"అమ్మా! కాంతమ్మ మొగుడు వచ్చాడు" అంటూ ఒక యువతి మా దగ్గరకు వచ్చింది నేను సూపరింటెండెంటు ముఖంలోకి చూశాడు "నాతో రండి" అంటూ ఆఫీసు గదికేసి నడిచింది ఆమె అక్కడ ఒక నలభై సంవత్సరాల వ్యక్తి నిలబడి ఉన్నాడు.
"అది ఇక్కడకు వచ్చిందా" అడిగాడు అతను.
"వచ్చింది." సూపరింటెండెంటు జవాబు.
"మేము వెదికి వెదికి వేసారిపోయాం?ఇక్కడికే వచ్చి ఉంటుందనుకున్నాము దాన్ని లోపలకు ఎందుకు రానిచ్చారు?"
"రానివ్వకపోతే ఎక్కడికి వెళుతుంది? ఎవరు ఆశ్రయం ఇస్తారు? ఇదే దాని పుట్టిల్లు. మీరు సరిగ్గా చూసుకుంటె ఆమె ఎందుకు ఇల్లు వదిలేస్తుంది?"
"నేను ఏం అనలేదు."
"నువ్వు అనలేదు కాని మీ అమ్మ, మీ చెల్లెళ్లు, మీ ఇరుగుపొరుగు వాళ్లు ప్రతినిమిషం ఆమెకు అంటిన కళంకాన్ని ఎత్తి చూపుతూ ఉంటే, ఎత్తి పొడుపు మాటలు అంటూ ఉంటే ఎలా సహిస్తుంది? ఒకసారి జీవితంలో పొరపాటు చేసింది నిన్ను ఇష్ట పూర్వకంగా చేసుకుంది ఆమె చరిత్రలో ఏదైనా లోపం నీకు కన్పించిందా?"
అతను తల వంచుకున్నాడు.
"ఏ లోపం లేదు. అయినా ఆమె ప్రతి చూపునూ, ప్రతి అడుగునూ మీరంతా అవమానంతో చూస్తారు మీ మధ్యలో ఆమెకు ఊపిరి సలపడం లేదు ఆత్మహీనతాభావంతో కుంగిపోతున్నది."
"అలా జరక్కుండా చూసుకుంటాను."
"నువ్వు చెయ్యలేవు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆమె గత జీవితాన్ని ప్రతి నిమిషం గుర్తు చేస్తూనే ఉంటారు."
"నన్నేం చెయ్యమంటారు?"
"మీ వాళ్ళకు దూరంగా వేరు కాపరం పెట్టు?" కొంచెం సేపు ఆలోచించి "అలాగే" అన్నాడు కాంతమ్మను పిలిపించింది ఆమెకు పాతికలోపు వయసు ఉంటుంది సూపరింటెండెంటు ఎన్నో చెప్పి అనునయిస్తేగాని భర్త వెంట బయలుదేరలేదు.
కొందరు పెళ్ళి చేసుకుంటామని వస్తారు నూటికి ఏ పది మందో గృహస్థ జీవితంలో గతాన్ని మరచిపోయి స్థిరపడిపోతారు మిగతా వాళ్ళు కొంతకాలం తర్వాత మళ్ళీ ఇక్కడికే చేరతారు" అన్నది సూపరింటెండెంటు.
"ఎందుకని?"
"భార్య కావాలి వస్తారు తీరా చూసుకున్నాక ఆ మగవాడు ఆమె గత జీవితాన్ని కెలకకుండా ఉండలేడు కొందరు కాంతమ్మ భర్తలాంటి వాళ్ళు ఉన్నా, చుట్టూ ఉన్న వాళ్ళు ఆ పని చేస్తారు వీళ్ళలో అసలే ఆత్మహీనతాభావం ఉంటుంది ప్రతి చిన్న విషయానికీ తమ గత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆలోచిస్తారు ఎంతో హృదయసంస్కారం ఉన్న వ్యక్తి సాహచర్యం లభిస్తే గాని, వీళ్ళు మళ్ళీ మామూలు మనుషులు కాలేరు."
ఉయ్యాలల్లోని పిల్లలు కళ్ళలో కదిలారు ఆ తల్లులకు పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తారు లేదా వాళ్ళే ఈ పంజరం ఊచల్ని బద్దలు కొట్టుకొని పారిపోతారు అలా పోయిన వాళ్ళు ఏమవుతారో వేరే చెప్పనక్కర్లేదు కాని ఆ పసివాళ్ళు - ఉయ్యాల దిగుతారు.
మోకాళ్ళ మీద బంతాడతారు పడుతూ లేస్తూ తప్పటడుగులు వేస్తారు, నడవడం నేర్చుకుంటారు, మాట్లాడటం నేర్చుకుంటారు నడవడం వచ్చాక వాళ్ళు ఎక్కడికి వెడతారు? అదృష్టవంతుణ్ణెవళ్ళో పిల్లలు లేనివాళ్ళు పెంచుకోవడానికి తీసుకుంటారు మిగతా వాళ్ళో? మగపిల్లల్ని ఏడేళ్ళ తర్వాత అక్కడి నుంచి అనాధ శరణాలయానికి పంపిస్తారు.
ఆ పసివాళ్ళ తల్లులు ఏ పట్టణంలోనో, ఏ ఇంట్లోనో లేక బ్రోతల్ హౌస్ లోనో ఉండీ, ఉండీ తమ హృదయాల్లోని మాతృత్వపు మమతను తడిమి చూసుకుంటారు మనసులోనే జోలపాట పాడుకుంటారు ఆ పాటలు పెదవుల మీదకురావు.
ఇలాంటివారు ఈ దేశంలో కోకొల్లలుగా ఉన్నారు మరి సమస్యలకు పరిష్కారం ఏమిటి? నాకు ఒకటే కన్పిస్తున్నది - ఈ వ్యవస్థలో మార్పు రావాలి స్త్రీ పురుషులకు సమానమైన ఆర్ధిక స్వాతంత్ర్యం ఉండాలి ఎవరూ ఎవరి మీదా ఆధారపడటం అంటూ లేని సమాజం ఏర్పడాలి.
అప్పుడే ఇలాంటి తల్లులు తమ కాళ్ళమీద తాము నిలబడి, తమ బిడ్డల్ని పెంచుకోగలరు అందరికీ అన్ని సుఖాలూ అందుబాటులో ఉన్నప్పుడు, దూరపు కొండల నునుపు చూసి ముగ్ధులు కారు మోసపోవటానికి అవకాశం ఉండదు.
ఇదెక్కడి సిగ్గు!
స్త్రీ కూడా పురుషుడితో సమానంగా గుర్తించబడాలనీ, స్త్రీలకు కూడా సమాజంలో సమాన హక్కులూ, స్థానం ఏర్పడాలనీ పోరాడుతున్న ఈ రోజుల్లో స్త్రీలే కొన్ని విషయాలను విస్మరిస్తున్నారు.
మాటకు ముందు సిగ్గుపడడం, మెలికలు తిరిగిపోవడం, నేను ఆడపిల్లను బాబోయ్, అన్నట్టు కాలేజీలో గోడల మీద పడుతూ నడవడం లాంటివి వదులుకోవాలి అలా ప్రవర్తించే ఆడపిల్లలు మగవారి దృష్టిని ప్రత్యేకంగా వారికి తెలియకుండానే ఆకర్షిస్తున్నారనేది గమనించాలి.
"స్త్రీకి సిగ్గే సింగారం" అనేది పాతకాలపు మాట యిలాంటి సూక్తుల్ని స్త్రీకి ఈ దేశంలో ఉగ్గుపాలతో రంగరించి పోశారు.
ఆ రోజు కాలేజీ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి సుమతి అబ్బాయిలతో పాటు కార్యకర్తగా చకచక తిరుగుతూ ఏర్పాట్లన్నీ చేస్తున్నది ఆ అమ్మాయిలో ఎలాంటి జంకూ, గొంకూ కన్పించలేదు కాంప్లెక్స్ లేదు అందువల్లనే అబ్బాయితో మాట్లాడినట్టే మాట్లాడుతూ పనులు చేస్తున్నారు.
ప్రతి నిమిషం సెక్సును దృష్టిలో వుంచుకొని సిగ్గుతో మెలికలు తిరిగిపోయే ఆడపిల్లలతో మగపిల్లలు కూడా అలా వుండలేరు పైగా వాళ్ళలో అల్లరి భావాలు కూడా రెకేత్తుతాయి.
అదే సమయంలో రేఖ అందంగా అలంకరించుకొని జారిజారి పోతున్న పైటను సరిచేసుకుంటూ బెరుకు బెరుగ్గా నడుస్తూ కాలేజీ ఆవరణ్లో ప్రవేశించింది వెనక నుంచి ఎవరో పిల్లిలా అరిచారు ఆ అమ్మాయి ఒక్కసారిగా మెలికలు తిరిగిపోతూ నడవసాగింది కొన్ని సందర్భాల్లో వయసులో వున్న ఆడపిల్లలు సిగ్గుపడటం అందంగానే ఉండవచ్చును కాని బాహ్యప్రపంచంలో నలుగురి మధ్యకు వచ్చినప్పుడు హుందాగా ఉన్నవాళ్ళనే పురుషులు గౌరవిస్తారు.
కొందరు మగవాళ్లు కూడా ఆడవాళ్ళ ముందు మాట్లాడేప్పుడు సిగ్గుతో మెలికలు తిరిగిపోతారు అలా సిగ్గుపడే మగవాళ్ళంటే అసహ్యం వేస్తుంది జంకు వేరు, వినయం వేరు అతిగా సిగ్గుపడిపోయే పురుషుల్ని ఆడంరేకుల అబ్బాయిలు అంటారు.
కొందరు ఆడపిల్లలు బస్ లో పక్క సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఒక పురుషుడు కూర్చుంటే టక్కున లేచి నిలబడతారు అప్పుడు ఆ పిల్ల మగవాళ్ళకే కాకుండా, కొంచెం విశాల భావాలు గల స్త్రీలకు కూడా చిరాకు కలిగిస్తుంది అవును కొందరు ప్రక్కన కూర్చున్న ఆడపిల్లను ఏమో చేత్తోనోపొడిచే వాళ్ళు వుండవచ్చును.
అలాంటివారి సంఖ్య చాలా తక్కువనేనా అభిప్రాయం అలాంటి వాళ్లు తటస్థపడినప్పుడు "మిస్టర్: కొంచెం వళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చోండి" అని ఆ పక్క ఆడపిల్ల చెప్పగలిగే ధైర్యాన్ని సాధించుకోవాలి ఒక్కసారి ఆ ఆడపిల్ల అన్నాక అతను బిగిసిపోయి కూర్చుంటాడో లేదో ట్రై చేసి చూడండి.
అంతేగాని పురుషుడు పక్కనే కూర్చోగానే ఏదో కొంపలు అంటుకుపోయినట్లు లేచి నిల్చుని అతన్ని అవమానం చెయ్యవద్దు ఇలాంటి సంఘటన నేను మూడు రోజుల క్రితం బస్ లో చూశాను ఆ అమ్మాయి నిల్చోగానే అతను పాపం తెల్లమొఖంవేసి "కూర్చోండి" అంటూ తాను లేచి నిల్చున్నాడు ఇలాంటి కాంప్లెక్సు వదిలితేనేగాని స్త్రీ నిజంగా ప్రగతి పథం వైపుకు పయనించలేదు.
"సిగ్గుపడక పోవడం "సిగ్గును విడిచెయ్యడం" రెండూ వేరువేరు అర్థాలను తెలియజేస్తాయి తప్పుచేసి, ఇతరులను బాధపెట్టి సిగ్గుపడకపోవడం సిగ్గులేనితనం అనిపించుకుంటుంది ఈ సిగ్గుపడడంలో సెక్సు ప్రమేయం ఉండదు.
చీటికీమాటికీ పురుషుల ముందు సిగ్గుపడడం అనేది మానసిక బలహీనతను తెలియజేస్తుంది నాకు తెలిసిన ఒక అమ్మాయి ఎం.ఏ. ఫస్టు క్లాసులో పాసయ్యింది ఎం.ఏ. అయినా ఉద్యోగం రాలేదు ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఆమెకు ఎక్కడలేని సిగ్గు ముంచుకొని వచ్చేస్తుంది ఒక్క ప్రశ్నకూ సరైన సమాధానం ఇచ్చే స్థితిలో ఉండదు.
ఆమె చదువుకొనే రోజుల్లో కూడా క్లాసులో చచ్చేంత సిగ్గుపడేదట మగపిల్లలు ఎంతో ఆటలు పట్టించేవారట ఎన్నోసార్లు ఏడ్చి కాలేజీ మానెయ్యడానికి కూడా సిద్ధపడిందట.
కొందరు స్త్రీలు (బాగా వయసు వచ్చిన తర్వాత, పెళ్ళీడుకు వచ్చిన పిల్లలు ఉన్నవాళ్ళు) పురుషులు ముందు మాట్లాడుతూ మాటిమాటికి పైట సర్దుకుంటారు చిన్నవాళ్ళు అయితే ఒకటికి రెండుసార్లు నువ్వు నా తమ్ముడి లాంటి వాడివి అనో, నా కొడుకు లాంటివాడివి అనో అంటుంటారు దానికి కారణం ఎంత చదువుకున్నా తనలోని సెక్సు కాంప్లెక్సును జయించలేక పోవడమే.
ఇంట్లో ఆడపిల్ల అన్నదమ్ముల దగ్గర ఎలా అరమరకల్లేకుండా, కాంప్లెక్సు లేకుండా మాట్లాడుతుందో అలాగే ఆఫీసుల్లో పనిచేసే ఆడపిల్లలు తోటివాళ్ళతో మాట్లాడగలిగే శక్తి పెంపొందించుకోవాలి ఇందుకు ఆత్మవిశ్వాసం కావాలి.
ఇకపోతే కొన్ని సందర్భాల్లో ఆడపిల్ల, వయసులో ఉన్న పిల్ల సిగ్గుపడటం సహజంగానూ, ముచ్చటగానూ, ఉండకపోదు ఇంటికి, కాబోయే భర్త అయిన బావగారు వచ్చినప్పుడు, మరదలు పిల్ల సిగ్గుపడి చాటుచాటుగా తిరుగుతూ తలుపు చాటున నక్కడం, బావ ఎదురు పడితే బుగ్గల్లో గులాబీలు విరియడం ముచ్చటగానే ఉంటుంది.