Next Page 
రీవెంజ్ పేజి 1

                                 

                                                                        

                                                                          రివెంజ్   
                                                __ సూర్యదేవర రామ్ మోహన్ రావు       

                   

                                                          నా సాహసానికి              

                                                    మీ ఆశీస్సులు అర్ధిస్తున్నాను.                                                     

                                                           
                                                     
      విజ్ఞులైన నా పాఠకాభిమానులకు అభివందనాలు.

    సాధారణంగా ఒక రచయితను ఏదో ఒక పత్రిక పాఠక ప్రపంచానికి పరిచయం చేయటం జరుగుతుంది. అది పత్రికలకు పరిచయం చేయటం జరుగుతుంది. అది పత్రికలకు చెల్లుతుంది కూడా. పత్రికలకు చెల్లుబాటయ్యే విషయాన్ని నేను చేస్తే అది సాహసమే అవుతుంది.

    1985 లో 'ఉదయం' లో నేను వ్రాసిన తొలి నవల మోడల్ కి ఓ యువ చిత్రకారుడు ఇల్లస్త్రేషన్స్ వేస్తుండేవాడు. నేనెవరయింది అతనికి తెలిసినా, అతనెవరో నాకు తెలీదు. కాని నేను సృష్టించిన పాత్రలకు, వంఘటనలకు అతను వేసిన చిత్రాలు నన్ను బాగా ఆకర్షించేవి. మోడల్ ని మెచ్చుకుంటూ నాకు అభిమానుల నుంచి వచ్చే ఉత్తరాల్లో మీ సీరియల్ కి వేస్తున్న బొమ్మలు చాలా బావుంటున్నాయి - చిత్రకారుడు టి. వి. ప్రసాద్ కి మా అభినందనలు అందజేయండని ఉండటంతో తొలిసారి అతన్ని పరిచయం చేసుకుని కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. సరిగ్గా అదే సమయంలో అతనే నా దగ్గరకు వచ్చి తనను తాను పరిచయం చేసుకొని బొమ్మలెలా ఉంటున్నాయని అడిగినప్పుడు అతన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఈ కుర్రాడేనా అంత అద్భుతంగా బొమ్మలు వేస్తున్నదని - ఆ తరువాత అతన్ని అభినందించి అతన్ని మెచ్చుకుంటూ నాకు వచ్చిన కొన్ని ఉత్తరాల్ని అతనికి అందించాను. అలా మా ఇద్దరి మధ్య పరిచయం జరిగింది. ఆ తరువాత నేను ఉదయంలోనే "ఆశ్వభారతం" సీరియల్ రాయటం జరిగింది. దానికి అతని చేతే బొమ్మలు వేయించమని ఇన్ చార్జి ఎడిటర్ శ్రీ గౌస్ ని రిక్వెస్ట్ చేసాను. ఆయనందుకు ఒప్పుకుని టి.వి. ప్రసాద్ తోటే బొమ్మలు వేయించారు. ఇప్పటినుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ప్రారంభమయింది. ఆశ్వభారతం నవలకు టి. వి. ప్రసాద్ కవర్ పేజీ వేయటం జరిగింది. ఇంకా తరువాత ఒక్కటి తప్ప నా నవల లన్నిటికి అతనే ముఖచిత్రాలు వేయటం జరుగుతుంది. ఈలోపు నేను ఆంధ్రజ్యోతి వీక్లీలో "త్రినేత్రుడు" రాయటం ప్రారంభించాను. సరిగ్గా ఆ సమయానికే టి. వి. ప్రసాద్ "ఉదయం" నుంచి ఆంధ్రజ్యోతికి రావటం జరిగింది. ఇది కాకతాళీయమే అయినా చాలా ఆనందించాను. ఏ రచయిత [త్రి] అయినా తన రచనలు చక్కని చిత్రకారుని కుంచెతో రేఖా చిత్రాలుగా రూపుదిద్దుకోవాలనే ఆశపడతాడు. అలా మా మధ్య స్నేహం ఓ విడదీయరాని అనుబంధముగా రూపుదిద్దుకొంది. అప్పటినుంచి టి. వి. ప్రసాద్ ని టీవీ అని సంబోధించే వాడిని, కాని తను మాత్రం నన్ను మోహన్ అని సింపుల్ గా పిలవటానికి మరో సంవత్సరం టైమ్ తీసుకున్నాడు.

    ఈ మధ్యలో మరో విచిత్రం జరిగింది. నేను వ్రాసిన ప్రతి సీరియల్ పార్ట్ తను వృత్తిరీత్యా చదివి బొమ్మలేయాలనుకొని నేను వ్రాసిన ప్రతి నవల తను చదవటం జరిగింది. చదవగానే ఒక విమర్శకుడిలా తన భావాల్ని నిర్భయంగా వెలిబుచ్చేవాడు.

    అంతవరకే నేను గమనించాను - కాని నేను ఎలా రాస్తాను.... ? ఎప్పుడు రాస్తాను....? ఏమి రాస్తాను....? అన్న విషయాల్ని కూడా శ్రద్ధగా గమనిస్తున్నాడని నేను గమనించలేదు. మా ఇద్దరికి కలిపి వేంపల్లి నిరంజన్ రెడ్డి అనే మరో మంచి మిత్రుడున్నాడు. అతను అవటానికి ఇంజనీరే అయినా గొప్ప సాహిత్యాభిమాని, అతను ఫలానా నవల ప్లాప్ అంటే ప్లాప్ గావటం-హిట్ అనంటే హిట్ కావడం ఖాయం. అంత కరక్ట్ గా అసెస్ చేయగలడు. నిరంజన్ ఓరోజు ఉన్నట్టుండి తగిన ప్రోత్సాహముంటే మన టి. వి. మంచి రచయిత కాగలడనే నమ్మకం ఉంది నాకు - అని పరోక్షంగా నువ్వు టి.వీ.ని ఎంకరేజ్ చేయకూడదా అని నిరంజన్ అన్నప్పుడు నేను ఒకింత ఆశ్సర్యపోయాను.

 

Next Page