Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 11


    
    అద్దంలో కిందిపోయిన ఒళ్ళు మనోహరంగా కనిపిస్తోంది అమెకి.
    మెల్లగా తలుపు బోల్టు తీసింది.
    మునివేళ్ళతో తలుపు మీద కొట్టింది రమాదేవి.
    "అభినయ్!" అని మృదువుగా పిలిచింది.
    అంతసేపు కదలకుండా అక్కడే నించున్న అభినయ్ కళ్ళు, మెరిశాయి. అమె పిలుస్తోంది కాదు అహ్వానిస్తోంది.
    "లోపలకి రానా?" అన్నాడు నవ్వుతూ.
    అమె సిగ్గుతో ముడుచుకుపోయింది. తెచ్చిపెట్టుకున్న చిరుకోపంతో.
    "షటప్...." మంచంమీద టవల్ వుంది తెచ్చి  ఇవ్వవూ!" అడిగింది మురిపెంగా.
    "ఓ.కే." అని మంచం దగ్గరగా నడిచి టర్కీ టవల్ ని తీసుకున్నాడు అభినయ్.
    బాత్ రూం తలుపు దగ్గరకు నడిచాడు.
    "ఇదిగో" అన్నాడు.
    తలుపు కొద్దిగా తెరుచుకొంది.
    అమె చేతిని బయటకి పెట్టింది. మల్లెపువ్వు కాంతిలో తామర తూడులా వున్న  ఆ హస్తం, ముంజేయి... భుజం అక్కడ కూడా నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి.
    అతను తన్మయత్వంతో నిలబడిపోయాడు.
    అ చేతిని ముద్దాడాలి.
    "ఇవ్వు!" అంది మెల్లగా...జీరపోయింది గొంతు.....
    తలుపుకి అవతల స్నానాల గదిలో రమాదేవి.
    ఇటుపక్క అభినయ్.
    ఇద్దరిలోనూ అస్పష్టమైన భావాలు... సాహసం చేయ్యాలి. కానీ ఏం జరుగుతుందో తెలీదు.
    అతని చేతిలోని తువాలు కింద పడిపోయింది.
    అభినయ్ అమె చేతిని పట్టుకున్నాడు. అమె తన చేతిని వెనక్కి లాక్కోలేదు.
    అభినయ్ మెల్లగా, సున్నతంగా ఆ చేతిని నొక్కాడు. పెదవులతో అమె హస్తాన్ని వెనక్కి తిప్పి ముద్దు పెట్టుకున్నాడు.
    అమె కుడిచేతి హస్తం మీద నించి ముంజేతి మీదిగా అతని చేయి అమె భుజం మీదకి పాకుతోంది.
    అటు రమాదేవి.
    ఇటు అభినయ్.
    తలుపు కొంచెం కొంచెం తెరుచుకొంటోంది.
    రమాదేవి తడబడుతోంది! అమె గుండెలు ఎగిరిపడుతున్నాయి. మనసులో ఉద్వేగం. అభినయ్ తనని పూర్తిగా ఇలాగే చూసేయబోతున్నాడు.  అతని చంపను పగలకొట్టవలసింది పోయి ప్రోత్సహిస్తున్నట్లుగా ఎందుకు ఊరుకుంటోంది. అబ్బ... ఎంత సిగ్గు? తనకింత సిగ్గు లేకుండా పోయిందే? తనని చూసి ఏం చేస్తాడు? ఇంకేం చేస్తాడు? తలుపుని వెనక్కి లాగేస్తే... కానీ లాభం లేదు. అప్పటికే జరగవలసిన అలస్యం జరిగిపోయింది. అతను కింద పెదవిని మునిపళ్ళతో కొరుకుతూ తన వంక చూస్తున్నాడు.
    అమె కళ్ళు కిందికి వాలిపోతున్నాయి.
    అతను చేయి మెల్లగా తన నగ్నశరీరం మీద సున్నతంగా , మృదువుగా మధురంగా హాయిగా పాకుతోంది.
    చేతినుంచి భుజం మీదకి---
    తలుపు పూర్తిగా తెరుచుకొంది.
    అతని ఎదుట తను.
    మామూలుగా కాదు. సిగ్గుతో ముడుచుకుపోతోన్న తను.....
    అతనికి కనిపించకుండా తప్పుంచుకోలేని తన అందాలని అతని ముందు వెన్నెలలా పరవక తప్పడంలేదు.
    అతను అడుగు ముందుకేశాడు.
    రెండు చేతులతో అమె భుజాలని గుచ్చి పట్టుకున్నాడు.
    అమె గువ్వపిట్టలా ముడుచుకుపోయింది.
    అతను తన స్టూడెంట్!
    తను అతనికి ఉపాద్యాయిని.
    ఒక స్టూడెంట్ ముందు తనెందుకంత బలహీనురాలై పోతోందో అమెకే అంతుచిక్కడంలేదు.
    అమె శరీరం మీద మంచుబిందువుల్లా నీటి బిందువులు... విడిపోయిన జడ పాయలుగా మారి అమె గుండెలని కప్పేసింది.
    అయినా ఎంత అందంగా వుంది!
    "డియర్ దేవీ!" అన్నాడు అభినయ్.
    కళ్ళెత్తి చూడాలనిపించింది అమెకి.
    ఎంత తియ్యగా పిలిచాడు. ఆ సంభోదన తిరిగి వినాలనిపించింది.
    దేవీ?
    అతనికి తను "దేవి" అవుతోందా!
    మళ్ళీ పివలవడే! ఒట్టి మొద్దులా వున్నాడు.
    అతను అమె మొహంలోకి చూడాలని ప్రయత్నిస్తున్నాడు.
    అమె సుముఖంగానే వున్నది. తనని కోపగించలేదు. తిట్టలేదు. అరిచి అల్లరి చేయడానికి అమె ప్రయత్నించలేదు.
    "దేవి!" అని పిలిచాడు అమె మనసులోని భావాల్ని చదివినవాడిలా అభినయ్.
    కనురెప్పలు రెపరెపలాడుతుండగా అమె మెల్లగా తలెత్తి అతని మొహంలోకి చూసింది.
    అమెని దగ్గరగా తీసుకుని అమె పెదవులని అందుకున్నాడు అభినయ్.
    "మ్చ్....."
    అమె గుండెలు సవ్వడి అతనికి అమె పూర్తి అంగీకారాన్ని తెలుపుతోంది. అతని చేతులు అమె నడుం మీదకి జారినాయి.
    "నేనడిగింది నిన్ను టవల్., ఇదికాదు" అంది సిగ్గుతో.
    అమె గొంతు హస్కీగా ధ్వనించింది.
    ఆ గొంతే చెబుతోంది అమె దేనికోసమో తపిస్తున్నట్టు.
    అభినయ్ అమె నడుముని చేతుల్లో బందించి అన్నాడు......
    "ఎప్పటినించో నీకివ్వాలని దాచిపెట్టాను. ఎంతకాలమని దాయగలను. నువ్వడిగిన టవల్ కన్నా ఇదే బాగుంటుందనుకొంటాను"

 Previous Page Next Page