చాయ కళ్ళెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లోని కోరిక ఆమెకు చురుక్కున గుచ్చుకుంది.
"కిరణ్..... ఇప్పుడు కాదు...." అన్నమాట పూర్తవకుండానే ఆమె గాల్లోకి లేచింది.
"ఏయ్....ఏమిటిది? వదులు!" అని గింజుకుంటున్న ఆమెని కిరణ్ భుజంమీద వేసుకుని బెడ్ రూమ్ లోకి తీసికెళ్ళాడు.
ఆ గది మొత్తం పూలతో అలంకరించబడి వుంది. అక్కడున్న డబుల్ కాట్ బెడ్ మీద గులాబీ రేకులతో ఏర్పాటుచేసిన పక్క ఆమెను ఆకర్షించింది. గులాబీ రేకుల మధ్య కావాలని వదిలేసిన స్థలం 'చాయ లవ్స్ కిరణ్' అన్న అక్షరాలను చూపెట్తోంది.
ఆ గది మొత్తం కాంక్షా గంధాలతో నిండిపోయినట్లుగా అదోరకమయిన మత్తయిన గుబాళింపు నిస్తోంది.
కిరణ్ ఆమెను దబ్బున మంచంమీద పడేశారు.
"ఆఁ!" అని అరిచింది చాయ. తన నడుం పుటుక్కుమని విరిగిపోయే వుంటుంది అని కళ్ళు గట్టిగా మూసుకుంది. కానీ నాథ ఎత్తునుంచి పడినా ఆమెకేం కాలేదు. మెత్తని ఫోం పరుపుమీద పడగానే రబ్బరులా మళ్ళీ పైకి లేచింది.
"వావ్" అంది పరమ ఆశ్చర్యంగా.
"చాయా! ఐ లవ్ యూ" కిరణ్ ఆత్రంగా ఆమెను అల్లుకుపోతూ అన్నాడు.
చాయ గుండెలమీదున్న దుప్పటి ఎగిరెళ్ళి నీలంరంగు బల్బుకళ్ళు మూసింది.
ఆ మసక చీకటిలో సైతం ఆమె సౌందర్యం కోటి ప్రభలై వెలిగిపోతుంటే, అతని కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఆ సౌందర దేవతని మొదటగా ఎక్కడ స్పృశించాలో, ఏ చోట ముద్దు పెట్టుకుంటే తన పెదవులు తనమీద అలుగుతాయో అని తేల్చుకోలేని సందిగ్దావస్తలో పడ్డాడు.
"ప్చ్....." గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు ఆమె అరికాళ్ళల్లో.
ఆ తర్వాత తన ముఖాన్ని కాస్త పైకి జరుపుతూ వచ్చాడు. ఎన్నో మైళ్ళు ప్రయాణించాల్సిన బహుదూరపు బాటసారిలా వున్నాడతను.
'ఐ హేవ్ టు గో మెనీమైల్స్......బిఫోర్ ఐ స్లీవ్' అన్న రాబర్ట్ ఫ్రాస్ట్ గుర్తుకొచ్చినట్లున్నాడు. వేగం పెంచి ముందుకు రాబోయాడు.
"నాకు భయం" అతని భుజాలని గుచ్చి పట్టుకుని అంది చాయ.
కిరణ్ ఆమె మాటల్ని పట్టించుకోనట్లు కొట్టిపారేస్తూ "మొదటిసారి అలాగే వుంటుందిలే" అన్నాడు.
"నాకు భయం హాస్పిటల్ అంటే" ఈసారి కొంచెం గట్టిగా అంది చాయ.
ఆమె గుండెలమధ్యనుంచి తలఎత్తుతూ విస్మయంగా చూసాడు కిరణ్.
"ఔను! హాస్పిటల్ బెడ్ మీద పడుకుని సీలింగ్ వంక చూస్తూ ఆ కత్తెర చప్పుడూ, నర్సుల సూటీపోటీ మాటలూ వినడం చాలా భయంకరంగా వుంటుందని మేరీ చెప్పింది. పైగా.....ఆ మందుల వాసనంటే నాకు పరమ అసహ్యం. ఆ పరిస్థితి రాకూడదనే అది తెచ్చాను..... బ్యాగ్ లో వుంది" అంది.
ఆ ఇరవయ్యవ శతాబ్దపు కన్నెపిల్ల..... తన ప్రథమ సంగమపువేళ.....పురుషుడితో పలికిన పలుకులు విని ఒక్కక్షణం నివ్వెరబోయినట్లుగా నిలబడిపోయింది ప్రకృతి.
విస్తుబోయినట్లుగా చూసిన విశ్వం 'అదంతేలే" అని వెంటనే సర్దుకుంది.
'తప్పేం వుంది. కొన్ని రోజుల తరువాత అనాల్సిన మాట ఇంకాస్త ముందుగా అంది అంతేగా?' అనుకుంది హడావుడిగా పరుగులు పెడుతున్న కాలం.
కిరణ్ ఆమె చెప్పిన వస్తువుకోసం ఆమె బ్యాగ్ అందుకున్నాడు.
* * *
వాన కురుస్తోంది.
కారు తారురోడ్డుమీద జారిపోతున్నట్లుగా దూసుకుపోతోంది.
"చాయా! మనం త్వరగా పెళ్ళి చేసుకుందాం" అన్నాడు కిరణ్.
విండోలోంచి బయటికి చూస్తూ ఏదో పాత సన్నగా హమ్ చేస్తున్న చాయ వులిక్కిపడి చూసింది.
"అవును చాయా! మనం త్వరలో పెళ్ళి చేసుకోవాలి" సీరియస్ గా చెప్పాడు కిరణ్.
"ఎందుకు"? కళ్ళు ప్రశ్నార్ధకంగా పెట్టి అడిగింది చాయ.
ఆ ప్రశ్న ఊహించనట్లు కిరణ్ కొద్దిగా తెల్లబోయి అంతలోనే సర్దుకుని "గెస్ట్ హౌస్ లో జరిగిందానికి..... నేను..... నేను" అన్నాడు.
చాయ విసుగ్గా చూస్తూ "దానికి మన పెళ్ళికి ఏమిటి సంబంధం" అంది.
కిరణ్ కి వెంటనే ఎం అనాలో తోచలేదు. అంతగా సంభ్రమానికి లోనయ్యాడు.
"చాయా! నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? దానికి..... దానికి నువ్వు ఏమీ ఇంపార్టెన్స్ ఇయ్యవా?" అన్నాడు.
"ఎందుకు ఇవ్వనూ? అందుకేగా నీకు కండోమ్ ఇచ్చిందీ, పెళ్ళికి ముందు గర్భాలు, ఎబర్షనులు నాకు ఇష్టంలేదు" అంది.
అతను వెంటనే కారు ఆపేశాడు. ఆమె భుజాలను గుచ్చి పట్టుకుని "ఏమిటలా ప్రతిదాన్నీ తేలిగ్గా తీసిపారేసినట్లు మాట్లాడతావు? నీకేం ఫీలింగ్స్ లేవా? మనం ఇద్దరం శారీరకంగా ఒకటయ్యాం. మానసికంగా, సామాజికంగా కూడా ఒకటవ్వాలనీ, పెళ్ళి చేసుకోవాలని నీకు అనిపించడం లేదా?" అని అరిచాడు.
"ముందు వదులు" అతన్ని విదిలించుకుంటూ అంది చాయ.
"ఏం అడిగావు? నాకు ఏమీ అనిపించడంలేదా అనా? అనిపిస్తోంది. బలంగా అనిపిస్తోంది. పెళ్ళి చేసుకోబోయేముందు నా భర్త తన కాళ్ళమీద తాను నిలబడి వున్నవాడయితే బావుండుననిపిస్తోంది. ఎవరో విసిరిన రొట్టె తుంపుల కోసం ఆశగా తోక ఊపుతూ ఎదురుచూసేవాడు కాకూడదని అనిపిస్తోంది. భార్య కోరిన ఏ కోరికకూ వెంటనే సమాధానం ఇవ్వలేక రూంలో కూర్చుని బడ్జెట్ లెక్కలు చూసుకునేవాడు దొరకకూడదని అనిపిస్తోంది. ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికీ కదిలిపోయేవాడు, కంటతడి పెట్టేవాడు అస్సలు కాకూడదని గట్టిగా అనిపిస్తోంది.
ఆ చివరి మాటకి కిరణ్ ముఖం తిప్పుకున్నాడు. జేబులోంచి కర్చీఫ్ తీసి కళ్ళల్లో ఉబికిన నీరు తుడుచుకుని తిరిగి కారు డ్రైవ్ చేయసాగాడు.
ఆకాశాన్ని ఎవరో ఘోరంగా అవమానించే వుంటారు. గుండె చెరువయ్యేలా భోరుమని ఏడుస్తోంది.
"మామూలు ఆడపిల్లలా ఎందుకు ఆలోచించవు చాయా?" బాధగా అడిగాడు.
"నేను మామూలు ఆడపిల్లను కాదు కాబట్టి" ఠక్కున జవాబిచ్చింది.
ఇంగితంతో కూడిన ఆశ, ఆశయం! మూర్ఖత్వంతో కూడినది అవుతుంది.
ఆ చీకట్లో ఆమె ముఖంలోని భావాలని పట్టుకోవాలని ప్రయత్నించి కిరణ్ ఓడిపోయాడు.
"నువ్వు అందర్లా మామూలు ఆడపిల్లవే చాయా! కానీ నువ్వు చాలా ప్రత్యేకంగా సృష్టించబడ్డ దానివని అమాయకంగా నమ్ముతున్నావు. ఒక అసత్యాన్ని సత్యంగా పదిసార్లు ప్రచారంచేస్తే జనం మమ్ముతారు. కానీ అది అసత్యం అని .