయ్ తలతిప్పుకొన్నాడు కోపంగా.
    "డిటెక్టివ్ కు తొందరపాటే తగదని ఎన్నోసార్లో చెప్పాను అనుమానితులు చెప్పేది సహనంతో వినాలి" అన్నాడు నరేంద్ర.
    "సార్! నన్ను హంతకుడిగా అనుమానిస్తున్నారా?" గాభరాగా అడిగాడు సూర్యనారయణ.
    "అబ్బే లేదు. మాకు పనిలేక నీతో సర్దాగా కబుర్లు చెప్పుకుందామని పిల్చాం." నరేంద్ర మీద కోపం సూర్యనారాయణ మెడ కక్కేశాడు విజయ్.
    నరేంద్ర చిరునవ్వునవ్వాడు.
    "సరే! చెప్పు!" అన్నాడు డిటెక్టివ్.
    "రామకృష్ణను చూడగానే నా కాళ్ళకింద భూమి కదిలినట్టు అయింది. తమాయించుకొని అతడు చూడకుండా పక్కకు తప్పుకొన్నాను. నా కళ్ళు నన్ను మోసం చేశాయేమోనని మళ్ళీ పరీక్షగా చూశాను. అతడే! రామకృష్ణే! సందేహంలేదని నిర్ణయించుకొన్నాను. మూడేళ్ళనాడు చనిపోయాడని భావించిన వ్యక్రి అనుకోకుండా ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి సార్!"
    "అందులోనూ చనిపోయిన వాడికి నమ్మకద్రోహం చేసిన వ్యక్తికి, అతడు సజీవంగా ఎదురైతే, అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోగలనులే. ప్రశ్నలు వెయ్యకుండా నువ్వు చెప్పేది చెప్పు" విసుగ్గా అన్నాడు నరేంద్ర.
    "అవును సార్! మూడేళ్ళ కిందట చనిపోయాడనుకొన్న వాడ్ని. అతడి స్నేహితుడ్ని, అతడి సహాయంతో జీవితంలో మనిషిగా నిలబడినవాడ్ని. అతడి భార్యనే పెళ్ళి చేసుకొన్నవాడ్ని. అన్ని విషయాలూ సినిమా రీల్ లా కళ్ళముందు గిర్రున కదిలాయి.

 Previous Page Next Page