మండుటేండలో బస్సు ప్రయాణంచేసి వచ్చిన మంగమ్మతో పాటుచంటి బిడ్డ పరిస్థితి కూడా విషయంగానే వుంది. ఇద్దరి శరీరాల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా వుంది. ఇద్దరూ స్పృహా కోల్పోయారు. ఉదయంవరకు ఆరోగ్యంగా వున్న అ తల్లీబిడ్డలు ఇలా అవడానికి వారికి "వడదెబ్బ" తగలడమె కారణం. వడదెబ్బ, ఎండదెబ్బ , గాడ్పు కొట్టడం_ ఈ మూడు ఒకటే. శరీరం ఎక్కువ వేడికి గురి అయినప్పుడు వడదెబ్బ తగులుతుంది. ఎండలో బయటకు వెళ్ళితేనే వడదెబ్బ తగులుతుందనీ ఇంట్లో వుంటే గాడ్పు కొట్టదనుకోవడం పొరపాటే! బయట వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఆ ప్రభావం ఇంట్లో ఉన్నవారి మీద పడితే, ఎండలో బయటకు వెళ్ళాకపోయినా వడదెబ్బ తగలవచ్చు. ముఖ్యంగా రేకుల షేడ్ లో వున్నవారికి, గాలి ప్రసారం సరిగ్గాలేని ఇళ్ళలో నివసించేవారికి వడదెబ్బ తగులుతుంది. అలాగే గంటల తరబడి బాయిలర్స్ దగ్గర, బొగ్గుతో నడిచే రైలు ఇంజన్లలోనూ పనిచేసే వారికీ వడదెబ్బ తగులుతుంది.
మామూలుగా ఎండవేడి, పరిసరాల ఉష్ణోగ్రత పరిగినప్పుడు మన శరీర ఉష్ణోగ్రత అ వేడికి సమానంగా పెరగకుండా చర్మంలో ఉన్న శ్వెచ్చ గ్రంధులు, రక్తనాళాలు, సున్నితమైనా నరాలు చాలా జాగ్రత్త పడతాయి. ఈ విషయంలో మెదడులో ఉండే "హీట్ రెగ్యూలేటర్" ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎండవేడి ఎక్కువ ఉన్నప్పుడు, వడ గాడ్పులు వీస్తున్నప్పుడు చమట ఎక్కువ పడుతుంది. ఇలా ఎక్కువ చమట పట్టడంవల్ల శరీరం చల్లబడుతుంది. ఈ రకంగా చర్మం శరీరానికి సహజమైనా "ఎయిర్ కూలర్" గా వ్యవహరింస్తుందికాని శరీరం చాలా సేపు ఎక్కువ వేడికి అయినప్పుడు స్వేద గ్రంధులు క్రమంగా అలసిపోతాయి . చమట పట్టడం ఆగిపోయి శరీరం వేడి ఎక్కి వడదెబ్బ తగులుతుంది.
వడదెబ్బ తగిలినా కొందరికి అకస్మాత్తుగా 106 డిగ్రీలుగాని అంతకు మించిగాని జ్వరం వస్తుంది. మరికొందరికిఇంతఎక్కువ జ్వరం రావడానికి ఒకటి_రెండు గంటల ముందునుంచే అతిదాహం, తలనొప్పి తల తిరగడం ఏదో తెలియని బాధ ఉంటాయి. ఇలా అనిపించిన కొద్ది సేపటికి అతిగా జ్వరం వచ్చి త్వరగా స్ప్రూహకోల్పోటారు. సాధారణంగా ఎండలోకి వెళ్ళివచ్చితరువాత కొద్దిగా తలనొప్పి అనిపించినా, కొద్దిగా తలతిరిగినట్లు అనిపించినా వడదెబ్బ తగిలిందని అంటూ ఉంటారు.
కాని చమటపట్టడం ఆగిపోయి చర్మం ఏమది నట్లయి వేడిగామరి, శరీర ఉష్ణోగ్రత106డిగ్రీలకిపెరిగితేనే వడదెబ్బ తగిలినట్లు! అంటే కాక కేంద్రనాడీమండలం ఎక్కువ వేడికి గురికావడంతో అపస్మారకస్థితిఏర్పడి ఆ దశలో ఏవేవో మాట్లాడడం, ఆవ్యక్తమైనా బాధను అనుభవించటంలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇవేమీ లేకుండా చమట మామూలు గా పడుతూ, కాస్త తలనొప్పి అనిపిస్తూ ఉంటే ఆస్థితి ఎండ వేడికి మామూలుగా కలిగే స్థితితప్ప వడదెబ్బ తగలడం మాత్రం కాదు. ఏ కొద్దిసేపావుఎండలో ఉన్నంత మాత్రానే వడదెబ్బ తగలదు.
గంటలతరబడి ఎండలో తిరిగి పని చేసినప్పుడు, గాలిలేని ప్రదేశంలో ఎక్కువసేపు కూర్చున్నాప్పుడే వడదెబ్బ తగులుతుంది పెద్దవాళ్ళకంటె చంటిపిల్లలే వడదెబ్బకి త్వరగా గురవుతారు.
హైఫర్ ధైరాయిడ్ ఉన్నవారికి, అతిగా మాధ్యమ సేవించేవారికి, శారీరిక అనారోగ్యం వున్నవారికి, గాలి ఆడని విధంగా బిగుతుగా దుస్తులు ధరించేవారికి వడదెబ్బతేలికగా తగులుతుంది. వడదెబ్బ తగిలినపుడు కొమ్దరకి విరోచనాలు కూడా అవుతాయి. విరోచనాలాలో నల్లగా రక్తం లో కలసి వుటుంది. విరోచనాలవల్ల శరీరంలోని నీరుకూడా తగ్గిపోతుంది.
వడదెబ్బకు తీవ్రమైన జ్వరం వుంటుంది. కనుక ఆ వ్యక్తిని చల్లగా చన్నీళ్ళతో తడిపిన వస్త్రాలతో చుట్టివుంచాలి. చల్లగా వుండేప్రదేశంలో పడుకోబెట్టాలి. ఇంటి గుమ్మానికి, కిటికీలకు వట్టివెళ్ళ తడకలుగాని, తడివస్రాలుగాని, కట్టి వాటిని మాటిమాటికి తడపాలి. వీలయితే ఆ వ్యక్తిని అయిస్ ముక్కలు వేసిన చన్నీళ్ళ తొట్టిలో కూర్చోబెట్టాలి. ప్రతి అయిదు నిమిషాలకు టెంపరేచరుచూస్తూ జ్వరం 102 డిగ్రలకి దిగాక ఐస్ వాడటం మాని వేసి వేరుగా పడుకోబెట్టాలి. జ్వరం త్వరగా 100 డిగ్రీలకంటె తక్కువ స్థాయికి డిగిపోకుండా చూడాలి. నిమిషాల్లో జ్వరం తగ్గిపోయి ఒళ్ళు చల్లబడి పోయినా ప్రమాదమే . అ వ్యక్తి షాక్ కి గురివుతాడు. జ్వరం తగ్గుముఖం పాడుతుందగానే వడదెబ్బ తగిలిన వ్యక్తులు అపస్మారక స్థితి నుండి కోలుకోవడం ప్రారంభిస్తారు. శ్వాసక్రియ సక్రమమగా జరుగుతూ వుండిమామూలు స్థితికివస్తుంది.
జ్వరం తగ్గి మళ్ళీ పెరుగుతూంటేవెంటనే తడి వస్రంతావు ఒళ్ళంతా తుడిస్తే ఆ ఉష్ణోగ్రత తేలికగా అదుపులోకి వస్తుంది. వడదెబ్బ తగిలినపుడు వెంటనే చికిత్స అందక గంటలు గడిచిపోయిన వ్యక్తులు కొందరికి టెంపరేచరుఎంతకీ తగ్గకుండా వుందిపోతుంది. అపుడు కూడా వ్యక్తి షాక్ కి గురిఅవుతాడు. ఇటువంటి వారికీ తడివస్రాళ చికిత్సతో పాటూ నరానికి గ్లూకోజ్ సలైను ఎక్కించాలి. షాక్ ని అదుపుచేయడానికి ఇతర మందులు వాడాలి.