Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 10

 

    "రండి!" అని భర్త చెయ్యి పట్టుకుని, పొరలి వస్తున్న దుఃఖం బయటపడకుండా పెదిమలు కొరికిపట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది జానకి. పక్కదులిపివేసి "పడుకోండి" అంది మృదువుగా.
    నిస్సత్తువగా పక్కమీదికి ఒరిగిపోయాడు రమణమూర్తి.
    జానకి కూడా పడుకుని, కప్పువైపు చూస్తూ ఆలోచించడం మొదలెట్టింది.
    ఒకగంట తర్వాత చటుక్కున లేచి కూర్చున్నాడు రమణమూర్తి. బయటముసురుగా వానపడుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. అందుకే వాన.....పిల్లలవైపు చూశాడు రమణమూర్తి ముడుచుకుని పడుకుని ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి జానకి కప్పిన రగ్గు చెదిరిపోయి ఉంది. రగ్గుసరిగ్గా కప్పాడు రమణమూర్తి తర్వాత ఇంకో రగ్గు తీసుకుని, తలుపు గడియ తీసాడు. ఆకొద్ది అలికిడికే కదిలింది జానకి, అయిదు నిమిషాల క్రితమే పట్టినమగత నిద్ర తెరలోనుంచి కొద్దిగా బయటికివస్తూ "ఎక్కడికి" అంది.
    "చలెక్కువగా ఉంది జానీ! సృజనకి రగ్గు కప్పివస్తా!"
    "ఊ!" అంది జానకి మళ్ళీ మగతలోకి జారిపోతూ.
    కానీ, అతను అన్న మాటకి అర్ధం కొద్దిసేపటితర్వాత మనసు కెక్కాక, ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుని తల విదిలించింది.
    "ఏమండీ!" అంది ఆదుర్దాగా.
    సమాధానం చెప్పడానికి రమణమూర్తి అక్కడలేడు!
    తొట్రుబడుతూ బయటికి వచ్చి చూసింది జానకి.
    హాలు తలుపు తెరచిఉంది. గేటూ బార్లా తెరిచే ఉంది.
    చెప్పులు ఉంచేచోట చూసింది జానకి. రమణమూర్తి చెప్పులు అక్కడే ఉన్నాయి. బూట్లుకూడా ఉన్నాయి.
    రమణమూర్తి ఎక్కడా లేడు!
    సృజనకి రగ్గు కప్పివస్తానని చెప్పిన రమణమూర్తి చెప్పులైనా వేసుకోకుండా వెళ్ళిపోయాడు!
    ఆతర్వాత అందరూ కలసివెదకడం మొదలైంది.
    ఈసారి రమణమూర్తి కోసం!


                                     4


    వాన ఉధృతమైంది.
    ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు రాఘవులు. అతని మెదడు దెయ్యాలు నడుపుతున్న కార్ఖానాలా ఉంది. ఒకదాన్ని మించిన భయంకరమైన ఆలోచన మరొకటిగా అతని మెదడులో రూపు దిద్దుకుంటోంది. ఆ కార్ఖానా తాలూకు పొగచిమ్నీలా కనబడుతోంది. అతను పెదిమలతో కొరికి పట్టుకుని కొద్దిగా పైకి లేపి ఉంచిన చుట్ట. మసక చీకటిని మరింత మసకగా చేస్తోంది ఆ పొగ.
    బయట ఎక్కడో ఒక బొదురు కప్ప బెకబెకమని అరుస్తోంది.
    ఆ నేపథ్యంలో సన్నగా వినబడుతున్నాయి సృజన వెక్కిళ్ళు.
    చిరాకుపడుతూ విసురుగా లేచి నిల్చున్నాడు రాఘవులు. చరచర దగ్గరకొచ్చి చాచి చెళ్ళుమని సృజన చెంపమీద కొట్టాడు.
    "నీయమ్మ! నీక్కాదా సెబుతోంది? ఇప్పుడేం పుట్టి మునిగిందనే నీ ఏడుపు? నరికి పోగులు పెడతా నస పెట్టావంటే! నా కోపం వస్తేనే మడిసిని కాను."
    అతను కొట్టిన దెబ్బకి తూలి విరుచుకు పడింది సృజన. ఆ పడడంలో ఆమె స్కూలు యూనిఫారం తాలూకు జాకెట్టు తలుపుకి ఉన్న ఒక పదునైన రేకుకి గుచ్చుకుని, కత్తితో కోసినట్లు సర్రునచిరిగిపోయింది. ఆగాడు రాఘవులు. అప్పుడే నవయవ్వనపు ఛాయలు అంకురిస్తున్న ఆమె ఛాతీవైపు కాసేపు కళ్ళార్పకుండా చూశాడు. కంగారుగా చేతులతో ఛాతిని కప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది సృజన.    రివ్వున చలిగాలి వీచింది. లేత అరిటాకులావణికింది సృజన. వంకరగా నవ్వాడు రాఘవులు. "సలిపెడుతోందా సుక్కా! ఒకసుక్కేసుకో! ఏడిగా, ఎచ్చగా ఉంటుంది. ఎల్లి పట్రా మంటావా?" బెదురుగా చూసింది సృజన. సిగ్గు దాచుకోవడానికి ఆ అమ్మాయి చేస్తున్న విఫల ప్రయత్నాన్ని కాసేపు వినోదంగా గమనించి, తర్వాత లేచి, తలకొక గుడ్డ చుట్టుకుని, దానిపైన ప్లాస్టిక్ షీట్ ఒకటి వేసుకుని, తలుపుకి తాళంపెట్టి, వెళ్ళిపోయాడు రాఘవులు. అతను వెళ్ళాక, ప్రయత్నపూర్వకంగా మనసుని స్వాధీనంలోకి తెచ్చుకుంది సృజన. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించడం మొదలెట్టింది.     తను చదివిన అడ్వెంచర్సు అన్నీ గుర్తు వచ్చాయి ఆ అమ్మాయికి.
    ఇలాంటి ప్రమాదంలో చిక్కుకుంటే అలైవ్ ఏమి చేసి ఉండేది? టామ్ సాయర్ ఏమి చేసి ఉండేవాడు? హకల్ బెర్రీఫిన్ ఏం చేసి ఉండేవాడు? వాళ్ళెవ్వరూ కూడా చేతులుకట్టుకుని ముడుచుకు కూర్చోరు. ఏదో ఒకటి చెయ్యాలి! తక్షణం! కానీ ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏమీ తట్టదేం? తలుపు తాళం తీస్తున్నచప్పుడైంది. గుండెలు గుబగుబ లాడాయి సృజనకి. రాఘవులు కంటే ముందు వచ్చింది అతను తాగిన మందువాసన! బయట తలుపు తాళం తీసినశబ్దం వినబడింది సృజనకు. ఆ తర్వాత గొళ్ళెం తీస్తున్న చప్పుడు వినబడింది. తట్టాలి! ఏదో ఒక ప్లాను తక్షణం తట్టాలి! టైం లేదు! చివరి క్షణం తాలూకు వెయ్యోవంతులో ఆమెకు తట్టింది ఏం చెయ్యాలో! ఒక్క ఉదుటున లేచి, అక్కడ పెట్టి ఉన్న పాత నీళ్ళ కూడా అందుకుంది. నీళ్ళతో నిండి బరువుగా ఉంది అది. దాన్ని రెండు చేతులతో ఎత్తి పట్టుకుని సిద్దంగా ఉన్న తలుపు పక్కన నిలబడింది. మెల్లిగా తెరుచుకుంది తలుపు. లోపలికి అడుగుపెట్టాడు రాఘవులు. బలం అంతా ఉపయోగించి కూజాని అతని తలవైపు విసిరింది సృజన. సరిగ్గా అతని తలవెనక భాగానికి తగిలింది కూజా. తగిలీ తగలడంతోటే భళ్ళున పగిలింది. పగిలిన పెంకులు చెల్లాచెదురుగా పడ్డాయి. అతి చల్లటినీరు వరదలా ఒక్కక్షణం పాటు అతని మొహాన్ని ముంచేసింది.
    కళ్ళలోకి పోయిన నీళ్ళని రెండుచేతులతో తుడుచుకుంటూ చెప్పలేనంత ఆశ్చర్యంతో సృజన వైపు చూశాడు రాఘవులు. తర్వాత అతని కనుగుడ్లు మెల్లిగా పై రెప్పలలోకి వెళ్ళిపోయాయి. తూలుతూ అడ్డదిడ్డంగా రెండు అడుగులు వేసి, దభేలుమని విరుచుకుపడిపోయాడు. ఆ తర్వాత ఇంక కదలలేదు అతను.
    తన అదృష్టాన్ని తనే నమ్మలేనట్లు కాసేపు అలాగే నిలబడిపోయి రాఘవులుని చూసింది సృజన. రొప్పుతూ సరిగ్గా ఊపిరందటం లేదు ఆమెకి. చలనం లేకుండా దుంగలాపడి ఉన్నాడు రాఘవులు. రొప్పుకాస్త తగ్గాక తన ఒంటివైపు చూసుకుంది సృజన. జాకెట్టు నిలువునా చిరిగి ఉంది. స్కర్టు పీలికలయిఉంది. అటూ ఇటూ చూసింది. పక్కమీద ఉండలా పడిఉన్న మాసిన గళ్ళ దుప్పటి కనబడింది. అది అందుకుని చుట్టూ కప్పేసుకుంది. రాఘవులు ఇంకా నిశ్చలంగా నేలమీదపడి ఉన్నాడు. గుండెలు గుబగుబలాడుతుండగా గబగబ తలుపు వైపు పరిగెత్తింది సృజన. గడప దాటితే చాలు! ఈ చెరలోనుంచి విముక్తి! కానీ, గడప దాటుతుండగా జరిగింది అది.
    మెరుపువేగంతో కదిలాడు రాఘవులు. రెండు చేతులుచాచి ఆమె కుడికాలిని మొసలి పట్టుకున్నట్లే పట్టేసుకున్నాడు. విహ్వలంగా కేకపెట్టింది సృజన. రాఘవులు చేతుల్లో ఆమె కుడి కాలు చిక్కుకున్నాడు మిగతా శరీరం పరుగుతాలూకు వేగంతో ముందుకుపోతూనే ఉండడంవల్ల విపరీతమైన ఫోర్సుతో కిందపడింది తను. భూమే ఎదురొచ్చి తన తలని ఢీకొన్నంత దెబ్బతగిలింది. లేచి నిలబడి పెద్దగా నవ్వాడు రాఘవులు.
    "నీఎత్తుకి చిత్తయిపోతాననుకున్నావు టేకుర్రముండా! నేను ఆంబోతులాంటి వాణ్ణి గనక బతికిపోయానుగానీ మరోవాడయితే పుచ్చెపగిలి ఊరుకుండేది కదా! ఓలమ్మా! ఇది ఆడది కాదురాబాబూ గాడిద!"
    కదలబోయింది సృజన. మడమదగ్గర వెయ్యి వోల్టుల షాక్ తగిలి నట్లయింది. పడటంలో కాలు బెణికింది అక్కడ. నిస్సహాయంగా అలాగే ఉండిపోయింది సృజన. బొప్పికట్టిన తలను తడుముకుంటూ మంటగా సృజన వైపు చూశాడు రాఘవులు.
    విసురుగా కింద పడటంలో సృజన కప్పుకున్న దుప్పటి తొలిగిపోయింది. అప్పుడు కనబడింది రాఘవులకి మొయిలుచూసి పురివిప్పిన నెమలి పింఛపు హొయలు లాగా! తొలకరి చినుకుల కీ పులకరించి పడమి పై మొలకెత్తిన మొలగొలుకుల పైరులాగా, పసితనం వీడి పసిడియవ్వనపు ప్రథమ ప్రాంగణంలోకి ప్రప్రథమంగా పాదం మోపుతున్న సృజన స్నిగ్ధనగ్న సౌందర్యం. ఆ పాపని ఆ స్థితిలో చూసిఉంటే ఇంకెవ్వరికయినా పాపం! అనిపించేది నిశ్చయంగా.
    కానీ రాఘవులుకి పాపం అనిపించకపోగా మహా పాపపుటాలోచనవచ్చినది. అప్రయత్నంగానే అతని ఎర్రటి నాలుక పామునాలుకలా నోటిలోనుంచి బయటకువచ్చి నల్లటి మొద్దు పెదిమలని తడిపేసింది. నెమ్మదిగా ఆమెవైపు రావడం మొదలెట్టాడు రాఘవులు.
    అది గమనించి అతి ప్రయాస మీద లేచి నిలబడింది సృజన. బెణికినకాలు ఈడుస్తూ దానివల్ల కలుగుతున్న యమబాధను సహిస్తూ పరిగెత్తబోయింది. దుఃఖంతో ఆమె పెదిమలు వణుకుతున్నాయి. కళ్ళు వర్షిస్తున్నాయి.
    సృజన ఆరాటాన్ని కొద్ది క్షణాలపాటు వినోదంగా గమనించాడు రాఘవులు. ఆమెని కొద్ది అడుగులు వెయ్యనిచ్చి తర్వాత వల్ల చిరతలా ఒక్కసారిగా లఘించి ఆమెని రెండు చేతులతో వాటేసుకున్నాడు. సారాతాలూకు మైకం, కోర్కె తాలూకు ఆవేశం అతన్ని నరరూప రాక్షసుడిగా మార్చేస్తున్నాయి. సృజనని దూది బొమ్మలా ఎత్తి సునాయాసంగా మంచంమీద పడేశాడు. నడుములు జారి పోయినట్లు అయింది సృజనకి. షర్టు గుండీలు విప్పుతూ అన్నాడు రాఘవులు. "ఎటో సూత్తావేమే! నా యేపు సూడవే! నన్ను సూత్తుంటే నీ కెవరు గుర్తొస్తున్నారు?"

 Previous Page Next Page