(అమల్ -విమల్ -కమల్ -ఇంద్రజిత్ వచ్చి పరీక్ష రాయటానికి వచ్చి కూర్చుంటారు. స్టూలు- టేబుల్ -ప్రశ్న పేపరు - కాపీ - రచయిత తీచరులా తిరిగి తిరిగి వాచ్ చేస్తుంటాడు.)
రచ : (కొంచెం ఆగి)
Time up stop writing please.
(వారు త్వరత్వరగా -రాస్తుంటారు. రచయిత ఒక్కొక్కరి దగ్గర పేపర్ల తీసుకొంటూ వుంటాడు. వాళ్ళు పరీక్షపేపర్ల గురించి మాట్లాడుకొంటూ నిరాశగా- భయంగా వెళతారు.)
రచ : స్కూలునుండి కాలేజికి-
కాలేజి-పరీక్ష -పరీక్షప్యాస్ - మళ్ళీ ప్రపంచం.
(అమల్ -విమల్ -కమల్ -ఇంద్రజిత్-ప్రవేశం)
అమల్ : ప్యాసయాక, ఏం చేస్తావ్?
విమల్ : ముందు ప్యాసవనీ.
కమల్ : ప్యాసయినా , ఫేలయినా, నేను ఉద్యోగం చెయ్యాల్సిందే. నాన్నగారు ఈ సంవత్సరం రిటైరు అవుతున్నారు.
విమల్ : నీకేమయ్యా! నేను ముగ్గురు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి.
కమల్ : ఇంతవరకు నిశ్చింతగా తిరిగాను. పరీక్ష ఫలితాలు తెలిసే రోజులు దగ్గరపాడుతుంటే, నాకు ముద్ద మింగుడు పడటం లేదు.
రచ : అమల్ కుమార్ !
(అమల్ సంతోషంతో కెవ్వుమంటాడు. అందరూ వీపు తట్టి, అభినందిస్తారు.)
విమల్ కుమార్.
(పైలాగే జరుగుతుంది)
కమల్ - ఇంద్రజిత్.
(ఒకరినొకరు అభినందించుకోంటారు. పిన్ని వస్తుంది. అందరూ పాదాభివందనం చేస్తారు. ఆమె దీవిస్తుంది. వెళ్ళిపోతుంది. నలుగురూ వెళతారు.)
రచ : ఇది మరోప్రపంచం. ఈసారి విద్యాదికులు ఈకుర్చీలో కూర్చొని పరీక్ష ఇస్తారు. బయట వేసివున్న బల్లమీద అమల్ , విమల్, కమల్, ఇంద్రజిత కూర్చొని వుంటారు.
(అమల్ , విమల్, కమల్, లోపలకువచ్చి బెంచీమీద కూర్చోబోతారు.)
కొంచెం వుండండి. ఒక్కనిమిషం.
(ముగ్గురూ వెళ్ళిపోతారు)
రచ : మర్చి పోయారు చెప్పటం. ఆ కుర్చీలు అక్కడలేవు, బెంచీల సంగతికూడా మార్చిపోండి. ఇక్కడ పచ్చని గడ్డివుంది. ఇవన్నీ చెట్లు. ఆ చెట్టు పై భాగంలో సింధూరరేఖ కనిపిస్తుంది. రోజూ ఉదయించే సూర్యుడు ఇవ్వాళా ఉదయించాడు. ఇప్పుడస్తమిస్తున్నాడు.
అదిగో, అటు, ఎంత చిక్కని సింధూరరేఖ కనిపిస్తుందో చూడండి.
(అదే సమయంలో, మానసి, ఇంద్రజిత్ ప్రవేశిస్తారు ఇద్దరూ చెట్టుక్రింద నిలుచుంటారు. మానసి చేతిలో ఒక పుస్తకంవుంది. రచయిత సిందూరరేఖ చూట్టంలో నిమగ్నుడై వుంటాడు.)
మానసి : నువ్వునాకు ఈపుస్తకం ఎందుకిచ్చావ్? న్యాయంగా నేను నీకు యివ్వాలి.
ఇంద్ర : ఎందుకు?
మానసి : ఎందుకేమిటి? నువ్వు ప్యాసయినందుకు.
ఇంద్ర : నేను ప్యాసయితే నువ్వు పుస్తకం యివ్వాలని ఎక్కడయినా రాసిపెట్టివుందా? నేనే ఎందుకివ్వ కూడదు?
మానసి : రాసిపెట్టి వుండాలా? అది పద్ధతి.
ఇంద్ర :పద్దతులమీద నమ్మకం వుందా ?
మానసి : (నవ్వుతూ) వుందంటే నువ్వూరుకుంటావా ?
ఇంద్ర :నా నమ్మకాలను ఒప్పుకొంటావా?
మానసి : ఆడపిల్లలు ఒప్పుకొక చేసేదేముంది?
ఇంద్ర : ఆడపిల్లలు - ఈ మాట ఎన్నోసార్లు అన్నావు. ఆడపిల్లలు - నియమాలను పాటించాలి. మగవాళ్ళు పాటించకపోయినా, ఫర్వాలేదు. అవునా?
మానసి : నేను నిజమే అంటున్నాను.
ఇంద్ర : నేను కూడా నియమాన్ని పాటిస్తాను. చదవాలన్నారు. చదివాను. పరీక్ష ఇవ్వాలన్నారు - ఇచ్చాను, ఉద్యోగం చెయ్యాలంటున్నారు -చేస్తాను. మరి ఇదంతా నియమపాలన కాదూ? ఒకటి-నియమం లేక పోయినా ఉద్యోగం చేస్తాను.
మానసి : ఎందుకు?
ఇంద్ర : అనేక కారణాలు. నా కాళ్ళమీద నేను నిలబడాలి. ఇంటివాళ్ళ డబ్బుతో నేను చదువుకోవడం అంటే నాకు ఎలా వుంటుందో నీకు చెప్పాను.
మానసి : ఇంకా!
ఇంద్ర : చాలా వున్నాయి. నువ్వొక సంగతి చెప్పు?
మానసి : ఏమిటది!
ఇంద్ర : నియమాలను పాటించాలి అనే వాక్కునుకూడా పాటించాలా?
మానసి : పాటించక ఏం చేస్తావ్ ?
ఇంద్ర : నియమాలను అసహ్యించు కొంటాను, కనీసం, ఆ మాతం స్వంతంత్రత వుండొద్దు?
మానసీ : దానివల్ల ప్రయోజనం ?
ఇంద్ర : నన్ను కట్టేసిన తాడును పూజించటంలో ప్రయోజనం?
మానసీ : పూజించమని ఎవరంటున్నారు?
ఇంద్ర : తాడును, నియమంగా తీసుకొని స్వీకరించటానికీ, దాన్ని పూజించటానికీ భేదం ఏముంది?
మానసీ : ఇన్నిటికీ, నువ్వు చెయ్యదలచిందేదో చెప్పరాదు?
ఇంద్ర : నన్ను కట్టేసిన త్రాళ్ళను తేంపేస్తాను. నాచుట్టూ వున్న గోడల్ని పగలగోడతాను.
మా : కోపం, ఎవరిమీద ?
ఇం : ప్రపంచంమీద-మీరు గౌరవించే సంఘంమీద. నేను, నీతో ఒకసారి లీలను గురించి చెప్పాను. గుర్తుందా?
మా : ఆమె భర్తకు-టి.బి. అన్నావు కదూ?
ఇం : అతను చనిపోయి చాలారోజులయింది. ఆమెను - అత్తగారింటినుంచి తరిమేశారు.
మా : తర్వాత?
ఇం : ఎవరో దూరం బంధువట. అతనికి ఒక చిన్న దుకాణం వుంది. వాళ్ళంతా, దొంగతనాల కేసుల్లో చిక్కుకొని వున్నారట.
మా : ఆ - అమ్మాయి ఏమయింది?
ఇం : జరుగరానిదే జరిగింది. మూడు నెలలయిందట. నాకు నిన్ననే తెలిసింది.
(మానసి మౌనంగా వుండిపోయింది.)
ఇం : నేను రోజూ బస్సు ఎక్కే స్టాపులో ఒకరోజుఒక కుర్రాడు - బూట్ పాలిష్ చేస్తానని నన్ను పట్టుకోన్నాడు. వాడికేడెనిమిది యేళ్ళుంటాయి. వాడిచంకలో సంవత్సరం పిల్లవాడు పాలిష్ తో మునిగి వున్న గుడ్డపీలికతో ఆడుకుంటున్నాడు.
(మానసి మౌనంగానే వుండి వింటూంది.)
ఇం : నేను, పాలిష్ చేయించుకోలేదు. ఒక్క పైసగూడాయివ్వలేదు. విదిలింఛికొట్టాను. నన్ను వాడు విసిగించి వుంటే, బహుశా, కొట్టేవాణ్ని కూడా నేమో!