మల్లిక్ బాధతో గాని, స్నేహితుల విమర్శలతో కానీ సంబంధం లేకుండా పెళ్ళి జరిగిపోయింది.
2
రెండేళ్ళు గడిచాయి.
ఒకరోజు తల్లితో చెప్పాడు మల్లిక్ "త్రిపురని ఇక్కడికి తీసుకురా, అమ్మ. త్రిపురని చదివిద్దాం. చదువు సంధ్యా లేకుండా ఆ పల్లెటూళ్ళో ఇంకా ఉంచడానికి వీల్లేదు."
"కార్యం కాకుండా పిల్లని ఎవరు పంపిస్తారురా? అయినా, ఇప్పుడు చదువులేందుకు ఆ పిల్లకు?" అని అడిగింది యశోదమ్మ.
"ఇంకో రెండేళ్ళలో నేను డాక్టర్ని కాబోతున్నాను. డాక్టరుగారి భార్య వట్టి పల్లెట్టూరి గబ్బిలంలా ఏంటే ఏం బాగుంటుంది? త్రిపురని కనీసం బి.ఏ. నన్నా చేయలమ్మా"
"పెళ్ళాన్ని చదివించుకోవాలని నీకంత ఉబలాటంగా ఉంటే చదివించు గాని దాన్ని బడికి పంపడానికి మాత్రం నేనోప్పకోను. ఇంట్లోనే టిచరును పెట్టి చదివించు"
త్రిపురని తీసుకు రావడానికి మల్లికే వెళ్ళాడు.
పిల్ల పెద్దమనిషి కాకుండానే అత్తవారింటికి పంపడానికి ఒక పట్టాన ఒప్పుకోలేదు త్రిపుర తల్లిదండ్రులు. "బొత్తిగా అక్షర జ్ఞానం లేని అజ్ఞానురాలిని ఏం చేయలేదు త్రిపురని. అమరం చెప్పాం సంస్కృతం నేర్పం. భారతం, భాగవాతం చక్కగా చదవగలదు. ఆ స్కూలు సర్టిఫికెట్లు, డిగ్రీలు, ఇంగ్లీష్ చదువులా ఏం?" అన్నారు.
"పూజారిగారి భార్య సంస్కృతం మాట్లాడితే బాగుంటుంది. డాక్టరుగారి భార్య ఇంగ్లీషులో మాట్లాడితే బాగుంటుంది. నాభార్యకు ఏం చదువు వచ్చ్చి ఉండాలో నాకు తెలుసు. మీరు నామాట కాదనకండి" అని త్రిపురను హ్తెధరాబాద్ తీసుకు వచ్చేశాడు మల్లిక్.
ఆలస్యం లేకుండా త్రిపురకు చదువు చెప్పడానికి టిచరుని ఏర్పాటు చేశాడు.
* * *
రేపు మెట్రిక్ పరిక్ష అనగా రజస్వల అయింది త్రిపుర.
"ధలియంపరిచి పిల్లని మూలకి కూర్చోబెట్టాలి. బంధువులందరికీ కబురుచేయాలి. సాయంత్రం భజం త్రిలకి చెప్పాలి!....." అని హడావిడి పడిపోసాగింది యశోదమ్మ.
"రేపు పరిక్ష పెట్టుకొని మూలకి కూర్చోబెదతావా? అదేం వీల్లేదు. ఎవరికీ కబురు చేయక్కరలేదు. స్నానం పోసేసి ఇంట్లోకి రమ్మను" అన్నాడు మల్లిక్.
"ఇదెక్కడి అనాచారం, నాయానా! ఇంతవరకు ఈ ఇంట్లో ముట్టుమ్తేలే కలుపుకోలేదు. ఇప్పుడు సమర్తమ్తెల కలుపుకోంటానా? అయినా మొదటి సమర్తకి ఎన్ని వేడుకలు చేయాలి? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి!"
వేడుకలంటే జ్ఞపక మొచ్చింది మల్లిక్ కు. పిన్ని కూతురు రజస్వల అయితే ఎన్ని వేడుకలు చేశారో ఆర్భాటంగా.
ఉదయం, సాయంత్రం భజంత్రి, సాయంకాలం పేరంటం, మంగళహారతి ఇచ్చి పాటలు పాడడం, నువ్వులు బల్లెం వరిపిండి దంచి ఉండలుచేసి పెట్టడం, తెల్లవారకముందే పసుపునూనేలతో స్నానాలు చేయించడం- బంధువులు కొత్తబట్టలు ఫలహారాలు తేవడం,ఇహ శోభనంరోజు సరే, భజంత్రిలు , బంధువులను పిలిచి భోజనాలు పెట్టడం "ఓహొ! మాపిల్లకి రోజు శోభనం" అని ఊరంతా చాటింపు చేసినంత ఆర్భాటం చేయడం-మల్లిక్ కి గుర్తొచ్చింది. "వెధవ ఆచారాలు, ప్రకృతి సహజంగా స్త్రి పుష్పవతి అయితే ఇన్ని తతంగాలేమిటో" అని తిట్టుకున్నాడు. తన భార్య విషయంలో అలా జరగడ్క్యనికి వీల్లేదు. 'ప్రతి ఘటించి తీరుతాను' అని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు.
"త్రిపుర రేపు పరిక్ష వ్రాస్తుంది. ఆమె పరిక్ష మానడానికి వీల్లేదు. ఆమెను ఏం తాకకుండా మూలకి కూర్చోబెట్టటనికి కూడా నేనోప్పకోను. అవన్ని విజ్ఞానం వికసించని కాలంలో చాందసులు ఏర్పరచిన ఆచారాలు. పుణ్యపాప ల్ప్కాలు ఉన్నాయని, పురాణాలు నిజమని నమ్మే మనుషులు ఏర్పరిచిన ఆచారాలు. శరీరాల్ని ఏ ముక్కకాముక్క కోసి చూపే డాక్టర్ని నేను? స్త్రి లకి బుతుస్రావం అయితే ఆమెను తాకకూడదని దుర్ల క్షణాలేవి ఏర్పడవు ఆమెలో"
"కనీసం ఆ మూడురోజులు ఆమెకు విశ్రాంతి కావాలన్తేనా ఒప్పకోంటావా లేదా?" అనడిగాడు తండ్రి.
"అమ్మ బయటున్న ఆ మూడురోజులు విశ్రాంతి తీసుకోవడం నేనెప్పుడూ చూడలేదు, నాన్నగారూ! డబ్బాలకోద్ది బియ్యం బాగుచేసి పెట్టేది కట్టలకోద్దివి స్తళ్ళు కుట్టిపెట్టేది. ఇంకా ఎన్నో పనులు కల్పించుకు చేపేది."
"దేవతార్చన ఉన్న ఇళ్ళల్లో ముట్టుమ్తెలలు కలుపుకోకూడదురా అనిష్ట కొట్టి ఊడ్చుకొని పోతాం"
"దేవుడిచ్చిన ముట్లకి దేవుడికి మ్తెల ఏమిటి, నాన్నగారూ?"
"వితండవాదనాలకి జవాబులుండవురా"
"ఎద్తేనా నా ఒక పని చేసేప్పుడు, "ఎందుకు? ఏమిటి?" అని అడగడం తప్పాం? ఏం ప్రయత్నించకుండా పనిచెయ్యటం అజ్ఞాని లక్షణం గాని విజ్ఞాని లక్షణం కాదు. "ఎందుకు? ఏమిటి?" అని ప్రశ్నించకుండా ఏ మనిషి ముందుకు వెళ్ళలేడు. మీరు చేశారని నేను, నేను చేశానని నా కొడుకూ చేయడమే ఉత్తమ సంస్కారమనిపించుకోదు. మీరు ఎందుకు చేశారో తెలుసుకొని మీరు చేసింది సారి అని నా మనసుకు తోచినప్పడే నేను చేస్తాను. మీరు వేదపండితులు. శాస్త్రాలను మదించివారు. పురాణాన్ని కంఠస్తం చేసినవారు. ఆ రంగంలో మీరు గొప్పే కావచ్చుగాని నాకు శిరోధార్యం కావు మీ మాటలు. ఎందుకంటే నేను డాక్టర్ని, శరీర శాస్త్రాన్ని చదివిన వాడిని. మీ ఆలోచనా పద్ధతికి చాలా తేడా ఉంటుంది. మీరు శాస్త్రాల్ని కళ్ళకి తగిలించుకు చూస్తారు. నేను నా శరీర శాస్త్రాన్ని నేను చదువుకొన్న విజ్ఞాన శాస్త్రాలను కళ్ళకు తగిలించుకు చూస్తాను.
నాకు కనిపించింది మీకు కనిపించిందు. మీకు కనిపించింది నాకు కనిపించదు" అని ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చాడు మల్లిక్.
"సంధ్యానంధనం మానేశాడు. ఔపోసనం పట్టడం మానేశాడు. మెడలో జంధ్యంకూడా కనిపించడం లేదండి ఈ మధ్య సిడు బొత్తిగా నాస్తికుడ్తే పోయాడు" అని వాపోయింది యశోదమ్మ.
"అంటే భ్రఘ్టడ్తే పోయాడన్నమాట. ఇక ఉంది లేడనుకోవాలి మనం" అని ఒక నిట్టూర్పు విడిచాడు శ్రీనివాస శాస్త్రి "బొత్తిగా తెలియని వాడికి చెప్పగలం అన్ని తెలుసుననేవాడికి ఏం చెప్పగలం?"
"అయితే అలావదిలి పెట్టేసి ఊరుకొంటారా?" ఆందోళనగా అడిగింది.
"డాక్టరు కదా? ఒకరు చెప్పే మాట వింటాడా? తనకే అన్ని తెలుసు కదా?"
"మా పెద్ధనాన్నగారి కొడుకు ఐ.ఎ.ఎస్. అంది నుదుట బొట్టు లేనిదే ఆఫీసుకి వెళ్ళాడు. పూజాదికాలు పూర్తిచేయందే గంగాముట్టడు"
"అంత చదువుకొని, అంత పెద్ద ఉద్యోగం చేస్తూకూడా పూర్వాచారాన్ని తు.ఛ. తప్పకుండా చేస్తున్నాడంటే మీకు గొప్పగా కనిపిస్తుంది గాని నాకు మాత్రం చదువుకొన్న మూర్ఖుడినిస్తూంది" అన్నాడు మల్లిక్.
చివరికి,
త్రిపురని ఇంట్లోక్తెతే రానివ్వలేదు గాని, పరిక్షలక్తెతే వెళ్ళకుండా చేయలేకపోయింది యశోదమ్మ. త్రిపుర పరిక్షలు వ్రాసి తీరాలని మల్లిక్ పట్టుబట్టడంతో ఏ వేడుకలూ జరుపలేదు. కనీసం తల్లిదండ్రులకి కూడా పిల్ల రజస్వల అయిందని తెలుపలేదు మాంచి చేద్దా అంతా మల్లిక్ కే వదిలేసి మౌనం వహించారు యశోదమ్మ వాళ్ళు. పరీక్షలన్నీ అయి పోయాక అప్పుడు వ్రాశారు ఉత్తరం. మల్లిక్ అత్తగారికి త్రిపుర రజస్వల అయిందని, పిల్లకు ఏ వేడుకలు జరుగలేదని ఎంత నొచ్చుకున్న అల్లుడిని ఏమనలేక పోయారు వాళ్ళు.
రెండో సమర్తకి ఊరికి తీసికెళ్ళి, అయిదవ రోజు తరువాత శోభనానికి ముహూర్తం నిర్ణయించి, మల్లిక్ నీ అతడి తల్లిదండ్రులని రమ్మని కబురు చేశారు పరమేశం వాళ్ళు. కానీ, వెళ్ళలేదు మల్లిక్. మనసులు కలిసి, ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడి నప్పడే శరీరాలు ఏకం కావాలన్న సిద్దాంతం ఉన్న అతడు ఈ ముహూర్తాల మిద తనకు నమ్మకం లేదని, తమలో ప్రణయం పరాకాష్ట నందుకొన్నపుడే తామే తమ కల యికకి ముహూర్తం పెట్టుకోంటామని వ్రాశాడు మల్లిక్.