Previous Page Next Page 
చిలకలు పేజి 24


    అంతవరకూ మౌనంగా వింటూ కూర్చున్న విజయ్ ఒక్క సారిగా లేచి అద్వయితం ముందుకొచ్చి "ఏమిటి నువ్వు తెలుసుకుంది! ఇందాకటినుంచి చూస్తున్నాను నీ ధోరణి. నరేంద్ర సహాయం లేకుండా ఇంత వరకు ఒక్క కేసైనా పట్టుకొన్నావా?" దురుసుగా అన్నాడు విజయ్.
    "విజయ్! నువ్వు మాట్లాడకు" మందలించాడు నరేంద్ర.
    "సహనానికి కూడా ఓ హద్దు ఉంది. ఈ హత్యతో మరికొంత మందికి కూడా సంబంధం ఉన్నట్టు  ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే  ఏమిటి నీ ఉద్దేశ్యం?"
    "విజయ్ నువ్వెందుకంత ఉద్రేకపడతావ్? నీకు కూడా సూర్యనారయణే హత్య చేసినట్టు  అనుమానం ఉందికదా?"
    "ఉంది! అయితే? నీ ధోరణి నాకు నచ్చలేదు. చూస్తాగా? నరేంద్ర సహాయం లేకుండా ఈ కేసు ఎలా  రుజువుచేస్తావో?"
    "చూస్తాను. తప్పక చూస్తాను" అంటూ  కానిస్టేబుల్స్ వైపు పుచూసి "ఊ తీసుకెళ్ళండి" అన్నాడు అద్వయితం.
    కానిస్టేబుల్స్ సూర్యనారాయణను బయటికి లాక్కెళ్ళారు.
    "వస్తా!" అని అద్వయితం దబదబా నేలను బూట్ కాళ్ళతో బాదుతూ వెళ్ళిపోయాడు.
    "దిస్ ఈజ్ టూమచ్!" ఉద్రేకంగా అన్నాడు విజయ్.
    "విజయ్! ఎందుకలా ఉద్రేకపడిపోతావ్?" నరేంద్ర అనునయంగా అన్నాడు.
    "ఆ చివరి మాటలు అన్నది నిన్ను ఉద్దేశించే. అతడికెంత దైర్యం?"
    "అలా అని ఎందుకనుకోవాలి?"
    "మధ్యాహ్నం అన్నాదులే....."
    "ఏమని ?" ఆశ్చర్యంగా అడిగాడు నరేంద్ర.
    "హత్య జరిగిన నాటి రాత్రి 1-20 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి  హొటల్ కు వచ్చాడని రామకృష్ణ గురించి వాకట్ చేసి అతడి గదికి వెళ్ళాడనీ, కౌంటర్ క్లర్క్ లిప్ట్ బాయ్ చెప్పారట"
    "అయితే?"
    "వాళ్ళు చెప్పిన పోలికలు నరేంద్ర రూపానికి దగ్గరగా  ఉన్నాయన్నాడు.
    "అది నిజమేకదా? వాళ్ళు చూసింది నన్నేగదా?"
    "కావచ్చు, అయితే ఈ హత్యకూ నీకూ సంబంధం ఉందంటాడా?"
    "అది సరే! ఆ రాత్రి అక్కడకు నేనే వెళ్ళానని నువ్వు చెప్పలేదు కదా?"
    "చెప్పలేదు"
    "ఎందుకంత  బాధపడ్తావ్? అద్వయితం తెలివి తేటలు గురించి నీకు తెలియదా ఏం? ఎన్నిసార్ల నన్ను అనుమానించి క్షమాపాన అడగలేదు? బీ కామ్ చాలా పొద్దుపోయింది. భోజనం చేసి పడుకో వెళ్ళు" అన్నాడు నరేంద్ర.
    విజయ్ లోపలకు వెళ్ళాడు.
    నరేంద్ర సిగరెట్ వెలిగించి ఆలోచనలో పడ్డాడు.
                                      12
    సాయంత్రం నాలుగు గంటలయింది.
    నరేంద్ర వరండాలో  పచార్లు చేస్తూ, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
    "బాస, ఫిఫ్టీ పర్సంటు సక్సెస్" అంటూ విజయ్  నగర్చుకొంటూ హడావిడిగా వచ్చాడు. 
    "వెరీ బ్యాడ్."
    "అదేమిటి?"
    "ఫిఫ్టీ పర్చెంటు ఫెల్యూర్ అన్నమాటేగా?" అన్నాడు నరేంద్ర చిరునవ్వుతో.
    "ఆ ఫిప్టీ పర్సెంటు కూడా సక్సెస్ అవుతాను. ఈ రాత్రికి  నర్స పూర్ లో విజయవాడ వెళ్తున్నాను."
    "ఎందుకూ?"
    "రంగారావు వెళ్తున్నాడు."
    "అలాగా?" సాలోచనగా అన్నాడు నరేంద్ర.
    "వాళ్ళు ఆ కమలాంబా. శంకర్రావూ, కృష్ణమూర్తి చాలా ఘటికులు, లావణ్య కూడా తక్కువైందేమీ కాదు. అవలిస్తే పేగులు లెక్కపెట్టే  రకాలు."
    "ఇంతకీ వాళ్ళు నీ పేగులు లెక్క పెట్టెరంటావా?"
    "నేను  అవలిస్తేగా వాళ్ళు నా పేగులు లెక్కపెట్టడానికి? రాత్రికి మరో హత్య  జరగొచ్చు." ఇప్పుడు చెప్పు ఎవరు ఎవరి పేగులు లెక్క పెట్టారో అన్నట్టుగా ముఖం పెట్టాడు విజయ్.
    "హత్యా? ఎవరీ?" అంటూ అదిరి పడ్డాడు నరేంద్ర.
    "లాయర్ రమణరావు హత్య, అతడే తన వివాహానికి అడ్డుపడ్తున్నట్టు కృష్ణమూర్తికీ, రంగారావుకూ అనుమానంలా ఉంది."
    "ఎలా చెప్పగలవు?
    "రాత్రి ప్రభావతి ఇంట్లో పెద్ద ఘర్షణ జరిగింది."
    "ఎవరు చెప్పారు?"
    "వంటవాడిని మంచి చేసుకున్నాను వాడే చెప్పాడు. ఈ రాత్రి రంగారావు గుంటూరు వెళ్తున్నట్టు కూడా వంటవాడే చెప్పాడు. వందరూపాయలు వాడి చేతిలో పెట్టాను వాడు భయపడుతూనే కొంత ఇన్ ఫర్ మేషన్ ఇచ్చాడు. వాడ్ని అరెస్టు చేస్తే చాలా సమాచారం దొరకవచ్చు"
    నరేంద్ర బుర్రలో ఓ ఆలోచన మెరుపులా మెరిసింది.
    "ఓ.కే. నువ్వు రాత్రికి నర్సాపూర్ లో శంక్రరావుకు ఫాలోకా, జాగ్రత్త" అని గబగబా బయటికి వెళ్ళాడు నరేంద్ర.
    గ్యారేజ్ మంచి మారుతి 2000 తీశాడు.
    క్రైంబ్రాంబ్ సబ్ స్టేషన్ ముందు మారుతి ఆగింది.
    నరేంద్ర దిగి లోపలకు వెళ్ళాడు.
    టేబుల్ ముందు కూర్చుని పైల్సు చూస్తున్న ఇన్స్ స్పెక్టర్ అద్వయితం తలెత్తి నరేంద్రను ఆశ్చర్యంగా చూశాడు.
    "ఉరమకుండానే పర్షించావ్? ఏమిటి విశేషం?" నరేంద్రను అదోలా చూస్తూ అడిగాడు ఇన్స్ స్పెక్టర్.
    "లాకప్ లో ఉన్న సూర్యనారాయణతో ఐదు నిముషాలు మాట్లాడాలి" కూర్చోకుండానే అన్నాడు నరేంద్ర.
    అతడి  వాలకం అద్వయితానికి కోపం తెప్పించింది.
    అయినా కోపాన్ని దిగమింగుకొని "నీకు అభ్యతరం ఏమిటి? నెంబర్ టూ రూంలో ఉన్నాడు వెళ్ళిమాట్లాడు" అన్నాడు.
    ఇన్స్ స్పెక్టర్  అంత తగ్గి మాట్లాడటానికి  కారణం లేకపోలేదు. అంతా క్లియర్  అయిందనుకొన్న కేసు, ఇట్టే చిక్కుముడి పడిపోయినట్టు గ్రహించి ఢీలాపడిపోయి వున్నాడు.
    "ముందు కూర్చోవయ్యా! హెడ్! రెండు కాఫీలు తెప్పించు" అన్నాడు అద్వయితం.
    "ఇప్పుడె కాఫీ తాగను. తొందరగా వెళ్ళిపోవాలి."
    "మిస్టర్ నరేంద్రా!" ఏదో చెప్పబోయి సందేహించాడు.
    "ఏమిటి?"
    "నేను ఇలా అంటున్నానని నువ్వేమీ అనుకోవద్దు...."
    "అదేదో చెప్పుత్వరగా" విసుగ్గా. అన్నాడు నరేంద్ర.
    "నువ్వు ఏదైనా సూర్యనారాయణకు సహాయం చెయ్యాలను కొంపే అది హంతకుడికి  చేస్తున్నట్టు మర్చిపోకు. హత్యజరిగిన  గదిలో దొరికిన సిగరెట్ కేసుమీద ఉన్న వేలిముద్రలూ, సూర్యనారాయణ వేలిముద్రాలూ ఒకటేనని ఇంతకు ముందే వేలిముద్రల నిపుణుడు పరీక్ష చేసి రిపోర్టు ఇచ్చాడు."
    "కావచ్చు."
    "అంతేకాదు. ఆ కేసు తనదేనని సూర్యనారాయణ ఒప్పుకున్నాడు స్టేట్ మెంటు ఇచ్చాడు. అతడి భార్యకూడా ఆ కేసు తన భర్తదేనని దాసి ఇచ్చింది."
    "ఓహొ! పకడ్ బందీ గానే కేసు ప్రారంభించావన్నమాట వెరీగుడ్!"
    "గుడ్డూ లేదు బిడ్డా లేదు." నీరసంగా అన్నాడు అద్వయితం.
    "అదేమిటి అలా  ఢీలాపడిపోతున్నావ్? హంతకుడు దొరికాడు. అతడే హంతకుడని నిరూపించడానికి ఆధారం దొరికింది. ఇంకేం కావాలి?"
    "చిక్కువిడిపోయిందానుకున్నాను. కాని అది మరీ గట్టిగా పీటముడి పడిపోయింది.
    "ఏం? ఎందుచేత?"
    "హొటల్ క్లర్కునూ, లిప్ట్ బాయ్ నీ పిలిపించాను. వాళ్ళు చూసింది సూర్యనారాయణను కాదన్నారు. అంతేకాదు అతడ్ని వాళ్ళు ఆ హొటల్లో ఎప్పుడూ చూడలేదన్నారు. వాళ్ళు చెప్పిన గుర్తులు...." అని ఆగి నరేంద్రను పరిశీలనగా చూశాడు.
    "ఊ! ఆగిపోయావేం? చెప్పు!"
    "వాళ్ళు చెప్పిన గుర్తుల్నిపట్టి చూస్తే ఆ అర్థరాత్రి హొటల్ కు వచ్చిన వ్యక్తి నీ అంతలావూ, నీ అంత ఎత్తూ, నీ జుట్టులాంటి జుట్టూ ఉన్నట్టు తేలుతోంది. మంచి సాక్ష్యం దొరికిండనుకొంటే అది కాస్తా ఇలా తగలడిపోయింది" నీరస పడిపోతూ అన్నాడు.
    "ఆ సిగరెట్ కేసు ఆధారం చాలదా?"
    "అలాగే అనుకొన్నాను. కాని కథ అడ్డం తిరిగేట్టుంది. దాని ఆధారంగా కేసు బనాయిద్దామనుకున్నాను. ఇలా బెడిసి కొడుతుందను కోలేదు" అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "కథ అడ్డం తిరిగిందా?"
    "అవును సూర్యం తిరగబడ్డాడు."
    "అంటే?"
    "తన సిగరెట్ కేసును పోలీసులే తీసుకెళ్ళి హత్య జరిగిన గదిలో వదిలారన్నట్టు మాట్లాడు తున్నాడు...."
    "మిస్టర్ అద్వయితం! నువ్వు చెప్పదల్చుకుంది అనుమానితుల లిస్టులో నేను ఉన్నాననేగా?" అద్వయితం మాటల్ని మధ్యలో అందుకొని అన్నాడు నరేంద్ర.
    "అనుమానితుడినని నేను అనడంలేదు. కాని ఈ హత్యతో నీకేదో సంబంధం ఉంది. ఆ రాత్రి నువ్వు జూబ్లీహిల్స్ లోని ప్యాలెస్ హొటల్ కు వెళ్ళినట్టు నేను రుజువు చెయ్యగలను" అన్నాడు నొసలు ఎగిరేస్తూ అద్వయితం.
    నరేంద్ర పకపకా నవ్వాడు,
    "అలా నవ్వుతున్నావ్ నేనన్నది అబద్దమా?" చిరాగ్గా అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "చూడు మిస్టర్ అద్వయితం నువ్వు అనుకొంటున్నట్టుగా ఆ హత్యతో నాకు సంబంధంలేదు. కాని నువ్వు అనుమానించిన వ్యక్తులతో నాకు సంబంధం ఉంది నువ్వు అనవసరపు అనుమానాలతో ఒక్క అడుగు ముందుకేశావా అడుసులో పడ్తావు తెలుసా?"
    "అడుసులోకే పడ్తానో ఒడ్డునే పడతానో చూస్తాను."
    "ఒడ్డున పడవు, నువ్వు హంతకుడు రామకృష్ణ అని రుజువు చేయగలవు. కాని రామకృష్ణ ప్యాలెస్  హొటల్ కు రానేలేదు."
    "అదేమిటి?" నోరు తెరిచాడు అద్వయితం.
    "అవును, రామకృష్ణ ఆ హొటల్లో దిగలేదు. ఆ హొటల్లో  దిగింది రామానంద స్వామి అని రిజిస్టర్ లో రాసి వుంది. ఆ గదిలో దిగింది రామానందస్వామి రామకృష్ణ కాదు ఇదెలా సాల్వ్ చేస్తావ్?" నరేంద్ర చిరునవ్వు నవ్వాడు.
    అద్వయితం బిక్క మొహం వేశాడు.
    "అవును,ఇదొక మిస్టరీ! దీని గురించి ఇంతవరకూ నేను ఆలోచించనేలేదు" నీరు కారిపోతూ అన్నాడు ఇన్స్ స్పెక్టర్.
    "అయితే నన్నిప్పుడు ఏం చెయ్యమంటావ్? సూర్యాన్ని వదిలేయ్యమంటావా?" అదోలా నరేంద్ర ముఖంలోకి చూస్తూ అన్నాడు అద్వయితం.
    "నేను అతడ్ని వదిలెయమనలేదే?"
    "నరేంద్రా! నీ ఉద్దేశ్యంనాకు అర్థం కాదు. స్పష్టంగా చెప్పు."
    "చెప్పినా, ఇప్పుడు ణ ఉద్దేశ్యం నీకు అర్థంకాదు. అందుకే చెప్పను. సమయం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావ్?
    "ఇప్పుడు నన్నేం చెయ్యమంటావ్?"
    "నీ ఇష్టం వచ్చింది చెయ్యి. నాకు కావాల్సింది సూర్యనారాయణతోఐదు నిమిషాల ఇంటర్వ్యూ."
    "నేను కూడా రావచ్చా?"
    "నేను వంటరిగానే మాట్లాడాలి."
    "అయితే వెళ్ళి మాట్లాడు."
    నరేంద్ర లేచి నంబర్ రెండు లాకప్ రూమ్ కు వెళ్లాడు.
    డిటెక్టివ్ తన గదిలోకి రావడం చూసి సూర్యనారాయణ బల్లమీద నుంచి లేచాడు.
    "ఇంతకంటే మోసం మరొకటి ఉంటుందా?"
    "ఏమిటా మోసం? ఎవరు చేశారు?"
    "మీరే! మీరే మోసం చేశారు. పేరు మోసిన డిటెక్టివ్ అని మిమ్మల్ని ఆశ్రయించాను నమ్మించి ఇంటికి పిలిపించి పోలీసులకు అప్పగించారు." బాధగా అన్నాడు సూర్యం.
    అతడి మాటల్ని వినిపించుకొనట్టే "నీ సిగరెట్ కేసు ప్యాలెస్ హొటల్లో హత్య జరిగిన గదిలోకి ఎలా వెళ్ళింది" అని అడిగాడు నరేంద్ర.
    "పోలీసులే తీసుకెళ్ళి వేసి వుంటారు."
    "మిస్టర్ సూర్యం! నరేంద్ర కంఠం గాభీరంగా పలికింది.
    సూర్యనారాయణ బెదురు చూపులు చూశాడు.
    "బాగా ఆలోచించుకొని చెప్పు. అది ఎప్పటివరకు నీ దగ్గర ఉన్నట్టు గుర్తు? అది పోయినట్టు ఎప్పుడు చూసుకున్నావు?"
    ఇన్స్ స్పెక్టర్ చూపించేదాకా అది పోయినట్టే నాకు తెలియదు."

 Previous Page Next Page