"అదీ! అట్లా రా దారికి. అయితే వాడిదేం తప్పుంది? వాడ్ని గుర్తుపట్టాలని ఎగాదిగా చూసి ఉంటానే స్టేషన్ లో అప్పగించాలని బయలుదేరావ్. వాడు వస్తున్నాడో లేదోనని తిరిగి తిరిగి చూశావ్? అవునా?" అన్నాడు నరేంద్ర.
"ఆ! ఆ! అవును!" అన్న ముఖంలోకి చూడకుండానే తలదించుకొని అన్నది సునంద.
"అందుకే వాడు నీ వెంటపడ్డాడు వాడ్ని తిరిగి తిరిగి చూస్తూ నడుస్తున్నావ్? నువ్వు వాడి వంకే చూస్తున్నావని ఆశపడో, భ్రమపడో నీ వెంట పడ్డాడు. వాడి తప్పేంలేదు. తప్పంతా నీదే." అన్నాడు నరేంద్ర సునంద కేసి తీవ్రంగా చూస్తూ.
సునంద ముఖం కోపంతో ఎర్రబడింది. భుజంమీద ముందుకు వాలి ఉన్న జడను వెనక్కు విసురుకుంది.
"బావా నీకు తెలియదు ఉరుకో. వాడెవడో దొంగ రాస్కెల్ అయి వుంటాడు." హీరో పోజుపెట్టి అన్నాడు విజయ్.
విజయ్ తనను సమర్థించడంలో సునందకు ఉషారు వచ్చింది.
"అది కాదండీ ఇన్ స్పెక్టర్ గారూ! మీరు ఇంతమందిహంతకుల్ని, దొంగల్ని పట్టుకొని జైళ్ళకు పంపుతున్నారు గదా.....?"
"ఈయన పట్టుకుంటున్నాడా?" విజయ్ ఎగతాళిగా అన్నాడు.
"ఉహూ!నువ్వే పట్టుకుంటున్నావులే. అమ్మాయిని చెప్పనివ్వు" అన్నాడు అద్వయితం.
"బస్సు స్టాండుల్లోనూ, బజార్లలోనూ ఆడపిల్లల్ని అవమానిస్తూ అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళని ఎందుకు అరెస్టు చెయ్యరండి రాను అందమైన ఆడపిల్లలు బయటికి పోవడమే ప్రమాదకరంగా ఉంటుంది. మీ పోలీసులంతా ఊరికే లాఠీలు తిప్పుకుంటూ, కాళ్లు రాపాడించుకుంటూ తిరగడం తప్ప ఏమిటండీ మీరంతా చేస్తున్నది?" ఇన్ స్పెక్టర్ను రెట్టిస్తూ అన్నది సునంద.
"ఓహొ? నువ్వూ మీ బావలాగే నాకే ఎసరు పెట్టావే? అంత మాత్రానికే అరెస్టు చెయ్యాల్సి వస్తే ముందు మీబావనే అరెస్టుచెయ్యాల్సి వస్తుంది. అందమైన ఆడపిల్లలు పోతుంటే చూడకుండా ఉండలేడే?" అన్నాడు ఇన్ స్పెక్టర్ పకపక విరగబడి నవ్వుతూ.
"మా బావ అలాంటి వాడు కాదండీ. ఒకవేళ అలా చూస్తే అది మీ డిటెక్టివ్ కోసమే అయి ఉంటుంది." బావను సమర్ధించి చేతి వాచీ చూసుకుంది.
"అమ్మాయ్! ఆ మాటకొస్తే మీ అన్నయ్య మాత్రం ఏం తక్కువ తిన్నవాడు కాదులే." నరేంద్ర కేసి చూస్తూ అన్నాడు ఇన్ స్పెక్టర్.
నరేంద్ర పెదవులపైన చిరునవ్వు తొణికిసలాడింది. "మా అన్నయ్య సంగతి నాకో తెలియదుకాదు మా బావ మాత్రం అటువంటి వాడుకాదు. చాలామంచివాడు. నా వెంట బడ్డ ఆ రాస్కెల్ గాడ్ని చూపిస్తారా బావా?" సునందలేచి నిల్చుంది.
"పారిపోయాడన్నావుగా! ఎలా చూపిస్తావ్?" నరేంద్ర చెల్లెల్ని చురచుర చూశాడు.
"పొలిసు స్టేషన్ లో దూరిన నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటానుకుంటాడా ఏం? ఎక్కడో పొంచి ఉంటాడు; మళ్ళీవేసు రోడ్దు మీదకు రాగానే వెంటబడ్తాడు."
"అంత ఖచ్చితంగా చెప్తున్నావ్. వాడ్ని నువ్వే ఎక్కడైనా దాగి ఉండమన్నట్టుగా!" సాలోచనగా సువందమ చూస్తూ నరేంద్ర అన్నాడు.
సునంద బిక్క ముఖం వేసింది.
"మీ అన్నయ్య అలాగే అంటాడులే. పద! వాడి అంతుతేలుస్తాను." అంటూ లేచి నిల్వున్నాడు విజయ్.
"విజయ్! ఆగు: ఎందుకైనా మంచిది. ఒక కానిస్టేబుల్ని కూడా పింపిస్తాను." అన్నాదు ఇన్ స్పెక్టర్.
"మీ పోలిసోళ్ల కంటే మా బావే నయం. రాబావా!" హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ బయలుదేరింది సునంద. విజయ్ ఆమెను అనుసరించాడు.
"రాధా వాడు ఏ బస్ స్టాండులో నుంచి నిన్ను వెంబడించాడు? ఎలా ఉంటాడు? పొడుగ్గా ఉంటాడా? పొట్టిగా ఉంటాడా? ఆమె వెనకేనడుస్తూ అడిగాడు విజయ్.
"ఐదడుగుల పదకొండు అంగుళాలుంటాడు. చాలా అందంగా ఉంటాడు" ఉషారుగా అన్నది సునంద.
విజయ్ ఒక్కసారిగా ఆగాడు. తీవ్రంగా సునంద ముఖంలోకి చూశాడు.
"ఎందుకలా చూస్తావ్? నేను అబద్దం చెప్పడంలేదు, వాడు అచ్చంగా నీలాగే ఉంటాడు." చిలిపిగా చూస్తూ అన్నది.
విజయ్ అయోమయంగా సునంద ముఖంలోకి చూశాడు.
"అవును బావా! అంత నీలాగే ఉంటాడు."
"ఇదేం సినీమా అనుకున్నావా?"
"అవును బావా! సినీమానే!"
"అంటే?"
"అర్థంకాలా? మీరాలో మంచి పిక్చెరుంది. టైం అయిపోతుంది పద!" అంటూ సునంద్ విజయ్ చెయ్యి పట్టుకొనిపక్కనే ఆగి ఉన్న ఆటో దగ్గరకు లాక్కుని వచ్చింది.
"అంటే నువ్వు చెప్పించంతా అబద్దమేనన్న మాట?"
"మరికాకపోతే? ఎవడైనా నన్ను పిచ్చి పిచ్చిమాటలంటే ఊరుకుంటానా? చెప్పు తీసి నాలుగు తగిలిస్తాను పద! టైం అయిపోతోంది."
ఆటో డ్రైవర్ వచ్చి ముందుసీట్లో కూర్చున్నాడు.
సునంద ఆటో ఎక్కింది. విజయ్ ఉషారుగా ఆటో ఎక్కి ఎక్కి సునంద పక్కన కూర్చున్నాడు. ఆటో బయలుదేరింది.
"భలే! నాటకం ఆడావే?"
"నిన్ను బయటికి పిలవడానికి ఈ ఎత్తు వేశాను. బావా! సినీమాకు పిలిస్తే అన్నయ్య ఊరుకోడని ఈ నాటకం ఆడాను." చిలకలా నవ్వుతూ అన్నది సునంద.
"అది సరేగాని ఒకటి అడగనా?" సునంద అన్నది.
"అడుగు."
"కోపం రాదుకదా?"
"మరి పెద్ద డిటెక్టివ్ కావాలని కలలుకంటున్నావు గదా! మా అన్నయ్యను మించిన పేరు సంపాదించాలని నీ తాపత్రయంగదా! మరి ఇంత చిన్న నాటకం ఆడితే తెలుసుకోలేకపోయావేం?" రెచ్చగోడ్తూ అన్నది సునంద.
"మీ అన్నయ్య గొప్ప డిటెక్టివ్ అయితే నీ నాటకం అతడు కూడా నమ్మాడుగా!" ఉడుకుబోతుతనంగా అన్నాడు విజయ్.
"మా అన్నయ్య అంతా నాటకం అని వెంటనే గుర్తించాడు. అందుకే పట్టించుకోకుండా కూర్చున్నాడు నేను నిన్ను బయటికి తీసుకు వెళ్ళడానికి వేసిన ఎత్తని గ్రహించాడు. నా కేసి చురచురా మాశాడు. నువ్వు గమనించలేదుగాని."
"అబ్బే అంత మేదానా మీ అన్నయ్య?"
"అవును, మేధావే."
విజయ్ ముఖం గంటు పెట్టుకొని కూర్చున్నాడు.
"ఏమిటా ముఖం పెట్టడం? ఇప్పుడెలా ఉన్నావో చెప్పనా బావా"
"ఎలా ఉన్నానూ?" కోసంగా అడిగాడు.
"పెంచిన వాడి చేతనే దెబ్బలు తిన్న బొచ్చుకుక్క పిల్లలా ఉన్నావు." అని కిలకిల నవ్వింది సునంద.
ఆ పోలికను విజయ్ కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు.
3
పోలీసు స్టేషన్ లో అద్వయితం. నరేంద్ర అలాగే కూర్చుని ఉన్నారు. నరేంద్ర సిగరెట్ తాగుతూ కేసు గురించి ఆలోచిస్తున్నారు.
"నిజమే నరేంద్రా! బస్సు స్టాండ్స్ లోనూ, రైల్వేస్టేషన్లలోను ఈ పోకిరీ వెధవలు ఎక్కువయ్యారు, మొన్న మా కాన్పెరెన్సులో ఇదే డిన్కస్ చేశాం. వీళ్ళను ఏ విధంగా కంట్రోల్ చెయ్యడమా అని ఆలోచించాం." అంటూ సిగరెట్ పొగను వదులుతూ అన్నాడు ఇన్ స్పెక్టర్.
"అది నిజమే! గట్టి చర్యలు తీసుకోవాలి. కఠినంగా శిక్షించాలి అలాంటి వాళ్లను." అన్నాడు నరేంద్ర.
"చూడు! పాపం సునంద ఎంతగా బాధపడిపోయింది మామూలు మరో ఆడపిల్లయితే ఇలా పోలీసు స్టేషన్ కు కూడారాదు.
"నువ్వు సునంద చెప్పిందంతా నమ్మావా ఏమిటి?"
అద్వయితం అయోమయంగా నరేంద్ర ముఖంలోకి చూశాడు .
"విజయ్ ను బహుశా సినిమాకు లాక్కెళ్ళడానికి ఈ ఎత్తు వేసింది సునంద."
"అదేమిటి నరేంద్రా అలా అంటావ్? బిడ్డ ఎంత గాభరాగా పరిగెత్తు కొంటూ వచ్చింది?" అద్వయితం అన్నాడు.
"సునంద లోపలకు వచ్చే ముందు బయట ఆటో ఆగిన శబ్దం నీకు విన్పించలేదూ?
"వినబడింది. అయితే?" అయోమయంగా అడిగాడు ఇన్ స్పెక్టర్.
"స్టేషన్ ముందు ఆటోశబ్దం ఆగిపోయింది. ఆ తర్వాత సునంద తప్ప మరెవరూ లోపలకు రాలేదు. అంటే సునంద ఆటోలో వచ్చిందన్నమాట. సునంద లోపల ఉండగా ఆటో డ్రైవర్ మీ జవాన్ పక్కన నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు కూడా, అంటే సునంద ఆటోలో వచ్చిందనేగా?"
"కావచ్చు."
"సునంద ఆటోలో వస్తే బస్ స్టాండు మంచి ఎవడో ఎలా వెంబడిస్తాడు? అంతా నాటకం విజయ్ ను బయటకు తీసుకెళ్ళడానికి వేసిన ఎత్తు" అని నరేంద్ర చిరునవ్వు నవ్వాడు.
"అరెరే!మీ చెల్లెలు మాభలే టోపి వేసిందే."
"మనకు అనకు నాకు అను."
"అదేలే! రారా! చూద్దాం." అంటూ అద్వయితం స్టేషన్ బయటికి వచ్చాడు.
నరేంద్ర కూడా ఇన్ స్పెక్టర్ వెనకే బయటికి వచ్చి నిలబడ్డాడు.
అప్పుడే కదిలిపోతున్న ఆటోను ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తూ "టాటా" చెప్తున్నట్టుగా చెయ్యి ఊపింది.
"అబ్బొ! మీ చెల్లెలు అఖండురాలయ్యోవ్! విజయ్ ఆమె ముందు ఎందుకూ పనికిరాడు. అది సరే! ఇదంతా నేను గమనించనే లేదు సుమా. నువ్వెలా తెలుసుకొన్నావ్?"
"అందుకే మీ పోలేసోళ్ళకు మా అవసరం ఉంటుంది." నవ్వుతూ అన్నాడు నరేంద్ర.
అద్వయితం గతుక్కుమన్నాడు.
"వాళ్ళిద్దరికీ త్వరగా పెళ్ళి చేసేస్తే పోలా? పాపం! ఎందుకు ఆలస్యం చేసి వాళ్ల నిలా బాధపెడ్తున్నావ్? మాట మారుస్తూ అన్నాడు అద్వయితం.
"నేనూ చేసుకోమనే అంటున్నాను. మా అమ్మయితే ఒకటేపోరు పెడ్తున్నది."
"మరి ఆలస్యం దేవికి? విజయ్ ఇప్పుడే చేసుకోనంటున్నాడా?"
"విజయ్ కు కూడా తొందరగానే ఉంది. కాని సునందే ఎం. ఎ. పూర్తి అయేంత వరకూ చేసుకోనని భీష్మించుకొని కూర్చుంది."
"మొత్తంమీద మీ చెల్లెలు అఖండురాలు." నరేంద్ర ముసి ముసిగా నవ్వుకొన్నాడు.
4
"మిస్టర్ అద్వయితం! నాకు నిద్రొస్తోంది." వళ్ళు విరుచుకొని ఆవలిస్తూ అన్నాడు మత్తుగా డిటెక్టివ్ నరేంద్ర.
"అంటే. ఇన్ డైరెక్టుగా నన్ను వెళ్ళమంటున్నావ్. అంతేనా?" ఇన్ స్పెక్టర్ అద్వయితం జావకారి పోతూ అన్నాడు.
"మరి! అనేగా? ఆ మాట వేరే చెప్పాలా?" నరేంద్ర మత్తుకళ్లతో చూస్తూ అన్నాడు.
అద్వయితం వాచీ చూసుకున్నాడు.
"ఎంతయింది?" అడిగాడు నరేంద్ర.
"ఇంకా కూడా కాలేదు. అప్పుడే నిద్ర అంటున్నావ్!
"నిద్ర వస్తోంది. ఇంకా కూర్చుని ఏం చెయ్యమంటావ్?"
"రాధ హ్యాండ్ బ్యాగ్ లో దొరికిన ఉత్తరాల గురించి మాట్లాడదామని వచ్చాను."
"వాటి గురించి రేపు ఆలోచిద్దాం లేవయ్యా! విసుగ్గా అన్నాడు నరేంద్ర.
"నరేంద్రా! అసలు విషయం చెప్పడం మరచాను, సోముందరాన్ని స్టేషన్ కు పిలిపించి బెదిరించాను."
` "ఓహొ! అప్పుడే నీకు అనుమానం వచ్చిన వాళ్ళను ఇంత రాగేట్ చెయ్యడం ప్రారంభింఛావన్నమాట?"
"అబ్బే: ఇంటరాగేట చెయ్యలేదు. ఊరికే కదిపి చూశాను. అంతే!"
"ఓ.కె. మాస్టర్ అద్వయితం నాకు చాలా అలసటగా ఉంది. ఈ విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్" అనేసి నరేంద్ర మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా బెడ్ రూం లోకి వెళ్ళి పోయాడు.
అయిష్టంగానే "గుడ్ నైట్" అని అద్వయితం బయటకు వచ్చాడు.
పోర్టుకోలోకి వచ్చి పోలీస్ జీప్ ఎక్కాడు. జీప్ వెళ్ళిపోగానే పని కుర్రవాడు గేటు వేసి లోపలకు వచ్చాడు.
నరేంద్ర పక్క మీద నడుం వాలుస్తూనే గాఢ నిద్రలోకి జారి పోయాడు.
ఎలక్ ట్రిక్ బెల్ ఒక్కటే మోగుతోంది.
"ఐదు నిముషాలపాటు గింగురు మంటూ మోగింది.
అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.
నరేంద్రకు మెలుకువ వచ్చింది. విసుగ్గా మంచం దిగారు. తన గదిలో నుంచి బయటకి వచ్చాడు. హాలులో ప్రవేశించి పోర్టికోలైటువేశాడు.