ప్రజ్ఞా ప్రభాకరము
__శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి
విషయాను క్రమణిక
౧.ఉపక్రమము ... 1
౨.జననదికము ... 3
౩.బాల్యస్మృతులు ... 5
౪.పురోహితత-సదనుష్టానము ... 18
౫.అనుభూతికి-తద్వికాసము ... 22
౬.కాకిపగ ... 27
౭.శాస్త్రము-అనుభూతి ... 30
౮.వెంకటశాస్త్రిగారికడవిద్యావ్యాసంగము ... 33
౯.ధూమ కేతు దర్శనము ... 36
౧౦.బ్రహ్మచర్యము-గార్హస్ధ్యము ... 39
౧౧.వివాహము ... 45
౧౨.బండిపాటు ... 47
౧౩.శకునపరిగణనము ... 53
౧౪.సాహిత్యజీవనము-అరకుడువు ... 56
౧౫.టైఫాయిడ్ ... 64
౧౬.వేంకటేశ్వరస్వామి దర్శనము ... 68
౧౭.తొలి కలయిక ... 71
౧౮.ఆవేదన ... 80
౧౯.అనారోగ్యం ... 86
౨౦.ఔషధ సన్యాసము ... 89
౨౧.వెలుఁగునీడలు ... 93
౨౨.వెలుఁగు బాట ... 99
౨౩.దివ్యదర్శనము ... 102
౨౪.అనుభూతి ... 106
౨౫.దివ్యబోధ ... 110
౨౬.చేకూడుట ... 115
౨౭.శ్రీ మాస్టరుగారు ... 117
౨౮.నవజీవనము ... 125
౨౯.ఇల్లాలి యినిపియేషన్ ... 134
౩౦.నాడీ గ్రంధములు ... 139
* * *
ప్రకాశక విజ్ఞప్తి
మహర్షి సత్తములు, మహతవస్సంపన్నులు, ప్రజ్ఞపూర్ణులు నయినా శ్రీ గురుదేవులు ప్రభాకర శాస్త్రి వర్యుల యోగ జీవితము ప్రజ్ఞా సుందరము, ప్రభావసంపన్నము. శ్రీ ప్రభాకర శాస్త్రి గారు కారణజన్ములు! వసుదైవ కుటుంబకముగా వారి జీవితము సాగినది. ప్రేమర సపూర్ణము వారి హృదయము. మహామహిమోపేతము వారి ప్రజ్ఞ!పసినాఁట నుండి యంతర్వర్తినియయి యమృతత్వసిద్ధి సాధన్ మార్గమున వారిని నడిపించిన దివ్య ప్రజ్ఞా చరిత్ర మే నేఁ డు మేము వెల్వఱచుచున్న 'ప్రజ్ఞా ప్రభాకరము'.
నన్ను ౯ వర్ణన సేయఁ గా వలవ దన్నా!కన్నయందాఁ క మిఁ
ద న్నీవర్ణన మెందు కిందులకుఁ గొందాఁ కం బ్రతిక్షింపు మం
చు న్నన్గూర్చిన యుష్మదాజ్ఞాకు నేదుర్చూపై గృహద్వారామం
దున్నాఁ డం గనరాఁ గదే కనుట కర్హు ౯ నన్నుఁ జేయంగ దే!
కుంభకోణమున నపూర్వము,నసాధరణము నయినా మహాత్తర యోగమును నెలకొలిపి యమృతత్వసిద్ధి ప్రసాదమును దమశిష్యులకు నొసఁ గఁ బ్రతినపూనిన మహాయోగి వర్యులగు తమ గురుదేవుల గూర్చి శ్రీ శాస్త్రి గారు రచించిన పద్యమిది! శ్రీ శాస్త్రిగా రాయోగమునఁ జేరిన కొలఁది కాలమున కెపుడో శ్రీ మాస్టరు గారి మహి మాదిక మున వర్ణించుచు నేదో పత్రికలోఁ బ్రశంసా పద్యములను గొన్నిటిని రచించి ప్రకటించి రఁట! అది తెలిసి శ్రీ మాస్టరు గారి తమ్ముఁ బూర్ణముగా నెఱుఁగుదాఁక నట్టి రచనము లేవియుఁ గావింపఁ దగ దని శ్రీ శాస్త్రి గారిని మందలించి రఁట! ఈ విషయము నెఱుకపఱచునదే పయిపద్యము. అటుపిమ్మట నెన్నఁ డును వారు శ్రీ వారిని గూర్చి ఎత్తి రచనము గావింపలేదు.
1948వ సంవత్సరమున తిరుపతిలో శ్రీ శాస్త్రి గారి షష్ట్యబ్దపూర్త్యుత్సవము జరగినది. షష్టిపూర్తి నాఁడు ప్రాతరుపాసన సమయమున వారు.
' వచ్చెను నేఁటి కర్వదగు వర్షము పుట్టువుఁ దొట్టి, గర్భముం
జొచ్చుటదొట్టి నాకరయఁ జూచిన నేఁటి కె షష్టిపూర్తి, యీ
వచ్చిన యేడు నిండిన ధ్రువంబుగఁ గాఁ గల షష్టిపూర్తితో
నిచ్చట నాకుఁ గావలయు నిష్టికిఁ బూర్తియు సృష్టిపూర్తియు౯.'
అని వేఁడి గురుదేవులను బ్రార్థించిరి. అపుడు ' నిన్నుటివఱకు ప్రభాకరుఁ డవుగా నుండిన నీవు నేఁటి నుండి ప్రజ్ఞా ప్రభాకరుఁడవు. నన్ను గూర్చి వ్రాయఁగలయ్యోగ్యత నీకుఁ లిగినది 'అనిశ్రీవారుద్బోధించినట్లుతెలియనయ్యెను.నాఁడేవారు' ప్రజ్ఞాప్రభాకరము' రచనమునకుఁదొడఁగిరి.తమకుఁ గలిగిన యోగానుభూతులను వివరించుచు వేయిపుటల గ్రంధముగాఁ దోలిసంపుటమును, నీయోగము వలనను పకారము పడసిన మిత్రులమొక్కయు, శిష్యులయొక్క యుననుభవములను, వారే వ్రాసిన వానిని,వేయించుట గ్రంధముగా రెండవ సంపుటముగా 'ప్రజ్ఞా ప్రభాకరము'ను వెలయించుట వారి సంకల్పము. అందుకై తొడఁగి రచనము కుపక్రమించి కొంతవఱకు సాగించిరి. మిత్రులకడ నుండియు, నాప్తులకడ నుండియు, శిష్యులకడ నుండియు వారి వారి యనుభవములను దెలుపు వృత్తాంతములను గూడఁ దెప్పించిరి.
తలమునుక లగు కార్యకలాపములలో నెట్లో తీరిక చేసికొని శ్రీ వారీ గ్రంధరచనము ను దినమున కొకకొంతగా సాగించుచునే యుండిరి. కాని యన్నమాచార్యుల కిర్తనముల ప్రచురణము, తదుత్సవాదికముల నిర్వహణము, కుమారసంభవో త్తర హరివంశ వ్యాఖ్యానములు రచనము, తిరుపతిలో మ్యూజియమునకై యమూల్యవస్తువుల సేకరణము-ఇత్యాది కార్యకలా ములలో దలమునుక లగుచుండుటచే నీ గ్రంధరచనము నేఁడు ప్రకటించు చున్నంత వఱకు మాత్రమే కొనసాగినది.ఇంతలో మ్యుజియమున కయిన వస్తు సేకరణ ప్రయత్నమున వారు బౌతికమున వీడుటయు మా దుర దృష్టము! కడకు దుఃఖపుఁ బుక్కిలింతగా మాకు దక్కినది యీ గ్రంధము!