నరేంద్ర లేచి వెళ్ళిచెస్ బోర్డు ముందు కూర్చున్నాడు.
10
పోలీస్ జీప్ దుమ్ము రేపుకుంటూ స్పీడుగా కూకటిపల్లి వైపుపోతున్నది.
"ఎక్కడికి వెళ్తున్నాం?" అడిగాడు విజయ్.
"సూర్యనారాయణ ఇంటికి?" ఇన్ స్పెక్టర్ అన్నాడు.
"ఎందుకూ? అతడ్ని అరెస్టు చేస్తావా?"
"అతడి విషయంలో నీ అభిప్రాయం ఏమిటి?"
విజయ్ ఆలోచనలో పడ్డాడు.
ఇన్ స్పెక్టర్ జేబులో నుంచి సిగరెట్ కేసు తీసి చూపిస్తూ "ఇది రామకృష్ణను హత్య చేసిన గదిలో దొరికింది. దీని మీద వేలిముద్రలు తీయించాను. ఇక హంతకుడి వేలు ముద్రలతో పరిశీలించాలి."
"అంటే హంతకుసు సూర్యనారాయణ అనేనా నీ అభిప్రాయం?"
"అవును, ఈ కేసు మీద ఆర్.యస్. అనే అక్షరాలు కూడా ఉన్నాయి. అతడి విషయంలో నీ అభిప్రాయం కూడా అదేనని నా అనుమానం."
"అలా ఎందుకనుకున్నావ్?" అన్నాడు విజయ్.
"కాదంటావా?"
"నరేంద్ర కాదంటున్నాడుగా!"
"నీ విషయం చెప్పు"
"నాకు మొదటి నుంచీ అతడి మీదే అనుమానం. కాని....."
"కానీ లేదు అర్థణాలేదు. అతడే హంతకుడు. ఈ విషయంలో నరేంద్ర ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నాడో నాకు అర్థం కావడంలేదు."
"నరేంద్ర బహుశా అతడ్ని ఇంకా అబ్జర్వు చేస్తున్నాడనుకొంటాను" అన్నాడు విజయ్.
"విజయ్. ఒకటి అడుగుతాను. నిజం చెప్తావా? ఈ కేసులో నువ్వు డిటెక్టివ్ గా స్థిరపడబోతున్నావు. నీ భవిష్యత్తుకు ముఖ్యమైన మెట్టు ఈ కేసు."
విజయ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు.
"ఆ రాత్రి నరేంద్ర జూబ్లీ ప్యాలెస్ హొటల్ కు వెళ్ళాడు గదూ?"
"విజయ్ చివ్వున తల తిప్పి చూశాడు.
"అవునా?" రెట్టించాడు ఇన్ స్పెక్టర్.
"నీకు ఈ అనుమానం ఎందుకు వచ్చిందో ముందు చెప్పు." విజయ్ అడిగాడు సాలోచనగా.
ఆ రాత్రి దాదాపు1.29 నిముషాలకు ఒక వ్యక్తి రామానందస్వామి కోసం ఆ హొటల్ కు వచ్చాడని కౌంటర్ లో క్లర్కూ, లిప్ట్ బాయ్ చెప్పారు.
"అయితే? ఆ వెళ్ళింది నరేంద్రేనని ఎందుకనుకుంటున్నావ్?" తీవ్రంగా ఉంది విజయ్ కంఠం.
"వాళ్ళు ఆ వ్యక్తిని వర్ణించి చెప్పారు. వాళ్ళు చెప్పిన పోలికలు నరేంద్రవే. వాళ్ళు ఆ వ్యక్తిని చూస్తే గుర్తు పడ్తామని కూడా చెప్పారు. వెళ్ళేప్పుడు వాళ్లకు కన్పించలేదట. బహుశా వాళ్ళ కంట పడటం ఇష్టం లేక మెట్లు మీదగా పక్క నుంచి వెళ్ళిపోయి వుంటాడని కూడా చెప్పారు.
"అంటే ఈ హత్య నరేంద్ర చేశాడనా నీ ఉద్దేశ్యం ?" కోపంగా అన్నాడు విజయ్.
"ఛా! నేను అలా అన్నానా?"
"ఏమో? అన్నా అంటావ్. మీ పోలీసోళ్ళను....."
"విజయ్. నేను అనేది అది కాదు." మాట పూర్తికాకుండా అందుకొని అన్నాది ఇన్ స్పెక్టర్.
"మరి?"
"అతనికి సూర్యనారాయణే ఈ హత్య చేశాడని తెలుసు అయినా అతడ్ని నిరపరాధిగా కలర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు."
"అంటే. ఈ హత్యకు సంబంధించిన కుట్రలో నరేంద్రకు ప్రమేయం ఉందనా నీ అభిప్రాయం?"
"ఆరోజు నరేంద్ర ఆ హొటల్ కు వెళ్ళాడా లేదా?"
"నరేంద్రనే అడుగు ఆవిషయం."
"అడుగుతాను. తప్పుతుందా? ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను." గొణిగినట్టుగా అన్నాడు ఇన్ స్పెక్టర్.
"విజయ్ కు ఇన్ స్పెక్టర్ మీద కోపం వచ్చింది. నరేంద్ర మీద కూడా చిరాకు వేసింది. అద్వయితం ఒకోసారి వెనకా ముందూ చూడాడు. నరేంద్రకు బేడీలు వేసినా ఆశ్చర్యంలేదు. అసలు నరేంద్ర ఎందుకు సూర్యనారాయణను ప్రోటేక్టు చేస్తున్నాడో తనకూ అర్థం కావడంలేదు.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్ విజయ్.
"ఆలోచిస్తున్నాను. ఏమిటి అని అడక్కు." అన్నాడు విజయ్.
"గుడ్! ఆలోచించు." అదోలా అన్నాడు ఇన్ స్పెక్టర్.
అంతలో జీపు కొత్తగా కట్టిన రెండు అంతస్థుల భవనం ముందు ఆగింది.
ఇన్ స్పెక్టర్ జీపులో నుండి దూకి చకచకముందుకు నడిచాడు. విజయ్ అతడ్ని అనుసరించాడు. అతడి వెనకే కాని స్టేబుల్ నడిచాడు
ఇన్ స్పెక్టర్ కాలింగ్ బెల్ నొక్కాడు.
తలుపు తెరుచుకున్నాయి.
తలుపులు తీసిన యువతి ఇన్ స్పెక్టర్ ను చూసి కొయ్య బారిపోయింది. అతడి వెనక నిలబడిన చూసి కొద్దిగా తేర్చుకొన్నది.
"మీరా? ఏమిటిలా వచ్చారు?" అన్నది విజయ్ ను చూస్తూ.
"పని ఉండే వచ్చాం." అంటూ ఇన్ స్పెక్టర్ లోపలకు నడిచాడు. విజయ్ ఓ క్షణం నిలబడి ఆమే ముఖంలోకి చూసి లోపలకు నడిచాడు.
"సూర్యనారాయణ లేడా?" అడిగాడు ఇన్ స్పెక్టర్ సోఫాలో కూర్చుంటూ.
"లేరు. వర్క్ షాపు కెళ్ళారు." ముఖానికి పట్టిన చమట్లు కొంగుతో తుడుచుకొంటూ అన్నది.
"కూర్చోండి" అన్నాడు విజయ్ తను ఇన్ స్పెక్టర్ పక్కన కూర్చుని.
"సూర్యనారాయణ మీకే మౌతారు?"
ఇన్ స్పెక్టర్ ప్రశ్నకు "నా భర్త" అని గొణక్కుండా జవాబిచ్చింది.
"రామకృష్ణ?"
అనసూయ వెంటనే సమాధానం ఇవ్వలేకపోయింది.
"చెప్పండి." గద్దించాడు ఇన్ స్పెక్టర్ .
"నా భర్త!" గబుక్కున అనేసింది. అంతలోనే సద్దుకొని "నా మొదటి భర్త" అన్నది.
"నీ మొదటి భర్తను హత్య చేసిందెవరో నీకు తెలుసు. అవునా?"
అనసూయ వెర్రి చూపులు చూసింది.
విజయ్ కు ఆమెను చూస్తుంటే జాలి వేసింది.
"చెప్పమ్మా భయంలేదు" అన్నాడు విజయ్.
"నాకు తెలియదండీ!"
"నాకు తెలియదు....తెలియదు...హిస్టీరియా పేషెంటులా అరిచింది అనసూయ.
"అద్వయితం పాపం! ఆమే నెందుకు అలా చెదరకొడ్తావ్ చిన్నగా అడుగు" అన్నాడు విజయ్.
"ఇది చూడు." సిగరెట్ కేసు అందించాడు. ఇన్ స్పెక్టర్ అనసూయకు.
అనసూయ వణుకుతున్న చేతిలో కేసు అందుకొని చూసింది.
"ఆ కేసు ఎవరిదో చెప్పగలవా?" అడిగాడు ఇన్ స్పెక్టర్ .
"ఇది మీ దగ్గరకెలా వచ్చింది?" ఎదురు ప్రశ్న వేసింది అనసూయ.
"అవును."
"ఏ భర్తది?"
అనసూయ ముఖం కదింపోయింది.
"ఏమిటి మీ ఉద్దేశ్యం? కోపంగా అడిగింది.
"ఈ కేసు ఎవరిదో చెప్పగలవా?" అడిగాడు ఇన్ స్పెక్టర్.
"ఇది మీ దగ్గరకెళ వచ్చింది?" ఎదురు ప్రశ్న వేసింది అనసూయ.
"మేము అడిగిన డానికి సమాధానం చెప్పు ఆ కేసు నీ భర్తదేనా?"
"అవును."
"ఏ భర్తది?"
అనసూయ ముఖం కందిపోయింది.
"ఏమిటి మీ ఉద్దేశ్యం? కోపంగా అడిగింది.
"ఈ కేసు నీ మొదటి భర్తదా, రెండో భర్తదా అని అడుగుతున్నాను."
"నా రెండో భర్తదే."
"సరిగా చూసి చెప్పు."
"సరిగానే చూశాను. ఆయన పేరు కూడా ఉంది. ఖచ్చితంగా గొణకకుండా చెప్పింది.
ఇన్ స్పెక్టర్ చివ్వన లేచి నిల్చున్నాడు.
"మళ్ళీ వస్తాను".
"మళ్ళీ వస్తారా? ఎందుకూ?" భయంగా చూస్తూ అడిగింది.
"ఇప్పుడె ఏమైంది? అసలు పని ముందే ఉంది. పద విజయ్." అంటూ చరాచర బయటికి వచ్చాడు ఇన్ స్పెక్టర్.
జీపు బయలుదేరింది.
"ఇప్పుడైనా అంగీకరిస్తావా రామకృష్ణను హత్య చేసింది సూర్యనారాయణేనని?" విజయ్ గర్వంతో అడిగాడు ఇన్ స్పెక్టర్.
"నేను అతడు హంతకుడుకాడని అనలేదే? నా అనుమానం కూడా మొదటి నుంచి అతడి మీదే ఉంది. కాని నరేంద్ర అభిప్రాయం వేరుగా ఉంది. అందువల్లనే. " క్షణం ఆగి.
"ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాను" విజయ్ అన్నాడు-
"కొన్ని గంటల్లో అన్ని విషయాలు కక్కిస్తాను చూస్తుండు" ఇన్ స్పెక్టర్ కంఠంలో గర్వం ధ్వనించింది.
ఆటోమోబాయ్ ల్ వర్కుషాపుకు వచ్చారు. ఆరోజు సూర్యనారాయణ వర్కుషాపుకు రాలేదని తెలిసింది.
"రాస్కెల్ అబ్ స్కాండ్ అయ్యాడేమో" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"విజయ్ మౌనంగా ఉండిపోయాడు.
"ఎక్కడున్నా ఇరవై నాలుగ్గంటల్లో పట్టేసి దొక్కలోకి తోసేస్తాను చూస్తుండు."
"రాధారాణిని కూడా ఇతడే హత్య చేసి వుండొచ్చుగా?" అన్నాడు విజయ్ ఇన్ స్పెక్టర్ ముఖంలోకి చూస్తూ.