ఒకరోజు నేను వాళ్ళ అమ్మ గొంతు పిసికి చంపటానికి చూస్తున్నానని అర్ధరాత్రి లేచి నాతో పోట్లాడేది.
మీ గురించి చెప్పేది. నా భార్య నాతో అన్నది. నేను పెద్దగా పట్టించుకోలేదు. మిగతా సమయాల్లో బాగానే ఉండేది. బాగా చదివేది. పిచ్చి లక్షణాలు నాకేమీ కన్పించలేదు. అనవసరంగా పెళ్ళి కావాల్సిన పిల్లను రచ్చకెక్కించకూడదనుకున్నాను.
నీ భార్య చనిపోయాక నీవు ఇల్లు ఖాళీ చేశావు.
చంద్రవదనను నువ్వే చంపావంటుండేది. మేము ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు.
ఎం.ఏ. ఫస్టుక్లాసులో పాసు అయింది. అప్పుడే దానికి రామకృష్ణ అనే అబ్బాయితో పరిచయం అయింది. అతనిమీద ఆశలు పెంచుకుంది. అతను చెప్పా పెట్టకుండా ఫారెన్ వెళ్ళిపోయాడు.
దాంతో అది మానసికంగా దెబ్బతిన్నది.
ఎన్ని సంబంధాలు చూసిన పెళ్ళి చేసుకోనని మొరాయించింది.
మగవాళ్ళను నమ్మకూడదనేది. మగవాళ్ళంతా రోగ్స్ అనేది.
ఒక సంవత్సరం బాగానే ఉన్నది.
ఆ సంవత్సరం బాగానే ఉన్నది.
ఉస్మానియాలో పి.హెచ్.డి. కి సీటు వచ్చిందని, హైదరాబాదు వెళతాననీ కూర్చుంది.
ఒప్పుకోక తప్పదు.
ఆ తర్వాత సంగతి నీకు తెలిసిందే.
మళ్ళీ నిన్ను చూసింది. చంద్రవదనను చంపింది నువ్వేనని దాని నమ్మకం.
"నువ్వే ఇక్కడ వున్నప్పుడు ఒకరోజు నన్ను అర్ధరాత్రి నిద్రలేపింది. నువ్వు భార్యను కొడుతున్నావనీ ఆ పిల్ల ఏడుస్తున్నదనీ చెప్పింది. నన్ను బలవంతంగా మీ తలుపు దగ్గరకు తోసుకొచ్చింది. అంతా నిశ్శబ్దంగా వుంది. నా చెల్లెల్ని ఆమె భర్త గొంతు పిసకడం చూసింది. మస్తిష్కం పొరల్లో ఎక్కడో ఆ భయం దాగి వుంది. భర్తలందరూ భార్యల్ని చంపేస్తారనే భ్రమలో పడిపోయింది. అందువల్లనే అర్ధరాత్రి ఏడుపులు వినిపించినట్టు అనిపించేదనుకుంటాను."
"అప్పుడైనా సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్ళాల్సింది."
"అదే నేను చేసిన తప్పు?"
"నీ భార్య చనిపోయాక అది కొంతకాలం జబ్బు పడింది. భయం భయం అనేది. ఎవరో వెంటిలేటర్ నుంచి చూస్తున్నారనేది. జ్వరం తీవ్రత వల్ల అలా మాట్లాడుతుందని సరిపెట్టుకున్నాను. కాని కూతురికి మళ్ళీ మతి చలిస్తున్నదనే భావం కూడా మనసులోనే రానిచ్చేవాణ్ణి కాదు.
హైదరాబాదు నుంచి దాదాపు పిచ్చిదానిలాగా వచ్చింది. ఎలా ఇల్లు చేరిందో అప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా పిచ్చిమాటలు మాట్లాడేది. పిచ్చి చూపులు చూసేది.
తనలో తను మాట్లాడుకునేది.
"ఛ! నోరుముయ్! నిన్ను చంపేస్తాను." అంటూ ఎవరితోనో దెబ్బలాడుతున్నట్టు మాట్లాడుతూ ఉండేది.
డాక్టర్ కు చూపించాను.
ఆసుపత్రిలో చేర్పించమని సలహా ఇచ్చాడు.
దాన్ని ఆసుపత్రిలో చేర్పించమని సలహా ఇచ్చాడు.
దాన్ని ఆసుపత్రి పాలు చేశాను. ఇంకా బ్రతికి ఉన్నాను.
బాబూ! నా కూతురు ఇలా అయినందుకే కుళ్ళి పోతున్నాను. దానివల్ల నీ భార్యకు జరిగిన అన్యాయానికి మరీ కుంగిపోతున్నాను.
"ఒకసారి సావిత్రిని చూడాలని ఉందండీ!" అన్నాడు రమణ.
"ఏం చూస్తావు బాబూ!"
"ఒక్కసారి చూస్తాను."
"సరే రేపు వెళ్దాం!"
18
"నేనూ వస్తాను." అన్నది పార్వతమ్మ భర్తతో.
"ఇవ్వాళ వద్దులే! మనం తర్వాత వెళదాం!" అన్నాడు భర్త.
"దానికి సున్ని ఉండలంటే ఇష్టమని చేశాను. తీసుకెళ్ళండి"
"నీ పిచ్చిగాని అది ఇవన్నీ దాచుకుని తినే స్థితిలో ఉందంటే? రెండురోజుల్లో మనం వెళదాం అప్పుడే ఇవ్వచ్చులే."
రామనాధం, రమణమూర్తి పిచ్చాసుపత్రికి వచ్చారు.
గేటులో కాలుపెడుతున్న రమణమూర్తి గుండెలు దడదడలాడాయి.
గేటుదాటి లోపలకు వెళ్ళి దిక్కులు చూస్తూ నిలుచున్నారు.
"ఎవరు కావాలండీ!" ఒక నడివయసు అతను నవ్వతూ అడిగాడు.
రమణ రామనాధం ముఖంలోకి చూశాడు.
"డాక్టరుగార్ని చూస్తారా?" మళ్ళీ అతనే అడిగాడు.
"అవును" అంటూ రామనాధం ముందుకు రెండడుగులు వేశాడు.
"ఏమండోయ్! అలా వెళ్ళిపోతారేం? ఆగండి" అతను గబగబ ముందువచ్చి రమణ ఎదురుగా నిల్చున్నాడు.
ఇద్దరూ ఆగారు.
"నీ పని చూసుకో వెళ్ళు!" అన్నాడు రామనాధం.
"మీ ఇద్దర్లో పిచ్చి ఎవరికండీ? నీక్కాదులే. నువ్వు ఎప్పుడూ ఎవరికోసమో వస్తూనే వుంటావు... ఈ కుర్రాడికేనా పిచ్చి? పాపం చిన్నవాడే!" అతను రామనాధంతో అన్నాడు.
రమణమూర్తికి కోపమొచ్చింది.
"ఏయ్! ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇక్కడికొచ్చే వాళ్ళంతా పిచ్చివాళ్ళని నీ ఉద్దేశ్యమా?" రమణ కోపంగా అన్నాడు.
అతను విరగబడి నవ్వసాగాడు.
"ఎందుకలా పిచ్చివాడిలా నవ్వుతావు?"