Previous Page Next Page 
చిలకలు పేజి 20

  
    "వాట్?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు ఇన్ స్పెక్టర్.
    "నీ ఉద్దేశ్యం ఏమిటి?"
    "ఈ రాస్కెల్ ఆమెను కూడా చంపేసి ఉంటాడు. మూసల్ ట్రీట్ మెంటు ఇస్తే అన్నీ బయటపడ్తాయి."
    విజయ్ పకపక నవ్వాడు.
    "ఎందుకు నవ్వుతున్నావ్?"
    "నేను అన్నానే అనుకో ఆలోచించకుండా వెంటనే  రెండు హత్యలూ సూర్యనారయణే చేసినట్టుగా రూఢి చేసుకోవడమేనా? అందుకే మీ పోలీసోళ్ళకు డిటెక్టివ్స్ సహకారం కావాల్సి వస్తోంది."
    అద్వయితం ముఖం గంభీరంగా పెట్టుకున్నాడు.
    "ఎవడో హొటల్ వాడు కొన్నిపోలికలు చెప్పడం, ఆ పోలికలు నరేంద్ర రూపానికి దగ్గరగా ఉన్నట్టు నీకు అన్పించడం, వెంటనే నువ్వు రామకృష్ణ హత్యకు సంబంధించిన కుట్రలో నరేంద్రకు జోక్యం ఉందనుకోవడం.....ఇవన్నీ మీ పోలీసు బుర్ర ఎంత చురుగ్గా పని చేస్తుందో చెప్పడంలేదూ?" సీరియస్ గా అన్నాడు విజయ్ .
    "విజయ్. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావ్."
    "సరి ఆ విషయం వదిలేయ్.సూర్యనారాయణే రాధారాణిని కూడా హత్య చేశాడంటావా!"
    "నేను అనలేదు. నువ్వేఅన్నావ్". చిరాగ్గా అన్నాడు ఇన్ స్పెక్టర్
    "నువ్వేమంటావోనని అన్నాను."
    "ఆ రాధారాణిని చంపినవాడు అఖండుడులా ఉన్నాడు. చిన్న క్లూ కూడా వదల్లేదు." అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "వదిలాడు. ఆ క్లూ నా దగ్గర ఉంది."
    "వాట్?" ఇంతెత్తున ఎగిరిపడ్డాడు ఇన్ స్పెక్టర్.
    జీపు క్రైం బ్రాంచ్ స్టేషన్ ముందు ఆగింది.
    ఇన్ స్పెక్టర్ , విజయ్ దిగి లోపలకువెళ్ళారు. ఇద్దరూ ఎదురెదురు కుర్చీలలో కూర్చున్నారు.
    "ఏదో క్లూ దొరికిందన్నావ్? ఏమిటది?" అంతవరకూ తనకు చెప్పకుండా దాచినందుకు గుర్రుగా చూస్తూ అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "తల పగిలిపోతుంది. ముందు కాఫీ తెప్పించవయ్యా?" అన్నాడు విజయ్.
    అద్వయితం హెడ్డు కేసి చూశాడు. హెడ్డు కాఫీ తెమ్మని కుర్ర వాడికి చెప్పాడు ఐదు నిముషాలు  ఎవరి ఆలోచనల్లో వాళ్లు ఉండి పోయారు.
    కుర్రాడు రెండు కప్పులతో కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. అద్వయితం, విజయ్ మౌనంగా కాపీ తాగారు.ఇన్ స్పెక్టర్ సిగరెట్ వెలిగించుకొని దమ్ము పీల్చాడు.
    "ఇప్పుడు చెప్పు విజయ్. ఏమిటా క్లూ?"
    "క్లూ సంగతి తర్వాత చెపుతాను, ముందు ఇది చెప్పు నీదృష్టిలో రాధారాణి హంతకుడెవరు?"
    "అది అంతుపట్టకేగా ఆ కేసు నరేంద్రకు అప్పగించాను. నీ అనుమానం ఎవరి మీదైనా ఉందా?"
    "రాధారాణిని హత్య చేసినవాడు...." అని అడిగాడు విజయ్.
    "ఆ హత్య చేసినవాడు.....? గాలి కుంభించి అడిగాడు అద్వాయితము.
    "శంకర్రావు"
    "వాట్? శంకర్రావా?"
    "అవును?"
    "నీ అనుమానానికి ఆధారం?"
    "గట్టి ఆధారాలే ఉన్నాయి."
    "ఏమిటా గట్టి ఆధారాలు? శంకర్రావుకు రాధారాణిని చంపితే ఏమొస్తుంది?" అద్వయితం అయోమయంగా అడిగాడు.
    "రామకృష్ణ చనిపోయినప్పట్నించీ....సారీ.....అదే రైలుప్రమాదంలో అతడు చనిపోయాడని భావించినప్పట్నించి అతడి ఆస్తిని అనుభవిస్తూ వచ్చింది ఎవరో తెలుసా?"
    "అతడి అక్క కమలాంబ....."
    "శంకర్రావు కూడా అతడి ఆస్తుపాస్తుల లావాదేవీలన్ని అతడే చూస్తు వచ్చాడు. శంకర్రావు కమలాంబ ప్రియుడని వేరుగా చెప్పక్కర్లేదు. అంతేకాదు తన  మేనల్లుడు కృష్ణమూర్తికి లావణ్యను ఇచ్చి పెళ్ళి చేస్తే ఆ ఆస్తి తన చెయ్యిజారిపోకుండా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే లావణ్య కృష్ణమూర్తిల మధ్య పరిచయాన్ని పెంచాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది?
    "అయితే?"
    "రామకృష్ణ తిరిగి వస్తున్నాడని ముందే పసిగట్టాడు శంకర్రావు అంతే కాదు అతడు రాధారాణిని ప్రేమిస్తున్నాడనీ, ఆమెను వివాహం చేసుకోబోతున్నాడనీ తెలుసుకొన్నాడు. అందుకే ముందు రాధారాణిని హత్యచేశాడు."
    "ఆగాగు. నాకు మతిపోతోంది." దాదాపు జుట్టుపీక్కున్నంత పనిచేశాడు ఇన్ స్పెక్టర్.
    విజయ్ ఇన్ స్పెక్టర్ ముఖంలోకి గర్వంగా చూశాడు.
    "అలాగయితే రామకృష్ణను కూడా శంకర్రావు చంపి ఉండొచ్చుగా?"
    "చంపేవాడే, కాని అంతకు ముందే సూర్యనారాయణ ఆపని కాస్తా పూర్తిచేశాడు" అన్నాడు విజయ్.
    "ఊహూ! నీ ఆర్గ్యుమెంటులో ఏదో ఓటిమోత విన్పిస్తున్నది" అన్నాడు అద్వయితం.
    "ఏమిటా ఓటి మోత?"
    "మరి ఆస్తి అనుభవిస్తున్నది శంకర్రావ్, కమలాంబ. సూర్యనారాయణకు కానీ,  అతడి భార్యకుగానీ, రామకృష్ణ ఆస్తిమీద ఎలాంటి ఆశలేదంటాడు నరేంద్ర. మరి సూర్యనారాయణకు రామకృష్ణను చంపాల్సిన అవసరం ఏమిటి?"
    "అతడికి ఆ అవసరం ఉంది"
    "ఏమిటది?"
    "రామకృష్ణ బతికి ఉన్నాడు తిరిగివచ్చాడు. అతడు చనిపోయాడని భావించి సూర్యనారాయణ అతడి భార్యను పెళ్ళి చేసుకొన్నాడు. తను చేసిన మోసానికి రామకృష్ణ ఒక పట్టాన తనను వదలడని అతడికి తెలుసు ఆ భయంతోనే సూర్యనారాయణ రామకృష్ణను హత్యచేశాడు."
    "అద్వయితం ముఖం ఒక్కసారిగా స్విచ్ అన్ చేసినట్టు వేగిలిపోయింది.
    "యూ ఆర్ కరెక్ట్ విజయ్. ఈ కేసులో హంతకుడ్ని పట్టుకోవడానికి సహకరించిన డిటెక్టివ్ గానీ పేరు రికార్డులోకి ఎక్కిస్తాను. ఈ దెబ్బతో నువ్వు అసిస్టెంటు స్థానం నుంచి డిటెక్టివ్ ల లిస్టులోకి వచ్చేస్తావ్." అన్నాడు ఇన్ స్పెక్టర్.
    విజయ్ సంతృప్తినా నవ్వాడు.
    "రాధారాణి హత్య స్థలంలో క్లూ దొరికిందన్నావ్. అదేమిటో చెప్పు."
    "అది....ఇదే." విజయ్ షర్టుకు ఉన్న బంగారు గుండీ చూపించాడు.
    "గుండీ దొరికిందా? మరి నాకు చెప్పలేదేం?"
    "సమయం వచ్చినప్పుడు తెబుతామనుకొన్నాను అసలు నువ్వేకని పెడతావనుకొన్నాను.
    "ఇది మరి బాగుంది. ఆ గుండీ సంగతి నాకు తెలియందే...."
    "ఆగవయ్యా అద్వయితం.నిన్న కమలాంబ ఇంట్లో జరిగిన సంభాషణ  ఒకసారి గుర్తు చేసుకో", అన్నాడు  విజయ్.
    ఇన్ స్పెక్టర్ ఆలోచనలో  పడ్డాడు.
    "అవునోయ్. రమణరావు మూడు గుండీల గొలుసులో రెండే ఉన్నాయన్నావుగదూ? అప్పుడు అతడు  కాస్త ఖంగుతిన్నట్టుఅన్పించింది." ఆలోచిస్తూనే అన్నాడు అద్వయితం.
    "ఆ తర్వత?"
    "ఆ తర్వాత.....నేను ఆ గుండీ గొడవ అంతగా పట్టించుకోలేదు ఈ గుండీల గొడవతో సమస్య మరీ చిక్కుపడి పోయింది గదయ్యా?" నీరుకారిపోతూ అన్నాడు అద్వయితం.
    "అదేం?"
    "హంతకులుగా అనుమానితుల లిస్టులో మరొకడు పోయాడు."
    "అదెవారు?"
    "రమణరావు" అన్నాడు అద్వాయితం.
    "మంచిదేగా? అనుమానితుల లిస్టు తయారుచేస్తాం. క్రమంగా  ఒక్కొక్క పేరే ఎలిమినేట్ చేస్తూపోతే హంతకుడు మిగిలిపోతాడు" అన్నాడు విజయ్.
    "ఈ గుండీ రమణరావుదనా నీ అనుమానం?"
    "కాదు."
    "మరి?"
    "శంకర్రావుది. గుర్తులేదూ?" అతడు డ్రెస్ చేసుకొని కింద కొచ్చాడు.
    "అవునవును. నువ్వు మీ గుండి ఒకటిపోయినట్టుందే అన్నావ్. దాంతో అతడు గాభరాపడి ఎక్కడో  పోయింది అంటూ చరాచర బయటికి వెళ్ళిపోయాడు. అవునా?"
    "అవును!"
    "ఇంకా అనుమానం ఎందుకు? వాడ్ని కూడా లోపల పెట్టెస్తాను. ఇవ్వాళే ఇద్దర్నీ  పట్టేస్తాను."
    "అంత పని చెయ్యకు. శంకర్రావు విషయంలో మరికొంత సమాహారం సేకరించాలి" అన్నాడు విజయ్.
    "ఓ.కే."
    "సార్! డి.సి .పి. గారి ఫోన్" అన్నాడు కానిస్టేబుల్.
    అద్వయితం ఫోన్  అందుకొన్నాడు.
    "నమస్కారం సార్! సార్ ! సార్! ఈ రాత్రికీ రామకృష్ణను హత్యచేసిన వాడినిపట్టుకొబోతున్నాను. అలాగే సరే, ఇప్పుడె  వస్తున్నా." రిసీవర్  పెట్టి చివ్వున లేచి నిల్చున్నాడు ఇన్ స్పెక్టర్.
    "విజయ్, డి.సి.పి. నన్ను అర్జెంటుగా రమ్మన్నాడు. నిన్ను ఎక్కడ డ్రాప్ చెయ్యమంటావ్?"
    "నువ్వెళ్లు నేను ఆటోలో వెళ్తాలే" అన్నాడు విజయ్.
                                           11
    రాత్రి 9గంటలు దాటింది
    ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకొస్తున్నాయ్.
    విపరీతంగా గాలి వీస్తోంది.
    మధ్య మధ్య మెరుపులు,
    విజయ్ ఇంకా ఇళ్ళు చేరలేదు.
    "అన్నయ్యా!"
    "ఏమిటమ్మా!" సునంద ఆడగబోయేది గ్రహించాడు నరేంద్ర.

 Previous Page Next Page