Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 23

    తెల్లని టర్కీటవల్ ఒంటికి చుట్టుకొని, బాత్ రూమ్ లోంచి బైటకి వస్తూ గడియారం వైపు చూసింది. హర్ష వచ్చే 'టైం' అవుతోంది. ఆమె ఒళ్ళంతా తియ్యని పులకింత! అలాగే వెళ్ళి బెడ్ మీద వాలిపోయింది.

    "ఎన్నో పుట్టిన రోజులు గడిచాయి కానీ ఈ పుట్టినరోజుమాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకునేంత అద్బుతంగా వుండాలి. హర్ష ఐ లవ్ యూ!" అనుకుంటూ కళ్ళు మూసుకుంది. ఒంటిగంటయింది.

    టవల్ తోటే వెళ్ళి తలుపు తెరిచి వచ్చింది.

    సీతాకాలం కాబట్టి మధ్యాహ్నం కూడా చలిగా వుంది. చుట్టూ పరదాలు పరచుకున్న బెడ్ రూం, మరింత చీకటిగా తయారయింది.

    అతని తలుపుతో ఆమె శరీరానికి కోటి కోర్కెలు! అతని సమక్షంలో మనసుకి వేయి నాల్కలు.

    అమృత ముద్దుగా అతన్ని విసుక్కుంటూ, "వున్నంతసేపూ నా తనువుకి ఒక్క క్షణం కూడా దూరం అనుక్షణం వీడక సతాయిస్తూ....ఉష్ అబ్బా! ఇంకా ఎంతసేపూ..." అనుకుంది వంటిమీద వున్న ఒక్క టవల్ తీసి క్రిందికి విసిరేసి, దుప్పటి కప్పుకుంటూ....
   
                                               *    *    *

    "సర్...హెడ్ ఆఫీస్ నుంచి అర్జంట్ కాల్" చెప్పింది కీర్తి.

    హర్ష విసుగ్గానే అందుకున్నాడు "ఓ....అలాగే ఇప్పుడే పంపిస్తాను....ఓ....కే సార్" అంటూ పెట్టేశాడు.


    "కీర్తి లోపలికి రా! అర్జెంటు పని ఒకటి వచ్చి పడింది."


    కీర్తి లోపలికి రాగానే ఆమెకి చెయ్యవలసిన పనుల గురించి వివరించి కాస్త ఆలస్యం అయినా శ్రమ అనుకోకుండా పూర్తిచేసి వెళ్ళు, ప్లీజ్...' అన్నాడు.


    "ఇట్స్ మై డ్యూటీ సార్!" అంది కీర్తి చిరునవ్వు నవ్వి.


    హర్ష 'టైం' చూసుకున్నాడు. అప్పటికే పావుగంట ఆలస్యం అయిపోయింది. వెళ్ళదానికి ఓ పది నిమిషాలు "ఇవాళ అమృత అలక పోగొట్టడం అంత తేలిక కాదు! ఫోన్ చేసి ఆలస్యానికి సారీ చెప్పి తిట్లు తినడం కన్నా వెళ్ళాక 'రేప్' సీన్లో ఆ తిట్లు ఈ తిట్లూ కలిపే తినవచ్చులే" అనుకుని నవ్వుకున్నాడు. కదలబోతూంటే మళ్ళీ ఫోన్.


    అవతల వైపున ఎం.డి. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాడు.


    హర్ష అసహనంగా "ఊ..." కొడ్తూ వింటున్నాడు. ఎం.డి. చాలా పనులు పురమాయించాడు.


    అతని ముఖంలో చికాకుని కీర్తి జాలిగా చూస్తోంది! ఇంటికి వెళ్ళదానికి కనీసం ఇంకో రెండు గంటలు పడుతుంది.
   
                                            *    *    *


    ఒంటి గంటా-పది నిమిషాలు.


    సన్నగా తలుపు తెరుచుకున్న శబ్దానికి చెవులు రిక్కించి వింటున్న అమృత ఉలిక్కిపడింది. అయినా కదల్లేదు. వస్తున్న నవ్వు దాచుకోడానికి బోర్లా పడుకుని పోయింది. బెడ్ షీట్ కేవలం జఘనం వరకు కప్పుతోంది.


    ఇల్లంతా చీకటి! ఎటుచూసినా ఆహ్వానాలు పలుకుతున్నట్టు పూల మాలలు.


    "ఎదురు చూపులో.....వలపెంతో...తీయనా..."


    "అతని రాకతో....బ్రతుకే నులి వెచ్చనా..." టేప్ లోంచి అమృత కమ్మని గళం...తీయ తేనియ లొలుకుతోంది.


    అడుగు తీసి అడుగు వేస్తూంటే...అతని కాళ్ళక్రింద పది....అరవిచ్చిన మల్లెమొగ్గలు నలిగి జీవచ్చవాలై పోతున్నాయి.


    "నేను...ఇక్కడ...బెడ్ రూమ్ లో" అమృత గొంతు, అతన్ని నిలువ నీయలేదు.


    అటువైపు వేగంగా కదిలాడు విక్రమ్. తలుపు తెరిచి అడుగు కదలక అలాగే నిలబడిపోయాడు. అందానికి అందమైన పుత్తడిబొమ్మ తన...తడి తడి అందాన్ని మంచంమీద ఆరబోసిన భంగిమలో.


    "వద్దు....దగ్గిరికి రాకు....నన్నేం చెయ్యకు, దుర్మార్గుదా" అంటూ అరచింది.


    అతను అడుగు కదపకుండా అలాగే చూస్తూ నిలబడ్డాడు.


    "నన్నేం చెయ్యకు, నా జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నావా?" అరుస్తోంది అమృత.


    బోర్లా పడుకుని, నవ్వు బిగబట్టి మాట్లాడ్తున్న అమృత నగ్నంగా వున్న తన శరీరం మీద నులి వెచ్చని స్పర్శకి ఠక్కున తల తిప్పి చూసింది.


    ఎదురుగా....విక్రమ్!!!


    అమృతకి తను చూస్తున్నది ఏవిటో అస్సలు అర్ధంకాలేదు. తను ప్రస్తుతం చూస్తున్నది కలా? లేక తను ఇన్నాళ్ళూ అనుభవించానను కుంటున్నది కలా? ఇది స్వప్నం కాదు సత్యమే అని నిరూపిస్తూ...ఎదురుగా విక్రమ్!


    బ్రతికి వున్నాడనుకున్న మనిషి చచ్చిపోయాడని తెలిస్తే కలిగేది బాధ! చచ్చిపోయాడనుకున్న మనిషి బ్రతికివస్తే కలిగేది ఆనందం!


    కానీ, ఇప్పుడు భయం కలుగుతోంది! మైగాడ్, ఎంత దారుణమైన ఫీలింగ్ ఇది! అతను విక్రమ్ అన్న నమ్మకం ఆమెకి ఇంకా కలగడం లేదు. అతని తాలూకు జ్ఞాపకాలు తన మనసులో ఎప్పుడో సమాధిచేసి, దానిమీద సంసారం అనే తులసి మొక్క నాటింది. అది అతిత్వరగా చిలవలూ....పలవలూగా ఎదిగి, మనసంతా పవిత్రమైన పరిమళంతో ఆక్రమించేసుకుంది. ఇటువంటి సమయంలో అతను మళ్ళీ....


    "వర్షిణీ!" అని అతని నోటినుండి వెలువడ్తున్న పిలుపు అతని హృదయాన్ని చీల్చుకుని, ఆర్తిగా వెలువడ్తున్న ఆకలి కేకలా వుంది!


    అతను ఆమె పక్కన మంచం మీద కూర్చుంటూ "అలా ఎందుకు భయపడ్డావూ? నిన్ను నేను ఏదో చెయ్యడానికి వచ్చానని ఎందుకు అనుకున్నావూ? నా సంగతి నీకు తెలీదా?" ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ అడిగాడు.

 Previous Page Next Page