Previous Page Next Page 
హేల్త్ సైన్స్ పేజి 3

                                3. ఎండకుతోడు ఉడుకు జ్వరం
   
    "డాక్టరుగారూ, మా ఇంట్లో అసలే వేడి. దానికి సై ఉడుకు జ్వరాలు. ఈ ఎండలు ఎప్పుడు తగ్గిపోతాయో కాని నానా విధాలా బాధ పడిపోతున్నాం." అంటూ వాపోయింది ఓ గృహిణి.

    అవునుమరీ మండుటేండలు, దీనికి తోడు ఇంట్లో పిల్లలకి_ పెద్దలకి జ్వరాలు. మామూలు రోజుల్లో జ్వరంవస్తే ఏదో విధంగా ఉపశాంతి పోందవచ్చు. వేసవికాలంలో ఎండవేడి, ఉడుకు జ్వరాల వల్ల శారీరకంగా, మానసికంగా స్థిమితం ఉండదు.సాధారణంగా జ్వరంరావాడానికి బాక్టీరియ, వైరస్ క్రిములు ఇతర వ్యాధులు కారణం కాగా: ఎండాకాలంలో వచ్చే ఉడుకు జ్వరాలకి కేవలం ఎండవేడేకారణం. సాధారణంగా జ్వరం వచ్చినపుడు చర్మంలోఉంటే చిన్న_ చిన్న రక్తనాళాలు బాగా వ్యాకోచిస్థాయి. శరీరంలో ప్రసారం అయ్యే రక్తం చర్మంలోని వ్యాకోచించిన రక్తనాళాల్లోకి ప్రవేశించి బయట ఉన్న చల్లధనంతో చల్లబడుతుంది. దాంతో వంటి వేడి త్వరగా చల్లబడుతుంది. దానికితోడు జ్వరానికి వాడే మందుల వల్ల త్వరగా జ్వరం తగ్గుతుంది.

    ఉడుకు జ్వరం ఎండవేడికి శరీరం వేడి ఎక్కడంవల్ల వస్తుంది. ఈ జ్వరానికి ఏ వ్యాధి క్రిములు కారణం కాదు. ఉడుకు జ్వరం వచ్చినప్పుడు అన్ని జ్వరాల్లో మాదిరిగానే రక్తం చర్మంలోని వ్యాకోచించిన రక్తనాళాల్లోకిప్రవహిస్తుంది. కాని బయటకూడా వేడిగా ఉండబట్టి రక్తం చల్లబడదు. జ్వరం సైతం అలాగే వుందిపోతుంది. కాని వడదెబ్బతగిలిన వారికీ మాదిరిగా చమట పట్టటం ఆగిపోదు. అంటేకాదు, మెదడులో ఉండే "హీట్ రేగ్యులేటరు" పనిచేయడం మానివేయదు ఈ రెండిటివల్ల బయట ఎండవేడి ఎంతవున్నాకొద్దో, గొప్పో చర్మం చల్లదనాన్ని నిలబెట్టుకుంటూ రక్తాన్ని కొద్దిగ్నైనా చల్లబరుస్తూ జ్వరం పెరగకుండా చేస్తుంది.

    ఉడుకు జ్వరం వచ్చినవారు చల్లగా ఉండే గదుల్లో ఉండాలి. ఇంటి కిటికీలకి గుమ్మాలకి తడివర్షాలు, వట్టివెళ్ళు తడికెలుకట్టి వేడిని అదుపుచేయాలి. ఉడుకు జ్వరం వచ్చినప్పుడు కేవలం మోటానిస్, క్రోసిస్ మొదలైన మందు బిళ్ళలు మింగడంవల్ల ఫలితం ఉండదు. జ్వరాన్ని నయంచేసేబిళ్ళలకంటె ముందు శరీరాన్ని పరిసరాలను చల్లగా ఉంచడం అవసరం. ఆ దృష్ట్యా శరీరాన్ని తడివస్రాలతోచల్లబరచాలి. శరీరాన్ని చల్లబరచకుండా ఎన్ని మందులు వదినా ఫలితం ఉండదు.

    వంటిని పరిసరాలని చల్లబరిస్తే ఉడుకు జ్వరం త్వరగా తగ్గిపోతుంది. సాధారణంగా ఉడుకు జ్వరం అనేది_ రెండు రోజుల్లో తగ్గిపోతుంది. ఉడుకువల్ల తలనొప్పి, ఒళ్ళు నొప్పులు_ కిఅల్లు గుంజడం లాంటి లక్ష్యణాలు ఉండవచ్చునేమోగాని వడదెబ్బ తగిలినపుడు వచ్చే జ్వరంలో మాదిరిగా అపస్మారకస్థితి, ఇతర చికాకులు ఉండవు. అయితే ఉడుకు జ్వరం తగ్గడానికితగిన విధంగా జాగ్రత పడకపోతే బయటవేడికి_ వంట్లో వేడికి మేడుడులోని "హీట్ రేగ్యులేటర్ సెంటర్" దెబ్బతిని వడదెబ్బకి దరితీయవచ్చు.

    సాధారణంగా ఎండాకాలంలో అతిగా చమట పట్టడంవల్ల శరీరం నుంచి రెండు_ మూడు లీటర్లు నీరు బయటకు పోతుంది. వేసవిలో ఇలా చమట ఎక్కువ పట్టడం వల్లనే ఉడుకు జ్వరాలు, వడదెబ్బలు ఎక్కువమంది జోలికి వెళ్ళవు. అయితే చమట రూపంలో నీరు బయటికిపోతే ఆ లోటును పూరించడానికి ఎప్పటికప్పుడు నీరు తాగుతూ ఉండాలి. మంచి నీళ్ళతో పటు ఉప్పుకూడా వాడాలి. లేకపోతే వాటి దుష్పలితాలు వెంటనే కనబడతాయి. కొందరికి ఉడుకు జ్వరం ఒక్కతోజులోనే అదుపులోకి వచ్చినా తరువాత అతి నీరసం, తలతిరగడం, తలనొప్పి, వికారం లాంటివి ఉంటాయి. బయటవేడిని ఎవరి శరీరం ఎంత వరకు భార్తిస్తుండో చెప్పడం కష్టం. అందువల్ల ఏవేవో మందుల్ని మనమ్ముకుని మొండి ధైర్యంతో ఇఉమ్డటం కష్టం, శరీరాన్ని అతివేడికి గురికాకుండా చూసుకోవడం అవసరం.

 Previous Page Next Page