ష్... మాట్లాడొద్దు
-సూరేపల్లి విజయ.
రాత్రి పదిదాటింది.
భార్గవకు నిద్ర రావడంలేదు. అసలే వేసవి కాలం. పైగా కూలర్ పాడైంది. కరెంటు కోత...షిట్...
అంటూ నాలుగో సారి విసుక్కున్నాడు. ఇంటి తలుపులన్నింటినీ బార్లా తెరచినా గాలి రావడంలేదు.
భార్య పుట్టింటికి వెళ్లింది. భార్గవకు పెళ్లయి ఆరునెలలు కూడా కాలేదు. ముప్పయ్యేళ్ల భార్గవ కాస్త ఆలస్యంగానే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన మడు నెలలకు భార్య ప్రణవిని కాపురానికి తీసుకువచ్చాడు. వచ్చిన మూడు నెలల్లోనే బామ్మకు సీరియస్ గా వుండడం, ప్రణవి కంటతడిపెట్టి రైలెక్కడం వెంటవెంటనే జరిగిపోయాయి.
సిటీ బ్యాంకులో క్యాషియర్ గా పనిచేసే భార్గవకు ఏ దురలవాట్లు లేవు.ఒకే ఒక బలహీనత- డబ్బు.డబ్బు సంపాదించే మార్గాల గురించి అతడు ఆలోచించినట్లు మరెవరూ ఆలోచించరు.
పెళ్లయిన మొదటిరాత్రే భార్యతో 'నువ్వు ఇంట్లో వుండి డబ్బు సంపాదించే ఐడియాలు చెప్పగలవా?' అని అడిగాడు.అప్పడప్పడు డబ్బుమీద అత్యాశతో లాటరీ టికెట్లు కొంటాడు. ఓసారి రేసులోకి వెళ్లాలని ప్రయత్నించి ధైర్యం చాలక ఊరుకున్నాడు.
* * *
ఇంటికి తాళం వేసి రోడ్డుమీదకు వచ్చాడు భార్గవ. అప్పుడు తగిలింది చల్లగాలి. హాయిగా అనిపించింది. అలా ఓసారి ప్లైఓవర్ నుంచి తిరిగి రావాలనుకుని మెల్లగా నడక సాగించాడు. వేసవి కావడంవల్ల జనసంచారం వుంది.బస్సులు, లారీలు తదితర వాహనాలు...నగరమంతా విద్యుద్దీపాలతో మెరిసిపోతోంది. చల్లగాలి మొహాన్ని సుతిమెత్తగా స్పృశిస్తుంటే హాయిగా వుంది. రోజూ యిలా ఓ గంట ప్లైఓవర్ మీద వాకింగ్ చేయాలనుకున్నాడు.
* * *
అరగంట నుంచి ఆ వ్యక్తి అలాగే కూర్చుండి పోయాడు. వయసు నలభై- నలభై అయిదుకు మధ్య వుంటుంది. తనలో తనే గొణుక్కుంటున్నాడు, నవ్వుకుంటున్నాడు. చూడ్డానికి దృఢంగా వున్నాడు, బట్టతల. గమ్మత్తుగా అనిపించే వ్యక్తి.
అతడ్ని పలకరించే వారెవరూ లేరు. పుట్ పాత్ మీద కూర్చుని అటూ యిటూచూస్తున్నాడు.
* * *
భార్గవ నడుస్తున్నవాడల్లా ఆగిపోయాడు. అతడి దృష్టిని బట్టతల వ్యక్తి ఆకర్షించాడు. హిందీ నటుడు పరేష్ రావల్ లా వున్నాడు. చదువుకున్న వాడిలా వున్నాడు.కోటు, సూటు వుంది కానీ పిచ్చిచూపులు చూస్తున్నాడు.
ఓ ఐదు నిమిషాలు అలాగే అతడ్ని పరీక్షగా చూసాడు కానీ ఆ వ్యక్తి మాత్రం ఇదేమీ గమనించక పేపర్ ని తిరగేసి చదువుతున్నాడు. అతడి దగ్గరికి వెళ్లి పలకరిచాలని అనిపించి, మెల్లగా దగ్గరకు వెళ్లాడు.
అతని చేతిలోని పేపర్ వ్తెపు చూస్తూ 'కాస్త పేపర్ యిస్తారా?' అని అడిగాడు. 'ఊహు...యివ్వను'అన్నాడు పిచ్చిచూపులు చూస్తూ.
"మీ పేరేమిటి?" అడిగాడు భార్గవ.
"నా పేరా? నా పేరేమిటబ్బా..అబ్రహం లింకన్? కాదుకాదు.. జాన్ ఎఫ్.కెనడి...ఊహూ...రాజీవ్ గాంధి...కాదు కాదు.. క్లింటన్ ..అదీ కాదు..మరేమిటబ్బా" అంటూ క్షణం ఆగి "ఆ...గుర్తొచ్చింది...గుర్తొచ్చింది" అంటూ చిన్నపిల్లాడిలా ఎగిరి అమితాబ్ బచ్చన్ "అన్నాడు.
షాక్ తిన్నాడు భార్గవ. అప్పటిగ్గానీ అర్ధం కాలేదు, అతను పిచ్చివాడని...అప్పుడు గమనించాడు...అతని నుదుట బ్యాండేజ్ కట్టబడి వుంది, గడ్డం మాసివుంది.
అతని వాలకం చూస్తుండగా భార్గవ దృష్టే పేపర్ మీద పడింది. అది నాలుగు రోజుల క్రితం దినపత్రిక.
అది కాదు, అతడి దృష్టిని ఆకర్షించింది.ఆ పేపర్ లో ఓ మూల చిన్న బాక్స్ఐట్ మ్. అది ప్రకటన'కనడుటలేదు'.
'ఈ వ్యక్తి గత రెండు రోజులుగా కనబడుటలేదు. చిన్నయాక్సిడెంట్ వల్ల మతిస్దిమితం కోల్పోయాడు. పై ఫోటోలోని వ్యక్తిని ఈ కింద అడ్రస్ లో అప్పగించినవారికి తగిన పారితోషికం అందజేయబడుతుంది.
దానికింద అడ్రస్ వుంది.
ఆ ఫోటో లోని వ్యక్తి అచ్చు తన ఎదురుగా వున్న వ్యక్తిలాగే వున్నాడు. లా ఏంటి? అతనే... కాకపోతే గడ్డం మాసివుంది, నుదుటికి కట్టువుంది.
యహూ...అని ఎగిరి గంతేయాలనిపించింది భార్గవకు. పొద్దున లేస్తే యిలాంటి 'కనబడుటలేదు' ప్రకటనలు బోల్డు కనిపిస్తాయి పత్రికల్లో...ఇలాంటి వ్యక్తులు తనకు కనిపిస్తే బావుండునని, వాళ్లని వాళ్ల తాలూకు వాళ్లకు అప్పగించి, బోల్డు డబ్బు పారితోషికంగా అందుకోవచ్చని అనుకుంటుంటాడు కూడా.
ఏదో అద్బుతంలా తోచింది భార్గవకు. ఒక్కక్షణం అతడి మెదడులో ఆలోచనల హొరు. ఏంచేయాలి? అతడిని తనతోపాటు తీసుకుపోవాలి.ఈ రాత్రే అతడిని అప్పగిస్తే? యింత రాత్రివేళ...వాళ్లు నిద్రమత్తులో వుంటారు.తగిన పారితోషికం అంటున్నారు? ఎంతిస్తారో...అయిదా?పదివేలా? లక్షా.....
ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ వుండిపోయాడు. ముందు ఇతడిని ఇక్కడినుంచి తిసుకెళ్లాలి.
"నా పేపర్...నా పేపర్" అన్న అరువు విని భార్గవ వెంటనే తేరుకున్నాడు.
"మీరు నాతో వస్తే, మాయింట్లో పడుకోవచ్చు. రేప్పోద్దునే మీ యింటి దగ్గర దిగాబెడతా" అన్నాడు సాద్యమైనంత సౌమ్మంగా.
"మా యిల్లా? ఎక్కడా?" అతను తన బట్టతల గోక్కుంటూ అన్నాడు.
"నాతో వస్తే చెప్తాను" అన్నాడు అతని చేయి పట్టుకుని.
"ప్రామిస్" అతను అమాయకంగా అన్నాడు.
"ప్రామిస్"
"మరి నన్ను హొటల్ కు తీసుకెళతావా?"
"తప్పకుండా"
"అయితే నేను రెడీ" చిన్న పిల్లాడి మాదిరిగా అన్నాడు.
వెంటనే మరో డౌట్ వచ్చింది భార్గవకు. ఆ పిచ్చివాడిని హొటల్ కు తీసుకెళ్తే ఎవరైనా గమనిస్తే...వాళ్లుకూడా
తనతో పోటీపడతారు. సాధ్యమైనంత త్వరగా యితడ్ని తన యింటికి తీసుకెళ్లాలి. ఆలస్యమ్తెన కొద్దీ ప్రమాదం ముంచుకొస్తుందని అర్ధమైంది.
"ఏయ్...ఏం చేస్తున్నారు?" ఓ కాని స్టేబుల్ భార్గవ భుజం తట్టి అడగడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి "ఏంలేదు...మా అంకుల్ తో ఇలా సరదాగా వచ్చాను".
"రోడ్డు మీదేమిటీ మీటింగూ...?" కరకుగా అడిగాడు కానిస్టేబుల్.
"అబ్బే...ఆయనకు ఆరోగ్యం సరిగ్గాలేదు. అందుకని మెల్లగా ఆగి...ఆగి నడుస్తున్నాం" అంటూ ఆలస్యం చేయకుండా ఆటోని పిలిచాడు.
ఆటోలో అతడిని కూర్చోబెట్టి తనూ కూర్చుని తన యింటి అడ్రస్ చెప్పాడు. ఆటో కదిలింది. కానిస్టేబుల్ ఏదో అనేలోగా ఆటో వేగంగా ముందుకు వెళ్లింది.భార్గవ చేతిలోని పేపర్ కిందపడింది.
"అరెరె...పేపర్ వదిలేసి వెళ్లాడు"అనుకుంటూ పేపర్ ని మడవ బోతూ,ఓమూలనవున్న 'కనబడుటలేదు' ప్రకటన చూశాడు.
కానిస్టేబుల్ చిన్న అనుమానం...
'ఇందాకటి అచ్చు యిలాగే' ఆ వ్యక్తిని పరిశీలనగా చూడకపోవడంతో అతడో గొప్ప అవకాశాన్ని మిస్సయ్యాడు.
ఎందుకైనా మంచిదనుకుంటూ...ఆ పేపర్ ని మడిచి తన ప్యాంటు జేబులోకి తోశాడు.
* * *
రాత్రి పదకొండు దాటింది.
వంట గదిలోకి వెళ్లి, ఆమ్లెట్ వేసి బ్రెడ్ మధ్యలో పెట్టి అతనికి యిచ్చాడు భార్గవ. ఆవురావురుమంటూ తిన్నాడు. ఫ్రిజ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసిచ్చాడు. ఒక్క చుక్కకూడా వదలక
గటగటమాంటూ తాగేశాడు.
అతడు రిలాక్సయ్యాక...
"ఇప్పుడు చెప్పండి మీ ప్రేరేమిటి? మీకేమైనా గుర్తొస్తోందా?" అని అడిగాడు.
ఆ వ్యక్తి కాసేపు రెండు చేతులతో కణతలు నొక్కుకుని "నా పేరు...న పేరేమిటబ్బా...కృష్ణా?
శోభానబాబా? సుమనా? గుర్తు రావడంలేదు"అంటూ గొణుక్కున్నాడు.
"ముందు మీరు రిలాక్స్ అవ్వండి" అంటూ అతడికి ప్రత్యేకంగా పడక ఏర్పాటుచేసాడు. అటకమీద వున్న టేబుల్ ఫ్యాన్స్ కిందికి దించి ఓ స్టూలు మీద పెట్టి, స్విచాన్ చేశాడు.
అతను బుద్ధిగా కళ్లు మూసుకున్నాడు. భార్గవకు నిద్ర రావడంలేదు.అతని మనసునిండా ఆలోచనలే. ఏంచేయాలి?రేపు పొద్దునే పేపర్ లో వున్న అడ్రస్ కు వెళ్లాలా?బ్యాంకుకు సెలవు పెట్టాలా?రకరకాల ఆలోచనలతో నిండిపోయింది అతని మస్తిష్కం.
పేపర్ చదవడం వల్ల ఉపయోగం వుండదని తనిన్నాళ్ళూఅనుకున్నందుకు తనను తానే తిట్టుకున్నాడు.ఎంత మంచి ఆవకాశం...రేపటినుంచి అన్ని పత్రికలు తెప్పించుకోవాలి' అనుకున్నాడు.
* * *
అర్దరాత్రి పన్నెండు అయింది.
నగరం నిద్రపోయింది. ఎక్కడో కుక్కల ఏడుపు సన్నగా వినిపిస్తోంది. దెయ్యాలను చూసి కుక్కలు ఏడుస్తాయని ఎక్కడో చదివాడు భార్గవ.
నిజానికి అతడికి దెయ్యాలంటే నమ్మకం లేకపోయినా రాత్రిపూట వాటి ప్రస్తావన వస్తే భయపడిపోతాడు.
అది అర్దరాత్రి కావడం, కుక్కలు ఏడవడం,(ఏడ్చినట్టు అతను భ్రమపడడం )అతడిని భయాందోళనలకు గురిచేశాయి.
వెంటనే లేచి బీరువాలో వున్న హనుమాన్ చాలీసా తీసుకుని చదవడం మొదలెట్టాడు.
ఓ పది నిమిషాలు తర్వాత అతని భయం మత్తు వదిలింది.మెల్లిగా లేచి,హాలులోకి వెళ్ళి చూస్తే అతడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.
రేప్పొద్దున్నే అతడిని అప్పగించాలని నిశ్చయించుకున్నాడు. అయినా భార్గవ మనసు స్దిమితంగా లేదు.వెంటనే అప్పగిస్తే?
హమ్మో...అసలే మతి స్దిమితం లేని వాడు. అతణ్ణి కాపలా కాయడం చాలా కష్టం. అలా కాకుండా వెంటనే అప్పగించడమే మంచిదనుకున్నాడు.
అడ్రస్ గుర్తు చేసుకున్నాడు. గుర్తుకు రాలేదు. పేపర్ కోసం వెతికాడు. అప్పుడు గుర్తొచ్చింది. పేపర్ ని తను ఫ్లయ్ ఓవర్ మిదే వదిలేసిన విషయం.
అతని గుండె గుభేలు మంది. కొంపదీసి ఆ కానిస్టేబుల్ పేపర్ లోని ప్రకటన చూడలేదు కదా...చూసి తన అడ్రస్ పట్టుకుని అతణ్ణి తీసుకెళ్ళిపోతే?
ఇలాంటి అనుమానాలు బోల్డు వచ్చాయి. చికాగ్గా ఉంది. దానిక్కారణం ప్రకటన వున్ఆపేపర్ మిస్సవ్వడం...
తనకు అడ్రస్ గుర్తు రాలేదు...ఇప్పుడెలా?
అటూ ఇటూ విసుగ్గా పచార్లు చేస్తూంటే గుర్తుకొచ్చింది సడన్ గా.రెండ్రోజుల క్రితం తను బ్యాంకులో నుంచి పేపర్ తీసుకొచ్చిన విషయం. చెప్పులు తెగిపోతే అటెండర్ ని అడిగి పేపర్ తీసుకొచ్చాడు.
వెంటనే హాలులో ఓ మూల వున్న చెప్పల స్టాండ్ దగ్గరకు వెళ్ళాడు. చెప్పుల స్టాండ్ పక్కనే రెండ్రోజుల క్రితం నాటి పేపర్ ఓ మూలకు పడిఉంది.
ఆ పేపర్ చేతిలోకి తీసుకొని కంగరుగా మొత్తం తిరగేశాడు. అందులో అతని ఫోటోతో తప్పిపోయిన ప్రకటన ఉంది. ఇంటి నెంబర్ పదహారు...మిథిలానగర్...గబగబ పూర్తి అడ్రస్ తన జేబులో వున్న అడ్రస్ ల బుక్ రాసుకున్నాడు.
ఓసారి అతని వైపు చూసి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు.
అర్దరాత్రి రెండు అవుతూండగా మెలకువ వచ్చింది భార్గవకు. ఎవరో తన దుప్పటిని లాగేస్తున్నారు.
భయంగా కళ్లు తెరిచాడు.
ఎదురుగా ఆ మతి స్దిమితం లేని వ్యక్తి.
అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
పళ్ళన్నీ బయటకు కనిపించేలా పెట్టి నవ్వాడు.
అతని నవ్వుకు భార్గవ శరీరం జలదరించింది.
అతని చేతివ్రేళ్లు గోళ్లు హఠాత్తుగా పెరగసాగాయి.
రెండు వైపులా కోరల్లా వచ్చాయి.
భార్గవకు ముచ్చెమట్లు పోశాయి.
అతనికి క్రితం రాత్రి తను చదివిన ఇంగ్లీష్ నవల 'వాంపయిర్' గుర్తొచ్చింది.
శరీరమంత చెమట.
ఆ వ్యక్తి భార్గవ గొంతు చుట్టూ తన చేతులు బిగించి తన గోళ్లను అతని కంఠం దగ్గరికి తీసుకువచ్చాడు.
డిమ్ లైట్ ఆరిపోయింది.
మూలాన వున్న వాటర్ జగ్ కింద పడింది.
పిల్లి కీచుమని అరిచింది.
'నను....న.....న్ను.....చం.....పొ.....ద్దు' అరిచాడు.
ఉలిక్కిపడి లేచాడు భార్గవ.
డిమ్ లైట్ వెలుగుతూనే ఉంది.
వాటర్ జగ్ టేబుల్ మీద ఉంది.
భయం.....భయం హాలులోకి తొంగి చూశాడు.
అక్కడ....
ఆ మతిస్థిమితం లేని వ్యక్తి నిద్రపోతున్నాడు 'ప్రశాంతంగా'
ఒక్క క్షణం నిట్టూర్చి ఊపిరి పీల్చుకున్నాడు.
అంటే తనకొచ్చిందీ కలా? ఎంత భయంకరమైన కల కలకే వణికిపోయేడు.
చిన్నప్పట్నుంచి తనకు కలలంటే భయం. దానిక్కారణం.....తనకెప్పుడూ భయంకరమైన కలలు రావడం . పెద్దయ్యాక సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ చేస్తే, దాని గురించి కంగారు పడవద్దని చెప్పాడు.
తనకు హార్రర్ పిక్చర్స్ అన్నా, క్రైం నవలలన్నా ఎక్కువిష్టం. ఎప్పుడూ అదే ధ్యాసలో వుండడం ఒక కారణం. రాత్రిళ్లు హార్రర్ సినిమాలు చూడ్డం.....నవలలు చదవడం మానేయాలనే నిశ్చయానికి వచ్చాడు భార్గవ.
అది తాత్కాలికమే.
తెల్లవారితే అతనికి షరా మామూలే.
గ్లాసుడు నీళ్లు తాగి మంచమ్మీద కూచున్నాడు, టీపాయ్ మీద ఇంగ్లీష్ నవల ఉంది. అదీ క్రైం నవల.
కొద్దిగా చదవగానే భయమేసింది. ఓ హాస్పిటల్ పేషెంట్లను చేర్చుకొని, వాళ్ల అవయావాలు కిడ్నీలు, కాలేయం తీసి అమ్ముకుంటూ ఉంటారు. ఓ పేషెంట్ కు చాలా కాలానికి కానీ తన కిడ్నీల్లో ఒక కిడ్నీ లేదని తెలియదు. చదువుతున్నంత సేపు ఏమనిపించలేదు. కానీ, చదవడం పూర్తయ్యాక భయమేసింది. నిజంగా ఇలా జరుగుతుందా?
భార్గవకు ఎంత భయమేసిందంటే హాస్పిటల్ కు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినా, వెళ్ళకూడదనుకునే నిర్ణయానికి వచ్చేంత.
ఫ్యాన్ స్పీడుగా తిరుగుతున్నా మొహమంతా స్వేదం అలుముకునే ఉంది.
భార్గవ ఆలోచనలు మళ్ళీ పిచ్చాడి మీదికి మళ్ళాయి. అతడ్నేం చేయాలి?
బుర్ర వేడెక్కినట్టనిపించింది.
కళ్లు మండుతున్నాయి. అలాగే వెనక్కీ వాలి నిద్రకు ఉపక్రమించాడు
తెల్లవారక ముందే మెలకువవచ్చింది.