ఇం: అమ్మా! నేను ఒకవేళ - ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే....
పిన్ని : పిచ్చిసన్యాసి. పద భోజనం ఆరిపోతుంది.
(పిన్ని వెళ్ళిపోతుంది. నేపధ్యంలో -సంగీతం-సన్నగా ప్రారంభించి- పెద్దగా వినిపిస్తుంది. పిన్ని వెళ్ళినవైపుకే ఇంద్రా వెళతాడు.)
పాట:
ఒకటి-రెండూ-మూడు.
ఒకటి-రెండూ-మూడు = ఒకటి-రెండూ-మూడు-
(రండు సార్లు)
నాలుగు - అయిదు - ఆరూ-
నాలుగు - అయిదు -ఆరు =ఐదు - నాలుగు - ఆరు-
(రెండు సార్లు)
ఏడు - ఎనిమిది - తొమ్మిదీ-
ఏడు - ఎనిమిది- తొమ్మిది = ఎనిమిది -ఏడు-
ఎనిమిది-తొమ్మిది-
తొమ్మిది-ఎనిమిది-ఏడు- ఆరు-ఐదు-
నాలుగు - మూడు - రెండు - ఒకటీ-
(పాట వినిపిస్తుండగానే- రచయిత ప్రవేశిస్తాడు- పాట చివరపదంలో -కంఠం కలిపి పాడతాడు. స్టేజి ముందు ముందుకు వచ్చి నిలుచుంటాడు.)
రచ: లాభంలేదు. వీళ్ళ గురించి నాటకం రాయటం సాధ్యం కాదు. అసలు వీళ్ళను గురించి రాయటానికి, ఏమీ లేందె!
అమల్ - విమల్ - కమల్....
(గలగలలాడుతూ ముగ్గురూ వచ్చి రచయితను చుట్టేస్తారు.)
అమల్ : ఏమయ్యా! కవికుమారా! ఎలా వున్నావ్ ?
రచ: బాగానే వున్నా!
విమల్ : కొత్తగా, ఎం రాశావు?
రచ: ప్ర్రత్యేకంగా - ఏం రాయలేదు.
కమల్: ఎందుకు బ్రదర్ ! భయపడతావు? మేము కానీ కొట్టంలే! అది గూడా మాకు చేతకాదు భయపడకు.
(ముగ్గురూ పెద్దగా నవ్వుతారు.)
రచ: ఒక చిన్న కవిత మాత్రం -రాశాను.
అమల్ : ఏదీ, అలా బయటకు, వినిపించు !
విమల్ : హే ! కవిశిరోమణీ! నీ కావ్యాకాకృతిని వినిపించుము?
కమల్: నీ కవిత్వం మాకు అర్ధం అయిందనుకో- చింపిపారేయ్. అర్ధం కాకపోతే ఏదైనా పత్రికకు-పంపించు.
(ముగ్గురూ పెద్దగా నవ్వుతారు.)
రచ: వింటారా?
అమల్, విమల్, కమల:- (ఒక్కసారిగా)
ఆ - ఆ - ఆ -తప్పకుండా!
(కవి - కవితా గానం ప్రారంభించుతాడు.)
రచ:ఒకటి-రెండూ-మూడు.
ఒకటి-రెండూ-మూడు +ఒకటి-రెండూ-మూడు
నాలుగు-అయిదు-ఆరు.
నాలుగు-అయిదు-ఆరు
ఏడు-ఎనిమిది-తొమ్మిదీ.
ఏడు-ఎనిమిది-తొమ్మిది=ఎనిమిది-ఏడుఎనిమిది -తొమ్మిది-
అమల్ : తర్వాత?
రచ:తొమ్మిది-ఎనిమిది-ఏడు-ఆరు-అయిదు-నాలుగు-మూడు-రెండు-ఒకటీ-
విమల్: వినిపించు !వినిపించు ! ఇంకా!
రచ: అయిపోయింది.
కమల్: ఇంతేనా?
రచ: ఇంతే.
(ఆశ్చర్యంగా కొంచెం వుండి - తర్వత -అంతా పక్కున నవ్వుతారు.)
అమల్ : ఆహ ! ఎంత మధుర కవిత్వం!
విమల్: అవును బ్రదర్ ! కలికాలంలో, బలిమి చాలావుంది!
రచ: అర్ధం అయిందా?
కమల్ : లేఖ్కలక్లాసులో అయితే అర్ధం అయేది. ఇది కవిత్వం కదా! అర్ధం కాలేదు.
(ముగ్గురూ- అట్టహాసం చేస్తారు.)
రచ: నాటకం రాయాలనుకొంటున్నాను.
అమల్: హఠాత్తుగా కవిత్వాన్ని వదిలేసి, నాటకం రాస్తావా?
రచ: హఠాత్తుగా కాదు, చాలాకాలంగా అనుకొంటున్నాను.
విమల్: రాసిపారేయ్ !రాసిపారేయ్ ! విశ్వాన్ని కూడా కలుపుకో!
కమల్: విశ్వం కొంచెం తలతిక్కగాడు. ఫోర్తుయియర్ లో వున్నాడు- నీకు తెలుసా? చాలా మంచి నాటకం రాశాడు. కాని అది అతనికే నచ్చలేదు. డ్రెమెటిక్ క్లయిమాక్సు, సరిగా కుదరకపోతే ఏం చేస్తావ్?
అమల్: ఏం, నాటకం ? సాంఘికమా?
రచ: సాంఘికం అంటే?
విమల్ : సాంఘికం అంటే - తెలియనివాడివి, నాటకం ఏం రాస్తావయ్యా?
కమల్ : సాంఘికం అంటే-నేటి యుగానికి సంబంధించింది. అంటే నీకూ నాకూ సంబంధించింది.
రచ:అవును !మనకు సంబంధించిందే రాస్తాను.
అమల్: ప్లాట్ - ఏమాలోచించావు?
రచ: ప్లాటూ లేదు.
విమల్: ఆయితే _థీం, ఏమిటో చెప్పు?
రచ: థీం! అదే మనల్ని గురించే.
కమల్ : మనం అంటే?
అమల్ : మనల్ని గురించే రాస్తావా? అయినా, నాటకం రాసినట్టే!
విమల్: మనలో నాటకానికి కావాల్సిన మసాలా ఏముంది?
కమల్: ఓ నాటక మహాశయా! మన నాటకంలో స్త్రీ పాత్ర వుండదే?
(ముగ్గురూ - నవ్వుతారు.)
అమల్ : అబద్దం ఆడతావెందుకు కమల్! ఎదురింటి అమ్మాయి-నీ నాయికేగా?
విమల్ : అవును. నేను మార్చేపోయా! కథ ఎంతవరకు వచ్చింది?
కమల్: నా కిటికీ కావ్యం దూరం నుంచే రాస్తున్నానుకాని. అమల్ తక్కువ అనుకొంటున్నారా? పోయిన సంవత్సరం ఉత్సవాల్లో తిరుపతిలో ఏం జరిగిందో అడుగు.
విమల్ : ఏమోయ్ అమల్ ఏమిటి కథ?
అమల్: అబ్బే! అలాంటిదేమీ, లేదు.
కమల్ : చెప్పరా, నాయనా, దాస్తావెందుకు?
(ముగ్గురూ ఒక ప్రక్కగా జరిగి మాట్లాడు కుంటూవుంటారు. రచయిత దూరంనుంచే వింటూ వుంటాడు. మానసి ఒకవైపు నుంచి ప్రవేశించి రెండో వైపునుంచి వెళ్ళిపోతుంది. ముగ్గురూ ఆమెను చూస్తారు. అంతలోనే ముగ్గురూ, గుసగుసలు ప్రారంభిస్తారు, నవ్వుకొంటారు. మానసి మళ్ళా ప్రవేశిస్తుంది. ఈ సారి ఆమె యింకో అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. చేతిలో bag నడక అన్నీ భిన్నంగా వుంటాయి. మాళ్ళీ మూకాభినయం- నవ్వు - తిరిగి- అతి సాధారణమైన రూపంలో మానసి ప్రవేశం ఆయయికంగా కనిపిస్తూ ఈసారి ఇంద్రజిత్ గూడా వుంటాడు. అందరి కళ్ళల్లో-కుతూహలం, ఈర్ష్య-)
(ఈర్ష్య తొంగిచూస్తున్నాయి. మానసి, ఇంద్రమాట్లాడుకొంటూ వెళ్ళిపోతారు.)