"అవును! ఎప్పటికీ మారను కూడా. ఎన్ని హత్యలైనా చేస్తాను నా వర్షిణి కోసం" అన్నాడు తాపీగా.
అయితే అతడి కంఠంలో కత్తికంటే పదునైన జీర కనిపించింది.
"ఏమిటీ ఉద్రేకం? కాస్త నిదానంగా నేను చెప్పేది వినరాదూ..."
"భ్రమరాంబా నా సహనాన్ని పరీక్షించకు, ముందు ఆ ఎడ్రస్ ఇటివ్వు" అతను ఆమె చేతిలోని కాగితాన్ని లాక్కోవడానికన్నట్లుగా ముందుకి కదిలాడు.
భ్రమరాంబ ఒక్క అడుగు వెనక్కి వేసి "అటూ చూడు...వర్షిణి" అంది. అతను గభాల్న వెనుదిరిగాడు.
భ్రమరాంబ వెంటనే చేతిలో వున్న కాగితాన్ని వుండగా చుట్టి, నోట్లో పెట్టుకొని మింగేసింది.
జరిగింది అర్ధం కాగానే "రాక్షసీ" అంటూ విక్రమ్ ఆమెని అందుకోబోయాడు.
ఆమె వెనక్కి తిరిగి పరిగెత్తడానికి ప్రయత్నించింది.
అతను వెనకనించి వీపు మీద చెయ్యివేసి గట్టిగా పట్టుకుని ఆపబోయేసరికి, ఆమె బ్లౌజ్ సర్రున చిరిగిపోయింది.
జరిగినాదానికి హతాశురాలైనట్లు చూసింది భ్రమరాంబ.
"ఎందుకు!....ఎందుకు ఎడ్రస్ మింగేశావు?" ఆమె చెంపల మీద ఎడాపెడా కొడ్తూ అడిగాడు.
భ్రమరాంబ ఏడుస్తూనే "నీలాంటి ఆవేశపరుడికి వర్షిణి అడ్రస్ ఇచ్చి ఆమె జీవితం నాశనం చెయ్యమంటావా?" అంది.
"ఇప్పుడు ఇవ్వకపోతే నిన్ను బ్రతకనిస్తాననుకున్నావా?" అతను ఆవేశం పట్టలేకపోయాడు.
"చంపినా సరే! నేను చెప్పను."
"చెప్పాల్సింది" అతని గొంతు కర్కశంగా వుంది.
"గుర్తులేదు. మింగేశానుగా?" అంది భయం భయంగానే.
"పద కడుపు కోయించి తీయిద్దాం. ఇంకా అక్షరాలు చెరిగిపోయి వుండవు" ఆమె రెక్కపట్టి లాక్కువెళ్తూ అన్నాడు.
అతను 'జోక్' చేస్తున్నాడేమో అని అతనివైపు చూసింది. ఆ కళ్ళల్లో ఆమెనీ ప్రపంచాన్నీ నమిలి మింగేసేయాలన్నంత కసి కన్పించింది.
"విక్రమ్! నాకు నిజంగా ఎడ్రస్ గుర్తులేదు. వున్న ఆ ఒక్క ముక్కా పొరపాటున మింగేశాను. దయచేసి నన్ను వదిలిపెట్టు" గింజుకుంటూ విడిపించుకోడానికి ప్రయత్నించింది.
"నిన్ను వదిలిపెట్టడం కాదు. నిలువునా కోసి కాకులకు గద్దలకు వెయ్యాలి" అతను ఆమెని వదలకుండా, ఈడ్చుకుని గుడి బైటకి తీసుకొస్తూ చెప్పాడు.
"వదులు....నన్ను వదులు" భ్రమరాంబ అరుస్తోంది.
ఇద్దరు ముగ్గురు పోగయి వింతగా చూస్తున్నారు.
ఒక సైకిల్ వ్యక్తి దిగి, విక్రమ్ వైపుకి వచ్చి "ఏమిటోయ్ ఇది, పట్టపగలు, నలుగురూ చూస్తుండగానే ఓ ఆడపిల్లని..." అని ఏదో అనబోయాడు.
'ఫట్' అన్న శబ్దం, అర్ధం అయ్యేలోగానే ఆ సైకిల్ వ్యక్తి నేల కూలడం, విక్రమ్ కొట్టిన దెబ్బకి అతని గడ్డం పగిలి నోట్లోంచి రక్తం కారిపోవడం జరిగిపోయాయి.
ఎదురుగా విక్రమ్ ఆవేశంతో నిలువెల్లా వూగిపోతూ కనిపించాడు.
"అయ్యయ్యో! ఏమీ జరిగింది తల్లీ! ఏమిటీ ఘోరం?" అన్నాడాయన,
"నీ కూతురు చేసినా పనికి, నిన్నూ, నీ కూతుర్నీ ఈ ఇంటితో పాటు దహనం చేసేద్దామనుకుంటున్నాను" అంటూ జేబులోంచి అగ్గిపెట్టె తీసి "ఎక్కడ కిరోసిన్ డబ్బా!" అడిగాడు.
"ఏమిటి?" ఆయన కళ్ళు పెద్దవిచేసి, కూర్చున్న చోటునుంచి గబుక్కున లేస్తూ అన్నాడు.
"దహనం అంటే కాల్చడం" చెప్పాడు విక్రమ్ వంటింట్లోకి వెళ్తూ.
అతడు అనుకున్నంతపనీ చేయగలడని భ్రమరాంబకి తెలుసు. వర్షిణి స్నేహితుడుగా, అతడి మనస్తత్వం ఆమెకి భ్రమరాంబకి తెలుసు. వర్షిణి స్నేహితుడుగా, అతడి మనస్తత్వం ఆమెకి హాస్టల్లో వున్న మూడు సంవత్సరాలూ బాగా తెలుసు. వర్షిణి కోసం చస్తాడు లేదా చంపుతాడు.
"వద్దు విక్రమ్....ప్లీజ్" అంటూ అతని వెనకాలే పరుగెత్తింది.
అప్పటికే విక్రమ్ మూలనున్న కిరోసిన్ డబ్బా చేతిలోకి తీసుకున్నాడు.
విక్రమ్ నీ కాళ్ళు పట్టుకుంటాను. అంత ఘోరం చెయ్యకు" అంది భ్రమరాంబ ఏడుస్తూ.
"ఇంతకీ ఏం చేసి తగలడ్డావే నువ్వూ?" తండ్రి కోపంగా అడిగాడు.
"ఒక ఎడ్రసు మింగేశాను నాన్నా!"
"ఎడ్రస్ మింగడమేమిటే? ఆకలేస్తే ఏ మరమరాలుండలో మింగాలి కానీ" ఆయనకీ అంతా అయోమయంగానూ, కంగారుగానూ వుంది.