పదిహేను కాదు పదహేడు నిముషాలు పట్టింది సర్కిల్ సుధాకర్ రావడానికి .ఆదరాబాదరా గదిలో అడుగుపెటుతూనే సాల్యూట్ చేశాడు. ఇంత గోప్యంగా ఆమె ఛార్జీ తీసుకోవడం అతడు సైతం ఊహించనిదే.
భారీగా వున్న సుధాకర్ విగ్రహాన్ని చూస్తూ అడిగింది. " ఇప్పుడు టైమెంతో చెప్పగలరా మిస్టర్ సుధాకర్?"
"పదకొండు గంటల పదిహేడు నిముషాలు."
అర్భన్ ప్రాంతపు మూడు సర్కిల్స్ లో ఒక సర్కిల్ లో మూడు పోలీస్ స్టేషన్ల ఇన్ ఛార్జిగా రేపో మాపో ఆస్థాయికి ఎదగబోతున్న ఓ పోలీస్ ఆఫీసరుగా... ఆమె అప్రోచ్ ని సహించలేకపోతున్నాడు సుధాకరరావు.
అతని మనోభావాల్ని గాని- అతని కున్న పరపతిని కాని పట్టించుకునే స్థితిలో లేదామె. " మీకు ఫోన్ చేసింది సరిగ్గా పదకొండు గంటలకి. పదిహేను నిమిషాల్లో ఇక్కడుండాలని నేను చెప్పినప్పుడు సాధ్యా కాకపోతే మరికొన్ని నిముషాల వ్యవధి కావాలని మీరు ముందే అడగాల్సింది."
సుధాకర్ అవాక్కయి చూస్తున్నాడు.
" మీరు రెండు నిముషాలు ఆలస్యంగా వచ్చారు. అవునా?"
రిస్ట్ వాచ్ చూసుకుంటూ అన్నాడు "నా వాచ్ రెండు నిమిషాల్లో స్లోగా నడుస్తోంది మేడం."
"అలాంటప్పుడు వాచ్ నైనా మార్చాలి. లేదా మీలో అయినా మార్పు రావాలి. దట్స్ కాల్డ్ పంక్చువాలిటీ." తను అడుగుపెట్టింది ఎలాంటి వ్యవస్థలోనో తెలియని అనుభవ రాహిత్యం కావచ్చు,అదీ కానినాడు తిరుగులేని మొండితనం కావచ్చు. స్థిరంగా చెప్పుకుపోయింది.
" మిస్టర్ సుధారక్! మీ సర్కిల్ లోని మూడు స్టేషన్ . మీరీ రోజు విజిట్ చేశారా? రిజిస్టరయిన కేసులెన్ని? కేసు డైరీ చేశారా? ఏ సబిన్ స్పెక్టర్ ఏం చేస్తున్నాడూ, ఏ అసిస్టెంట్ సబిన్స్టెక్టరు లీవులో ఉన్నాడూ లాంటి ప్రశ్నలతో తొలిరోజే మిమ్మల్ని నిలదీయడం నా అభిమతం కాదు. డిసిప్లిన్ ఈజా హింజాఫ్ ఎనీ బిజినెస్ అండ్ దేరీజ్ నో జిసిప్లిన్ వితౌట్ పంక్చువాలిటీ. ముఖ్యంగా ఇది పోలిస్ వ్యవస్తకెంతగా అన్వయమవుతుందీ మీకు చెప్పాల్సిన అగత్యం లేదనుకుంటాను. సకాలంలో జోక్యం చేసుకోనినాడు శాంతి భద్రతలు విచ్ఛిన్నం కావచ్చు. లేదా కొందరు నిరపరాధులు ప్రాణాలు కోల్పోవచ్చు. మన ఉనికిని అర్థం అలా ప్రాణాలు కోల్పోయినవాళ్ళ అటాప్పీలతో అసలు నేరస్తుల్ని పట్టుకోవడం కాదు. బయాప్పీలా భవిష్యత్తును?" ప్రెడిక్టుచేయడం కూడా."
చూడటానికి పిల్లకాకిలా ఉన్నా సామాన్యురాలు కాదని బోధపడి పోయిందప్పటికే.
"ఇంతకాలం ఇక్కడి పరిస్థితులేమిటీ అన్నది నాకు అనవసరం .ఇకముందు ఎలా ఉండాలీ అన్నది స్టాఫ్ కి తెలియచేయాలనుకుంటున్నాను కాబట్టి, రేపు ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకి పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో అందర్నీ సమావేశపరచండి. మిగతా రెండు సర్కిల్స్ కు చెందివాళ్ళని కూడా." క్షణం ఆగింది " మరో విషయం-ల మీరు పర్శనల్ గా వెంటనే.." క్లుప్తంగా 'మల్లి'నుంచి తీసుకోవాల్సిన స్టేట్ మెంటు గురించీ, రణధీర్ ని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం గురించీ...
స్టేషన్ లో విద్యుద్దీపాల కాంతిలో అతనిపాలభాగాన అలుముకున్న స్వేదం మీద ప్రతిఫలిస్తుంటే అయిష్టంగానే కదిలాడు.
రణధీర్ ని కస్టడిలోకి తీసుకోవడం ఎంత ప్రమాదమో చెప్పాలనిపించినా నిభాయించుకున్నాడు. ఓ శాసనంలా ఆదేశాల్ని జారీ చేస్తున్న ఆమె లాంటి సుడిగాలిని నియంత్రించాలీ అంటే అటువేపు మరో ప్రభంజనం రెచ్చిపోవాలి. ఇలాంటి వాళ్ళని తనెంతమందిని చూడలేదని?అప్పటికే జీపులో రోడ్డుమీదికి వచ్చిన సర్కిల్ ఇన్ స్పక్టర్ సుధాకర్ ఇలా ఆలోచిస్తున్న సమయంలో...
ఏ.ఎస్. పి. మేనక నేరస్థుల్లా తలవంచుకున్న కానిస్టేబుల్స్ దగ్గరికి నడిచింది. కొన్ని క్షణాల క్రితం బాస్ కి వంతపాడి అతన్ని ఇంప్రెస్ చేయబోయిన వాళ్ళ పైన కోపం రాలేదు.
రాష్ట్రంలోని తొమ్మిది వందల నలభై పోలిస్ స్టేషన్స్ లో సుమారు ఏభై ఎనిమిదివేల బలగం గల పోలిసే ఫోర్స్ లో అధిక సంఖ్యాకులువీళ్ళే.వ్యక్తిత్వం లేని అల్ప ప్రాణులు. ఉన్నా చాలా త్వరగా కోల్పోయే అవకాశమున్న వాళ్ళు.
తనను సమీపించిన మేనకని చూస్తూ.
శక్తిని కూడపట్టుకుని శాల్యూట్ చేయబోయాడు సింహాద్రి.
"తాతా!" ఆప్యాయంగా అతని చేతిని స్పృశించింది.
చిత్రమైన పులకింత ఆ వృద్ధుడి కళ్ళలో.
"నన్ను కాపాడలని నువ్వు చేసిన ప్రయత్నంలో ప్రతిక్షణమూ నేను మరిచిపోలేనిదే. నేను అడుగురపెట్టిన వ్యవస్థను ప్రడలు ద్వేషించటానికి కారణాన్ని తెలుసుకున్నాను. నిన్ను చూశాక ఇంకా కరుణ పంచగల రుషులూ ఉన్నారని గ్రహించాను. శాపగ్రస్తమైన ఈ తరం మధ్య నిలబడి నిన్నటితరానికి చెందిన సహృదయతనే వర్షింపజేసిన నిన్ను అభినందించగల పదవి తప్ప అనుభవం లేనిదాన్ని."
దుష్టశిక్షణ కోసం అవతారం దాల్చిన దేవతే అనిపించిందో , అదీ కాని వాడు తనలాంటి ఓ సామాన్యుడిపైన ఆమె చూపుతున్న అభిమానానికి మనసే ఉద్రిక్తత చెందిందో-సింహాద్రి కళ్ళు, తడయ్యాయి.
"చాలా దూరం నిబ్బరంగా నడవాల్సిన నాకు కావల్సిందినీ ఆశీస్సులు."
సుడులు తిరిగిన కన్నీళ్ళు ఇప్పుడు ఆ వృద్ధుడి చెంపలపైకి జారాయి.
మరో అరగంటకల్లా ప్రభుత్వ క్వార్టర్సు కి చేరిన మేనక తన కోసమే నిరీక్షిస్తున్నట్టు హాల్లో కూర్చున్న తల్లిని చుట్టేసింది.
ఇప్పుడామెకి తను ఓ ఐ.పి.ఎస్ ఆఫీసరన్న విషయం జ్ఞప్తికి రాలేదు. అలా గుర్తుచేసుకోవడం ఇష్టంలేదు కూడా.
" భోం చేశావా మమ్మీ?"
జవాబు చెప్పలేదు అన్నపూర్ణగర్వంగా కూతురి వేపు చూస్తూంది.
"ఓ కే. ఓకె. యూ ఆర్ ఫ్రౌడాఫ్ మీ.... అది నాకు అర్ధమైపోయింది అర్జెంటుగా భోంచేద్దాం రా."
బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళబోతూ ఆగింది. " మమ్మీ!"
కళ్ళొత్తుకుంటున్న అన్నపూర్ణ దొరికిపోయినట్టు తల తిప్పుకుంది.
"నో ...వద్దు మమ్మీ. ఆకన్నీళ్ళంటే నాకు చాలా అసహ్యం.వాటిని నువ్వులా వృథాగా ఖర్చు చేయకూడదనే నేను అహోరాత్రులు శ్రమించిందీ, ఈ స్థాయికి చేరుకున్నదీను, ప్లీజ్, మమ్మీ!"
ఇప్పుడు తల్లిని పసిపిల్లలా అక్కున చేర్చుకుంది.అమ్మనలా ఆరిందలా పొదివి పట్టుకుని నడిపిస్తున్నందుకేమో గర్వంగా ఆమెకళ్ళూతడయ్యాయి.
ఆ రాత్రి చాలా సేపటిదాకా నిద్ర పట్టలేదు. ఏ.ఎస్..పి. గా తొలిరోజు అనుభవాన్ని, ఆనందాన్ని పంచుకోవాలనిపించిందేమో వెంటనే లెటర్ పాడ్ అందుకుంది. రాయబోతూ క్షణం ఆగింది.