ముందొక సుషుప్తిలాంటి స్థితి. అందులో ఓ స్వప్నం లాంటి ఆకృతి.
అరనిమిషం మౌనం . అరక్షనంలో భూగోళణంతా విస్తరించిన మృధుమధుర దరహాసాన్ని ముందు నిలిపింది.
"మిత్రా!"
ఎంత పొగరు నీకు ? ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబివ్వనిది నీకు రాయకుండా నేను ఉండలేననేగా? ఎన్ని యుగాలైంది నిన్ను చూసి? అసలు నేనేం తప్పు చేశానని నన్నిలా బాధపెడుతున్నావు? ఏయ్,ఇప్పడు నేనుపోలీసాఫీసర్ని, దీనికన్నా నువ్వు జవాబివ్వకపోతే నిన్నేదో నేరంలో ఇరికించి డిపార్టుమెంట్ తరపున గాలించి, నాకస్టడీలోకి తీసుకుంటాను. అయినా ఏమయ్యావు నువ్వు?
" ఎంత ఎదురుచూస్తున్నానో నీకెలా చెప్పను? నేనెవర్నని ?తుదిలేని ఆలోచనలు ఒకనాడు ఆజ్యమైనా బ్రతుకుని నుసి చేయబోతుంటే, నీ కారుణ్యంతో మనిషిగా మిగిలిన నీ నిచ్చెలిని, నువ్వు నిర్దేశించిన మార్గంలో నడవాలని నిర్ణయించుకుని ఈ స్థితికి చేరుకున్న నీ కాంతి పాదాలకు చుట్టుకున్న ఓ అందెని నేను."
ఎక్కడ ప్రారంభమైనజీవితం నాది! నాన్నెవరో చెప్పని చెప్పలేని అమ్మ. నువ్వెవరికి పుట్టావ్ అంటూ క్షణక్షణం నిలదీసిన లోకం. నిశ్శబ్దంగా రాత్రివేళ కంటతడి పెట్టుకునే అమ్మని ఓదార్చలేని నిస్సహాయత, ఆత్మన్యూనతా భావంతో కొట్టుకుపోతున్న నాకు నీ పరిచయమయింది టెన్త్ క్లాస్ లో. చూడగానే అల్లరి అబ్బాయివనుకున్నాను. కాదని బోధపడిపోయింది మరుసటి రోజే. చిత్రంగా అక్కడినుంచే నీ స్నేహం కోసం తపించిపోయాను. ప్రతి క్షణమూ నువ్వందించే ఊరటకోసం అంగలార్చాను. నేను చెప్పకుండానే నాకథ తెలుసుకున్నావు. ఎవరిభార్యో చెప్పుకోలేని అమ్మని చూస్తూ బాధపడటం కాదు, మేనక తల్లిగా సంఘం గుర్తించే స్థాయికి నువ్వు ఎదగాలీ అంటూ నాకో మంత్రోపదేశం చేశావు. సగంలోనే ఆగిపోతుందన్న నా చదువుకు ఆర్దిక సహాయమూ చేశావు. నీకు తెలిసిన కథనే నేనెందుకు రాస్తున్నానూ అని ఆశ్చర్యపోకు మిత్రా!"
"నీ చేరువనిగాని, నీ ప్రేమనిగాని మననం చేసుకోని నాకు, నా బ్రతుక్కి అర్థంలేదు. నా గతం నాకు తెలిసిన శ్లోకమయితే నన్ను నడిపించిన దేవుడిముందు ఆ శ్లోకాన్నే నేను పదేపదే వల్లెవేయడం తప్పని నేననుకోను.
ఆ రోజు సివిల్ సర్వీసెస్ ప్రలిమినరీస్ లో నేను పాసైనందుకు నువ్విచ్చిన బహూమతి గుర్తుందా?మెయిన్స్ కి ప్రిపేరయ్యాను. అనూహ్యమయిన ఫలితంతో మరోసారి నీనుంచి అలాంటి బహూమతిని కోరుకున్నాను. కాని నువ్వు బెట్టుచేశావు. అందుకే పర్సనల్ ఇంటర్వ్యూ కోసం లోపలికి వెళుతూ నిన్ను ఓ మూలకి పిలిచి నా బహూమతిని నేనే తీసుకున్నాను.
టాపర్ గా జాతీయస్థాయిలో మొదటి పదిమందిలో నేనూ ఒక దాన్నయినందుకు నీనుంచి అంతకుమించి మరేదో బహుమతిని ఆశిస్తే లాలనగా నా తల నిమిరావు. నువ్వు నాకేదో దూరమయిపోతున్నావని అప్పుడే అనిపించింది. నిన్ను ఇంప్రెస్ చేయడానికి నేనేం చేయాలో నాకు తోచలేదు.
" అందుకే ఐ. ఏ.ఎస్. కి అపకాశమున్నా నీ మాట ప్రకారం ఐ.పి.ఎస్. ని ఆప్ట్ చేశాను. నిన్ను నిలదీశానా, లేదే! న్యాయమన్నా, చట్టమన్నా నీకున్న గౌరవం తెలిసినదాన్ని గానీ మాటకే కట్టుబడిపోయాను. గుర్తుందా? నేను ఆడపిల్లని నాకీ పోలిస్ డిపార్టమెంటేమిటి అంటే నువ్వేమన్నావు? మనిషిని రక్షించగలిగేది దేవుడుకాదు మేనకా. డాక్టరూ, పోలీసాఫీసరూ అనే ఇద్దరు వ్యక్తులుమాత్రమే అంటూ చట్టం మీద నీకున్న గౌరవాన్ని అసాధారణంగా తెలియచెప్పావు."
ఏడాది పాటు ఎకాడమీ ట్రెయినింగ్ లో, మరో ఆరునెలలు లోకల్ ట్రెయినింగ్ కాలేజీలో గడిపిన నేను, కనీసం వంద ఉత్తరాలయినా రాసుంటాను. ఒక్కదానికీ డవాబు అవ్వలేదు నువ్వు. నిజంగానే ఏడుపొచ్చేది. నేనేమన్నా తప్పుచేశానా అని ఆలోచించేదాన్ని. నువ్వెలా ఉన్నావో తెలీక అలమటించిపోయేదాన్ని. నిజం చెప్పొద్దూ.? నీకేకాదు, మీ చెల్లెలు రాజీకి రాశాను. నన్నంతగా ఇష్టపడే రాజీసైతం జావాబివ్వలేదు. ఎందుకిలా జరుగుతూందో ఊహించలేకపోతున్నాను.
ప్లీజ్. నువ్వు తీర్చిదిద్దిన మేనక నేను. నువ్వు కోరిన మార్గంలో అధికారికంగా అడుగుపెట్టిన ఈతొలిరోజున నీ సామీప్యాన్ని ఎంతగా నేను కోరుకుంటున్నదీ మాటల్లో వ్యక్తం చేయలేను. నీ ఆశీసుల్నీ అందుకుని నువ్వు అనుమతిస్తేనీ సగభాగంగా ఓ జీవితకాలం నడవాలనుకుంటున్న దాన్ని-ఒక్కసారి రావూ?
నీకోసం నిరీక్షిస్తున్న నీ మేనక."
* * * *
"డియర్ ఫ్రెండ్స్!"
ఉదయం తొమ్మిదిగంటలవేళ కాన్ ఫరెన్స్ హాల్లో అడుగు పెట్టిన ఏ.ఎస్.పి.మేనక అప్పటికే సమావేశమయిన అసిస్టెంట్ సబిన్ స్పెక్టర్సునీ, సబిన్ స్పెక్టర్స్ నీచూస్తూ అంది.
"నేను పిలిచింది ఉపన్యసించడానికికాదు. నన్ను నేను పరిచయం చేసుకోవాలని మాత్రమే నేరప్రవృతిగల నేరస్థుల గురించీ, నేరస్థుల నుంచి కాపాడాల్సిన నిస్సహాయులు గురించీ నేను మాట్లాడదలచుకోలేదు" క్షణం ఆగింది ముందువరసలోవున్న ముగ్గురు సర్కిల్ ఇన్స్పెక్టర్లనీ గమనిస్తూ-
"ప్రజలకోసం నిర్దేశించిన ఈ చట్టము ప్రజల సహకారం లేనిదే ఆచరణకు సాధ్యం కాదన్నది తిరుగులేని సత్యమే అయినా,ఆ సహకారాన్ని మనం పొందగలిగాలితప్ప అందించమని ఆదేశించలేం.ఎందుకిలా జరుగుతూంది. ప్రజరక్షణకి ఉద్దేశించిన పోలిసు వ్యవస్థ ప్రజల సానుభూతిని ఎందుకు కోల్పోతూంది?"
"కారణం... ప్రజలుకాదు.... మనమే! మన ఇంటి కిటికీల మకిలిని తుడవకుడా వాటిద్వారా సమాజాన్ని దర్శించాలనుకోవడం ఉప్పునీటితో దాహం తీర్చుకోవడం లాంటిదే అని మీరు అంగీకరిస్తే కమాన్! లెట్స్ క్లీన్ అవర్ ఓన్ విండోస్ ఫస్ట్. దానికి కావలసిన అస్త్ర్రం ప్రేమ.ముందు మన వృత్తిని మనం త్రికరణశుద్ధిగా ప్రేమిద్దాం. అప్పుడే మనచుట్టూ వున్న వ్యక్తుల్ని మనం ప్రేమించగేది. దానికి ఓ జీవితకాలం ఆలస్యం చేయొద్దు.ఈ రోజే..ఎస్...బియువర్ సెల్స్ బి పోజిటివ్ అండ్ బి సింపతిటిక్. ఓ పోలీస్ ఉద్యోగి కర్తవ్యం మనిషిని శిక్షించడం కాదు. సమాజంలో పేరుకుపోయిన ఎగో సెంటర్డు క్రిమినల్స్ నుంచి మనిషినికాపాడటం. నేను అడుగుతున్నది మనిషికి, మనుషుల్లో ని నేరస్థులకి వైవిధ్యాన్ని ఎంచి చూడమనే."
ఆమె వేదికమీద నుంచి దిగి పోలీస్ ఆఫీసర మధ్య నడుస్తూ అంది."పూర్ ఇమేజ్... లో క్రెడిబిలిటీ. ఇవే మన డిపార్టుమెంటుకి ఇప్పుడున్న దురదృష్టకరమయిన ఆభరణాలు- దానికి కారణం ముఖ్యంగా కరప్షన్.అది డబ్బు రూపేణా కావచ్చు. లేదా రాజకీయమయిన పలుకుబడికోసం పడే తాపత్రయం కావచ్చు. ఈ క్షణమే అలాంటి ఆలోచనలకి చివరి క్షణం కావాలి. రక్షణ ఇవ్వాల్సిన మీరు ఈ రెప్యూజీ ఏటిట్యూడ్ నుండి బయటపడనివాడు వ్యవస్థకీ, నాకూ శత్రువులవుతారు.ఓ రచయిత అన్నట్టు బ్రతుకుని అందంగాగాని, అహ్యంగాగాని మలుచుకునేది మరో మనిషికాదు. ఎవరికివారే! ఏజ్ దిమైండ్ సోది ఏక్టు ఏజ్ ది ఏక్టు సో ది మాన్... మాన్.. గుడ్ లక్..నౌ.."
ప్రసాద్ అనే ఓఎస్సై సమీపించింది. " క్రిమినలస్ ప్రొసీజర్ కోడ్ లో మీకు పరిచయముండి ఉంటుంది."