Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 11

 

    "మా నాన్నగారు గుర్తొస్తున్నారు" అంది సృజన ఏడుపు గొంతుతో.
    "మా నాన్నగారు కూడా నీ అంత పొడుగ్గా ఉంటారు"
    "స్సీనీయవ్వ! నన్ను సూత్తే నీ నాన్న గుర్తురావడమేందే! నన్ను సూత్తే సినీయాట్టరు నాగేస్సర్రావు గుర్తురావడలేదూ? ఈరోలా ఉంటానే నేను! నువ్వు నా ఈరోయిన్ వి అవునాక్కాదా?"
    "ప్లీజ్! నాకు భయంగా ఉంది! నన్ను పంపించేయ్! ప్లీజ్! ప్లీజ్!"
    "అహె! నోర్ముయ్యమంటూంటే!" అంటూనే ఆమె మీదికి ఒరిగాడు రాఘవులు.
    ఆబరువుకి వంట్లోని ఊపిరి అంతా బయటికి వచ్చేసినట్లు అనిపించింది సృజనకి.
    ఆ తర్వాత తనని నిలువునా కత్తితో చీల్చేస్తున్నట్లు వర్ణింపశక్యం కాని బాధ.
    "హ్ మ్మా!" అని దిక్కులు పిక్కటిల్లేలా గావుకేకపెట్టింది సృజన. వెంటనే ఆమెకి స్పృహ తప్పిపోయింది.
    నిమిషాలు గడిచాయి. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి.....
    రాఘవులు మొహం తన మొహానికి అతి దగ్గరగా కనబడింది. బెదిరిపోయి కేకవెయ్యబోయిన సృజన పెదిమలని అతని పెదిమలు నొక్కేశాయి.
    తర్వాత మెల్లిగా దూరంగా వెళ్ళిపోయింది, రాఘవులు మొహం.
    మళ్ళీ వెంటనే దగ్గరయింది.
    మళ్ళీ దూరం.
    మళ్ళీ దగ్గర, మళ్ళీ దూరం.
    వంట్లోని ప్రతి ఎముకా, ప్రతికీలూ విరిగిపోతున్నట్లు అనిపిస్తోంది సృజనకి. ప్రతినరం తెగిపోతున్నట్లూ ప్రతి కండా కోసివేయబడుతున్న వరింప శక్యం కాని బాధకలుగుతోంది. కళ్ళలో నీళ్ళు పడి చూపులు మసగ్గా అయిపోయాయి.
    ఆకన్నీటి పొరలోనుంచి దగ్గరగా కనబడుతోంది రాఘవులు మొహం దగ్గరవుతోంది దూరమవుతోంది.
     క్రమంగా శారీరక బాధకు అతీతమైన స్థితికి చేరుకుంది సృజన. మనసుపడే బాధే తెలుస్తోంది గానీ శరీరం పడుతున్న బాధగమనానికి రావడం లేదు. మెల్లిగా కళ్ళలోని నీళ్ళు ఇంకిపోయాయి. ద్వేషం తాలూకు తీక్షణతో.
    అస్పష్టంగా తెలుస్తోంది ఆమె లేత మనసుకి.
    జరగరానిది ఏదో జరిగిపోయిందనీ, ఇంకఇకముందు తన జీవితం అందరి జీవితాల్లాగా సక్రమంగా జరిగిపోవడం కుదరదనీనూ! పసితనంలోనే తన జీవితం మసి అయిపోయిందన్న భావన కలిగించిన కసి. రాఘవులుకి అతని కోర్కె వలన కలిగిన కసికంటే కనీసం కోటి రెట్లు తీవ్రంగా ఉంది. కసి కసిగా సృజన వైపు చూస్తున్నాడు రాఘవులు. అంతకంటే కసిగా అతని మొహంలోకే చూస్తోంది సృజన. భూతద్దంలో భూతంలా కనబడుతోంది అతని మొహం. అతని మొహంలోని ప్రతిరేఖనూ, ప్రతివంపునీ ఎత్తుపల్లాలనీ కత్తిగాటు నీ, మొటిమలవల్ల ఏర్పడ్డ గుంటలనీ, ఆజన్మాంతం గుర్తు ఉంచుకోవడం కోసం అన్నట్లు నిర్నిమిషంగా, తీక్షణంగా చూసింది సృజన.
    తలుపు దడదడ చప్పుడయింది. బండ తిట్లతో విసుక్కుని, లేచాడు రాఘవులు. తలుపు వెనక జాన్ నిలబడి ఉన్నాడు. అతని పక్కన పదమూడేళ్ళ పిల్ల. ఆమె చేతులు విరిచిపట్టుకుని ఉన్నాడు జాన్.
    "నువ్వు నాకు మాంచి సారా తేవాలిబ్రెదరూ! నీకు కూతురుపుట్టిందిట! మీ ఊరినుంచి మునుస్వామివచ్చి చెప్పాడు" అన్నాడు జాన్.
    "ధూత్తెరికీ! కూతుర్నే కన్నదీ శనిముండ? వద్దే అని చెప్పినా వినిపించుకోలేదన్నమాట!" అన్నాడు రాఘవులు తిక్కగా.
    "ఈడికోసం జూడు! శాస్త్రప్రకారంపోతే ఎవురికో కుక్క పిల్లలు పుట్టాయట! అట్టాగే ఉంది నీ వరస! మొగాడేపుడతాడో, ఆడదే పుడుతుందో అది మనచేతిలో ఉందిటయ్యా రాఘవులూ!" కళ్ళు మూసుకుని వింటోంది సృజన. వాళ్ళు మాట్లాడుతున్న అన్ని మాటలలోనూ ఒకే ఒక్క వాక్యం ఆమె చెవుల్లోగింగురుమనడం మొదలెట్టింది.
    రాఘవులుకి కూతురు పుట్టింది!
    రాఘవులుకి కూతురు పుట్టింది!
    రాఘవులుకి కూతురు పుట్టింది!
    ఆమె మనసు ఆ విషయాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకుంది.
    "ఈపిల్లెవరు?" అంటున్నాడు రాఘవులు.
    "ఇంకెవరు? టీచరమ్మగారి అమ్మాయి కామాక్షి!"
    "ఎట్టా అయితేనేం ఎత్తుకొచ్చావన్నమాట! ఉండోల్సినవాడివిలే!"
    "వస్తావస్తా అహల్య కాడికెళ్ళి బేరం కూడ కుదుర్చుకొచ్చా! రెండేల ఐదొందలు! నీకంత కంటే చిల్లిగవ్వకూడా ఎక్కువ రాదు. ఒప్పేసుకో రాఘవులు!"
    "నేనొప్పేసుకుంటే నీకు దక్కే కమీషనెంతో!" అని జనాంతికంగా అని "అట్టాగే కానియ్! ఇంక జెప్పెదేముంది!" అన్నాడు రాఘవులు.
    "ఎత్తుకురానయితే ఎత్తుకొచ్చాంగానీ ఈళ్ళని అహల్య కొంపకు జేర్చేదెలా? పోలీసులు గడబిడచేస్తున్నట్లున్నారే!" అన్నాడు జాన్.
    కాసేపు ఆలోచించాడు రాఘవులు.
    "ఆటోడ్రైవరు నవాబు ఉంటేశానా బాగుండేది"
    "ఆడులేడుకదా!"
    "మరయితే ఇక రిచ్చాలో ఏస్కోనిపోవాల!"
    "తేలిగ్గా చెపుతున్నావేబాయబ్బా! అందరూ చూడరేంది?"
    "గోనెసంచుల్లో కుక్కి అంజయ్య రిచ్చాలో ఏస్కెళ్తే సరి!"
    అప్పుడు సృజనవైపు చూశాడు జాన్. తర్వాత నవ్వు మొహంతో రాఘవులువైపు తిరిగాడు.
    "నీ అసాజ్జెం గూల! ఫినిష్ చేసేశావన్న మాట!"
    సిగ్గుపడుతున్నట్లు ఇకిలించాడు రాఘవులు.
    తర్వాత వాళ్ళు ఇద్దరూ కలిసి ఆ ఇద్దరు ఆడపిల్లల నోళ్ళలో టైట్ గా గుడ్డలుకుక్కారు. రెండు గోనెసంచులు తెచ్చాడు జాన్. ఇద్దరినీ చెరొక బస్తాలో అమానుషంగా దింపి సంచులుమూతలు నులకతాటితో కట్టేశారు.
    అంతలో అంజయ్య రిక్షా తలుపుదగ్గరికి వచ్చి ఆగింది.
    "అదేమిటి?" అన్నాడు జాన్, ఆగిపోయి, సృజన ఉన్న గోనెసంచివైపు చూస్తూ.
    రాఘవులుకూడా అటువైపు చూశాడు.
    సృజన ఉన్న గోనె సంచిమీద ఎర్రటి దాగుపడి ఉంది. నెమ్మదిగా వ్యాకోచిస్తోంది అది.
    రాఘవులు జాన్ భయంగా మొహామొహాలు చూసుకున్నారు.
    రాఘవులుకి వళ్ళంతా చెమటలుపట్టింది.
    "అయిందేదో అయింది! రిచ్చాలో ఏసుకుని అహల్య ఇంటికెళ్ళి పోదాం! నోరెత్తకుండా ఏం చేస్తే అది చేసేడాక్టర్లు ఆమెకాడ ఉంటారు" అన్నాడు జాన్.
    తల ఊపాడు రాఘవులు.
    ఆడపిల్లలు ఉన్న రెండు గోతాల నీ రిక్షాలోకి సామాను ఎక్కించినట్లు ఎక్కించారు. వాళ్ళ శరీరాలు సగం సీటుమీదా, సగం కాళ్ళు పెట్టుకునే చెక్కమీదా ఉన్నాయి. సీటు అంచు వాళ్ళపక్క టెముకలని నొక్కేస్తోంది.
    రిక్షా కదులుతుండగా మళ్ళీ స్పృహ తప్పిపోయింది సృజనకి.
    గోనెసంచిమీద ఎర్రడాగు మరింత పెద్దదయింది.
    ఎవరివో మోటు చేతులు తనని సున్నితంగా తాకుతుంటే నెమ్మదిగా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచింది సృజన.
    ఒక మొహం తనమీదికి ఒరిగి చూస్తోంది.
    ఉలిక్కిపడి మళ్ళీ కళ్ళు మూసేసుకుంది సృజన, కళ్ళు మూసుకుంటే ఆ మొహం మళ్ళీ కనబడకుండా అదృశ్యమైపోతుందన్న భ్రమతో.
    ఎవరిదామొహం? రాఘవులుదా?
    కాదని చెబుతోంది మనసు.
    అప్రయత్నంగా మళ్ళీ కళ్ళు తెరిచింది సృజన.
    తనమొహంలోకే చూస్తోంది ఆ మొహం. చెవులకు రింగులు, ముక్కుపుడక, నుదుట పెద్దబొట్టు. నున్నగా షేవ్ చేసుకున్న గెడ్డం!
    బెదిరిపోయింది సృజన.
    పీడకల కంటోందా తను?
    కళ్ళు చిట్లించి చూసింది.
    ఎవరామనిషి?
    ఆడా? మగా?
    చీర, జాకెట్టూ---మెళ్ళో గొలుసులూ!
    "మెలకువొచ్చిందా పాపా?" అంది ఆమె.
    బండగా ఉన్న మగగొంతు!
    నోటెంబడి మాటరానట్లు చూస్తోంది సృజన.
    "నీకేంభయంలేదు! లేచి కూర్చో! ఇంద! ఇది తాగు!" అంది ఆమె వెండిగ్లాసులో ఉన్న ఒక ద్రవాన్ని సృజన నోటి దగ్గరికి తెస్తూ.
    ఆకుపచ్చటి ఆకుపసరులా ఉంది ఆ ద్రవం. వెగటు వాసన వస్తోంది.
    పెదిమలు బిగించి తల అడ్డంగా ఆడించింది సృజన.
    "తాగమంటే తాగాలి!" అంది ఆమె గద్దిస్తూ మళ్ళీ అంతలోనే సౌమ్యంగా అంది "నా పేరు రంగేలీ! నీ పేరేమిటి?"   

 Previous Page Next Page