తీవ్రంగా ఏదో ఆలోచిస్తున్నాడు.
"రామానందస్వామి" పేరు మాత్రమే అతడి బుర్రలో తిరుగుతోంది. సిగరెట్ అర్పకుండానేడానికి మరోసిగరెట్ అంటించుకొన్నాడు.
రామానందస్వామి!
అవును అదే పేరు!
రాధారాణి హ్యాండ్ బాగ్ లో దొరికిన ఉత్తరం, రామానంద స్వామి పేరు, అతడి బుర్రలో గిర్రున తిరుగుతున్నాయ్. నిన్నరాత్రి హైదరాబాద్ చేరుకొన్న రామానందస్వామి మొదటి భారీ ఈమేనా?
"ఆ సంగతి మీకేలా తెలిసింది?"
"అతడే రాశాడు."
"ఇద్దరికి రాశాడా?"
"అవును"
"ఆ ఉత్తరాలు తెచ్చారా?"
"ఆ!" అంటూ సూర్యం ఫ్యాంట్ జేబుల్లో నుంచి ఉత్తరాలు తీసి నరేంద్రకు అందించాడు.
నరేంద్ర ఉత్తరాలు విప్పి సంతకం చూశాడు. ఉత్తరంలో హండ్ రైటింగ్ చూశాడు" అవును! వాడే అతడే! మనసులోనే మననం చ్సుకొన్నాడు. ఉత్తరాలు మడిచి పక్కన పెట్టాడు.
"చదవండి సార్!"
"చదువుతాను. ముందు ఇది చెప్పండి ఇప్పుడు అతను ఎక్కడ దిగాడు?"
"ఏదైనా హొటల్లో అని అడుగుతున్నాను"
"మాకు తెలియదు"
"మీకు తెలుసు చెప్పండి!" గద్దించాడు.
"వెంకట రమణ ప్యాలెస్, జూబ్లీహిల్స్, రూం నెం.13" గబగబా అనేసింది అనసూయ.
"ముందు తెలియదన్నారుగా?"
ఇద్దరూ మాట్లాడలేదు.
"అయితే ఇక మీరు వెళ్లొచ్చు. ఒంటిగంట కావస్తోంది.
వాచీ చూసుకొని నరేంద్ర అన్నాడు.
"మేము ఇక్కడకొచ్చింది రామకృష్ణ ఏ హొటల్లో దిగాడో చెప్పడానికి కాదు" అనసూయ కోపంగా అన్నది.
"మరెందుకూ?" ఆమె కేసి కొంటెగా చూస్తూ అన్నాడు.
మిస్టర్ నరేంద్రా! మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు. మీ మీద ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాం. మా ప్రాణాలకు రక్షణ కల్పిస్తారని వచ్చాం. మీరు చెయ్యవలసిన సహాయం ఎంతో ఉంది. హగిన ప్రతిఫలం ముట్టజెప్పుకుంటాం. నా జీవితం మీరు చెయ్యబోయే సహాయం మీదే ఆధారపడి ఉంది." అన్నది అనసూయ గద్గద కంఠంతో. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"నా నుంచి మీరు ఎలాంటి సహాయం ఆశిస్తున్నారు?" నరేంద్ర సూటిగా అనసూయ ముఖంలోకి చూస్తూ ప్రశ్నించాడు.
ముందొక్కసారి మీకు ఆ ఉత్తారాలు చూడండి. పెద్ద ఉత్తరాలేమీ కావు. ఒక్కొక్కదానిలో రెండులైన్లు మాత్రమే రాశాడు. ఒకసారి చూడండి,ప్లీజ్."
"ఒక్క క్షణం ఉండండి" అంటూ నరేంద్ర లోపలకు వెళ్లాడు.
ఐదు నిముషాల్లో నరేంద్ర అసిస్టెంట్ విజయ్ తో తిరిగివచ్చాడు.
విజయ్ నరేంద్ర పక్కనే సోఫాలో కూర్చొని కళ్ళు నులుపుకొని అనసూయను చూశాడు. చూస్తూనే ఉండిపోయాడు కొద్దిక్షణాలు.
"మిమ్మల్ని ఎక్కడో చూశాను" అనసూయతో అన్నాడు.
"అబిడ్స్ లోనో, టాంక్ బండ్ మీదో చూసి ఉంటావులే. మాట్లాడకుండా ఆమె చెప్పేది విను" విజయ్ కేసి కోపంగా చూస్తూ అన్నాడు నరేంద్ర.
అనసూయ విజయ్ కేసి జాలిగా చూసింది.నరేంద్ర కేసి తిరిగి "ఆ ఉత్తరాలు" అన్నది.
"అందులో ఏమీలేదు, వెండెట్టా నవల చదివావా అని మీ రెండో భర్తకూ, "వెండెట్టా" నవల ఆ కథ ఏమిటో నీ రెండోమొగుణ్ణి అడిగితెలుసుకోవలసిందిగా నీకూ రాశాడు. అంతేగా?" నరేంద్ర అన్నాడు .
"అంటే వెండెట్టా "లోని హీరోలా మమ్మల్ని హింసించి హిసించి చంపుతాననేగా?" అన్నాడు సూర్యం.
"కాదు చంపడం అతని ధ్యేయం కాదు. మీరు బతికి ఉండాలి. జీవితం అంతా కుళ్ళుతూ , రోజూ చస్తూ వందేళ్ళు బతకాలని అతని లక్ష్యం."
"హారిబుల్!" అన్నాడు సూర్యం.
అనసూయ కళ్లల్లో బోలెడంత దిగులు.
"చెప్పండి" అన్నాడు నరేంద్ర.
అనసూయ గొంతు సవరించుకొని చెప్పసాగింది.
"నేనూ రామకృష్ణా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం.ఇది ఐదు సంవత్సరాలయింది జరిగి. ఓ స్నేహితురాలి ద్వారా రామకృష్ణతో నాకు పరిచయం ఏర్పడింది. ఇద్దరం ఇష్టపడి రిజిష్ర్ మారేజి చేసుకున్నాం. అతనికి నేనంటే ప్రాణం...."
"మరి మీకో?" మధ్యలో అద్దం వచ్చి అనసూయకళ్ళల్లో గుచ్చి చూస్తూ ప్రశ్నించాడు నరేంద్ర.
"పరస్పరం ఇష్టపడే పెళ్ళి చేసుకున్నామని చెప్పగా?" కోపంగా అన్నది అనసూయ.
"సరే! చెప్పండి! ఆ తర్వాత?"
"మా దాంపత్య జీవితం ఏ ఒడుదుడుకులు లేకుండా ఒక సంవత్సరంపాటు గడిచిపోయింది."
"సంవత్సరం లోపల ఎవరికీ ఎవరి మీద మొహం మొత్తింది?" విజయ్ అడిగాడు,
"ప్లీజ్ ముందు నేను చెప్పేది వినండి- ఆ తర్వాత ప్రశ్నలు వెయ్యండి", విసుగ్గా అన్నది అనసూయ.
"రామకృష్ణకు ఓ అక్క ఉంది. ఆమె పేరు కమలాంబా. రామకృష్ణ ఆమెకంటే చాలా చిన్నవాడు. అతడికి తొమ్మిదేళ్ళు నిండకుండానే ఒకయక్సిడెంటులో తల్లితండ్రి పోయారు.
ఆమె చిన్నప్పుడు రామకృష్ణను పెంచింది, అతను మేజర్ అయ్యేంత వరకూ అతడి ఆస్తి మీద వచ్చే ఆదాయాన్ని అనుభవించారు. ఆమెకు ఒక కూతురు ఉంది. ఆ పిల్ల పేరు లావణ్య . పేరు లోనే కాని రూపంలో లావణ్యం ముచ్చుకైనా కన్పించదు. ఆ పిల్ల రామకృష్ణ కంటే ఆరేళ్ళు చిన్నది. ఆ విల్లను ఇచ్చి పెళ్ళి చెయ్యాలని అక్కాబావల ప్రయత్నం- ఇయితే అతడి బావ క్యాన్సర్ వల్ల ఐదేళ్ళ క్రితం చనిపోయాడు.
రామకృష్ణ అక్కకు నన్ను చూస్తే గిట్టదు. లావణ్యకు కూడా నా మీద చాలా కోపం నేను రామకృష్ణ ఆస్తికోసం అతడ్నివలలో వేసుకున్నానని వాళ్ళు ప్రచారం ప్రారంభించారు....."
"అది ఒక వేళ నిజమేనేమో!" అన్నాడు విజయ్.
అనసూయ విజయ్ కేసి చురచుర చూసింది.
"మీ అసిస్టెంటును కొంచెం సేపు మాట్లాడవద్దని చెప్పండి" అన్నది నరేంద్రతో-
నరేంద్ర విజయ్ కేసి సీరియస్ గా చూశాడు.
"ఊ! చెప్పండి!" అన్నాడు అనసూయతో.
"న్యాయంగా వీళ్ళిద్దరి దృష్టో అతడి ఆస్తి మీద ఉంది.
"అని మీరెలా చెప్పగలరు?" అని "సారీ" అన్నాడు విజయ్.
ఆమె విజయ్ ను పట్టించుకోకుండా చెప్పసాగింది.
"వారి ఆశలు నెరవేరలేదు. రామకృష్ణకు మాత్రం అక్క అన్నా, అక్కకూతురన్నా చాలా ప్రేమ. బాగా కట్నం ఇచ్చి అయినా మంచి సంబంధం చూసి మేనకోడలికి పెళ్ళి చేస్తాననేవాడు. అంతేకాదు వాళ్ళ ఆశను నిరాశ చేసినందుకు తన ఆస్తిలో కొంత భాగం వాళ్ళక్కకు ఇస్తాననేవాడు."
"అందుకు మీరేమనేవారు?" నరేంద్ర ప్రశ్నించాడు.
"నేను ఎప్పుడూ ఆయన మాటకు అడ్డు చెప్పేదాన్ని కాదు అయన చాలా చిత్రమైన మనిషి . ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండే వారు నేను ఎంత అడిగినా చెప్పేవారుకాదు. తరగని ఆస్తి ఉంది ఆయన దిగులేమిటో. దేన్నీ గురించో నాకు అర్థం అయ్యేదికాదు. ఒకో సారి ఆయన ధోరణి నాకు చాలా విసుగు కలిగించేది.
"అనూ! నన్నెందుకిలా బాదపెడ్తావ్? నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వివా?" అనేవారు నేను నిలదీసి ఏదైనా అడిగితే. కమలాంబా, లావణ్యా నా మీద లేనిపోనివి కల్సించి చెప్పేవారని తెలిసింది. ఆయన ప్రవర్తన చూస్తే అసలు ఆయనకు ఈ ప్రపంచం మీదా, ఈ మనుషుల మీదా, విశ్వాసంలేనట్టుగా అన్పించేది."
"అందుకు మీ ప్రవర్తన కూడా కారణం ఎందుకు కాకూడదూ? అన్నాడు విజయ్.
"నా సంగతి మీకేం తెలుసని అలా మాట్లాడుతున్నారు?" కోపంగా అన్నది అనసూయ.
"సరి! చెప్పండి" అన్నాడు నరేంద్ర.
"ఇక రోజు రాత్రి ఆయన ఒక మనిషిని వెంటబెట్టుకొని వచ్చారు. అతడుతన ప్రాణస్నేహితుడని చెప్పి నాకు పరిచయంచేశారు."
"ఎవరా వ్యక్తి?" నరేంద్ర సూర్యనారాయణను చూస్తూఅడిగాడు.
"మీ అనుమానం కరక్టే"
"అంటే?" నరేంద్రకు అనసూయ చాలా తెలివైందని అర్థం అయింది.
"ఇంకెవరు?" వీరే? అంటూ అనసూయ సూర్యనారాయణను చూపించింది.
"ఓ! అలాగా!" అని నరేంద్ర సూర్యంకేసి నొసలుచిట్లించిచూశాడు.
"మీ ఇద్దరికీ ఎంత కాలంగా పరిచయం?" అన్నాడు విజయ్.
"ఆ రాత్రి ఆమె భర్త పరిచయం చేసిన నాటినుంచే " అన్నాడు సూర్యం.
మీ ఇద్దరికీ కాదు రామకృష్ణకు మీకూ?" అన్నాడు విజయ్.
రామకృష్ణా నేనూ వైజాగ్ యూనివర్సిటిలో చదువుకొన్నాం. ఎం.ఎ.పూర్తి అయాక నేనూ ఉద్యోగం వేటలో పడ్డాను. వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ కంపెనీలో చేరాను. ఆ ప్రొప్రయిటర్ కూ నాకూ పడక సంవత్సరం తిరక్కుండా రిజైన్ చేశాను. ఉద్యోగం వేటలో హైదరాబాద్ చేరుకున్నాను. ఉద్యోగం కోసం వేట సాగించాను. ఒక రోజు అనుకోకుండా రామకృష్ణ అబిద్ లో కన్పించాడు. నా గొడవంతా చెప్పుకున్నాను. అయితే రామకృష్ణ నాకు అంత సహాయం చేస్తాడనుకోలేదు."
"ఏం చేశాడు? తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడా?" నరేంద్ర ప్రశ్నించాడు.
"నన్ను హైదరాబాద్ లోనే ఆటోమొబైల్ వర్క్ షాప్ పెట్టుకోమన్నాడు. నా దగ్గర డబ్బులేదన్నాను. అందుకు కనీసం లక్షరూపాయలన్నా కావాలి. తమ కావాల్సిన పెట్టుబడి పెడ్తానన్నాడు. పెట్టాడు అన్నమాట ప్రకారం. చాలా పెద్ద ఎత్తునే కంపెనీ పెట్టాడు. అందులో సగభాగం అనసూయ పేరునా, సగ భాగం తన పేరునా రిజిష్టర్ చేయించాడు. కంపెనీ మానేజ్ మెంటంతా నాకు అప్పగించాడు. నెల జీతం రెండు వేలు కాక, లాభాలలో మూడో భాగం నాకు వచ్చేట్టు రాశాడు. అతడి రుణం ఈ జన్మలో తీర్చుకోగలిగిందికాదు. అతడికి ఆజన్మాంతం కృతజ్ఞుణ్ణి...."