తను అనవసరంగా స్నేహితురాలు వస్తున్నదని చెప్పింది. నిజం చెప్పెయ్యాలి. వీడి పీడ కూడా కొన్ని గంటలకే విరగడవబోతున్నాది.
కారు వచ్చి రాధారాణి ముందు ఆగింది.
అతడు స్టీరింగ్ దగ్గర కూర్చుని, పక్కకు వంగి ముందుడోర్ తెరిచాడు.
అయిష్టంగానే రాధ కారు ఎక్కి అతని పక్క సీట్లో కూర్చుంది.
ఆమె కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు. కారు బేగం పేట వంతెన దిగి, గ్రీన్ లాండ్స్ మలుపు తిరిగింది.
"ఎక్కడికెళ్తున్నాం" రాధ అడిగింది.
"బిర్లా మందిరం వెళ్ళి కాసేపు ఆ మెట్లమీద కూర్చుందాం."
రాధ రిలీఫ్ గుండెం నిండా గాలి పీల్చుకుంది.
"ఎవరొస్తున్నారాన్నావ్?"
"నా స్నేహితుడు"
"మరి ఇందాక స్నేహితురాలన్నావ్?"
రాధ సమాధానం ఇవ్వలేదు.
"ఆ స్నేహితుడెవరో తెలుసుకోవచ్చునా?"
"నీకు అనవసరం" అనాలనిపించింది. కాని" అతడే....ఇంతకు ముందే మీకు ఆయనను గురించి చెప్పాను."
"ఓహొ! నువ్వు ప్రేమించిన ఆ అదృష్టవంతుడా?"
రాధకు సిగ్గు ముంచుకొచ్చింది.
"అతను ఆశ్రమంలో ఉంటున్నాడన్నావ్?"
"అవును"
"ప్లైట్ లో వచ్చేంత ధనవంతుడా?"
"అవును! చాలా ధనవంతుడు."
"నువ్వెప్పుడూ ఆ మాట చెప్పలేదు."
"అప్పుడు నాకు అతడు ధనవంతుడని తెలియదు. మొన్న వచ్చిన ఉత్తరంలో రాశాడు."
"అంత ధనవంతుడు ఆశ్రమంలో ఎందుకు చేరాడో?"
ప్రపంచమంటే విరక్తి కలిగి."
"ఇప్పుడు మళ్ళీ నీ మీద రక్తి కలిగి వస్తున్నాడన్నమాట." కసికసిగా అన్నాడు.
"అవును!" గర్వంగా అన్నది రాధారాణి.
"అతడు నాకంటే అందంగా ఉంటాడా?"
"పెద్ద అందగాడేం కాదు.
"ప్లైట్ లో వచ్చే ధనవంతుడా?"
"అవును! చాలా ధనవంతుడు."
"నువ్వెప్పుడూ ఆ మాట చెప్పలేదు."
"అప్పుడు నాకు అతడు ధనవంతుడని తెలియదు. మొన్న వచ్చిన ఉత్తరంలో రాశాడు."
"అంత ధనవంతుడు ఆశ్రమంలో ఎందుకు చేరాడో?"
ప్రపంచమంటే విరక్తి కలిగి."
"ఇప్పుడు మళ్ళీ నీ మీద రక్తి కలిగి వస్తున్నాడన్నమాట." కసికసిగా అన్నాడు.
"అవును!" గర్వంగా అన్నది రాధారాణి.
"అతడు!" గర్వంగా అన్నది రాధారాణి.
"అతడు నాకంటే అందంగా ఉంటాడా?"
"పెద్ద అందగాడేం కాదు.
"మరి ఏం చూసి ప్రేమించావ్? అతడి డబ్బు చూశా?"
"అతుద్ ధనవంతుడని అప్పుడు నాకు తెలియదు."
"మరి అతడితో ఏముందని...."
"మీలో లేనిది ఒకటి ఉంది."
"ఏమిటది."
"సంస్కారం"
అతడు కారు సడన్ బ్రేకు వేశాడు. రాధారాణి ముందుకు తూలింది.
"సారీ!" అంటూ కారు వేగం పెంచాడు.
"ఇట్టెక్కడికి?"
"బంజారా హొటల్లో కాఫీ తాగుదాం." అన్నాడు.
"వద్దు. నేను కాపీ తాగను. బిర్లా మందిర్ కు పోనివ్వండి."
"ఎనిమిది కావస్తోంది. బిర్లామందిర్ కు ఇప్పుడెళ్ళి ఏం చేస్తాం. బంజారాహిల్స్ కు వెళ్తే కాస్త ప్రష్ గాలి తినొచ్చు"
కారు బంజారాహిల్స్ ఎక్కింది.
రాధ చంపాల మీద పడ్తున్న ముంగురులను సంవరించుకొనసాగింది.
"మరీ గాలి ఎక్కువగా వస్తోంది కదూ?" అతడు ఆమె మీదగా వంగి, ఆమెవైపు డోరు అద్దం దించండి." అన్నది రాణి.
"వద్దు రాణీ అద్దం దించకు. నాకు జలుబుచేసి ఉంది. చల్లగాలి తగిలితే మరీ ఎక్కువ అవుతుంది. నావైపు అద్దం కొద్దిగా దించే ఉంది. ఆ గాలి చాలు."
"మరి అలా చెప్పండి. నామీద వంకపెట్టి అద్దం ఎత్తితేనో?" అని పక్కున నవ్వింది.
"ఈ జన్మసంగతేమో కాని పూర్వజన్మలో అతడు పుణ్యం చేసి ఉంటాడు." తలతిప్పి రాధను ఓరగా చూస్తూ అన్నాడు వెన్నెల అద్దంలో నుంచి ఆమె ముఖంమీద పడుతోంది.
"మీరనేదేమిటో నాకు అర్థం కావడంలేదు."
"అందం, తెలివితేటలూ ఉన్న నీలాంటి స్త్రీ అతడికి భార్యగా దొరకడం అదృష్టం కాదా?"
"ఆ మాటకొస్తే అదృష్టం నాది. అంత మంచి మనిషి, మనసున్న మనిషి నాకు భర్త కావడం...."
"అంటే నాకు మనసు లేదనేగా నీ అభిప్రాయం?"
"నేను అలా అనలేదే?"
కారు ప్రసాద్ లాబ్స్ దాటింది.
"నాకూ మనసుంది రాధా! నాకు ప్రేమించడం తెలుసు. నేనూ నిన్ను మనస్పూర్తిగానే ప్రేమించాను."
"నేను కాదనడం లేడు మీరు ప్రేమించింది నా మనస్సునుకాదు. నా శరీరాన్ని. నా అందాన్ని. ఈ అందం కరిగిపోయిన మరుక్షణం....." ఆపై మాటలు పెగల్లేదు కోపంతో వణుకుతున్న కంఠంనుంచి.
"హూ! ప్రేమా! హృదయం! ప్రేమ ప్రేమే. మనసును ప్రేమించినా, హృదయాన్ని ప్రేమించినా, అనుభవించేది నీ శరీరాన్నీ-నీ అందాన్నీ-నీ యవ్వనాన్నీ-కాదంటావా?" అదోలా తనలోతను నవ్వుకొంటూ ప్రశ్నించాడు.
"ఇప్పుడు ఇదంతా తిరిగతోడుకోవడం ఎందుకూ? నా అభిప్రాయాన్ని నీకు ఆరునెలల క్రితమే చెప్పాను."
"దానికేముంది? కావాలంటే ఇప్పుడైనా మనసు మార్చుకోవచ్చు
"అసంభవం"
"ఎందుచేతనో?" వ్యంగ్యంగా అన్నాడు.
"నా ప్రేమ గురించీ, వారిని గురించీ కూడా చెప్పాను. కొద్ది సేపట్లో వారిని మీరు చూడబోతున్నారు. కొద్ది నిముషాలు మాట్లాడితే, వారెలాంటివారో మీకే తెలుస్తుంది. అంతవరకూ గతాన్ని తవ్వి నా ఆనందాన్ని భగ్నం చెయ్యకండి. మీకు పుణ్యముంటుంది." దీనంగా అన్నది రాధ.
"అంత ఆనందాంభుధిలో ఓలలాడుతున్నావా?"
"ఎంతో కాలానికి వారిని కలుసుకొబౌతున్నాను. అడలు వారు మనసు మార్చుకొని ఆశ్రమం నుంచి తిరిగి ఈ ప్రపంచంలో అడుగు పెడ్తారని అనుకోలేదు.
"అతడు రాకపోతే ఏం చేసే దానివి?"
"జీవితమంతా వారి మధుర స్మృతులలోనే గడిపేదాన్ని."
"అంతఘాటు ప్రేమా?"
"ప్రేమ గురించి మీకు అర్థం కాదు."
"అవును నాలో వుంది మనసు కాదు. నల్లరాతి బండ."
"నేను అలా అనడం లేదు. ఇంత కాలానికి వారిని కలుసుకోభోతున్నాను. నా హృదయం ఎలా సంతోషంతో ఉరకలు వేస్తుందో అర్థం చేసుకోవడానికీ ప్రయత్నించండి." మిమ్మల్ని నిరాకరించాను కాని మీరంటే నాకు ద్వేషం లేదు. ఎంతో గౌరవం ఉంది. నాకు మీ మీద ఉన్న ఆ గౌరవాన్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను." అని ముఖం తిప్పుకొని పై కొంగులో కళ్ళు తుడుచుకొన్నది రాధ.
"క్షమించు రాణీ! నిన్ను చాలా బాధ పెట్టినట్టున్నాను. నీ సెంటిమెంట్సును హార్టు చేశారు. క్షమించు. నా బాధకొద్దీ అలా అన్నాను. నిన్ను బాధ పెట్టాలని కాదు నా ఉద్దేశ్యం."
రాధ మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ అతడే అన్నాడు-"మనసు మనసు అంటూ మనసు గురించి కబుర్లు చెప్పి, శరీరాన్ని కాంక్షించే పెద్ద మనుషులంటే నాకు పరమ అసహ్యం. వళ్ళు మండుతుంది. వాళ్ళ మాటలు వింటుంటే."
రాధకు మాట్లాడాలని లేదు. అతడితో వాదించాలని లేదు. ఎంత ఆలస్యం అయినా ఎయిర్ పోర్టులోనే కూర్చోవల్సింది. తను అనవసరంగా ఇతడి కారు ఎక్కి కూర్చుంది. ఇతడెలాంటివాడో తెలిసే తను మొహమోటంతో తిరస్కరించలేక కారెక్కి కూర్చుంది.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?"
"ఆ! ఏం లేదు."
"మనుసు, హృదయం, అనేవి కవులు కల్పించిన భ్రమలు ఊపిరితిత్తులూ, "లబ్ డబ్" అంటూ కొట్టుకొనే గుండెకాయ శరీరంలోని భాగాలే. కొద్ది క్షణాలు గుండె కొట్టుకోవడం ఆగిపోతే, అందులోకి రక్తం రాకపోతే, ఆ గుండెలో -అదే మీరు ముద్దుగా పిల్చుకొనే హృదయంలో- ఎంత ప్రేమ ఉన్నా బిగుసుకు పోతుంది. శరీరంతో పాటు అదీ నశిస్తుంది. అందువల్ల శరీరం లేకపోతే నువ్వూహించుకొనే ఆ హృదయం కూడా ఉండదు."
"అబ్బబ్బ! నా తల బద్దలైపోతోంది. ఇక ఆపండి." దాదాపు అంచినట్టే అన్నది.
"ఏం నా మాటలు అంత భయంకరంగా ఉన్నాయా?"
"చాలా!"
"క్షమించు రాణీ! నిన్ను మళ్ళీ బాధ పెట్టాననుకొంటాను." అన్నాడు.
"ఒకటి చెప్పండి....."
"ఏమిటది?"
"బాధ పడుతున్నది నా శరీరమా నా మనస్సా?"
"ఆ బేధం నాకు తెలియదు. అదే నా అసమర్థత. అందువల్లనే నా ప్రేమ విఫలమైంది. ఇక నీ మనసును బాధపెట్టను రాణీ. మళ్ళీ అలాంటి అవకాశం రానివ్వను.
కారు వేగం తగ్గింది.
హరన్ మ్రోగింది.
ఎదురుగా వస్తున్న లారీ దాదాపు కారును ఢీకొనినంత పని చేసింది.
మళ్ళీ కారు వేగం హెచ్చింది.
రాధ తలపక్కకు తిప్పి డ్రైవింగ్ సీటులో ఉన్న అతడికేసి చూసింది. పెదవి బిగించి ముందున్న రోడ్దుకేసి దీక్షగా చూస్తున్నాడు. యాక్సిలేటర్ మీద కాలు వణుకుతూ ఉంది. స్పీడోమీటర్ మీద ముల్లు 80 మీది నుంచి90 మీదకు వంగుతూ ఉంది.
రాధ గాభరాగా తల తిప్పి ఏదో అనబోయింది.
అతడు హఠాత్తుగా బ్రేక్ వేశాడు.
ఆమె ఒక ఊపున ముందుకు పడింది. తల డాష్ బోర్డుకు తగిలింది. దిమ్మరపోయి తల రెండు చేతుల్తో పట్టుకుంది.
ఆమె తెప్పరించుకొని తలపైకెత్తి చూసింది. ఎదురుగా కొండలు పక్కకు చూసింది. ఎగుడు దిగుడుగా కొండరాళ్ళు. దట్టంగా తుప్పలు.
"ఏయ్! మిస్టర్! ఎక్కడికి వెడుతున్నాం. కారు తిప్పండి -ఎయిర్ పోర్టుకు "దాదాపు అరిచింది రాధ.
"ఎయిర్ పోర్టుకే వెళ్తున్నాం"
"జూబ్లీ హీల్స్ లో చాలా దూరం వచ్చేశాం. ఎయిర్ పోర్టుకంటావేం?" కోపం, భయం, ఆమె కంఠంలో ఒకదాన్నొకటి ఒరుచుకున్నాయి.
"ఇది అడ్డదారి!"వ్యంగ్యంగా అన్నాడు అతడు.
"ఎయిర్ పోర్టుకు ఇది అడ్డదారా?"
"లేదు."
"మరి"
"నీ ప్రేమను అందుకోవడానికి ఇది అడ్డదారి"
"మోసం! ఆపుకారు" రాధ కారుడోర్ తెరవబోయింది.
కారు కొండ అంచున వేగంగా పోతోంది.
"దూకుతావా? ఊ దూకు" వికటంగా నవ్వుతూ అన్నాడు అతడు.
రోడ్దు పక్కన ఉన్న కొండ రాళ్ళను చూసింది రాధ. కారు డోర్ తెరిచే ప్రయత్నం మానుకొన్నది.
"దుర్మార్గుడా ఆపు కారు." పెద్దగా అరిచింది.
"అరుపు. గొంతు చించుకొని అరిచినా ఇక్కడ పిట్టమనిషి లేడు. ప్చ్.ఎంత అరిచినా ప్రయోజనంలేదు. చుట్టూ కొండలు. బండరాళ్ళు. నీ అరుపులు వినే చెవులు వాటికి లేవు." కర్కశంగా అన్నాడు.
ఎదురుగా ఒక లారీ రావడం కన్పించింది. లారీ చాలా స్పీడ్ గా రోద చేస్తూ వస్తోంది.
"రక్షించండి? రక్షించండి" అరవసాగింది రాధ.
అతడు గట్టిగా హరన్ మోగిస్తూ లారీని దాటి దూసుకుపోయాడు. ఆమె అరుపులు లారీలో వాళ్ళకు విన్పించలేదు.
"ఆపు! ఆపు! అతనితో పెనుగులాట ప్రారంభించింది. అతడి బలమైన ఎడంచెయ్యి ఆమెను చుట్టివేసింది. ఆమె కదలకుండా, కొద్ది క్షణాల్లో కారు ఆగింది. అక్కడితో రోడ్దు అంతమయింది.
కారు ఆగి ఆగడంతోనే రాధ కారు తలుపు తోసుకొని బయటకు దూకి పరుగులంకించుకుంది.
ఆకాశంతో కారు మబ్బులు చంచమామను కప్పేశాయి.
చీకటి అలుముకుంది.
కొండగాలి రయ్యిన వీస్తోంది.
ఆమె కాళ్ళు నల్లరాళ్ళమీద తడబడుతూ పరుగులు తీస్తున్నాయి. ఆమె కాలి హైహీల్సు చెప్పులు కొండ రాళ్ళమీద టక టక శబ్దం చేస్తున్నాయి.
బూట్ కాళ్ళ ధ్వని ఆమెను తరుముతూ వెనక వస్తోంది. ఆ ధ్వని దగ్గరౌతున్న కొద్దీ ఆమె గుండె వేగం ఎక్కువ అవుతోంది.