శ్రీవారి యోగ జీవితమునకు సంబంధించిన యీ రచనము వారి ప్రధమ వర్ధంతి నాఁటికి వెల్వఱచుట మా సంకల్పము.
శ్రీ శాస్త్రి గారితో స్వయము నాకుఁ బదునై దేండ్లకు మించిన పరిచయము కలదు. 1939లో వారు మదరాసు విడిచి తిరుపతి వెళ్ళిన తరువాత మదరాసునకు వారు వచ్చునపుడెల్ల మాయింటనే బస చేయు చుండువారు. వారియోగ చికిత్స వలన నారోగ్యము పడసిన నాఁట నుండి యుఁ బరుమభక్తితో నేను వారి ననువర్తించు చుండడివాఁడను. వైద్యులకుఁ గుదుర్పరాని రోగాములతో బాధపడుచున్నవా రెందఱో శ్రీ వారి యోగచికిత్స వలన నారోగ్యము పడసి యానందముతో నుండుట నే నెఱుఁగుదును.
వారి యాధ్యాత్మిక శక్తి యెంత పటిష్ఠ మో తెలుపుట కొక సత్య సంభవము నుదా హరింతును.
అన్నమాచార్యుల ప్రధమ వర్ధంత్యుత్సవము తిరుపతిలో మహా వైభవముగా సాగు చుండినది. మదరాసు ఉన్నత న్యాయస్దానమున ప్రధాన నుఆయన్యాయమూర్తులు శ్రీ పాకాల వెంకటరాజమన్నారుగా రధ్యక్షత వహించిరి. రెండవదినమున సాయంకాలము శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి పాటకచ్చేరి జరగుచుండినది. వేలకొలదిఁ జనము విఱుగఁబడి వచ్చియుండిరి. సభాస్ధలము క్రిక్కిఱిసి యుండినది వాతావరణమల్లకల్లోల ముగనుండెను. కాఱుమబ్బులు క్రమ్ముకొన్నవి. తుపాను వాయువులు వీవసాగినవి. ఉత్సవ ప్రాంగణ మంతయు దుమ్మెత్తి పోయు చుండెను. వేలకొలఁది జనము. స్రీలు, శిశువులు, వృద్ధులుపలువురుండిరి. ప్రాణభీతి! సభలోఁబెద్దగ్లోలయ్యెను. రసాభాసమగు నని శ్రీ శాస్త్రిగారు వెంటనే లేచి మైకు దగ్గఱకు వెళ్లి 'వర్ష మురాదు! మనమందఱము నేకమనస్కతతోఁ బ్రార్థించు చున్నాప్పుడు తద్విరుద్ధముగా వర్ష మెట్లు రాఁగలదు. మబ్బులు విచ్చిపోఁ గలవు. గాలిహొరు తగ్గును. కూర్చుండుఁడు! వాన రాదు! రాదు! రాదు!' అని మమ్మాఱు నొక్కి చెప్పిరి. ఆశ్చర్యము! శ్రీ వారి దివ్య సంకల్ప బలమేమో కాని వెంటనే మబ్బులు తొలఁగిపోయినవి. గాలి హొరు తగ్గినది. వర్షము రాలేదు. కచ్చేరి జయప్రదముగా సాగింది. వారి యాధ్యాత్మిక శక్తి ప్రభావ మట్టిది! ప్రకృతి విజయ మన నిట్టిది యేకదా! ఆహొ! యిట్టివి శ్రీవారి విషయమున మా యె ఱుకలో నెన్నియో!!
అమృతత్వసిద్ధికై సాధనము సలుపు నీ యోగమ యొక్క మహాత్త్వము చెప్ప నలవి కాదు. యోగమహిమమును గూర్చియు, తత్ స్దాపకులగు గురుదేవుల దివ్య ప్రభావమును గూర్చియు శ్రీ శాస్త్రి గారు రచించిన యీ గ్రంధము ముద్రిత మయిన యెడల నెందఱకో యీ యోగ విషయము తెలియగోరువారికి నుపకరముగా నుండు నని దీనిని బ్రకటింప నుత్సహించితిని. యోగ విషయము తెలియగోరువారి కిది మిక్కిలి తోడ్పడఁ గలదని నా విశ్వాసము.
శ్రీ వారి యోగానుభావములను గూర్చియుఁ, దమకు శ్రీ వారితోఁ గల 'పరిచయ సందర్భములను గూర్చియు ననేక విశేషాంశములు తెలుపుచు శ్రద్ధాంజలి'వ్రాసిన శ్రీ కేఒత్త వెంకటే శ్వరరావు గారికి మే మెంతయుఁ గృతజ్ఞులము. ఈ గ్రంధ ముద్రణ సందర్భమున శ్రీ శాస్త్రి గారి శిష్యులు శ్రీ తిమ్మావ జ్ఝల కోదండ రామయ్యగారు మాకు మిక్కిలి సహాయపడిరి. వారికి మా కృతజ్ఞత!
అలఁతి కాలములో ససిగా సర్వాంగ సుందరముగా అచ్చొంత్తించి యీ గ్రంధమును శ్రీ వారి ప్రధమవర్ధంతి నాఁటికి మా కందఁజేసిన 'వెల్డను ప్రెస్సు'వారి నభినందిచుచున్నారము.
మదరాసు
ఖర కంభంపాటి సత్యనారాయణ.
శ్రావణ బహుళ విదియ
శ్రద్ధాంజలి
" Greatear love hath no man than this that a man lay down hislife for his friends."
st. john Xv, 12.
" మిత్రులకై తన ప్రాణ మార్పించుటకన్న నుత్కృష్ట ప్రేమను మానవుఁ డెఱుఁగడు" అన్నజీససు మహోదార ప్రవచనమునకు పరమ లక్ష్యభూతమైనది శ్రీ ప్రభాకర శాస్త్రి గారి పుణ్య జీవితము. వారు అందఱను మిత్రులు గనే భావించెడివారు. అధివ్యాధులచే దారి తెన్నులు తెలియక, నిస్పృహు లైనవా రాయనకు పరమమిత్రులు. అట్టివారి దుఃఖము లోను బాధలోను దూరి, వారే తాముగ భావించి, వారి యాపన్నివారణకై యాహొరాత్రములు పరితపించి, అ యనుతా పలబ్ద మగుఆత్మశక్తిచే బాధా నివారణ చేసెడి వారు శ్రీ శాస్త్రి గారు. అట్లు వారిని గట్టెక్కించిన పిమ్మట గూడ వారి యోగ క్షేమముల నరయుచు ఆపదలో నాదుకొనెవారు." సమర్ధ మాపత్సఖ" మనుస్తుతి వాక్యములకు వీ రెంతయు తాగి యుందురు.
" ఆపద గడవం బెట్టఁ గ
నోపి శుభం బయినదాని నొడగూర్పఁ గ మా
కీ పుట్టువునకుఁ బాండు
క్ష్మాపాలుఁడు నిన్నుఁజూపి చనియె మహాత్మా"
యని శ్రీకృష్ణుని గూర్చిన యుధిష్టిర సంబోధనము కలదు. శ్రీ శాస్త్రి గారిచే పరిర క్షి తులై పెక్కు రిట్లే వారిని స్మరింతు రనుట కేవలము స్వభావోక్తి! వారి కరుణా ప్రసారముచే నుజ్జివితు లైనవారిలో నేనొకఁడను. ఆ కృతజ్ఞతను పురస్కరించికొని ఈ శ్రద్ధాంజలి నర్పింప సాహసించితిని.