భవిష్యత్ భారతం
ఆయన పేరు చంద్రయ్య. వయసు రెండు వందల వేల సంవత్సరాలు దాటింది. వృద్దాప్యంతో ముడతలు పడిన శరీరం కాదు ఆయనది.... కండలు తీరిన దృడ కాయం. కుళ్ళిపోయిన వంకయాలా మారిన మొహం కాదాయనది... నిగనిగలాడుతున్న చెంపలు,గుబురుగా పెరిగిన మీసాలు.... గంబీరంగా హుందాగా ఉన్నాడు.
ఆరంతస్తుల భవనం....బెడ్ రూమ్ కి అనుకున్న ఉన్న చిన్న బాల్కనీ లో రివాల్వింగ్ చెయిర్ లో కూర్చున్నాడు. అయన చేతిలో లాప్ టాప్ ఉంది. సీరియస్ గా లాప్ టాప్ లో ఏదో పనిచేసుకుంటున్న అయన లాల్చీ జేబులోంచి సెల్ ఫోన్ మోగడంతో , జేబులోంకి చేయి పెట్టి, ఫోన్ తీసి, ఓ బటన్ నొక్కాడు...అయన మొహంలో ఆనందం వెల్లివిరిసింది.
"హలో! సూర్యారావు ...హహ్వార్యూ! ఏంటి ఇవాళ అలా ఉన్నావు.... కలర్ బాగా తగ్గిపోయావు... డార్క్ అయ్యావు.... ఎంచేత? ఐసీ.... అంటే భూమ్మీద పొల్యూషన్ అంతగా పెరిగిందన్న మాట. ఒకే.... నేను ఫేస్ మాస్క్ పంపిస్తాను వాడు.... ఏంటి? రాకెట్స్ కావాలా? పిల్లలు అక్కడ స్కూళ్ళ కు రోజు విడిచి రోజు వేడుతున్నారా? ఎందుకని? ట్రాఫిక్ దాటి వెళ్ళేటప్పటికీ పన్నెండు గంటలు పడుతోందా? ఓ గాడ్....' సెల్ ఫోన్ లాల్చీ జీబులో పెట్టుకుని, తిరిగి లాప్ టాప్ లో తన ఆఫీసు వర్కు చేసుకోసాగాడు.
రెండు వందల వేల సంవత్సరాల చంద్రయ్య పాతిక సంవత్సరాల కుర్రవాడిలా హుషారుగా, బలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. శాస్త్రజ్ఞులు కనిపెట్టిన ఆధునిక జెనోమ్ పద్దతి ద్వారా అయన తన యవ్వనాన్ని జయించాడు.
ఆఫీస్ ఫైల్స్ చూడడం పూర్తీ కాగానే, ఇంటర్ నేషనల్ గా ఏఏ దేశాల్లో ఎంత టెక్నాలజీ కనుక్కున్నారు.... ఎంత ఆధునికంగా పరిజ్ఞానం సాధించారు.... అన్న విషయాలను అయన ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్నాడు. అంతలో ఆయనకి దాహం వేసింది.
చేతి కందుబాటులో ఉన్న స్విచ్ నొక్కాడు. కొన్ని నిముషాలకు ఏదో మిషన్ తిరుగుతున్న ధ్వని వినిపించింది. జర, జరలదుతో ఓ రోబో వచ్చి అందమైన జార్ లోంచి ఒక టాబ్లెట్ తీసి అయన నోట్లో వేసింది.
అయన ఆ టాబ్లెట్ చప్పరిస్తూ థాంక్యూ అన్నాడు రోబోట్ మళ్ళీ జర జరలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది.
ఇంతలో ఇరవై ఏళ్ళ కుర్రవాడు పరిగెత్తు కొచ్చాడు. వయసు ఇరవై అయినా వాడు పదేళ్ళ పిల్లవాడిలా ఉన్నాడు. వాడి ఒంటి మీద స్కూలు యూనిఫాం ఉంది. ఆ యూనిఫాం వ్యోమగాములు అంతరిక్షం లోకి వెళ్ళబోయే ముందు వేసుకునేదిగా ఉంది. వాడు వస్తూనే, "హాయ్ గ్రాండ్ పా....' అని పలకరించాడు.
అయన లాప్ టాప్ లోంచి తలెత్తి చిరునవ్వుతో ఆ కుర్రవాడిని చూసి "హలో! ఆర్మ్ స్ట్రాంగ్ ....హహ్వార్యూ!' అని పలకరించి , "ఏంటి బాబూ! అలస్యమైందే" అని అడిగాడు.
"ఏం చేయను? రాకెట్ ఎంతసేపటికి రాలేదు. చాలాసేపు వెయిట్ చేశాను...." అంటూ గోడకున్న స్విచ్ నొక్కాడు.
లోపల్నించి రోబోట్ జరజరా వచ్చి కుర్రవాడి కాళ్ళ కున్న షూస్ తీసింది. డ్రెస్ మార్చి, మామూలు లాగూ, చొక్కా వేసింది. జార్ లోంచి టాబ్లెట్ తీసి కుర్రవాడి నోట్లో వేసి, మళ్ళీ లోపలికి వెళ్ళింది. రెండు నిముషాల్లో పేపర్ ప్లేటు లో ఫ్రూట్స్, తెచ్చి కుర్రవాడికిచ్చింది. అతను అక్కడే ఉన్న మరో కుర్చీలో కూర్చుని ప్లేటు కుర్చీ కున్న చెక్క మీద పెట్టాడు. కుర్చీకి ఎడం చేతి పక్క నున్న మీట నొక్కాడు. ప్లేటు లో ఉన్న జీడిపప్పు లాంటి గింజలు ఒక్కొక్కటి ఆ కుర్రవాడి నోట్లో కి వెళ్తున్నాయి.
"ఐయామ్ వెరీ మచ్ టైర్డ్ గ్రాండ్ పా.... నాకు సపరేట్ గా ఓ రాకెట్ కొనివ్వండి. స్కూలు రాకెట్లో వెళ్ళి రాలేను. రాకెట్ సమయానికి రాదు. వచ్చినా హెవీ ట్రాఫిక్ లో చిక్కుకుపోయి.... త్వరగా ఇంటికి చేర్చదు. ఐవాంట్ మై ఇండివిడ్యువల్ రాకెట్..."
"ష్యూర్ బాబూ! రేపే అమెరికా నుంచి రాకెట్ తెప్పిస్తాను. ఆ ... ఇవాళ స్కూల్లో ఏం చెప్పారు బాబూ! ఎనీ న్యూ లెసన్" ఆ మాట వినగానే ఆ కుర్రవాడు కుర్చీలోంచి లేచి గట్టిగా నవ్వి, తిరిగి కుర్చీలో వాలి, పడీపడీ నవ్వసాగాడు. అతని నవ్వు చూసి అయన కంగారుపడి పోతూ చటుక్కున గోడ కున్న స్వేచ్ నొక్కాడు. జరజరా రోబోట్ వచ్చింది.
"చూడు.... బాబూ నవ్వి నవ్వీ అలిసిపోయాడు.... నువ్వేం చేస్తున్నావక్కడ? చూస్తూ కూర్చోక పొతే , సాయం చేయవచ్చుగా..."
"సారీ సర్ ...." రోబోట్ గరగరమంటూ శబ్దం చేసి అపాలజీస్ చెప్పింది. మరుక్షణం లో రోబోట్ నుంచి భయంకరమైన ధ్వని రాసాగింది.
ఆ కుర్రవాడు చటుక్కున నవ్వాపేసి, "స్టాప్....స్టాప్....స్టాపిట్...." అంటూ అరిచాడు. రోబోట్ టక్కున ఆగిపోయింది.
"వాటీజ్ దిస్ గ్రాండ్ పా.... నా బదులు రోబోట్ నవ్వడం ఏంటి? రేపట్నించీ పుడ్ కూడా నా బదులు రోబోట్ తింటుందా?" అడిగాడు రోబోట్ వికృతంగా మొహం పెట్టింది.
"నువ్వు అలసిపోతావని" అంటూ నసిగాడాయన.
"సోవాట్....యుకేన్ గో...." చిరాగ్గా రోబోట్ వైపు చూశాడా కుర్రాడు . రోబోట్ లోపలి కెళ్ళిపోయింది.
"ఇంతకీ ఎందుకంతగా నవ్వావు?' అడిగాడాయన.
"ఏం లేదు గ్రాండ్ పా... ఇవాళ మా స్కూల్లో చాలా చిత్రమైన సంగతి చెప్పారు. కొన్ని శతాబ్దాల క్రితం మనుషులంతా దాహమేస్తే మంచినీళ్ళు తాగే వాళ్లంట.... పైగా ఏవో జబ్బులు వస్తే మనుషులు చనిపోయేవారట.... ఏమిటో వర్షాలు కురిసేవని చెప్పారు....అసలు వర్షం అంటే ఏమిటి గ్రాండ్ పా?"
అయన గుబురు మీసాల చాటున గుంభనంగా నవ్వాడు. "సో! మీకివాళ చరిత్ర చెప్పారన్న మాట....గుడ్....వెరీ గుడ్....తెలుసుకోవాల్సిందే...."
"అది సరే....మంచి నీళ్ళెంటి? మనుషులు చనిపోవడం ఏమిటి? వర్షాలంటే ఏమిటి? నాకేం అర్ధంకాలేదు. పైగా అప్పట్లో అందరూ బస్సులు, ఆటోలు, కార్లు ట్రాన్స్ పోర్టు గా వాడేవారట. నాలాంటి పిల్లలను స్కూలుకి తీసుకెళ్లడానికి రాకెట్స్ బదులు ఆటోలు వచ్చేవిటగా.... అవి భూమ్మీదే, రెండు అడుగుల ఎత్తున తిరిగేవట, చాలా ఫ్రీక్వెంట్ గా యాక్సిడెంట్స్ అయ్యేవట...అబ్బ! రియల్లీ ఇట్ వజ్ వెరీ ఎగ్జయిటింగ్ ...ఐ వాంట్ టు నో అబౌట్ వర్షం..."
"చెప్తాను....బాబూ! ఒకప్పుడు భూమ్మీద వేడికి సముద్రం లో నదుల్లో చెరువుల్లో నీరంతా ఆవిరిగా మారి, ఆకాశంలో మేఘాలుగా ఏర్పడుతుండేది. గాలికి ఆ మేఘాలు ఒకదాన్ని ఒకటి డీ కొని, వర్షాన్ని కురిపించేవి. ఆషాడ మాసం అని ఒక తెలుగు మాసం ఉండేది. అ మాసాన్ని వర్షాకాలం అంటారు. అంటే ఆ మాసం నుంచీ వర్షాలు కురవడం ప్రారంభమై మూడు నెలల పాటు కురుసేవి. రైతులని ఉండేవాళ్ళు...పాపం వాళ్ళంతా ఏవో విత్తనాలు అంటూ తీసుకెళ్ళి ఫేల్డ్స్ లో చల్లేవాళ్ళు.... ఆ విత్తనాలు వాన చినుకులకి మొలకెత్తడం ప్రారంభించి, వర్షాకాలం పూర్తీ అయ్యే ;లోపల ఏపుగా ఎదిగి, చలికాలానికి కాపు కొచ్చేవి. అంటే ఆ విత్తనాల ద్వారా పుడ్ గ్రెయిన్స్ తయారుచేయడానికి రైతులు కష్టపడే వాళ్ళు.... వాళ్ళని ఫార్మర్స్ అంటారు.... ఎంతో ఎఫర్త్స్ చేసేవాళ్ళ. వాళ్ళు కేవలం వర్షాల మీద ఆధారపడి బతికేవాళ్ళు.... కానీ పాపం కొంతకాలం గడిచాక వాతావరణం కాలుష్యం ఏర్పడి వర్షాలు పడలేదు..."