Previous Page Next Page 
సంధియుగంలో స్త్రీ పేజి 29


    నాకు ఒళ్ళు మండి చివరి రోజున భోజనాల సమయంలో "మహిళా మండలి సెక్రటరీని మొగుడు కొడతాడా?" అన్నాను అందరు గొల్లున నవ్వారు "ఎందుకు కొట్టడూ? ప్రెసిడెంటును కూడా కొడతాడు" అన్నది మరో ఆమె సరదాగా నవ్వుతూ.   
    "కట్నాల విషయమేమిటి? ఆడపిల్లలకు కట్నాలు లేకుండా మీ రాష్ట్రాలలో పెళ్ళిళ్లు అవుతున్నాయా" అని అడిగాను పంజాబు నుంచి వచ్చిన ఆఫీసర్ని "ఎందుకు లేవు? ఆడపిల్లల పెళ్ళిళ్లు పెద్ద సమస్యగానే ఉన్నది" అంటూ మాట ప్రకారం తండ్రి పూర్తి కట్నం యివ్వలేక పోనందున ఒక అమ్మాయిని అత్తగారూ, భర్తా కలసి మెట్లమీద నుంచి తోసేసి యిటీవలే చంపేశారని చెప్పింది.  
    ప్రమాదవశాత్తు చచ్చిపోయినట్టు కేసు నమోదు అయిందట కాని ఆ వూరి వారందరికీ ఆ విషయం తెలుసునట అయినా వాళ్ళు శిక్షించబడలేదు అందుకు ఎవరూ ప్రయత్నించలేదు కూడా.
    "మరి కట్నాలకు వ్యతిరేకంగా మహిళా మండలి సభ్యులు అలజడిని ఎందుకు లేవదీయరు?" అని అడిగాను ఆమె కొంచెంసేపు తీవ్రంగా ఆలోచించింది.
    "అబ్బే: లాభం లేదండీ? వాళ్ళలో అంత సాహసం లేదు ఒకవేళ ధైర్యం చేసి యిలాంటి పని ఏదయినా చేస్తే రెండో రోజు నుంచి భర్త భార్యను ఇల్లు దాటనివ్వ"డన్నది.
    "అంటే ఈ మహిళా సమాజాల ద్వారా స్త్రీలలో సాంఘిక చైతన్యం కలిగించే ప్రయత్నాలు జరగడం లేదన్నమాటేగా?"
    "పూర్తిగా లేదనడానికి వీల్లేదనుకోండి వారు, పదిమంది ఒక చోట కలవడం, సామూహికంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టడంతో వారి దృక్పథంతో కొంతమార్పు వస్తున్నదనే అనుకుంటున్నాను" అన్నది ఆమె ఆలోచిస్తూ.  
    ఈ మహిళా సమాజాల మెంబర్లు కేవలం, కుట్లు కుట్టటం, అప్పడాలు వత్తడంతోనే సంతృప్తి పడక సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలి తమ హక్కులు ఏమిటో తెలుసుకోవాలి గ్రామంలో ఏ స్త్రీకి అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని ఖండిస్తూ ఆ స్త్రీకి న్యాయం జరిగేలా చెయ్యగలిగే స్థాయికి చేరుకోవాలి.   
    కట్నాలకు వ్యతిరేకంగా ఉద్యమం లేవదీయాలి తమ పిల్లల పెళ్ళిళ్లు కట్నం ఇచ్చి చెయ్యడాన్ని వ్యతిరేకించే స్థితిలో ఉండాలి కాని తమాషా ఏమిటంటే, పురుషుల కంటే స్త్రీలకే ఈ కట్నాల వ్యామోహం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తున్నది ఒక మహిళా మండలి ప్రెసిడెంటు (ఆమె నాకు తెలుసు) తన కొడుకు కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకొన్నందుకు దాదాపు మంచం పట్టింది ఆ పిల్లను (కోడల్ని) నానా తిట్లూ తిట్టేది.
    సంఘంలో తన స్థాయినీ, స్థానాన్నీ పెంచుకోవడానికి ఉపయోగపడినప్పుడే ఈ మహిళా సమాజాలు స్త్రీలకు ఉపయోగపడుతున్నాయని భావించాలని నా అభిప్రాయం కోళ్ళ పెంపకం వరకే ఈ సమాజాల కార్యక్రమాలు పరిమితమై ఉన్నంతకాలం, వీటివల్ల స్త్రీలకు ఉపయోగం ఏమి ఉండదు.   
    మహిళా మండలుల సభ్యులు ఈ విషయం గురించి ఆలోచిస్తారని భావిస్తాను.    
                                                            కృతజ్ఞత
    జీవితంలో ప్రతివ్యక్తి ఎవరికో ఒకరికి ఏదో సమయంలో చిన్నదో పెద్దదో సహాయం చేయడం జరుగుతుంది కాని కొందరు ఆ చిన్న సహాయాన్నే చుట్టూ వాళ్ళకు చెబుతారు.
    తను సహాయం చేసిన వ్యక్తి కృతజ్ఞుడై ఉండాలని కాంక్షిస్తారు. ఇటువంటి పరిస్థితిలో సహాయం చేసిన వ్యక్తి మీద గౌరవం పోతుంది ఏదైనా ఎవరికైనా సహాయం చేసి, వెంటనే దాని గురించి చెప్పినప్పుడు అతను చేసిన సహాయం విలువ తగ్గిపోతుంది ఇలాంటి అలవాటు పురుషుల్లోనూ ఉంటుంది.    
    కాని స్త్రీలలో ఎక్కువ ఉంటుంది మననుంచి సహాయాన్ని పొందిన వ్యక్తులే మనకు విరోధులై దుష్ప్రచారం ప్రారంభించినప్పుడు మనసు క్షోభ పడుతుంది అప్పుడు అప్రయత్నంగానే నేను ఆమెకు ఎలాంటి అపకారం చెయ్యలేదే? పైగా ఈ సహాయాలు చేశాను కృతజ్ఞత ఇలా చూపిస్తుందా?" అనేస్తాం.  
    ఇది మానవ బలహీనత ఆ మాట కూడా అనకుండా ఉండగలిగితే ఆ వ్యక్తి చాలా గొప్పవాడు అని భావించాలి సహాయాన్ని పొంది కూడా చాటున నిందించే వ్యక్తుల్ని ఏమనాలో నాకు బోధ పడదు.
    ఇకపోతే చాలా దగ్గిరవాళ్ళకు సహాయం చేసి వాళ్ళ నుంచి కృతజ్ఞతను ఆశించడం అంత దారుణమైన విషయం మరొకటి లేదు ఎదుటి వ్యక్తి బాధ పడతారనే వివేకం లేకుండా కొందరు తమ విశాల హృదయాన్ని ప్రదర్శిస్తారు.   
    ఉదాహరణకు ఒకరోజు నేను కామాక్షి ఇంటికి వెళ్ళాను కామాక్షి, లలితా, నేనూ హైస్కూల్లో కలిసి చదువుకున్నాం కామాక్షి, లలితా కాలేజీలో కూడా కలిసి చదువుకున్నారు మేము దగ్గరగా ఉండేవాళ్ళం.    
    కాని వాళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉండేవారు లలిత బీద ఇంటి బిడ్డ కామాక్షి కలిగిన ఇంట్లో పుట్టింది శ్రీమంతుల ఇంటికోడలైంది ఆమె భర్త హైదరాబాద్ లో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు మేము అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటాం లలిత కబుర్లు కామాక్షి ద్వారా తెలుసుకుంటూ ఉండేదాన్ని.
    లలిత భర్త గుంటూరులో ఏదో ఆఫీసులో గుమస్తాగా పని చేస్తున్నాడు ఆమెకు చదువుకునే రోజుల నుంచి తను ఎన్నెన్ని సహాయాలు చేసిందీ, లలిత విషయం వచ్చినప్పుడల్లా కామాక్షి ఒక పెద్ద లిస్టు చదివేది నాకు వినాలనిపించేది కాదు, చిరాకుగా ఉండేది లలిత విషయం అడగటమే మానేశాను.
    ఇకపోతే ఆ రోజు నేను వెళ్ళేసరికి కామాక్షి నన్ను చూడగానే ముఖం చాటంత చేసుకుంది "ఈ అబ్బాయి లలిత కొడుకు. ఏదో బ్యాంకు ఇంటర్వ్యూ ఉందని వచ్చాడు రికమెండేషన్ కావాలని వచ్చాడు.   
    మావారు ఫోన్ చేసి చెప్పారు కమిటీ ఛేయిర్ మెన్ కు లలితకు ఎన్నో సహాయాలు చేశాను లలిత కొడుక్కు మరి చెయ్యకపోతే ఎలా? పాపం ఎక్కువ సంతానం, తిండికి కూడా సరిగా జరగడం లేదట.
    అబ్బాయికి ఉద్యోగం అయితే కడుపునిండా తింటారు. మెట్ల దగ్గర సామానుగది సర్ది అందులో వుండమన్నాను ఎంత ఖర్చు కావడం లేదు ఉద్యోగం గురించి తేలేదాకా మా ఇంట్లోనే భోజనం చెయ్యమన్నాను ఎంతమంది తినడం లేదు?" అంటూ చెప్పుకుపోసాగింది.     
    నేను ఆ యువకుడి కేసి చూశాను ఆ కుర్రవాడు తలదించుకుని కూర్చున్నాడు అభిమానంతో కూడిన సిగ్గుతో కుంచించుకుపోతున్నాడని అర్థం అయింది కామాక్షిని లాగి చెంప పగల కొట్టాలనిపించింది.  
    "నీ పేరేమిటి బాబూ?" అన్నాను మాట మారుస్తూ.
    "సుధీర్" చిన్నగా అన్నాడు ఆ కంఠంలో ఏదో బాధ స్పష్టంగా గోచరించింది.  
    "మీ అమ్మగారు నాకు కూడా స్నేహితురాలే కాకపోతే మా ఇద్దరిమధ్యా రెగ్యులర్ వుత్తర ప్రత్యుత్తరాలు జరగడం లేదు వుత్తరాలు రాయడంలో చాలా సోమరిని నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా వున్నది మా యింటికి వస్తావా?"    
    ఆ అబ్బాయి తల ఎత్తకుండానే "వస్తానండి ఇవ్వాళ సాయంకాలం వూరికి వెళ్ళిపోతాను" అన్నాడు.
    "అదేమిటి పది రోజులు వుండాల్సి వస్తుందని ఇప్పుడేగా అన్నావ్?" ఆశ్చర్యంగా అన్నది కామాక్షి.
    "మీ మూడో అబ్బాయి పరీక్ష రాయడానికి వెళ్ళి ఒక నెల గుంటూర్లో లలితా వాళ్ళింట్లోనే వున్నాడు అన్నావు కదూ?" ఒళ్ళు మండి అడిగాను కామాక్షిని.
    "అయ్యో మాటల్లో పడి మరిచిపోయాను కాఫీ తెస్తాను" అంటూ లేచింది కామాక్షి.
    "అబ్భే అక్కర్లేదు నేను త్వరగా వెళ్ళాలి వెళ్లబోయేముందు ఒకసారి రా బాబూ" అని నేను లేచి వచ్చేశాను ఆ అబ్బాయి తలెత్తినా ముఖం చూడలేకుండావున్నాడు పసి హృదయం ఎంత గాయపడిందో చాలా దగ్గర వాళ్ళ మధ్య (ప్రేమికులు, భార్యాభర్తలు తండ్రీ బిడ్డలు అన్నా చెల్లెళ్ళు) మొదలయిన వారి మధ్య ఇట్టి ప్రవర్తన ఆ సంబంధాలనే కలుషితం చేస్తుంది.  
    ఉదా: కమల, మోహన్ ప్రేమించుకున్నారు. (పేర్లు అంత అందమయినవి అయినప్పుడు ప్రేమించుకోకచస్తారా ఏం అంటున్నారా? అసలు విషయానికి వద్దాం) మోహన్ కి ఉద్యోగం దొరకలేదు ప్రయత్నాలు చేస్తున్నాడు.
    ఉద్యోగం వచ్చాక పెళ్ళి చేసుకోవాలనుకున్నారు ఒకరోజు కమల మోహన్ తో అన్నది నాకు నగలంటే ఎంతో యిష్టం మా నాన్న నగల దుకాణం వానికి ఇచ్చి పెళ్ళి చేస్తానని అంటూ వుండేవాడు.
    మొన్న బాగా డబ్బున్న వాళ్ల సంబంధం వచ్చింది నీకు కావాల్సినన్ని నగలు పెడతాడు మీ ఆయన " అంటూ నాన్న నవ్వుతూ చెప్పారు నేను అంగీకరిస్తే నాన్న సంతోషించే వాడే."
    "ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది? ఒప్పేసుకో మెడ తిరక్కుండా నగలు వేసేస్తారు" మోహన్ జోక్ గా అన్నాడు.
    "కాని నీ ప్రేమ ఎలా కాదనేది?" అతన్ని కనికరించి తను మంచి సంబంధాన్ని వదులుకున్నట్టు అన్నది.
    మోహన్ ముఖం వెలవెలాపోయింది ఒక క్షణం తుమ్మ ముల్లు గుచ్చుకున్నట్టు అయింది.

 Previous Page Next Page